లీగల్ అవేర్నెస్ క్యాంపు…

లీగల్ అవేర్నెస్ క్యాంపు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో లీగల్ అవేర్నెస్ క్యాంపును ప్యానెల్ అడ్వకేట్ సోమశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో కనీస వేతన చట్టం, పనిప్రదేశాల్లో భద్రత, మహిళల లైంగిక వేదింపుల నిరోధక చట్టంపై వివరించారు. ఉచిత న్యాయ సేవా సహాయంపై అవగాహన కల్పించారు.

ఆదివాసీలను కించపరిచే విధంగా మాట్లాడితే.!

ఆదివాసీలను కించపరిచే విధంగా మాట్లాడితే నీ సినిమా చరిత్రను తొక్కిపడేస్తాం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),

నేటిధాత్రి:

ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో
గుండాల మండల కేంద్రంలో
అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు పూనెం రమణబాబు మాట్లాడుతూ
ఆదివాసీల చరిత్రను విమర్శిస్తే నీ సినిమా చరిత్రను తలకిందులుగా పాతాళానికి తొక్కవలసి ఉంటుంది ఖబర్దార్ ఔరంగజేబు విజయ దేవరకొండ నీకు ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాల గురించి ఏమి తెలుసు ఈ ప్రపంచానికి ఐక్యతను సమైక్యతను సంస్కృతిని సాంప్రదాయాలను నేర్పింది ఆదివాసీలే ఆయుర్వేద మూలికల వైద్యంతోనే సైన్స్ రంగాన్ని పునాది వేసింది ఆదివాసీలే అంతెందుకు నువ్వు కూడా నీ అభివృద్ధి చెందిన జాతని చెప్పుకునే నువ్వు కూడా ఆదిమానవుల మూలాల నుంచే అభివృద్ధి చెందిన అని చెప్పుకునే అప్పర్ క్యాస్ట్ గా వచ్చావు నీ మూలాలు మర్చిపోయి నిన్ను నువ్వే విమర్శించుకునే స్థాయికి ఎదిగా ఉంటే నువ్వు అభివృద్ధి చెందినట్లు అభివృద్ధి అనే ముసుగు వేసుకున్నట్టు తెలుసుకో ముందు.
500 సంవత్సరాల క్రితం సేన్స్ లేకుండా ట్రావెల్స్ కొట్టుకున్నారని మీరు అన్నారు.ఓకే కానీ నాడు సెన్స్ లేకుండా కొట్టుకున్న ఆధిపత్యం గుంపు మేలు కోసం తగల లాభాల కోసం కొట్టుకున్నారు. డ్రైవర్స్ కానీ సైన్సు స్పేస్ రంగాలు అభివృద్ధి చెందిన ఈ కాలంలో దేశాలు దేశాలు ఎందుకు కొట్టుకుంటున్నాయో దాన్ని మీరు వివరించగలరా ఆఫ్ చేయగలరా
అది చేతగాని మీకు 500 సంవత్సరాల నాటి ఆదివాసీల ఐక్యతను చరిత్రను గురించి మాట్లాడే అర్హత లేదు నీకు తక్షణమే క్షమాపణ చెప్పాలి లేకుంటే నీ దిష్టిబొమ్మలను ప్రతి వాడలొ తగలబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల కార్యదర్శి గొగ్గెలా సుధాకర్, జబ్బా సుదర్శన్,ప్రశాంత్, సంపత్ ,రామ్మూర్తి,చింటూ తదితరులు పాల్గొన్నారు.

దేవాలయ భూములను కాపాడాలని వినతి.

దేవాలయ భూములను కాపాడాలని వినతి.

