అర్హులైన లబ్ధి దారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.

అర్హులైన లబ్ధి దారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.

బిజెపి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి రాజేశ్వర్.

బెల్లంపల్లి, నేటిధాత్రి:

 

 

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని బెల్లంపల్లి బిజెపి మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల శ్రీదేవి రాజేశ్వర్ అన్నారు.బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కేవలం ఇందిరమ్మ కమిటీ, కాంగ్రెస్ నాయకులకు సిఫారసు చేసిన జాబితానే సర్వే చేస్తూ అధికార దుర్వినియోగానికి పాలు పడుతున్నారని ఆమె మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చేసిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలుపుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ఇందిరమ్మ ఇండ్ల కోసం సర్వే చేసినప్పుడే అధికారులు అర్హుల జాబితాను తప్పుల తడకగా అనర్హులతో తయారు చేశారన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి వారికి మాత్రమే ఇండ్లను మంజూరు చేయాలని, ఇలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని ఆమె డిమాండ్ చేశారు.లేనియెడల బిజెపి ఆధ్వర్యంలో లబ్ధిదారులయిన నిరుపేదలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

జీతాల కోసం 4 నెలలుగా ఎదురుచూపులు.

జీతాల కోసం 4 నెలలుగా ఎదురుచూపులు.. ఉపాధి ఫీల్డ్ హామీ అసిస్టెంట్ల పస్తులు!

◆ సుమారు 10.000 మందికి అందని వేతనాలు.

◆ అప్పులతో కుటుంబాలను పోషిస్తున్న సిబ్బంది.

◆ ఏడాదైనా పేస్కేల్‌ హామీని నెరవేర్చని ప్రభుత్వం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రాష్ట్ర ఉపాధి హామీ జాయింట్ యాక్షన్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పే స్కేల్, పెండింగ్ జీతాలు పరిష్కారం కోసం ఎంపిడిఓ సుధాకర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగినది. ఏపీవో రాజ్ కుమార్ మాట్లాడుతూ
 క్రమం తఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పస్తులతో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు ఎక్కడా పొంతనలేదని, ఇందుకు తమ దుస్థితే నిదర్శనమని చెప్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలతో పనులు చేయించడం, సకాలంలో వేతనాలు అందించడంలో సాంకేతిక, క్షేత్రస్థాయి సిబ్బంది విధులు నిర్వహిస్తారు.ప్పకుండా కూలీలతో పనులు చేయిస్తూ కేంద్రం నుంచి వీలైనంత మేరకు నిధులు రప్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. కానీ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు.

మహాప్రస్థానంలో పని చేస్ కార్మికులుకు సన్మానం.

మహాప్రస్థానంలో పని చేస్ కార్మికులుకు సన్మానం
శేరిలింగంపల్లి,నేటి ధాత్రి :-

 

కార్మికుల దినోత్సవం సందర్బంగా రాయదుర్గం లోని వైకుంఠ మహా ప్రస్థానం లో పనిచేసేవారందరికీ శాలువాతో సత్కరించిన శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కార్మికులు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహా ప్రస్థానంలో పనిచేసేవారందరికీ బహుమతులను మరియు స్వీట్ బాక్స్ లను అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ “ప్రతి మనిషి ఆఖరి మజిలీ చావు, అట్టి ఆఖరి గమ్యంలో మీరంతా అందించే సేవలు ఆదర్శప్రాయం అని, అతి ముఖ్యంగా కరోనా సమయం లో మహా ప్రస్థానం సిబ్బంది అందించిన సేవలను ఎప్పటికి మర్చిపోలేమనీ కొనియాడారు.

Corona

 

ఒక మనిషి చనిపోతే సొంత కుటుంబికులే రాలేని రోజుల్లో మీరే అన్ని అయ్యి అంత్యక్రియలు చేయడం ఎంతో ఆదర్శం. మీరు అందించే సేవలకు మేము మా తృప్తి కొరకు అందిస్తున్న ఈ చిన్న కానుక”.భవిష్యత్తులో ఏవరికి ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహాప్రస్థానం మేనేజర్ రాజ్ కుమార్, మహా ప్రస్థానం సిబ్బంది మరియు నాయకులు అంజమ్మ, దారుగుపల్లి నరేష్, రమేష్ గౌడ్, శామ్లెట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బాల్యవివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత..

బాల్యవివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత..

జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రాజు..

రామాయంపేట మే 1 నేటి ధాత్రి (మెదక్)

 

 

బాల్యవివాహాలను అరిక ట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జస్టెట్స్ ఫర్ చిల్డ్రన్స్ విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఎన్జీఓ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ రాజు అన్నారు. ఎన్జీఓ డైరెక్టర్ వంగరీ కైలాస్ ఆదేశానుసారం బాల్య వివాహాలపై జిల్లాలోని దేవాలయాలు, మజీదులు, చర్చిలు, కాలనీలు, అంగన్వాడీ కేంద్రా ల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Coordinator Raju.

 

ఈ సం దర్భంగా రాజు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడమంటే చిన్న పిల్లలపై అత్యా చారాలు ప్రోత్సహించడం లాంటిదన్నారు. పూజారులు, ఫాస్టర్లు, ముస్లిం మతపెద్దలు పెళ్లిళ్లు చేసే సమయంలో అమ్మాయి, అబ్బాయి మేజర్లు అయితేనే వివాహాలు జరిపించాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే రూ. లక్ష జరిమానతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.

Coordinator Raju.

ఈ సందర్భంగా ఆలయాలు, చర్చిలు మజీద్ లలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ ప్రతిజ్ఞ చేయించామన్నారు.
ప్రతిజ్ఞ చేస్తున్న భక్తులు, పూజారులు.
వంగరీ కైలాస్
విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ

నందనంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు.

నందనంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు
గ్రామ లారీ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

నేటిధాత్రి ఐనవోలు :-

 

 

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా అయినవోలు మండలం నందనంలో కార్మికులు కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ నెత్తురును చెమటగా మార్చి అవరోధాలను అభివృద్ధికి మెట్లుగా మార్చుతూ దేశ అభివృద్ధికి వారదులుగా నిలుస్తున్న కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం కార్మికుల దినోత్సవం సందర్భంగా ఎర్ర జెండాలు ఆవిష్కరిస్తూ సంబరాలు చేసుకున్నారు. అలాగే గ్రామంలో లారీ యజమానులు డ్రైవర్స్ అంతా కలిసి తమకంటూ ఒక యూనియన్ ఉండాలని గురువారం లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది.లారీ యూనియన్ అధ్యక్షుడుగా బర్ల బలరాం ఉపాధ్యక్షులు ఇసురం అనిల్ ప్రధాన కార్యదర్శి యాకర లక్ష్మణ్ కార్యదర్శి బర్ల భాస్కర్ పోశాధికారి ఆకులపల్లి భాస్కర్ సలహాదారుడు బర్ల నాగరాజ్ సలహాదారుడు బర్ల రవి లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తమ ఎన్నికకు సహకరించిన యజమానులకు డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ ఏరియా ఆకులపల్లి అశోక్ యాకర కుమార్ దోమకొండ రాజ్ కుమార్ యాకర నరహరి ఇస్రం రఘు యాకర రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

రిస్క్ టీం సభ్యులకు ఘనంగా సన్మానం.

రిస్క్ టీం సభ్యులకు ఘనంగా సన్మానం

మందమర్రి నేటి ధాత్రి

 

 

మే 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా, తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ మార్కెట్లోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా, ఫిబ్రవరి 22న నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ ఎల్ బి సి) టన్నెల్లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యల్లో పాల్గొన్న సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు రెడ్డి శ్రీనివాస్, సానబోయిన శ్రీనివాస్ వర్కర్స్ షేర్ గ్రూప్ తరఫున ఘనంగా సన్మానించారు.

ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదం భారతదేశంలో అత్యంత క్లిష్టమైన రక్షణ చర్యలలో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సింగరేణి కొలియరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సి సి ఎల్) నుండి 60 మంది ప్రత్యేకంగా శిక్షణ పొందిన రెస్క్యూ సిబ్బంది పంపించబడ్డారు. ఈ సిబ్బంది అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ బాడీ (ఐ ఎం ఆర్ బి) సభ్యులుగా ఉన్నారు .
ప్రమాదం జరిగిన తర్వాత, రక్షణ చర్యలు 63 రోజులపాటు కొనసాగాయి. ఈ సమయంలో రెండు మృతదేహాలు వెలికితీయబడ్డాయి, అయితే మిగిలిన ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, సహచరుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలను గుర్తించి, మే డే సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మానం కార్మికుల సేవలను గుర్తించి, వారికి గౌరవం చూపించే ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో వాకర్ టీం సభ్యులు అందరూ పాల్గొన్నారు

రెడ్ స్టార్ కుంగ్ పూ ఇండియా అకాడమి .

