కార్మికుల ఉద్యోగ భద్రత సౌకర్యాల సాధన కోసం సిఐటియు ను గెలిపించండి.

కార్మికుల ఉద్యోగ భద్రత సౌకర్యాల సాధన కోసం సిఐటియు ను గెలిపించండి

★చుక్క రాములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఈనెల 5వ తేదీన జరిగే పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు ఘనవిజయం అందించేందుకు కార్మికులు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలని సిఐటియును గెలిపించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, మహీంద్రా&మహీంద్రా ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) అధ్యక్షులు కామ్రేడ్ చుక్క రాములు పిలుపునిచ్చారు. మంగళవారం రోజు కంపనీ ముందు జరిగిన ఎన్నికల గేట్ మీటింగ్ లో చుక్క రాములు మాట్లాడుతూ మరో చారిత్రాత్మక వేతన ఒప్పందం 25000 రూపాయలతో చేస్తామని, ఉద్యోగ భద్రత, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని, కార్మికులతో పాటు తల్లిదండ్రులకు మెడికల్ కార్డ్ వర్తించేలా 7లక్షలతో చేస్తామని, 3సంవత్సరాలకు అగ్రిమెంట్, 4.50రూ/- డి ఎ పెంచుతామని ఇలా అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఐ ఎన్ టి యు సి నాయకులకు కనీసం కార్మికుల పట్ల అవగాహన లేదనీ, కార్మికుల పట్ల కేవలం అవగాహన ఉండి చారిత్రాత్మక వేతన ఒప్పందాలు సాధించి పెట్టి అనేక సౌకర్యాలు సాధించిన ఘనత సిఐటియు దేనని రాబోయే రోజుల్లోనూ వేతన ఒప్పందం ఉందని ఆ వేతనం ఒప్పందాన్ని కూడా మెరుగైందిగా చేయాలంటే సిఐటియుని గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, సీపీఎం ఏరియా కార్యదర్శి రాంచందర్, వివిధ పరిశ్రమల యూనియన్స్ నాయకులు నాయకులు పాండు రంగ రెడ్డి, బాగారెడ్డి, మహిపాల్, రాజిరెడ్డి, కనకారెడ్డి, గణేష్, నర్సయ్య, మణి, నారాయణ, సందీప్ రెడ్డి, నరేష్, నర్సింలు, తదితరులున్నారు.

ప్రియురాలితో గొడవ.. ఇదేం పని నాయనా..

ప్రియురాలితో గొడవ ఇదేం పని నాయనా..

 

నేటిధాత్రి: 

 

 

 

ప్రియురాలిని బెదిరిద్దామనుకున్నాడో..

లేక చనిపోవాలనుకున్నాడో తెలీదు కానీ..

హై ఓల్టేజ్ కరెంట్ లైన్ టవర్‌ను ఎక్కాడు.

ఇది గమనించిన ఓ వ్యక్తి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు.

ప్రేమ ఎంత మధురం..

ప్రియురాలు అంత కఠినం..

అని అభినందన సినిమాలో ఓ పాట ఉంటుంది.

సృష్టి మొదలైన నాటినుంచి ఇప్పటి వరకు స్త్రీ అర్థంకాని..

అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.

ప్రేమలో ఉన్న లేదా పెళ్లి చేసుకుని ఉన్నా..

మగాళ్లకు ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు.

ఏ కారణం లేకపోయినా..

కారణం లేని కారణంగా గొడవపడే ఆడవాళ్లు ఎందరో..

తాజాగా, ఓ యువకుడు ప్రియురాలితో గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

ఏకంగా 40 అడుగులు ఎత్తైన ప్రమాదకరమైన కరెంట్ లైన్ ఎక్కాడు.

అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్, రాయబరేలీకి చెందిన అంకిత్ సింగ్..

అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

కొద్దిరోజుల క్రితం అంకిత్ ఉస్రైనా గ్రామంలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు.

సోమవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా..

అంకిత్‌కు అతడి ప్రియురాలికి మధ్య గొడవ మొదలైంది.

ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది.

ఊరి బయటకు పరుగులు తీశాడు.