కల్వకుర్తి/నేటి దాత్రి

 

కల్వకుర్తి మండలం రఘుపతి పేట రామగిరి దేవాలయ భూములను కాపాడాలని దేవాదయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీమతి కృష్ణవేణి గ్రామస్తులు, బిజెపి నాయకులు వినతి పత్రం సమర్పించడం జరిగింది.
దేవాలయ భూములకు 540 ఎకరాలు సంబంధించిన భూములలోని 100 ఎకరాలకు పైగా ఉన్నగుట్టను కొంతమంది కాంట్రాక్టర్ ఇష్ట రీతిన మట్టిని అక్రమంగా తరలించడం జరుగుతుందని, దేవాలయ భూములను కాపాడాలని, మట్టిని అక్రమంగా తవ్విన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్,మండల అధ్యక్షులు నరేష్ గౌడ్,మాజీ టౌన్ ప్రెసిడెంట్ బోడ నరసింహ ,వైస్ చైర్మన్ శ్యామ్ సుందర్,రఘుపతి పేట గ్రామస్తులు మల్లికార్జున్ రెడ్డి, వినయ రెడ్డి,రమేష్,సైదులు తదితరులు పాల్గొన్నారు

మే డే ను ఘనంగా నిర్వహించాలి.!

మే డే ను ఘనంగా నిర్వహించాలి:
మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం కావాలి:

సిఐటియు చండూరు మండలం కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ
నల్లగొండ జిల్లా నేటి ధాత్రి :

 

మే1న ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా చండూరు పట్టణ కేంద్రంలో,గ్రామాలలో ఘనంగా నిర్వహించాలని, సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి విరుద్ధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక హక్కులను కట్టు బానిసలుగా మార్చేందుకు పెద్ద కుట్ర చేస్తున్నాదని ఆయన విమర్శించారు.బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై మే 20న 11 కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం కావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల కోసం రక్తం చిందించి . హక్కులను పోరాడి సాధించుకున్న
మేడే అమరవీరుల స్ఫూర్తితో వారు సాధించిన హక్కులపై బిజెపి ప్రభుత్వం చేస్తున్న దాడికి వ్యతిరేకంగా మే 20న 11 కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఫెడరేషన్లు దేశవ్యాప్తంగా చేస్తున్న సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నెహ్రు బ్రిటిష్ పాలనలో కూడా దేశంలో అమలు చేసిన చట్టాలను బిజెపి ప్రభుత్వం వ్యతిరేకించడం దారుణం అని మండిపడ్డారు. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో కార్మికుల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తుందని అన్నారు.ఈ ప్రైవేటీకరణతో సామాజిక న్యాయం దెబ్బతింటుందని రిజర్వేషన్లు రద్దు అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మళ్లీ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 11ఏళ్ల బిజెపి పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని అన్ని తరగతుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల మధ్యన కుల మతాల పేరుతో విభజన సృష్టించి రాజకీయం పబ్బం గడుపుతుందని అన్నారు.మోడీ విధానాలపై కార్మిక వర్గం ప్రతిఘటనే మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె అని అన్నారు.145 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసం జరిగే ఈ దేశభక్తియుత సమ్మెలోకార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని, మే 1న చండూరు మండల కేంద్రంలో జరిగే మే డే దినోత్సవం కు గ్రామపంచాయతీ కార్మికులు, హమాలీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్,వివో ఏ లు, వాటర్ మెన్ లు, అందరూ తప్పకుండా హాజరుకావాలని ఆయన కార్మికులను కోరారు.
ఈ సమావేశంలో సిఐటియు సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం,చిట్టిమల్ల లింగయ్య,హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సాయం కృష్ణయ్య, రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, సైదులు, జాని, నగేష్, చిరంజీవి
తదితరులు ఉన్నారు.

అటవీ ఉత్పత్తులను దగ్గరలోని డిఆర్డిపోలో అమ్ముకోవాలి.