రెడ్ స్టార్ కుంగ్ పూ ఇండియా అకాడమి ఆశ్వర్యంలో సమ్మర్ శిక్షణ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

ముత్తాపురం ప్రాథమిక పాఠశాల ఆవరణ లో విధ్యార్థులకు సెల్ఫ్ డిపెన్స్ నిమిత్తం అమ్మాయిలకు, అబ్బాయిలకు కుంగ్ పూ శిక్షణ శిభిరాన్ని గురువారం ప్రారంబించారు. శిక్షణ ఇచ్చువారు మంక్కిడి సుధాకర్, ఇన్ చార్జి, పెనక సిమయ్య గ్రాండ్ మాస్టర్ పౌండర్ బి వెంకట్ బాబు హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విధ్యార్థుల యొక్క శారీరక దృఢత్యానికి మంచి ఆరోగ్యానికి క్రమ శిక్షణ కొరకు ఈ విద్యను వెనుకబడిన విద్వార్థులకు అందజేయాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మోకాళ్ళ వీరాస్వామి, మార్తా రామకృష్ణ, మోకాళ్ళ క్రిష్ణ తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు.

శ్రమ గొప్పదనాన్ని చాటి చెప్పే రోజే ఈ మే డే.

‘శ్రమ గొప్పదనాన్ని చాటి చెప్పే రోజే ఈ మే డే’

‘శ్రమను గౌరవిద్దాం కార్మికులకు అండగా ఉందాం’

 

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు కార్మికులు ఎంతగానో శ్రమిస్తారని, వారి శ్రమతోనే ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం సమకూరుతాయని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మే డే వేడుకలలో పాల్గొని కార్మికులతో కలిసి భోజనం చేశారు. మే డే కానుకగా మున్సిపల్ కార్మికులందరికీ దుస్తులను పంపిణీ చేసారు. మున్సిపాలిటీలో గాని, గ్రామాలలో గాని పరిసరాల పరిశుభ్రత కోసం కార్మికులు అహర్నిశలు పాటుపడతారని ఆయన ప్రస్తావించారు. ఒక్క రోజు ఈ కార్మికులు పని చేయకపోయినా పరిసరాలన్నీ కంపు కొడతాయని, ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని చెప్పారు. అందుకే వారు చేసే సేవలు అమూల్యమైనవని అభిప్రాయపడ్డారు. పట్టణాల్లో, గ్రామాల్లో పని చేసే ఈ కార్మికుల కృషివల్లే అందరికీ ఆరోగ్యం సమకూరుతుందని పేర్కొన్నారు. మురికి కాలువలను శుభ్రం చేస్తూ, చెత్త ఎత్తివేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు కార్మికులు ఎంతో కష్టపడతారన్నారు.

Hard Work.

 

అలాంటి కార్మిక సోదరులతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నానని అనిరుధ్ రెడ్డి చెప్పారు. కార్మిక సోదరులకు నా వంతుగా అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో AMC చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత గారు, మున్సిపల్ కమిషనర్, AMC వైస్ చైర్మన్ రాజు గౌడ్, కౌన్సిలర్లు,AMC డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన.

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన…..

రామాయంపేట మే 1 నేటి ధాత్రి (మెదక్)

 

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెరుగైన విద్యా బోధన అందించడం జరుగుతుందని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంగ్లీష్, జువాలజీ అధ్యాపకులు యాదగిరి, స్వామి అన్నారు. గురువారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఇండ్లలోకి వెళ్లి ప్రభుత్వ కళాశాలలో విద్యాబోధనపై వారికి అవగాహన కల్పించారు. రామాయంపేట పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుభవం గల అధ్యాపకుల తెలుగు, ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. విశాలమైన తరగతి గదులతో పాటు ఇతర వసతులు ఉన్నాయని చెప్పారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరాలని వారు సూచించారు. ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు బస్ పాస్ సౌకర్యం ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందన్నారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కళాశాలలో బైపిసి, ఎంపీసీ, సి ఈ సి, హెచ్ ఈ సి గ్రూపులతో పాటు ఒకేషనల్ విభాగంలో ఎలక్ట్రికల్, ఆఫీస్ అసిస్టెంట్ షిప్, అకౌంటెంట్ టాక్సేషన్ గ్రూపులు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయని విద్యార్థులకు వివరించారు. అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్ కళాశాలలో చేరి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా వారు సూచించారు. ప్రభుత్వ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా లెక్చరర్లు తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన తాహశీల్దార్ రాజేశ్వరి.

