ఘనంగా జగ్జీవన్ రామ్ 118 జయంతి.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జగ్జీవన్ రామ్ 118 జయంతి

దళిత సింహం జగ్జీవన్ రామ్-ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి

పరకాల నేటిధాత్రి

 

పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధానిడాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత సింహమని బీహార్లో ఒక సామాన్య రైతు కుటుంబంలో 198లో ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జన్మించారని ఆయన జన్మదినాన్ని భారతదేశమంతట సమతా దివసుగా జరుపుకుంటారన్నారు.అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి షెడ్యూల్ కులాలను ఆయన సంఘటితం చేశారని,బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జగ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనేవారని తెలిపారు.సామాజిక చైతన్యం సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు 1934లో ఆల్ ఇండియా డిప్రెసెడ్ క్లాసెస్ లీగ్అఖిల భారతీయ రవిదాస్ మహాసభకు పునాది వేశారని అలాగే 1935లో అక్టోబర్19న దళితులకు ఓటు హక్కు కోసం హమండ్ కమిషన్ ముందు వాదన వినిపించారన్నారు.రాజ్యాంగ సభలో సభ్యుడుగా ఆయన పాత్ర ఎనలేనిదని దళితుల సామాజిక న్యాయ రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు 1946లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటుచేసిన తాత్కాలిక ప్రభుత్వ క్యాబినెట్ లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణ తీసుకొచ్చి తర్వాత కమ్యూనికేషన్,రైల్వే,రవాణ,ఆహార,వ్యవసాయ,రక్షణ వంటి కీలక శాఖలో బాధ్యతలు నిర్వహించారు. దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడానికి జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్ఎఫ్ నాయకులు బొచ్చు సంపత్ మాదిగ,దైనంపెళ్లి అజయ్ మాదిగ,ఒంటేరు మహేందర్ మాదిగ,ఏకు ప్రణయ్ మాదిగ,ఒంటేరు చరణ్ మాదిగ లు పాల్గొన్నారు.

జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి.

జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి.

రామాయంపేట ఏప్రిల్ 5 నేటి ధాత్రి (మెదక్)

 

దివంగత బాబు జగ్జీవన్ రామ్ సెవెన్ మరువలేనివని రామాయంపేట లైన్స్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. శనివారం రామాయంపేట పట్టణంలో ఆయన 117వ జయంతి వేడుకలను నిర్వహించారు. బడుగు బలహీనవర్గాల కోసం ఆయన ఎంతో సేవ చేశారని ఆయన సేవలు మరువలేనిది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ నాయకులు. ఏలేటి రాజశేఖర్ రెడ్డి, దేమే యాదగిరి, కైలాష్ తదితరులున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version