అటవీ ఉత్పత్తులను దగ్గరలోని డిఆర్డిపోలో అమ్ముకోవాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),

నేటిధాత్రి:

అటవీ ఉత్పత్తులను జిసిసి కొనుగోలు కేంద్రంలోనే కాకుండా దగ్గర్లోని డిఆర్ డిపోలో కూడా అమ్ముకునే సౌకర్యం కల్పించినట్లు జిసిసి మేనేజర్ నరసింహ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ ఉత్పత్తులను మధ్య దళారులకు అమ్మి మోసపోకూడదని సూచించారు. గిరిజన సహకార సంస్థ ద్వారా కిలో ముష్టి గింజలు 75,కుంకుళ్ళు 40,ఇప్ప పూలు 30,ఇప్ప పలుకు 29,కరక్కాయ 15,కానుగ కాయ 10 రూపాయలు,కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున గ్రామాలలోని ఉత్పత్తుల సేకరణ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.మంగళవారం సేల్స్ మెన్ శ్రీనివాస్ కు గుండాల డి ఆర్ డిపోను అప్పగించినట్లు చెప్పారు. గతంలో పనిచేసిన పగడయ్యను బదిలీపై పంపించినట్లు చెప్పారు.కార్యక్రమంలో అకౌంటెంట్ బూసేయ్య, జిసిసి సేల్స్ మెన్లు పూనం లక్ష్మయ్య, గలిగ చెన్నయ్య, అంబటి శ్రీనివాస్, మోల్కం పగడయ్య, గుండాల, అల్లపల్లి రెండు మండలాల సేల్స్ మెన్లు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు.

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు
వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన మహిళలు
ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో
ఇల్లందకుంట: నేటిధాత్రి

 

ఇల్లందకుంట మండలంలోని సిరిసెడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయి అంటూ కాంగ్రెస్ లీడర్లు పైసలకు అమ్ముకుంటున్నారంటూ అర్హులను వదిలిపెట్టి అనరులకు మరియు కాంగ్రెస్ నాయకుల దగ్గర వాళ్లకు కేటాయించారని రోడ్డుపై బయటాయించి ధర్నాకు దిగారు కొందరు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు

అఖిల భారతి పద్మశాలి సంఘ మండల కమిటీ ఎన్నిక.

అఖిల భారతి పద్మశాలి సంఘ మండల కమిటీ ఎన్నిక

యూత్ ,మహిళ గ్రామ, మండల స్థాయి కమిటీలకు దిశానిర్దేశం

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో గల చేనేత సహకార సంఘంలో అఖిలభారత పద్మశాలి సంఘం అనుబంధం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల కమిటీ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డిరమేష్ మరియు మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మండల కమిటీ పూర్తిస్థాయి ఎన్నిక, సభ్యత్వ నమోదు గ్రామ మండల మహిళా కమిటీలు పై చర్చ, యువజన సంఘం పూర్తి స్థాయి ఎన్నిక గురించి దిశా నిర్దేశం చేయడం జరిగింది. అఖిలభారత పద్మశాలి సంఘ మండల అధ్యక్షునిగా వంగర సాంబ య్య, ఉపాధ్యక్షుడుగా చిందం రవి,, ముదిగొండ సంతోష్ ప్రధాన కార్యదర్శిగా సామల ధనుంజయ్, సహాయ కార్యదర్శి మోత్కూరి సత్య నారాయణ కుసుమ చంద్ర మౌళి, కొండా ముకుందం కార్యనిర్వాహణ కార్యదర్శి బాసని మల్లికార్జున్, కోశాధికా రిగా దిడ్డిప్రభాకర్, ప్రచార కార్యదర్శిగా వలుప దాసు రాము ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్య దర్శి పత్తి శ్రీను, జిల్లా ప్రచార కార్యదర్శి బాసని బాలకృష్ణ, మహిళ మండల అధ్యక్షురాలు బాసని శాంత, గ్రామ అధ్యక్షు డు బాసని ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో బీసీలంటే బీఆర్ఎస్ పార్టీకి అంత అలుసా..?

తెలంగాణలో బీసీలంటే బీఆర్ఎస్ పార్టీకి అంత అలుసా..?