బాధ్యతలు స్వీకరించిన తాహశీల్దార్ రాజేశ్వరి

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల తాహశీల్దారుగా బి.రాజేశ్వరి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీల్లో భాగంగా రామడుగులో పనిచేసిన వెంకటలక్ష్మి కొత్తపెల్లి మండల తహశీల్దార్ గా బదిలిపై వెళ్ళగా మానకోండూరు మండల తాహశీల్దారుగా పనిచేసిన బి.రాజేశ్వరి రామడుగు తాహశీల్దారుగా బదిలీపై వచ్చారు. ఈసందర్భంగా కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

విద్యుత్ ఘాతానికి మూడు గేదెలు మృతి.

విద్యుత్ ఘాతానికి మూడు గేదెలు మృతి

కొత్తగూడ, నేటిధాత్రి :

 

 

 

మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం గ్రామంలో బుధవారం రాత్రి వీచిన గాలి దుమారానికి 11 కేవీ విద్యుత్ వైరు తెగి పడి ఓటాయి గ్రామానికి చెందిన చింత కుమార్, స్వామి జున్ను కిరణ్ లకు చెందిన మూడు గేదెలు మృతి చెందాయి సుమారు 2లక్షలు నష్టం జరిగిందని బాధితులు తెలిపారు ప్రభుత్వం మాకు సహాయం చేయాలనీ వేడుకున్నారు,.,

అత్యుత్తమ ఫలితాలు సాధించిన అల్ఫోర్స్.

అత్యుత్తమ ఫలితాలు సాధించిన అల్ఫోర్స్

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

రాష్ట్ర విద్యాశాఖ బుధవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు కీర్తిని తెచ్చిపెట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో 600 మార్కులకు గాను బక్కశెట్టి హర్షిని 574, కే.భాను ప్రకాష్ 573, ఎం.శరణ్య 568, జె.సాయి చరణ్ 568, కే.సంజన, జి.మన్విత 566మార్కులు సాధించారు. 500కు పైగా 72 మంది వంద శాతం ఉత్తీర్ణతతో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని పాఠశాల చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ ఊట్కూరి నరేందర్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు.

పరకాల వ్యవసాయ మార్కెట్లో ఘనంగా మేడే వేడుకలు.

పరకాల వ్యవసాయ మార్కెట్లో ఘనంగా మేడే వేడుకలు

జెండా ఆవిష్కరించిన లంక దాసరి అశోక్

పరకాల నేటిధాత్రి

 

కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏఐటియూసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసర అశోక్ జెండా జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగల శంకర్,శ్రీపతి కుమారస్వామి,కోట యాదగిరి,మోర రవి,దొగ్గేలా బాబు,ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి పల్లె గ్రామంలో జండా విష్కరణ

కామారెడ్డిపల్లి గ్రామంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీపతి రాజు జెండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో కొయ్యడా శంకర్,తిక్క శ్రీనివాస్,అలాగే గౌరవ అధ్యక్షులు తిక్క రమేష్ బాబు,ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీపతి ఐలయ్య,అమాలి కార్మిక సభ్యులు మేకల రాజయ్య,కొయ్యడ రాజయ్య,కొయ్యడ చిన్న భద్రయ్య,కొయ్యడ శంకర్రావు,కొయ్యడా శోభన్,మామిడి జగన్,రేణిగుంట్ల రాజయ్య,రేణిగుంట్ల రాజు,నాగేల్లి శంకర్,తిక్క కుమారస్వామి,సప్పిడి సాంబయ్య,కొడపాక చిరంజీవి,అనుమకొండ సదయ్య తదితరులు పాల్గొన్నారు.

నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న.!

నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ కే సముద్రం విలేజ్లో విశ్వబ్రాహ్మణ సంఘం నూతనంగా నిర్మించబోతున్న శ్రీ శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం మరియు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయము మరియు శ్రీ సరస్వతి దేవి అమ్మవార్ల నూతన దేవాలయములకు గాను గురువారం భూమి పూజ శిలా న్యాస శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ పాల్గొనడం జరిగింది, వారితోపాటు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారి వెంకన్న, దస్రు నాయక్, శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మురళి నాయక్ ను శాలువాతో సత్కరించడం జరిగింది, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి గొప్ప మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు మరియు కమిటీ సభ్యులను అభినందించారు. ఇంతటి గొప్ప కార్యక్రమం చేయాలంటే చాలా కష్టతరమైన కార్యచరణ ఎంతో కష్టంతో కూడుకున్న కార్యక్రమం చేపట్టారు అని మీరంతా సమైక్యంగా ఉండి ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని అప్పుడే అనుకున్న కార్యచరణ సిద్ధిస్తుందని కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ సంకేపల్లి నారాయణరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు పోలేపల్లి వెంకట్ రెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, లక్కాకుల నరసయ్య, బుర్ర నాగిరెడ్డి, కమటం సురయ్య, కనుకుల రాంబాబు, మరియు విశ్వబ్రాహ్మణ సంగం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ సంఘం నూతన కమిటీ ఎన్నిక.

అంబేద్కర్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్, మాజీ సర్పంచ్ మన్నె దర్శన్ రావు, ఉపాధ్యాయులు మేకల ప్రవీణ్ కుమార్ ల ఆధ్వర్యంలో నూతనంగా అంబేద్కర్ సంఘం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈయొక్క కమిటీ గౌరవ అధ్యక్షులుగా మన్నె కిషన్ చందర్, కమిటీ సలహాదారునిగా మేకల విజేందర్, అధ్యక్షులుగా మేకల ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్, ఉపాధ్యక్షులుగా చిలుముల హరీష్, మేకల కిరణ్ లు, కోశాధికారిగా సుమన్, కార్యదర్శిగా మేకల అభిషేక్, జాయింట్ సెక్రెటరీగా రవితేజ, సహాయ కార్యదర్శిగా గడ్డం రాజు, కార్యవర్గ సభ్యులుగా దాసరి సుధీర్ కుమార్, కనకం సతీష్, గుడిసే శ్రీకాంత్, కలిగేటి శ్రీకాంత్, వడ్లూరి మహేష్, మన్నే విక్రం, గోల్కొండ సంతోష్, మేకల విని కుమార్, తదితరులను ఎన్నుకోవడం జరిగింది.

Mekala Praveen Kumar.

ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ కొరుటపల్లి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయడానికి కలిసికట్టుగా మావంతు కృషి చేస్తామని తెలిపారు.

సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు.

కార్మికులహక్కుల సాధనకు సమరశీల పోరాటం చేయాలి

సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు

కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పురమల్ల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

చికాగో వీధుల్లో కార్మిక వర్గం చిందించిన నెత్తుటి చారికలు నేటికీ స్ఫూర్తిదాయకమని, పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం వంటి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి కార్మికులపై ఉందని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు ఉద్ఘాటించారు. మే డే సందర్భంగా కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో కాల్వ నర్సయ్య యాదవ్ చిత్రపటం వద్ద జరిగిన మే డే వేడుకలో అరుణపతాక ఆవిష్కరణ చేశారు. ఈసందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ, అప్పటి దుర్మార్గపు ప్రభుత్వం కార్మికుల గొంతు నొక్కాలని ప్రయత్నించినా, వారి ఐక్య పోరాటం ముందు తలవంచక తప్పలేదని గుర్తు చేశారు. న్యాయమైన వేతనాలు, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, జీతంతో కూడిన సెలవులు, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు, కార్మిక సంక్షేమ చట్టాలు వంటి ఎన్నో విజయాలు ఆపోరాటాల ఫలితమేనని ఆయన అన్నారు.
నేడు పరిస్థితులు మళ్లీ మారుతున్నాయని, పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో కార్మిక వర్గం మరింత ఐక్యంగా, సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు.
సమానత్వం కోసం జరిగే ఈపోరాటంలో ప్రతి ఒక్క కార్మికుడు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ, కార్మికుల హక్కులను హరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఆటోరిక్షా, హమాలి కార్మికుల నుండి మొదలుకొని అడ్డా కూలీల వరకు ప్రతి ఒక్క కార్మికుడు “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అనే చారిత్రాత్మక నినాదంతో స్ఫూర్తి పొంది, సమానత్వం కోసం, తమ హక్కుల కోసం ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని అన్నారు. కార్మిక శక్తికి తిరుగులేదని నిరూపించే సమయం ఆసన్నమైందని పురమళ్ళ శ్రీనివాస్ అన్నారు. ఈజెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బొమ్మకల్ సిపిఐ గ్రామ కార్యదర్శి కాల్వ శ్రీనివాస్ యాదవ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ బీరం ఆంజనేయులు, హమాలి నాయకులు మేకల చంద్రయ్య, రాయమల్లు,పాశం మోహన్, గాలిపెల్లి సుధాకర్, మాదరవేణి సంపత్, పెంటమీద ఐలయ్య, పుట్టపాక శంకర్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆర్కేపి లో “మే” డే వేడుకలు.

