కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామడుగు, కొక్కరకుంట, వన్నారం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామడుగు మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్ మాట్లాడుతూ మండల అధికారులు గ్రామాల్లో ప్రతీ ఇంటికి తిరిగి ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా సరైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా చూసుకోవాలని, లబ్ధిదారులు సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో గోపాలరావుపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, వెన్న రాజమల్లయ్య, రామడుగు కార్యదర్శి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడే శంకర్, పంజాల శ్రీనివాస్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ కర్ణ శీను, పొన్నం మల్లేశం, బత్తిని అజయ్, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బి.రవి రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి…
నేటి ధాత్రి – మహబూబాబాద్ :-
జిల్లాలో వ్యాప్తంగా పనిచేస్తున్న ఫార్మసీ వైద్య సిబ్బంది అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించిన తాత్కాలిక పద్ధతులైన అంతరా ఇంజక్షన్స్, ఓరల్ పిల్స్,ఐ యు సి డి జిల్లాకు వచ్చినఅన్ని రకాల మందులు పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఫార్మసీ వైద్య సిబ్బందిలో తో ప్లానింగ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ,వర్షాకాలంలో మందులన్నీ మూడు నెలల స్టాక్ ఉంచుకోవాలని కోరడం సూచించారు.
Dr. B. Ravi Rathod, District Medical Health Officer.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ లక్ష్మీనారాయణ,డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సారంగం, డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ కొప్పు ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కెవి రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ,లోక్య,ఫార్మసీ ఆఫీసర్ రామారావు, డిపిఓ నీలోహన, డిడిఎం సౌమిత్, సూపర్వైజర్ రవి, రాజ్యలక్ష్మి విసిసిఎం, ఫార్మసీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…
గార్ల నేటి ధాత్రి:
మండలంలోని సమీపంలో ఉన్న గార్ల పెద్ద చెరువులో కబ్జాకు గురైన చెరువు శిఖం భూములకు వెంటనే ట్రెంచ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం స్థానిక మంగపతి రావు భవనంలో మల్లెల నాగమణి అధ్యక్షత జరిగిన మండల కమిటీ సమావేశంలో శ్రీనివాస్, సత్యవతిలు మాట్లాడుతూ, మండలానికే అతిపెద్ద చెరువు గా ఉండి,అటు ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇటు రైతుల లెక్కల ప్రకారం సుమారుగా 18 వందల ఎకరాల వరి పంటల భూములకు సాగునీరు అందించే ఈ చెరువు శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుని పట్టాలు చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెంచ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు కె.ఈశ్వర్ లింగం, వి.పి.వెంకటేశ్వర్లు,ఐ.గోవింద్,ఎల్లయ్య, మౌనిక,ఉపేందర్ రెడ్డి, బి.లోకేశ్వరావు,కైబాబు,మౌలానా,సిహెచ్.మౌనిక,ఎ.రామకృష్ణ,కె.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండలం. టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేయడం జరిగింది. ఇందిరమ్మ కమిటీ సభ్యులతోపాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో. గ్రామంలో లబ్ధిదారులకు. ముగ్గు పోసి భూమి పూజ చేయడం జరిగిందని తెలియజేస్తూ. ఈ సందర్భంగా సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గడ్డం మధుకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సీఎం పరిపాలనలో పేద ప్రజలకు ఇండ్లు లేని లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని సంకల్పంతో ఇల్లు నిర్మించాలని తెలంగాణ ప్రజా పరిపాలనలో ప్రజలు అందరూ. మంచిగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి ధ్యేయంగా. ప్రజా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.పొన్నం ప్రభాకర్ రెడ్డికి. వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ప్రవీణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీ కమిటీ సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం రచన. కొంపల్లి శ్యాం. కొండ రాజు. పొన్నం కనకయ్య. అడి గొప్పల రాము. యమునా. ముంతాటి శారద. జ్యోతి. మౌనిక. సంపతి శ్యామల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో జరిగిన రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న రైతులు అధికారులు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో జూన్ 4న రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం రైతు వేదికలో జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ పంటలకు సిఫారసు చేసిన మోతాదులోనే యూరియాను పచ్చి రొట్ట ఎరువులను వర్మి కంపోస్టు జీవన ఎరులను భూసార పరీక్ష ఫలితాలను బట్టి పంటలకు ఎరువులను.
