శివాలయ పునర్నిర్మాణానికి 3లక్షల విరాళం.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలం లోని నవాబుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి ఏలేటి రామయ్య పల్లి గ్రామానికి చెందిన కీర్తి శేషులు ఏలేటి రాంరెడ్డి జ్ఞాపకర్థం వారి కుమారులు అయినటువంటి ఏలేటి రాజు – ప్రసన్న, మరియు శ్రీనివాస్ – జమున దంపతులు శివాలయానికి విరాళంగా 300116/- రూపాయలు అక్షరాల (మూడు లక్షల నూట పదహారు రూపాయలు) ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమం లో శివాలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్,బిళ్ళ సత్యనారాయణ రెడ్డి, మందల రాఘవరెడ్డి,కాల్వ సమ్మిరెడ్డి,బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, మోతుకూరి రాజు,చెక్క నర్సయ్య,సర్వ శరత్, తీగల నాగరాజు,అనగాని రాజయ్య,తిప్పణవేణి రవి, ప్రధాన అర్చకులు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.