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర జనాభాలో 50 శాతంకు పైగా ఉన్న బీసీల పట్ల బీఆర్ఎస్ వైఖరి ఏమిటని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించిన సభలో గులాబీ దళపతి..మాజీ సీఎం కేసీఆర్ తన సుదీర్ఘ ప్రసంగంలో బీసీల ఊసే ఎత్తకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో..రాష్ట్రంలో బీసీ వాదం రోజురోజుకు పెరిగిపోతుంటే..బీసీల్లో వచ్చిన చైతన్యం చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ..చట్టం చేశారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలో ప్రతి అంశంపై మాట్లాడిన కేసీఆర్..బీసీల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని..బీసీలు అంటే కేసీఆర్ కు అంతా అలుసా అని మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని ప్రశ్నించిన కేసీఆర్..బీసీల హక్కులు, డిమాండ్లపై ఎందుకు నిలదీయలేదన్నారు. బీసీ బిల్లు అమలుపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాల్సి ఉండాల్సిందన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం న్యాయ నిపుణులతో చర్చించి..బీసీ బిల్లు అమలు చేయడంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నందున కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేస్తే బీసీలు హర్షించే వారని తెలిపారు. బీసీ బిల్లును గవర్నర్ వద్దకు పంపకుండా..కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తే.. బీసీల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగేదన్నారు. బీహార్, తమిళనాడు ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధాన ప్రక్రియను ఇక్కడ కూడా పాటించాలని, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు కేసీఆర్ ఇవ్వాల్సిందన్నారు. తమిళనాడులో రిజర్వేషన్లు పెంచినప్పుడు..బిల్లులు పాస్ చేయడానికి చట్టాలు చేసినప్పుడు..మొదట జీవోలు జారీచేసి ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. తెలంగాణలో బీసీ బిల్లు అమలు కాకుండా ఉండేందుకు కొందరు కోర్టుకు వెళితే..సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టివేస్తే..అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి సవరణ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచిస్తే..బీసీలు..బీఆర్ఎస్ ను ఆదరించేవారన్నారు. బీసీల ప్రస్తావన లేకపోవడంతో..బీసీలు..కేసీఆర్, బీఆర్ఎస్ పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు వేముల మహేందర్ గౌడ్ తెలిపారు.

ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపి వేయాలి.

ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపి వేయాలి

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

ఆదివాసి,దళిత,గిరిజన,ప్రజా సంఘాల నాయకుల డిమాండ్..

నేడు ములుగులో జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు..

వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి:

 

 

తెలంగాణ,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల పరిధిలో ఉన్న కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్ర బలగాలు గత కొన్ని రోజులుగా ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆదివాసి,దళిత,గిరిజన, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ మూలంగా నిరాయుదులైన ఆదివాసీలు,మహిళలు,చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని,ప్రజలు సాధారణ జీవితం గడపలేక భయాందోళనలు చెందుతున్నారని,తాగు నీరును కూడా సేకరించుకోలేని దీన స్థితిలో చనిపోయే స్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సైనిక చర్యను నిలిపివేసి,ఆదివాసి ప్రాంతంలో అభివృద్దిని స్థాపించుటకు తక్షణం మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు.నేడు ములుగు జిల్లా కేంద్రంలో జరిగే శాంతిర్యాలీలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు,వివిధ ప్రజాసంఘాలు,కుల సంఘాల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత, గిరిజన,ఆదివాసి,ప్రజాసంఘాల నాయకులు సోమ రామ్మూర్తి,జిలుకర శ్రీనివాస్,మాదాసి సురేష్,బొట్ల బిక్షపతి,జై సింగ్ రాథోడ్,నున్న అప్పారావు,సిద్ధమైన లక్ష్మీనారాయణ,తెలంగాణ కొమురయ్య,ఐతం నగేష్ బాదావత్ రాజు,అజ్మీర వెంకట్,సిద్దిరాజు యాదవ్ తదితరులు పాల్గోన్నారు.

దూరదర్శన్ ఆటపాట ప్రోగ్రాంకు ఎన్నికైన ప్రతాప్.!

దూరదర్శన్ ఆటపాట ప్రోగ్రాంకు ఎన్నికైన ప్రతాప్.