అందించడం బట్టి రసాయన ఆధారిత పురుగు మందులను.మాత్రమే ఉపయోగించడం మరియు సమగ్ర సస్య రక్షణ పద్ధతులను పాటించడం పంట కోసం చేసిన వివిధ విత్తనాలను రసాయనిక ఎరులను మరియు రసాయనిక మందులు కొనుగోలు చేసిన రసీదులను.
భద్ర పరచాలని. సాగునుటి యజమాన్యం తడి పొడి పద్ధతితో పాటు వరి సాగు.
మల్చింగ్ సుస్థిరమైన వ్యవసాయ కోసం పంట మార్పిడి మరియు పంట వైవిద్దీకరణ పూల మరియు మునగ సాగు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం యూట్యూబ్ ఛానల్ ను మరియు ఏ యు వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమాన్ని..
ఉపయోగించడం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం రైతుల వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటకు సంబంధించిన విషయాలపై చర్చించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు తదుపరి కార్యక్రమంలో అంశాలను పాటిస్తామన్నారు ఇట్టి కార్యక్రమంలో.
శాస్త్రవేత్తలు. డాక్టర్ . సిహెచ్. రమేష్. డాక్టర్ హిందూజ. ఎన్ ఏ..lcar.llrr. శాస్త్రవేత్త డాక్టర్ శృతి. కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు. శ్రీనివాస్ రెడ్డి. వేణుగోపాల్. వ్యవసాయ అధికారి. కే సంజీవ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
ఈ శ్రీనివాస్ రెడ్డి. ప్రాథమిక వ్యవసాయ సహాయ సంగం చైర్మన్ కె భాస్కర్. విజేందర్ రెడ్డి. వ్యవసాయ విస్తరణ అధికారులు. గౌతమ్ లక్ష్మణ్. విద్యార్థులు సిద్ధార్థ్ మరియు సన్నీ ప్రసాద్ రైతులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు
భూకబ్జాదారులను కఠినంగా శిక్షించాలి:ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్..
జాతీయ రోడ్డుపై దళితుల ధర్నా..రెండు కిలోమీటర్ల మేర స్థంబించిన ట్రాఫిక్..
న్యాయం చేస్తామన్న ఎస్సై హామీతో ధర్నా విరమణ
వరంగల్ నేటిధాత్రి:
హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని నాగయ్యపల్లెలో కొంతమంది అగ్రకుల రెడ్డి కులస్తులు భూకబ్జాదారులుగా అవుతారమెత్తి రెచ్చిపోయారు.ఏకంగా ఎస్సీల స్మశాన వాటికనే కబ్జా చేశారు.సర్వే నెంబర్ 931లో దాదాపు రెండు ఎకరాల భూమిలో ఆది నుంచి గ్రామంలోని మాదిగ కులస్తులు స్మశాన వాటికగా ఏర్పాటు చేసుకొని సమాధులు నిర్మించారు.ఈ భూమిపై కన్నేసిన గ్రామానికి చెందిన పోగుల మహేందర్ రెడ్డి,పోగుల బ్రహ్మయ్య,పోగుల కైలాసం,పోగుల సురేందర్ అను వ్యక్తులు మంగళవారం గుర్తుతెలియని రెండు జెసిబిలను తీసుకువచ్చి సమాధులను తొలగించి స్మశానవాటికలోకి అక్రమంగా ప్రవేశించి భూమిని చదును చేశారని :ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ ఆరోపించారు.కబ్జా పట్ల పోలీసు అధికారులకు,రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాతో సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది.ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ మాట్లాడుతూ దళితులకు సంబంధించిన స్మశానవాటిక భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకాలను శాంతింపజేసి కబ్జాదాలపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చి ధర్నాను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత ప్రజాసంఘాల నాయకులు బాగాజీ రజనీకాంత్,జినుక అశోక్,మాదాసి ప్రభాకర్, మాదాసి ఎర్ర సూరయ్య,మాదాసి కృష్ణ, మాదాసి సాంబయ్య,మాదాసి సుధాకర్,సంగి యాకయ్య,గిన్నారపు భాస్కర్, మాదాసిరాజు,మాదాసి మల్లయ్య,మాదాసి రాహుల్ తదితరులు పాల్గోన్నారు.
