అఖిల భారతి పద్మశాలి సంఘ మండల కమిటీ ఎన్నిక
యూత్ ,మహిళ గ్రామ, మండల స్థాయి కమిటీలకు దిశానిర్దేశం
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో గల చేనేత సహకార సంఘంలో అఖిలభారత పద్మశాలి సంఘం అనుబంధం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల కమిటీ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డిరమేష్ మరియు మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మండల కమిటీ పూర్తిస్థాయి ఎన్నిక, సభ్యత్వ నమోదు గ్రామ మండల మహిళా కమిటీలు పై చర్చ, యువజన సంఘం పూర్తి స్థాయి ఎన్నిక గురించి దిశా నిర్దేశం చేయడం జరిగింది. అఖిలభారత పద్మశాలి సంఘ మండల అధ్యక్షునిగా వంగర సాంబ య్య, ఉపాధ్యక్షుడుగా చిందం రవి,, ముదిగొండ సంతోష్ ప్రధాన కార్యదర్శిగా సామల ధనుంజయ్, సహాయ కార్యదర్శి మోత్కూరి సత్య నారాయణ కుసుమ చంద్ర మౌళి, కొండా ముకుందం కార్యనిర్వాహణ కార్యదర్శి బాసని మల్లికార్జున్, కోశాధికా రిగా దిడ్డిప్రభాకర్, ప్రచార కార్యదర్శిగా వలుప దాసు రాము ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్య దర్శి పత్తి శ్రీను, జిల్లా ప్రచార కార్యదర్శి బాసని బాలకృష్ణ, మహిళ మండల అధ్యక్షురాలు బాసని శాంత, గ్రామ అధ్యక్షు డు బాసని ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.