చిట్యాల నేటి ధాత్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన పుల్ల ప్రతాప్ సోమవారం రోజున హైదరాబాద్ రామంతాపూర్ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో ఆట పాట సీజన్ 2 పల్లె పాటల కార్యక్రమం లో గడ్డం రమేష్ బృందం లో పుల్ల ప్రతాప్ పాల్గొని రమేష్ చంద్ర గడ్డం రాసినటువంటి మల్లి మరుమల్లె పువ్వా అనే పాటను పాడి తరువాత ఎపిసోడ్ కి సెలక్షన్ కావడం జరిగింది.ఈ కార్యక్రమం లో న్యాయనిర్ణేత యాశ్ పాల్ మాట్లాడుతూ కనుమరుగు అవుతున్న జానపదాలను కాపాడుకోవడం అలాగే కనుమరుగు అవుతున్న కళాకారులను వెలికి తీయడం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమం లో నిర్మాత మధు రాయుడు యాంకర్ నాగలక్ష్మి నిర్మాణ సహకారం
ఎ వి సత్యనారాయణ (చంటి )మరియు దూరదర్శన్ యాజమాన్యం పాల్గొన్నారు.

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడి పాడే మోసిన ఎమ్మెల్యే.

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడి పాడే మోసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని అందుకు తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని దేవదాసు అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆ కుటుంబాన్ని పరామర్శించి అతని అంతక్రియలో పాల్గొని పార్టీ కార్యకర్తలతో కలిసి దేవదాసు పాడే మోసినారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోయిని దేవదాసు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఆదుకుంటామని ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుట్ల తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు అల్లకొండ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వర్షాల కారణంగా రైతులకు పంట నష్టం .

వర్షాల కారణంగా రైతులకు పంట నష్టం ….

◆ చేతికొచ్చిన పంట కోతకు రాని దుస్థితి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కోహిర్ మండలం పరిధిలోని మామిడి మొక్కజొన్న, బొప్పాయి పంట రైతులకు తీవ్ర నష్టం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు.చేతికొచ్చిన పంటలను కోయలేని పరిస్థితి నెలకొనడంతో రైతు నేలకు భారీ నష్టం సంభవిస్తుంది.మొక్కజొన్న,కూరగాయల వంటి పంటలు కోతకు సిద్ధంగా ఉండగా, నిరంతర వర్షాలు, వడగళ్ల కారణంగా బురదమయ ఏమైనా పొలాల కారణంగా కోత పనులు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు పొలాల్లో నిలిచిపోవడంతో పంటలు కుళ్లిపోతున్నాయి. ముఖ్యం గల తక్కువ ఎత్తులో ఉన్న పొలాల్లో నీరు చేరడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ పరిస్థితి రైతులను ఆర్థికంగా మానసీకం గా కూడా కుంగదీస్తుంది. కొందరు రైతులు పంట కోసేందుకు కూలీలు రాకపోవంతో యంత్రాలు బురదలో కదలలేని స్థితి కారణంగా నష్టం తప్పడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి, బొప్పాయి. రైతులు భారీ వర్షాలు వనగళ్లు కారణంగా కాయలు తీ వ్రంగా దెబ్బతినడంతో మార్కెట్లో ధర లేకపోవడం తో చెట్టుపైనే మామిడికాయలు కోయకుండా వదిలేశారు. రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని సూచించారు. రైతుల కష్టాలను తీర్చడానికి వ్యవసాయ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని పంట నష్టాన్ని అధిగమించేందుకు సాంకేతిక,ఆర్థిక సహయం అందించాలని స్థానిక రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

*-స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం *

*-స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం *
మొగుళ్ళ పల్లి: నేటి ధాత్రి

 