వివాహ వేడుక లో టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం లోని శుభం కన్వెన్షన్ హాల్లో షీలా రమేష్ గారి కూతురి వివాహ వేడుకలో పాల్గొని అక్షంతలు వేసి నూతన వధువు వరులకు శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితోపాటు కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కుచ్చుబుద్దీన్ బిజీ సందీప్ రేవనప్ప శంకర్ కాశీనాథ్ తదితరులు ఉన్నారు.
శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల కమిటీని మండల అధ్యక్షుడు నర హరిశెట్టి రామకృష్ణ ప్రకటిం చడం జరిగింది.ఈ కమిటీలో ప్రకటించిన వారు మండల ఉపాధ్యక్షులుగా పోల్ మహేందర్, రేణుకుంట్ల చిరంజీవి, కోమటి రాజశేఖర్, లావుడియా జ్యోతి, మండల ప్రధాన కార్యదర్శులుగా మామిడి విజయ్, భూతం తిరుపతి, కార్యదర్శులుగా మేకల సుమన్, కొంగర భారతి, వంగరి శివశంకర్, జున్నుతుల జీవన్ రెడ్డి, కోశాధికారిగా కుక్కల మహేష్ బిజెపి మండల కమిటీని ఎన్ను కున్నారు ఎన్నుకున్న మాట్లాడుతూ కమిటీ సభ్యులు భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలాన్ని మండలంలో విస్తరింప చేస్తా రని రానున్న రోజుల్లో భారతీ య జనతా పార్టీ గెలుపు కొర కు కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్య క్షులు ఉప్పు రాజు తదితరులు పాల్గొన్నారు
పట్టణం లోని శుభం కన్వెన్షన్ హాల్ లో జరిగిన మహిళ నాయకురాలు షీలా రమేష్ గారి కూతురి వివాహా వేడుకల్లో కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు శ్రీ కొన్నింటి మాణిక్ రావు, మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం , కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,పాక్స్ చైర్మన్ స్రవంతి రెడ్డి, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్ , ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,యువ నాయకులు మిథున్ రాజ్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప , వెంకట్ ,దీపక్, శంకర్ పటేల్ ,నర్సింహ రెడ్డి,రేవనప్ప తదితరులు.
బయ్యారం మండల పరిధి నామాలపాడు నుంచి కాచన పల్లి రహదారి మార్గం పక్కన కేబుల్ కోసం తవ్విన గుంటలు పూర్తిగా పూడ్చకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి.
గతంలో బిఎస్ఎన్ఎల్ టవర్ కేబుల్ లైన్ వేయడం కోసం యంత్ర సాధనాలతో తీసిన గుంతలు పుడ్చకపోవడతో రహదారి ప్రయాణికులకు, పశువులకు ప్రమాదంగా మారి సతమతమవుతున్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అసంపూర్తిగా ఉన్న గుంటలలో ద్విచక్ర వాహనాలు, వాహనదారులు,మూగ జంతువులు పడి ప్రమాదాలకు గురి అవుతున్నాయి.
ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాయి.
