బిఆర్ఎస్ అంటేనే దోచుకోవడం దాచుకోవడం..

బిఆర్ఎస్ అంటేనే దోచుకోవడం దాచుకోవడం

ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత రేవంత్ సర్కార్ దే

కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్

పరకాల నేటిధాత్రి
బిఆర్ఎస్ పార్టీ అంటేనే దోచుకుని దాచుకునే పార్టీ అని గత పదేళ్ల పాలన అంతా కమిషన్ల పాలన అని కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కేటీఆర్ ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.గత బిఆర్ఎస్ పాలనలో ఒక్క పేదవానికి ఇల్లు,రేషన్ కార్డులు ఇవ్వలేదని అలాంటివారు ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలల కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు,రేషన్ కార్డు అందించిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ దేనని,ప్రతి పేదవాడి కడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ,ఉచిత విద్యుత్తు,గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఇచ్చి పేదల కళ్ళల్లో ఆనందం నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు.ఓట్ల కోసం రాజకీయం చేసేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చిన ప్రజాపాలన నడుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,కుంకుమేశ్వర్ టెంపుల్ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,సమన్వయ కమిటీ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అనిత రామకృష్ణ,చిన్నల గోనాథ్, ఎండి రంజాన్ అలీ,పంచగిరి జయమ్మ,బుర్ర రాజమౌళి,చందుపట్ల రాఘవరెడ్డి,మెరుగు శ్రీశైలం, పసుల రమేష్ ల్,మడికొండ సంపత్,ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి,బండి సదానందం గౌడ్,మడికొండ శీను,దుబాసి వెంకటస్వామి,ఏకు రాజు, నల్లల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి ని సన్మానం

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ల జిల్లా పోరం అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన చందుపట్ల రాజిరెడ్డిని సోమవారం రోజున కాంగ్రెస్ నాయకులు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,సమన్వయ కమిటీ సభ్యులు పంచగిరి జయమ్మ,చిన్నాల గోనాథ్, ఎండి రంజాన్ అలీ,చందుపట్ల రాఘవరెడ్డి,మడికొండ సంపత్ కుమార్,పసుల రమేష్,దుబాసి వెంకటస్వామి, బుర్ర రాజమౌళి,నల్లెల్ల అనిల్ కుమార్,మెరుగు శ్రీశైలం,బండి సదానందం గౌడ్,మడికొండ శ్రీను,ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడి పాడే మోసిన ఎమ్మెల్యే.

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడి పాడే మోసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని అందుకు తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని దేవదాసు అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆ కుటుంబాన్ని పరామర్శించి అతని అంతక్రియలో పాల్గొని పార్టీ కార్యకర్తలతో కలిసి దేవదాసు పాడే మోసినారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోయిని దేవదాసు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఆదుకుంటామని ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుట్ల తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు అల్లకొండ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చోరవాణి అందజేత.!

చోరవాణి అందజేత

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి:

మండల కేంద్రానికి చెందిన బోడ కుల్దీప్ అతను తేదీ 06.04.2025 రోజున అతని యొక్క సెల్ ఫోను ఎక్కడో పడిపోయినదని తేదీ 07.04.2025 రోజున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు, వెంటనే CEIR Portal లో వివరాలను నమోదు చేయడం జరిగింది. అయితే ఆ బాధితుడు పోగొట్టుకున్నతన ఫోనును ట్రేస్ అవుట్ చేసి అతడికి అప్పగించడం జరిగినది. మరియు ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురి అయిన ఫోన్ వివరాలను CEIR Portal లో నమోదు చేస్తే తిరిగి ఆ మొబైల్ ఫోన్ ను పొందే అవకాశం ఉంటుంది, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి, ఎవరికైనా మొబైల్ లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఏఎస్ఐ S.ఆంజనేయులు  తెలిపినారు.

సోలార్ బ్యాటరీలు దొంగలించిన నిందితుల అరెస్ట్.

సోలార్ బ్యాటరీలు దొంగలించిన నిందితుల అరెస్ట్.

#ఎస్సై వి గోవర్ధన్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నల్లబెల్లి, మండలాల్లోని పలు గ్రామాల్లో సోలార్ లైట్లు సంబంధించిన బ్యాటరీలను దొంగలిస్తున్న ముఠా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై వి గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి 365 పై ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా మల్లంపల్లి వైపుగా వెళ్తున్న ఒక బజాజ్ ఆటోలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా అనుమానం వచ్చి ఆటోను పరిశీలించగా సదరు వ్యక్తులు ఆటో వదిలి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని ఆటోని పరిశీలించగా అందులో 10 సోలార్ బ్యాటరీలు లభ్యం అయ్యాయి. పట్టుబడిన నిందితులను వారితో ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు పట్టుబడిన వారిలో పర్వతగిరి మండలానికి చెందిన భూక్య నవీన్, అల్లాడి దుర్గ స్వామి, సంగెం మండలం తీగరాజు పల్లి కి చెందిన గూడూరు అరవింద్, కర్నే అఖిలాష్ గా పోలీసులు గుర్తించారు. వీరి నుండి 10 బ్యాటరీలు సహా ఒక ఆటో స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version