సొంత రక్తసంబంధీకులే వివిధ కారణాలతో విడిపోయి..గొడవలు పడి..మానవత్వ విలువలను మంటగలుపుతున్న తరుణంలో..తోటి స్నేహితుడి తండ్రి మరణం పట్ల స్పందించి..ఆర్థిక సహాయాన్ని అందించి..తోటి స్నేహితులు మానవత్వాన్ని చాటుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నవీన్ తండ్రి కుమ్మరి సమ్మయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా 2012-2013 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన కుమ్మరి నవీన్ స్నేహితులు జన్నే రాజ్ కుమార్, ఇల్లందుల విజయ్ కుమార్, బొచ్చు ప్రకాష్, నాగన బోయిన రాకేష్ యాదవ్, వైనాల అజయ్, బొచ్చు రాజు, తంగళ్ళపల్లి హరీష్, జన్నే రేష్మ, కట్ల మమత, వనపర్తి రుతీష, చల్ల మమత, పోతరాజు జ్యోతి, పసరగొండ శ్రీలత, గాదే రమ్య, చేపూరి రజిత, వైనాల శిరీషలు విరాళాలుగా వేసుకుని 5000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు.

ముంబైలోని “ఈడీ” ఆఫీస్‌లో అగ్నిప్రమాదం.

ముంబైలోని “ఈడీ” ఆఫీస్‌లో అగ్నిప్రమాదం.

“నేటిధాత్రి”, ముంబై.

 

 

ఈడీ ఆఫీస్ ఉన్న కైసర్-ఐ-హింద్ భవనంలో ఘటన.

మంటలు ఆర్పేందుకు రంగంలోకి 12 ఫైర్ ఇంజిన్లు.

 

 

10 గంటల పాటు చెలరేగిన మంటలు.. భారీగా ఆస్తినష్టం.

ఇందులోనే చోక్సీ, నీరవ్, భుజ్‌బల్ కేసు ఫైల్స్.

బసవ దళ్ వారి ఉచిత హెల్త్ క్యాంపు.

బసవ దళ్ వారి ఉచిత హెల్త్ క్యాంపు ,రక్త దాన శిబిర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పటేల్ గారి ఆహ్వానం మేరకు పట్టణం లోని బసవ మంటప్ లో జరిగిన ఉచిత హెల్త్ క్యాంపు ,రక్త దాన శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అందరికీ ముందుగా బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు, రక్త దానం చేయడం ఒక పుణ్య కార్యం అని ,బసవ జయంతి పురస్కరించుకొని రాష్ట్రీయ బసవ దళ్ వారు ప్రతి సంవత్సరం రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు,
అనంతరం రక్త దానం చేసిన వారికి సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ శేరి , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ నాయకురాలు పద్మజ,తులసి దాస్ ,సందీప్ రాజ్ , నగేష్ ,రాష్ట్రీయ బసవ దళ్ తెలంగాణ అధ్యక్షులు శంకర్ పటేల్ ,రాష్ట్రీయ బసవ దళ్ డాక్టర్ శర్నప్ప ,వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్,డాక్టర్ సచిన్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో.!

కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు పూజలు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వైశాఖమాసం వసంత రుతువు ఉత్తరాయణం శుక్ల విదియ కృత్తిక నక్షత్రం మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెల నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భాగంగా గ్రామ దేవతలకు పంచామృతాలతో అభిషేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా కోట గుళ్ళు ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు గ్రామదేవతలకు హారతి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు నాగపురి శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు రౌతు కిషోర్, పాణిగంటి గణేష్, తదితరులు పాల్గొన్నారు.

బసవ దళ్ వారి ఉచిత హెల్త్ క్యాంపు.!

బసవ దళ్ వారి ఉచిత హెల్త్ క్యాంపు ,రక్త దాన శిబిర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పటేల్ గారి ఆహ్వానం మేరకు పట్టణం లోని బసవ మంటప్ లో జరిగిన ఉచిత హెల్త్ క్యాంపు ,రక్త దాన శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అందరికీ ముందుగా బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు, రక్త దానం చేయడం ఒక పుణ్య కార్యం అని ,బసవ జయంతి పురస్కరించుకొని రాష్ట్రీయ బసవ దళ్ వారు ప్రతి సంవత్సరం రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు,
అనంతరం రక్త దానం చేసిన వారికి సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు.