BSNL tower
గుత్తేదారు గుంతలు పూడ్చకపోవడం ద్వారానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, జిల్లా అధికారులు చోరువచూపి ప్రమాదాల బారిన పడకుండా కేబుల్ కోసం వేసిన గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చుతారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గురిజాల రవీందర్ రావ్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణి సంస్థ ఒక రత్న గర్భ అని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు, క్యాతనపల్లి మాజీ సర్పంచ్ గురిజాల రవీందర్ రావ్ అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సివి రామన్ పాఠశాలలోఅడ్వకేట్ కస్తూరి శ్రీనివాస్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి లో ఓపెన్ కాస్ట్ గనులు వచ్చి ఈ ప్రాంతాన్ని బొందలగడ్డ చేస్తదని నేను ఓపెన్ కాస్ట్ ను వ్యతిరేకిస్తే నా ఉద్యోగాన్ని సంస్థ తీసివేసింది అని అన్నారు.సింగరేణి కార్మికులు,కార్మికేతరులు, చిరు వ్యాపారుల కొరకు అనేక ఉద్యమాలు చేశానని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో రామకృష్ణాపూర్ పట్టణం కనుమరుగవుతుందేమోనని బాధను వ్యక్తం చేశారు.135 సంవత్సరాల చరిత్ర కలిగి,అత్యధిక కార్మికులు సింగరేణి సంస్థ లో పని చేసే వారని గుర్తు చేశారు.అత్యధిక ఉత్పత్తి, ఉత్పాదకత సింగరేణి సంస్థ సాధించి తెలంగాణకు ఒక ఆయువుపట్టుగా నిలిచిందని అన్నారు.మందమర్రి ఏరియాలో మ్యూజియం ఏర్పాటు చేస్తే అధికారుల, కార్మికుల ఫోటోలు, ప్రతి ఒక్కరి ఫోటోలు, సంస్థలో వాడే వస్తువులు మ్యూజియంలో ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు చూసుకునే అవకాశం ఉంటది కాబట్టి మ్యూజియం అవసరం అని, కొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా కలిసొస్తాయని అన్నారు.సింగరేణి లో నాటిన మొక్కలు మరెక్కడా నాటలేదని అన్నారు.కొత్తగూడెం, మందమర్రి ,భూపాలపల్లి మూడు ఏరియాలలో మూడు మ్యూజియాలు ఏర్పాటు చేసేలా సింగరేణి సంస్థ చొరవ తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు.దేశంలోని వివిధ సంస్థలకు మ్యూజియాలు ఉన్నప్పుడు సింగరేణి సంస్థ కు ఎందుకు ఉండకూడదని అన్నారు. మ్యూజియాలు ఏర్పాటు చేస్తే వాటి ముందు విలియం కింగ్ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థను కోరుతామని అన్నారు.
దుగ్గొండి మండలంలోని సీనియర్ ఈనాడు పత్రిక రిపోర్టర్ బైగాని వీరస్వామి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.కాగా బుదవారం దుగ్గొండి ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు మృతిని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీతో ఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేదవారి సొంతింటి కల నెరవేరిన వేళ ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కోరుట్ల పట్టణ జిఎస్ గార్డెన్లో పట్టణానికి చెందిన 33 వార్డుల ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేసి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ తో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి పట్టణానికి చెందిన 33 వార్డుల్లో అర్హులైన 502 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని ప్రజా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజల సొంతింటి కల సహకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేయకుండా కేవలం తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే పంపిణీ చేసిందన్నారు కోరుట్ల పట్టణంలో కేవలం 80 ఇల్లు మాత్రమే మంజూరు చేయగా అది కూడా తమ నాయకులకు కార్యకర్తలకు కట్టబెట్టారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల వ్యవధిలోనే జనాభా ప్రాతిపదికన అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు పేదవారు కూడా సన్న బియ్యంతో కడుపునిండా తినాలని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందన్నారు కొండ్రికర్ల బ్రిడ్జి నిర్మాణం కేవలం ఎన్నికల్లో ఓట్లు దండు పోవడం కోసం తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే బ్రిడ్జి నిర్మాణం చేపడతామని బాండ్ పేపర్ రాసి ఇచ్చింది కానీ గెలిచిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం ఊసే లేకుండా పోయిందన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 నెలల వ్యవధిలోనే 6 కోట్ల 80 లక్షల రూపాయల మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణ పనులకు పునాది వేసిందన్నారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వార్డు ఆఫీసర్ల కృషి అభినందనీయమన్నారు ఇందిరమ్మ ఇంటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాజీ మంత్రివర్యులు స్వర్గీయ రత్నాకర్ రావు హయాంలో కోరుట్ల పట్టణంలో సుమారు 500 ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 80 మాత్రమే మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ద్వారా పట్టణంలోని 33 వార్డుల ద్వారా 502 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రోస్డింగ్ పత్రాలు అందజేస్తున్నామన్నారు ఇంకా ఎవరైనా లబ్ధిదారులు రాని వారు ఉంటే వారికి కూడా త్వరలోనే అందేలా కృషి చేస్తామన్నారు కోరుట్ల నియోజకవర్గం లో ఇప్పటివరకు సుమారు మూడు కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు ఎవరికి ఏ సమస్య ఉన్న నేరుగా తన వద్దకు వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తోపాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు వార్డు ఆఫీసర్లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క నూతన రేషన్ కార్డును కూడా పంపిణీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల వ్యవధిలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తుందన్నారు.