ప్రియురాలిని బెదిరిద్దామనుకున్నాడో..

లేక చనిపోవాలనుకున్నాడో తెలీదు కానీ..

హై ఓల్టేజ్ కరెంట్ లైన్ టవర్‌ను ఎక్కాడు.

ఇది గమనించిన ఓ వ్యక్తి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు.

పెద్ద ఎత్తున జనం అక్కడికి వచ్చారు.

అంకిత్ బంధువులు కూడా వచ్చారు.

కిందకు దిగమని బతిమాలారు.

పోలీసులకు కూడా సమాచారం వెళ్లింది.

వారు అక్కడికి చేరుకుని అతడికి సర్ధి చెప్పారు.

ఈ హైడ్రామా సాయంత్రం నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు సాగింది.

అతి కష్టం మీద అతడ్ని కిందకు దించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే, అంకిత్‌కు అతడి ప్రియురాలికి మధ్య ఏ విషయంలో గొడవ అయిందో తెలియరాలేదు.

మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్తు ప్రవేశాలు.

మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్తు ప్రవేశాలు

మరిపెడ:నేటిధాత్రి.

 

 

 

మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్తు రెండవ విడతఅడ్మిషన్లు ప్రారంభమైనాయని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం పరిసర గ్రామాలలో పర్యటించి విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను కలిసి కళాశాలలో గల కోర్సుల వివరాల ను మరియు కళాశాల యొక్క వసతులను వివరించారు కళాశాలలో గల గ్రూపులు బిఎస్సి, ఎంపీసీ ,బీజేపీ ,
బి కం కంప్యూటర్ అప్లికేషన్ ,కోర్సులు గలవు అదే విధంగా టైలరింగ్ నేర్పబడును అని కళాశాల ప్రిన్సిపాల్ టి జీవన్ కుమార్ తెలిపారు.

ఆంజనేయ విగ్రహం పునః ప్రతిష్టకు 10,116 రూ, విరాళం.

ఆంజనేయ విగ్రహం పునః ప్రతిష్టకు 10,116 రూ, విరాళం

దేవేందర్ పటేల్, కేటీఆర్ సేన సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్ల మండలం లోని అంకుషాపూర్ సోమనపల్లి గ్రామ పురాతనమైన ఎంతో విశిష్టత మహిమ కలిగిన శ్రీ అభయాంజనేయ ఆలయం శిథిల అవస్థలో ఉండడం వలన ఉమ్మడి గ్రామాల ప్రజలు అభివృద్ధి కమిటీ వేసుకొని, ఆ కమిటీ ద్వారా శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం దేవాలయాన్ని పునః ప్రతిష్ట చేయడం జరిగింది, మూడు రోజులు అంగరంగ వైభవంగా మే 31 వ రోజు నాడు గణపతి పూజతో ప్రారంభమై అయి జూన్ 1వ తారీకు నాడు విగ్రహాలను జల నివాసం చేయడం జరిగింది, జూన్ రెండో తారీకు శ్రీ అభి ఆంజనేయ స్వామి విగ్రహం, ధ్వజస్తంభం గణపతి సుబ్రహ్మణ్యస్వామి నవగ్రహాలు ప్రతిష్టించడం జరిగింది, మూడు రోజులు పాటు సోమనపల్లి అంకుషాపూర్ ఉమ్మడి గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మూడు రోజులు మహా అన్నదానం ఆలయ కమిటీ వారు నిర్వహించడం జరిగింది,
శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ కి దేవేందర్ పటేల్ కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షుడు భూపాలపల్లి 10,116 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నందికొండ రామ్ రెడ్డి, పెంట రమేష్, పెద్దోజు రమణాచారి మీసేవ, పోతన వేన ఐలయ్య, అబ్బేంగుల శ్రీకాంత్, తిరుపతి రెడ్డి, పెద్దోజు భీష్మాచారి మంద రాజయ్య, నందికొండ రమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేయాలి.

ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేయాలి

ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షించాలి

మాజీ ఎమ్మెల్సీ ,తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో మాజీ ఎమ్మెల్సీ ,తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని,ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేయాలని,ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని మాజీ ఎమ్మెల్సీ ,తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.ప్రభుత్వ బడులు నిలబడాలి- చదువుల్లో అంతరాలు పోవాలి అనే నినాదం తో తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ సిరిసిల్ల చేరుకున్నారు.ఈ సందర్బంగా ఆయన తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రభుత్వం తో పాటు ప్రజలపై కూడా ఉందన్నారు.ప్రాథమిక పాఠశాలలో ప్రి ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని,తరగతి గదికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని,
పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పొరస్పందన వేదిక ఉపాధ్యక్షురాలు మంగ,కార్యవర్గ సభ్యులు నాగమణి,టి.ఎస్ యూ.టీ.ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మన మూర్తి, టి.ఎస్.యూ.టీ.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్,జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు,జిల్లా ఉపాధ్యక్షుడు గుండమనేని మహేందర్ రావు,కోశాధికారి అంబటి రమేష్,కార్యదర్శులు పాముల స్వామి,కొత్వాల్ ప్రవీణ్,తిరుపతి జాదవ్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు సి రామరాజు ,జిల్లా అధ్యక్షులు సిలువేరి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..

తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..

నేటి ధాత్రి

 

 

 

తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు నూతన వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణం శుభ్రంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు మున్సిపల్ వాహనాల కొత్త సదుపాయం ఎంతో అవసరం. ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ కార్యాలయానికి అందిన ఈ వాహనాలు — ప్రత్యేకించి కచ్రా వాహనాలు, వాటర్ ట్యాంకర్లు, ఇతర ఉపయుక్త వాహనాలు — పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందించేందుకు తోడ్పడతాయి..

పట్టణంలోని పారిశుద్ధ్య పరిరక్షణ, డ్రైనేజ్ నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మున్సిపల్ వ్యవస్థను శక్తివంతం చేస్తోంది..

అలాగే, మున్సిపల్ సిబ్బంది సమర్థంగా పనిచేస్తే పట్టణ వాతావరణం శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా సహకరించాలని నేను కోరుతున్నాను..

ఈ కార్యక్రమంలో కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ నాయకులు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు..

భూసమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో భూభారతి రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ ముప్పు కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అర్షణ పల్లి, రాంపూర్ గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయగా రైతుల నుండి పలు సమస్యలపై 162 దరఖాస్తులను తహసిల్దార్ ముప్పు కృష్ణ నేరుగా స్వీకరించడమైనది అనంతరం ఆయన మాట్లాడుతూ. రైతుల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్ లో నమోదు చేసుకొని దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. ఈనెల 3 నుండి 20 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు సదస్సులో పాల్గొని తమ భూ సమస్యలపై దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. అలాగే సాదా బైనామా, వారసత్వం, డిజిటల్ సంతకం పెండింగ్, దేవుని పట్టా, మిస్సింగ్ సర్వే నెంబర్, విస్తీర్ణ సవరణ మొదలైన సమస్యలపై పరిష్కారం దిశగా భూభారతి పనిచేస్తుందని దానికి అనుగుణంగా రైతులు రెవెన్యూ సిబ్బందికి సహకరించి తగు సమయంలో వారి భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ మెంబర్ జ్యోతి, రెవిన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వనము.ఆత్మీయ భక్తజనులకు మరియు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా తేది: 04-06-2025, ఉ 9.00 గం॥లకు రోజున శ్రీ జీరప్ప స్వామి ఊరేగింపు,శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మరియు హోమం కార్యక్రమము జరుగును, కావున భక్తులందరు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి గారి కృపకు పాత్రుల కాగలరని మనవి కార్యక్రమం అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేయనైనది.
అందరూ ఆహ్వానితులే…ఆహ్వానించువారు
గొల్లకురుమ సంఘం గ్రా॥ కక్కెడ వాడ, మం: ఝరాసంగం, జిల్లా, సంగారెడ్డి.

ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి.

ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి

విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందించిన పిడి ఎస్ యు నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విద్యాహక్కు చట్టంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలుకై చర్యలు చేపట్టాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారికి పిడి ఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా పిడి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీ నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది.ఇప్పటికీ ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించలేకపోయారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి కృషి కూడా చేయడం లేదు.విద్యార్థులు లేరనే సాకుతో రెండువేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం పూనుకుంటుంది.అలాగే కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ విచ్చలవిడిగా పాఠశాలలను నెలకొల్పుతూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు.విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోవడం లేదు.ఏ ఒక్క పాఠశాలల్లో కూడా చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25% ఉచిత అడ్మిషన్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు.కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ కొరకు ఈ ఏడాదే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని ప్రకటించి మరోపక్క యాజమాన్యాలు ముందుస్తు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికిని ఇంకా కాలయాపన చేస్తున్న పరిస్థితి నెలకొంది.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడి ఎస్ యు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.లేని యెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిడి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్,కార్తీక్,పాల్గొన్నారు.

కల్వల ప్రాథమిక పాఠశాల లో బడిబాట.

కల్వల ప్రాథమిక పాఠశాల లో బడిబాట

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కల్వల బడి బాట కార్యక్రమం ను మంగళవారం కల్వల సమీపంలో గల బావోజీ తండ లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. బడి బాట కార్యక్రమం లో భాగంగా రోడ్ ప్రక్కన వ్యవసాయ పని చేస్తున్న గ్రామ ప్రజలను కలిసి, ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి ప్రభుత్వ పాఠశాల పై ప్రభుత్వ తీసుకుంటున్న కార్యక్రమాల గురించి వివరిస్తూ, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు తో పాటు, ఉద్యోగ,ఉపాధి అవకాశాల ల్లో ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది అని నొక్కి వక్కానించారు. అవసరమయితే సుదూర ప్రాంత తండా పిల్లలకు పాఠశాలకు రావడానికి ఇబ్బంది పడుతున్నందున వారికి రవాణా నిమిత్తము ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ,స్వరూప ,క్రిష్ణ, శ్రీదేవి, మోహనకృష్ణ ,తండ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అనుమతి పత్రాలు లేని 8 ఇసుక ట్రాక్టర్ల పై కేసులు నమోదు.

అనుమతి పత్రాలు లేని 8 ఇసుక ట్రాక్టర్ల పై కేసులు నమోదు.

ఎస్ఐ జి శ్రవణ్ కుమార్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

చిట్యాల మండల కేంద్రంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేని కాల్వపల్లి, అందుకు తండా, నేరేడుపల్లి గ్రామాలకు చెందిన ఎనిమిది ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసి ఎమ్మార్వో ముందు ఉంచగా, ఎమ్మార్వో వాటిపై జరిమానా విధించిన తర్వాత వాటిని వదిలివేయడం జరిగింది
ఇకముందు ఎవరైనా అనుమతి పత్రాలు లేకుండా ఇసుక అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని చిట్యాల ఎస్సై జి శ్రవణ్ కుమార్ తెలిపారు,
అలాగే మైనర్ డ్రైవింగ్ చేస్తే ఓనర్ పై కూడా కేసు నమోదు చేస్తామని, వాహనాలకు తప్పకుండా నంబర్ ప్లేట్లు ఉండాలని డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిపారు.

భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి చట్టం…

భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి చట్టం…

రెవెన్యూ గ్రామ సభలను రైతులు వినియోగించుకోవాలి…

జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు, 288 రెవెన్యూ గ్రామాలు…

నేటి నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు…

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్…

నేటి ధాత్రి – మహబూబాబాద్ :-

 

 

భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి నూతన రెవెన్యూ చట్టం అని, రెవెన్యూ గ్రామసభలను భూ సమస్యలు ఉన్న రైతులు వినియోగించుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.మంగళవారం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన భూభారతి రెవెన్యూ చట్టం – 2025,రెవెన్యూ గ్రామసభలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలలో నిర్వహించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ,రాష్ట్రవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టులో భాగంగా దంతాలపల్లి మండలంలో ఇప్పటికే రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.జిల్లాలో రెండు బృందాలుగా రెవెన్యూ సిబ్బందిని నియమించి
ఉదయం 9 నుండి 4 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఇప్పటికే స్థానిక తహసీల్దారులు పూర్తిస్థాయిలో సంబంధిత రెవెన్యూ గ్రామాలలో ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్య పరిచినట్లు తెలిపారు.మహబూబాబాద్, సింగారం, నెల్లికుదురు మండలం, వావిలాల రెవెన్యూ గ్రామాలలో జరుగుతున్న సదస్సులను పరిశీలించారు.ప్రభుత్వం సూచించిన ప్రకారం రెవెన్యూ గ్రామసభలను పక్కాగా నిర్వహించాలని దరఖాస్తుదారులకు ముందస్తు ఫారాలను ఇవ్వాలని వారి యొక్క దరఖాస్తులను పరిశీలించి స్వీకరించాలన్నారు.సదస్సులలో ప్రత్యేక హెల్ప్ డిస్కులను ఏర్పాటు చేయాలన్నారు.

Farmers

 

 

వాటి ద్వారా దరఖాస్తుదారులకు తగు సూచనలు చేస్తూ దరఖాస్తులను పూరించుటకు సహకరించాలన్నారు.జిల్లా వ్యాప్తంగా ప్రతీ రోజు వచ్చిన దరఖాస్తుల స్థితిగతులను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. వీరబ్రహ్మచారి కురవి మండలం తిరుమలపురం, మొగిలిచర్ల, రెవెన్యూ గ్రామాలలో జరుగుతున్న సదస్సులను పరిశీలించారు.ప్రజలకు అనువైన ప్రదేశాలు గ్రామపంచాయతీ, రైతు వేదికలు,తదితర ప్రదేశాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సదస్సులు నిర్వహిస్తూ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు

– తహసిల్దార్ జాలీ సునీత
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు మొగుళ్లపల్లి తహసిల్దార్ జాలీ సునీత తెలిపారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి మరియు పోతుగల్ గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహసిల్దార్ సునీత రైతుల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించి..రిజిస్టర్ లో నమోదు చేశారన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. ఈనెల 3 నుండి 20 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, ప్రజలు రెవెన్యూ సదస్సులలో పాల్గొని తమ భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. అలాగే నేడు గురువారం మండలంలోని రంగాపురం మరియు అంకుషాపురం గ్రామాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొని భూములకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న వారు వారి దగ్గర ఉన్న ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తహసీల్దార్ జాలీ సునీత సూచించారు. ఈ కార్యక్రమంలో డిఏఓ రంగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ రామకృష్ణ మరియు రెవెన్యూ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన వడ్లు తీసుకోకుండా ప్రైవేటుగా వడ్లు తీసుకొని బియ్యం.

ప్రభుత్వం ఇచ్చిన వడ్లు తీసుకోకుండా ప్రైవేటుగా వడ్లు తీసుకొని బియ్యం చేసే మిల్లులపై కఠిన చర్యలు

పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్

వనపర్తి నేటిధాత్రి:

