అటవీ ఉత్పత్తులను దగ్గరలోని డిఆర్డిపోలో అమ్ముకోవాలి.

అటవీ ఉత్పత్తులను దగ్గరలోని డిఆర్డిపోలో అమ్ముకోవాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),

నేటిధాత్రి:

అటవీ ఉత్పత్తులను జిసిసి కొనుగోలు కేంద్రంలోనే కాకుండా దగ్గర్లోని డిఆర్ డిపోలో కూడా అమ్ముకునే సౌకర్యం కల్పించినట్లు జిసిసి మేనేజర్ నరసింహ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ ఉత్పత్తులను మధ్య దళారులకు అమ్మి మోసపోకూడదని సూచించారు. గిరిజన సహకార సంస్థ ద్వారా కిలో ముష్టి గింజలు 75,కుంకుళ్ళు 40,ఇప్ప పూలు 30,ఇప్ప పలుకు 29,కరక్కాయ 15,కానుగ కాయ 10 రూపాయలు,కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున గ్రామాలలోని ఉత్పత్తుల సేకరణ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.మంగళవారం సేల్స్ మెన్ శ్రీనివాస్ కు గుండాల డి ఆర్ డిపోను అప్పగించినట్లు చెప్పారు. గతంలో పనిచేసిన పగడయ్యను బదిలీపై పంపించినట్లు చెప్పారు.కార్యక్రమంలో అకౌంటెంట్ బూసేయ్య, జిసిసి సేల్స్ మెన్లు పూనం లక్ష్మయ్య, గలిగ చెన్నయ్య, అంబటి శ్రీనివాస్, మోల్కం పగడయ్య, గుండాల, అల్లపల్లి రెండు మండలాల సేల్స్ మెన్లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version