తంగళ్ళపల్లి మండలం లో దేశాయి పల్లె బదనపల్లి తంగళ్ళపల్లి గ్రామాలలో నూతన గృహాలకు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగిందని . తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి.మండల కేంద్రంలో ఇప్పటివరకు 210. ఇండ్లకు గ్రౌండింగ్ చేయడం తో పాటు పేదింటి కలల సహకారం.చేస్తున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో డబుల్.బెడ్ రూమ్ పేరు మీద. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అటువంటి దానికి. తావు లేకుండా ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం. ప్రజా పరిపాలన అందిస్తుందని. గత ప్రభుత్వాలు చేసిన. అప్పులను తీర్చుకుంటూ. రేవంత్ రెడ్డి. ప్రజా పరిపాల సాగిస్తూ. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి. అభివృద్ధి పథంలో ఉంచుతున్నారని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కోరుట్లలో స్వాగతం పలికిన జువ్వాడి నర్సింగ్ రావు మెట్ పల్లి జూన్ 4 నేటి ధాత్రి
జువ్వాడి నర్సింగరావు స్వగృహం జువ్వాడి భవన్ లో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి కోరుట్ల నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామికి కోరుట్ల పట్టణ సాయిబాబా దేవాలయం వద్ద స్వాగతం పలికి ఆరపేట గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మెట్ పల్లి పట్టణంలో గల జువ్వాడి నర్సింగ్ రావు స్వగృహం జువ్వాడి భవన్ లో ఏర్పాటుచేసిన తేనేటి విందులో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు అనంతరం ఆర పేటలో వై కన్వెన్షన్ హాల్ లో జరిగిన మాలలా గర్జనలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి మాజీ కేంద్ర మంత్రి వర్యులు సభ్యులు కీ”శే” గడ్డం వెంకట స్వామి చిత్రపటానికి పూల మాలాలు వేసి నివాళులర్పించి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ని శాలువాతో సత్కరించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కోరుట్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మాలల గర్జన కార్యక్రమానికి విచ్చేసిన వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినట్లు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ గురుకులాల సెక్రటరీని విధుల నుంచి తొలగించాలి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి విల్సన్
నేటి ధాత్రి అయినవోలు :-
ఎస్సీ గురుకులాల విద్యార్థుల పట్ల కుల వివక్ష చూపెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణిని తక్షణమే విధులు నుండి తొలగించి కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ప్రధన కార్యదర్శి జేరిపోతుల విల్సన్ మాదిగ డిమాండ్ చేశారు.
మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిట్టు పాక ప్రభాకర్ మాదిగ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ముందుకు సాగుతూ ఎస్సీ గురుకుల ను దేవాలయాల లాగా వుండాలని చెప్పారు.
కానీ ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఒక ఐఏఎస్ అధికారిని అయి ఉండి దళిత విద్యార్థుల పై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కుల అహంకారంగా భావించాల్సిన అవసరం ఉంది అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను దళితులు పక్షాన ఉన్నాను ఉంటాను అని ఎన్నో వేదికల పైన మనకు తెలపడం జరిగింది కానీ ఇటువంటి కులహంకార అధికారుల వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి వర్షిని మాట్లాడిన మాటలు మనము గమనిస్తే విద్యార్దులే వారి టాయిలెట్లు కడిగితే తప్పేముంది అనే మాట ఏంతో విషపూరిత మాట కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటేనే వారిని తొలగించండి .