Health camp

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ శేరి , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ నాయకురాలు పద్మజ,తులసి దాస్ ,సందీప్ రాజ్ , నగేష్ ,రాష్ట్రీయ బసవ దళ్ తెలంగాణ అధ్యక్షులు శంకర్ పటేల్ ,రాష్ట్రీయ బసవ దళ్ డాక్టర్ శర్నప్ప ,వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్,డాక్టర్ సచిన్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

మూగజీవాల రోదన.. పట్టింపు ఎవరిది..

మూగజీవాల రోదన.. పట్టింపు ఎవరిది..

శిథిలావస్థలో రామాయంపేట పశు వైద్యశాల..

… బిక్కుబిక్కుమంటు కార్యాలయంలో కూర్చుంటున్న డాక్టర్లు..

రామాయంపేట ఏప్రిల్ 29 నేటి ధాత్రి(మెదక్)

 

మనుషులకు సమస్య వస్తే చెప్పుకోవడానికి మాటల ద్వారా చెప్పొచ్చు. కానీ మూగజీవాల రోదన ఎవరికి పట్టింపు అనే చందంగా మారింది రామాయంపేట పశు వైద్యశాల. ఉమ్మడి రామయంపేట మండలంలో ఎన్నో ఏళ్లుగా పశు వైద్యశాల ఉన్నది. చుట్టుపక్కల గ్రామాల గ్రామాల పశువులతో పాటు, గొర్రెల కాపరులు పశువులకు ఏవైనా వ్యాధులు సోకితే రామయంపేటకు వచ్చి వైద్యం చేయించుకొని వెళ్లేవారు. పశువైద్య డాక్టర్లు సైతం గ్రామాల్లో గాలికుంట, నట్టల నివారణ టీకాలు గ్రామాలకు వెళ్లి అందించేవారు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఒకవైపు శిథిలావస్థకు చేరి చెత్తాచెదారం నిండిపోయి రెండు మూడు గదులు నిరుపయోగంగా ఉంచారు.

 

Hospital

ఉన్న ఒక గదిలో పైసలు కందించి టీకాలతో పాటు మందులు ఉంచి పక్కనే ఒక కుర్చీ వేసుకొని కూర్చునే పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో కనీసం పశు వైద్యశాల ఉందనే విషయాన్ని సైతం మర్చిపోయే విధంగా తయారయింది. పశు వైద్య చికిత్సల కోసం వచ్చినవారు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ ఏ మందులు అందుబాటులో ఉన్నాయో లేవు అర్థం కాని పరిస్థితి దాపురించింది. ఇదిలా ఉండగా గతంలో గ్రామ గ్రామాన పశు వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాధుల బారిన పడ్డ గొర్రెలు, మేకలు, పశువులకు వైద్యం చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి శిబిరాలు ఎక్కడ కూడా జరగడం లేదు. పశు జాతి తో పాటు గొర్రెలు మేకలు పెంపుడు కుక్కలు కనుమరుగవుతున్న తరుణంలో ఉన్న వాటిని ఏ వ్యాధులు సోఖకుండా కాపాడుకోవడానికి రైతులు తమ వంతు కృషి చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది.

Hospital

 

పశువైద్యాధికారులు అందుబాటులో ఉండి వ్యాధులకు అవసరం ఉన్న మందులు సిద్ధంగా ఉంచితేనే ఏ వ్యాధులు వచ్చిన వాటిని నివారించుకొని వాటిని కాపాడుకోవడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు ప్రజలు కోరుతున్నారు. అలాగే వన్యప్రాణులు గాయపడ్డ, అస్వస్థతకు గురి అయిన సమయానికి వైద్యం అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తోనిగండ్ల గ్రామ శివారులో కృష్ణ జింకను ఊర కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలుపగా వెటర్నరీ డాక్టర్ను తీసుకొని ఘటన స్థలానికి చేరుకునేలాగా ఆ కృష్ణ జింక్ అభివృద్ధి చెందింది. ఇదొకటే కాకుండా వన్య ప్లాన్లు గాయపడ్డ అశ్వసగురైన సకాలంలో చికిత్సలు అందిస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.