వనపర్తి జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉన్న రైస్ మిల్లులు సగానికి పైగా డిఫాల్ట్ అయి ఉండటం ధాన్యం సేకరణకు ప్రధాన సమస్యగా మారిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్ అన్నారుమంగళవారం ఉదయం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐ.డి. ఒ సి. సమావేశ మందిరంలో వరి కొనుగోలు పై వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు, మిల్లర్లు ఐ.కే.పి, పి. ఎ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల సమీక్ష సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నాగర్ కర్నూల్ వనపర్తి అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.ఈ సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ వరి కొనుగోలు విషయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్య నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో వస్తుందని అన్నారు. దీనికి ప్రధాన కారణం వనపర్తి జిల్లాలో 184 రైస్ మిల్లులు ఉండగా సగానికి పైగా డిఫాల్ట్ అయి ధాన్యం తీసుకోవడంలో దూరంగా ఉండటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారున్నాగర్ కర్నూల్ జిల్లాలో సైతం సగానికి పైగా మిల్లులు డిఫాల్ట్ అయ్యాయన్నారువనపర్తి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి అయితే మిల్లింగ్ చేయడానికి మిల్లులు లేకపోతే
బియ్యం ఎవరు చేస్తారని మిల్లర్ల ను ప్రశ్నించారు తాత్కాలికంగా గోదాముల్లో నిల్వ చేసినప్పటికీ అంతిమంగా తిరిగి మిల్లులకు చేయాల్సిందేనని
స్పష్టం చేశారు.ప్రభుత్వం నుండి వడ్లు తీసుకోకుండా గట్టిగా ప్రైవేట్ వడ్లు తీసుకొని మిల్లింగ్ చేస్తున్న డిఫాల్ట్ మిల్లుల పై చర్యలు కఠినంగా ఉంటాయని మిల్లర్లను హెచ్చరించారు.
మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నాణ్యమైన వడ్లు మిల్లుకు రాకపోవడం వల్ల క్వింటాలుకు 67 కిలోలు రావాల్సిన బియ్యం 62 కిలోలు మాత్రమే వస్తుందని, తద్వారా మిల్లరు నష్టపోతున్నారని ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తెచ్చారు సమీక్షలు పాల్గొన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా రైతులు వరి పండిం చారని అన్నారు.జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ అమరేందర్, వనపర్తి సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డి.యం లు, జిల్లా అధికారులు, మిల్లర్లు, ఐ.కే.పి, పి. ఎ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

తాహసిల్దార్ కు గౌడ కులస్తుల సన్మానం.

తాహసిల్దార్ కు గౌడ కులస్తుల సన్మానం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

మండల కేంద్రంలోని మండల తాహసిల్దార్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బిఎస్ఎస్ వరప్రసాద్ ను గౌడ కులస్తులు సాల్వతో ఘనంగా సత్కరించారు. గ్రామాల్లో నెలకొన్న గౌడ కులస్తుల సమస్యలను తాహసిల్దార్ కు వివరించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఏ గ్రామంలో నైతే గౌడ కులస్తులకు ఐదు ఎకరాల భూమి లేదు వాటిని గుర్తించి వారికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. భూ సమస్యలు నెలకొన్న వాటిని భూభారతిలో పరిష్కారం చేసి గౌడ కులస్తుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా నాయకులు చెట్ల చంద్రశేఖర్ గౌడ్, చర్ల పళ్లి సత్యనారాయణ గౌడ్, సీనియర్ న్యాయవాది కట్ట నరస గౌడ్ మండల నాయకులు నేరెళ్ల సుభాష్ గౌడ్, భూసారపు సాయిరాం గౌడ్, కట్ట ఆంజనేయులు గౌడ్ పలు గ్రామాల గౌడ సంఘాల నాయకులు, ఎలుక అశోక్ గౌడ్, కుంట రాజగౌడ్, గంగా నరసయ్య గౌడ్, రాంప్రసాద్ గౌడ్, నారాయణ గౌడ్, రాజేశ్వర్గౌడ్, శంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామ్ కిషన్ గౌడ్, రఘు గౌడ్, అంజయ్య గౌడ్, రాములు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి.

బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

బిసి ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కన్వీనర్ కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన యుద్ధంలో రెడ్డి రావులకు అమృత అధికారం వస్తే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు విషాంధకారం లభించింది ఈ అశుభ సందర్భంలో తెలంగాణ అమరవీరుల స్థూపాలపై “తెలంగాణలో బలైపోయిన అమరవీరులంతా బీసీ ఎస్సీ ఎస్టీ” లు- “అధికారంలోకి వచ్చిందంట అగ్రకుల దొరలు” అనే రెండు లైన్లు అని భూపాలపళ్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద రాయడం జరిగిందన్నారు ఇప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం మేల్కొని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీలో అంతర్భాగమై 93 శాతం ఉండేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని సాధించుకోవాలని అన్నారు
ఈ కార్యక్రమంలో కాసగాని దేవేందర్ గౌడ్ ,హాబీబ్ పాషా కండే రవి, పుల్ల అశోక్, పర్ల పెళ్లి కుమార్ ,నేరెళ్ల రమేష్ ,కోరళ్ళ శ్యామ్, రవీందర్ బోయిని ప్రసాద్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు

గోవధ చేసే వారిని కఠినంగా శిక్షించాలి.