వారి మీద రాష్ట్ర ఉన్నత పోలీస్ శాఖకేసును సుమోటోగా తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విచారణ జరిపి తక్షణమే విధుల నుంచి తొలగించాలి గురుకులాల సెక్రటరీ పోస్టును అర్హులైన దళిత అధికారిని వెంటనే నియమించాలి అప్పుడే మా దళిత బిడ్డలకు న్యాయం జరుగుతుంది స్వేచ్ఛగా చదువుకునే విసులుబాటు అందుతుందిఅని మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ టి. ఎం. ఆర్. పి. ఎస్ తరుపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నమన్నారు.
నేతాజీ డిగ్రీ కళాశాల లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్
సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ “టెక్ బ్రిక్స్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్”(TekBrix IT Pvt.Ltd) ఆధ్వర్యంలో డిగ్రీ పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కళాశాల చైర్మన్ జూపల్లి పృధ్విధర్ రావు,ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగానికి సెలెక్ట్ కావడానికి అర్హతలుఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలని, టైపింగ్ లో మంచి నైపుణ్యం ఉండాలని తెలిపారు. అంతేకాకుండా 25 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలని తెలిపారు. విద్యార్థులను టైపింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుందనీ తెలిపారు. జీతం నెలకు 20000 నుండి 25000 వరకు ఇవ్వబడుననీ తెలిపారు. జాబ్ లొకేషన్ హైదరాబాద్.ఇంటర్వ్యూ కోసం విద్యార్థులు తేదీ: 06/06/2025 అనగా శుక్రవారం రోజున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలవరకు హజారు కాగలరు. వచ్చేటప్పుడు 2 బయోడేటా ఫామ్ లు తీసుకొని నేతాజీ డిగ్రీ కళాశాల, ఆటోనగర్ సిరిసిల్ల లో సంప్రందించగలరని కళాశాల యాజమాన్యం తెలిపారు.
* మలబార్ గోల్డ్ & డైమండ్స్ ను పునః ప్రారంభించిన ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి
కాప్రా నేటిధాత్రి 04:
డీ యర్ ఏఎస్ రావు నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మల్బార్ గోల్డ్ & డైమండ్స్ షో రూమ్ ప్రారంభోత్సవం నకు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి తో కలసి ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.
BRS party leaders Bandari Lakshma Reddy.
ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో రాణించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం కరోనాకాలం నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపిన ఐనవోలు మండల పార్టీ అధ్యక్షులు ప్రణయ్
నేటి ధాత్రి అయినవోలు :-
మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సందర్భంగా భాజాపాయనవోలు మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్షాకాల దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఒకేసారి చేయడాన్ని హర్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఐనవోలు మండల పార్టీ అధ్యక్షులు మాదాసు ప్రణయ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి నాయకులు మరియు రేషన్ బియ్యం తీసుకున్న పేద మహిళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. కరోనాకాలం నుండి దాదాపు నాలుగు ఏళ్లుగా ఉచిత బియ్యం ఇస్తున్న మోదీ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలికారు, మోడీజీ పేదల సంక్షేమం కోసం నిరంతరం పేదల పక్షపాతిగా అనిపించుకుంటున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పొన్నాల రాజు, శక్తి కేంద్ర ఇన్చార్జ్ కోట కిరణ్ కుమార్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు తాటికాయల ఆనందం, పోలింగ్ బూత్ అధ్యక్షులు కట్కూరి రమేష్, మాదాసు వేణు, కట్ట విజయ్, మహేష్, లెనిన్, శివమణి, తదితరులు పాల్గొన్నారు
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మిక తనిఖీ చేశారు సీజన్ వ్యాధుల గురించి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది హాజరు పట్టికను పరిశీలి ంచి సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు మందుల కొరత లేకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం డే )డేసర్వే చేయాలని మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అదే రంగాపురం పిఢిసిల్ల మోట్ల పెళ్లి నూతన సబ్ సెంటర్ లను (పల్లె దవఖానాలను) పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డాక్టర్ నాగరాణి డాక్టర్ నవత ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.