 

Hospital

 

అందుబాటులో ఉంటున్నాం.. కానీ భయం గుప్పెట్లో వెటర్ని ఏడి తిరుపతి..

మేము ఎల్లప్పుడూ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటున్నాం. కానీ భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న గోడౌన్ లో విధులు నిర్వహించడం జరుగుతుంది. శిథిలవస్తులు ఉన్న భవనం గురించి పై అధికారులకు తెలపడం జరిగింది. అలాగే పశువులతో పాటు అస్వస్థతలకు గురైన వన్యప్రాణులకు సరైన సమయంలో వైద్యం అందించడం జరుగుతుంది.

తరుగు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి.!

‘తరుగు లేకుండా..వరి ధాన్యం కొనుగోలు చేయాలి’

 

కల్వకుర్తి / నేటి ధాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో మంగళవారం మధ్యాహ్నం వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు మహబూబ్ నగర్ చౌరస్తాలో వరి ధాన్యం రోడ్డుపై పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..

Farmers

వరి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు వ్యాపారస్తులు ఒక బస్తాకు మూడు నాలుగు కేజీల తరుగుదల తీస్తున్నారని.. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఆరుగాలం కష్టించి పనిచేస్తే.. వ్యాపారస్తులు తమని మోసం చేస్తున్నారని వాపోయారు. ప్రజా పాలనలో ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకులు.. తమకు అన్యాయం జరుగుతుంటే ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. ‘జై జవాన్.. జై కిసాన్’ ‘తరుగు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి’ అంటూ.. రైతులు నినాదాలు చేశారు. రైతుల ధర్నాతో.. ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. రైతు సంఘాల నాయకులతో మాట్లాడి ధర్నా విరమింప చేశారు.

భూ భారతి చట్టం..పేద రైతుల చుట్టం.

భూ భారతి చట్టం..పేద రైతుల చుట్టం

-భూ భారతితో భూ వివాదాలన్నీ పరిష్కారం.

-నవాబ్ పేట్ సదస్సులో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

నవాబుపేట నేటి ధాత్రి

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూభారతి చట్టం పేదల రైతులు, ప్రజల చుట్టం అనీ, దీని ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మంగళవారం అన్నారు. నవాబ్ పేట్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో అప్పటి ఎమ్మెల్యేలు నిరుపేదల భూములను కబ్జాలు చేసి వేలకోట్లు సంపాదించారని విమర్శించారు. పేద ప్రజల భూములకు పట్టా పాస్ బుక్ లు ఇవ్వకుండా ఎన్నో రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. భూ భారతి చట్టం రైతుల చట్టం, భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూ భారతి చట్టం అని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా, ప్రతి భూమికి భూధార్ కార్డుని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ ,భూధాన్, అసైన్డ్, దేవాదాయ, భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా సీసీఎల్ఏకి అధికారాలు ఉంటాయన్నారు. కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చామని, ఎవరి భూమి అయిన వేరే వాళ్ళకు తప్పుగా నమోదైతే ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీ, కలెక్టర్ కు అప్పీలు చేసుకొని పరిష్కరించుకోవచ్చాన్నారు.

 

Farmers

ప్రతి సమస్య పరిష్కారానికి నిర్ణీత గడువు ఉంటుందని, ఆ గడువులోపుగానే సమస్యలు పరిష్కారమౌతాయని, అందుకే భూ భారతి చట్టం వచ్చాక రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సమస్యలు గ్రామంలోనే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. జూన్ నెలలో ప్రతి గ్రామంలో అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు, ప్రజలకు అన్ని సేవలు అందించేలా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. ధరణి వల్ల రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతితో సులభంగా పరిష్కారం అవుతుందన్నారు. ధరణి రిజిస్ట్రేషన్ లో పొరపాటు జరిగిన సరిదిద్దుకునే అవకాశం ఉండేది కాదని, పేద రైతులు కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదాని వ్యాఖ్యానించారు. ధరణి వల్ల అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టిందని వివరించారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మొత్తం పారదర్శకంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version