ఘనంగా ఆర్కేపి లో “మే” డే వేడుకలు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలో 139వ మే డే వేడుకలు ఘనంగా జరిగాయి.చారిత్రాత్మక మేడే ఆవిర్భావ నేపథ్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకుని వారి త్యాగాలకు పలువురు కార్మిక సంఘ నాయకులు, రాజకీయ నాయకులు ఘన నివాళులర్పించారు. సిపిఐ కార్యాలయం ఆవరణలో అక్బర్ ఆలీ, సిహెచ్పి సమీపంలో ఏఐటియుసి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో తేజావత్ రాంబాబు, పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, సీఐటియు కార్యాలయం ఆవరణలో పార్టీ నాయకులు సాంబారి వెంకటస్వామి, రామగిరి రామస్వామి, రజక సంఘం కార్యాలయం ఆవరణలో అధ్యక్షుడు నడిగోట తిరుపతి , సింగరేణి సివిల్ కార్యాలయం సమీపం లో ఐఎన్టీయుసి నాయకులు సంగ బుచ్చయ్య, శ్రీనివాస్ గౌడ్, మేకల రాజయ్య,కాంగ్రెస్ నాయకులు యాకుబ్ ఆలీ, తాపీ మేస్త్రి సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు జిలకర రాయమల్లు లు జెండాలు ఎగరవేసి మే డే దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయండి.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయండి

రాఘవ పట్నం లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిన

రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు జిల్లా, నేటిధాత్రి :\

 

 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
అన్నారు.
గురువారం గోవిందరావు పేట మండలం రాఘవ పట్నం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకుంటున్న పొన్నం రవీందర్, ధనసరి లింగయ్య, కృష్ణ వేణి కోరం రామ్ మోహన్ లతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మంజూరైన ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలనీ అన్నారు. రెండవ దఫా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని, అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులూ లేక

ఖానాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం.

ఖానాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో పి ఎ సి ఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు.సన్నరకం వడ్లకు క్వింటాకు రూ500బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల సత్తా….

ప్రభుత్వ పాఠశాలల సత్తా….

8 పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత

మండల టాపర్ ఎల్లారెడ్డి

నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ
తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం లోని, బర్దిపూర్, ఎల్గోయ్, జీర్లపల్లి, ఈదులపల్లి, ఝ రాసంగం, ఆదర్శ పాఠశాల, కేజీబీవీ, మహాత్మ జ్యోతి రావు పూలే పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. కుప్పానగర్ పాఠశాలలో 99% శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మండల వ్యాప్తంగా 402 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 401 మంది ఉత్తీర్ణత సాధించారు. కుప్పానగర్ పాఠశాలకు చెందిన ఒక్క విద్యార్థి మాత్రమే ఉత్తీర్ణత సాధించలేకపోయారు.

 

Education

మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థి ఎల్లారెడ్డికి 581 మార్కులు సాధించి మండల టాపర్గా గెలిచాడు. తెలంగాణ మోడల్ స్కూల్కు చెందిన ఎస్. రాధిక 574 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. మండ లానికి చెందిన 30 మందికి పైగా విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. జడ్పీహెచ్ ఎస్ ఝరాసంగం పాఠశాలకు చెందిన రాహుల్ 556, సీహెచ్. భవాని 548, జి. భువనేశ్వరి 529, కె. త్రిష 527, ఎలిజబెల్ రాణి 526 మార్కులు సా ధిం చారు. ఈ విద్యార్థులను మండల విద్యాధి కారి శ్రీనివాస్, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version