గోవధ చేసే వారిని కఠినంగా శిక్షించాలి.

భాజపా మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి నేటి ధాత్రి:

బక్రీద్ పండుగ పురస్కరించుకొని గోవధ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య కు మండల పరిధిలో గోమాత హత్యలు చేస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మండల పార్టీ తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి గో అక్రమ రవాణాలను నివారించాల్సిందిగా అదేవిధంగా గోమాత హత్యలను అరికట్టే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, కోశాధికారి మురికి మనోహర్, నాయకులు వల్లే పర్వతాలు, కొండ్లె రమేష్, కౌడగాని రాజేందర్, తిమ్మాపురం శివ తదితరులు పాల్గొన్నారు.

ఓపెను జిమ్ కొరకు ప్లేస్ పరిశీలన కమిటీ సభ్యుల సమావేశం.

ఓపెను జిమ్ కొరకు ప్లేస్ పరిశీలన కమిటీ సభ్యుల సమావేశం.

కల్వకుర్తి/ నేటిదాత్రి :

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని యోగ గ్రూప్ సభ్యులు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రోజు వాకింగ్ మరియు ఎక్ససైజ్ చేస్తుంటారు. అందులో భాగంగా పాఠశాల ఆవరణలో చివరిలో’ ఓపెన్ జిమ్ ఉంటే బాగుంటుందని గత నెల రోజుల క్రితం ఆనంద్ కుమార్, కల్వకుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఆర్యవైశ్యుల పట్టణ అధ్యక్షులు వాస శేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. దానిని పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయురాలు తో మాట్లాడి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో చర్చించి “ఓపెన్ జిమ్”మంజూరు చేయించినట్లు తెలిసినది. ఇందులో భాగంలోనే మంగళవారం పాఠశాల ఆవరణలో స్థలాన్ని పరిశీలించినారు.

సొంత ఇంటి కల నెరవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

సొంత ఇంటి కల నెరవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం.

నరసింహులపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కలను నెరవేరుస్తున్న ఏకైక ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అని .

ఇందుకుగాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి. గత ప్రభుత్వం.

ఎన్నో ప్రాజెక్టు ల. పేరిట. అప్పులు.చేసిన కూడా. వాటిని కట్టుకుంటూ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని

ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.

మంత్రి పొన్నం ప్రభాకర్ కి. ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ.నియోజవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు.

అలాగే ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందని నిర్మాణాలకు ఇసుక ఉచితంగా సరఫరా ప్రభుత్వమే చేస్తుందని లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేసుకుంటూ.

ఇల్లు నిర్మాణం చేపట్టి పనులు వేగవంతంచేసి ఇందిరమ్మ ఇంటి సహకారం ఇందిరమ్మ కలను సహకారంచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ పేరిట ప్రజల సొమ్ము దోచుకున్నారని ప్రజా ప్రభుత్వంలో ఇప్పటి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనలో.

అటువంటి వాటికి తావు లేకుండా ఉంటుందని

ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు అధికారులకు నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన లబ్ధిదారులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. ఏఎంసి వైస్ చైర్మన్.

నేరెళ్ల నరసింహం గౌడ్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి.

సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఏం సి డైరెక్టర్ పరశురాములు. కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం యాదవ్.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కటకం రాజశేఖర్. జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ. తిరుపతి. కిషన్. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ.

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని పురపాలక సంఘం సిరిసిల్ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ను ఈరోజు అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 100రోజుల కార్యాచరణ ప్రతిజ్ఞ ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది.అదే విధంగా అమరవీరుల స్థూపం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.   

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు పట్టణం లోని పురపాలక సంఘం ద్వారా జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో పురోగతి సాధించుటకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.ఈ యొక్క 100రోజుల కార్యాచరణ లో శానిటేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక మరియు మెప్మా విభాగాలు ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రతి విభాగం అభివృద్ధిలో పాలు పంచుకోవడం జరుగుతుంది అని ప్రజలు కూడా మాకు సహకరించి సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పట్టణ ప్రజలకు తెలియజేయడం జరిగినది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version