పైడిపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం..!

పైడిపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం..!

నగరంలో బండి కుమారస్వామి కబ్జా విషయం ఇంకా కనుమరుగక ముందే, ఎల్లవుల కుమార్ యాదవ్ కబ్జాకు ప్రయత్నం?

ప్రభుత్వ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్న ఎల్లావుల కుమార్ యాదవ్ పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి :_ సంఘీ ఎలేందర్, దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు.

పైడిపల్లి, నేటిధాత్రి.

 

 

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పైడిపల్లి గ్రామ శివారు సర్వే నెంబరు 264లో ఎల్లావుల కుమార్ యాదవ్ ప్రభుత్వ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసుకొని, దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సంఘీ ఎలేందర్, జన్ను రవి లు అట్టి ప్రభుత్వ భూమిని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ఎల్లవుల కుమార్ యాదవ్ సర్వేనెంబర్ 263లో రిజిస్ట్రేషన్ చూపించి సర్వే నంబర్ 264 భూములను అమ్మినాడని, ఇట్టి విషయంపై గత కొన్ని ఏళ్లుగా పోరాటం చేయుచుండగా, వరంగల్ తహశీల్దార్ ఇట్టి భూమిలో, ఇది ప్రభుత్వ భూమి ఎవరు అక్రమించరాదని బోర్డు పెట్టడం జరిగినది అని, అయినా కానీ తన వైఖరి మార్చుకోకుండా కొందరి రాజకీయ నాయకుల పేర్లు చెప్పి, అక్కడున్న గుడిసె వాసులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కావున ఎల్లవుల కుమార్ యాదవ్ పై నమోదైన కేసుల సంఖ్యలు పరిశీలించి వరంగల్ పోలీస్ కమిషనర్ అతడిపై రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని కోరడమైనది. నగరంలో బండి కుమారస్వామి కబ్జా విషయం ఇంకా కనుమరుగక ముందే ఎల్లవుల కుమార్ యాదవ్ కబ్జాకు ప్రయత్నం చేయడం వరంగల్ జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ గా మారిందని భూకబ్జాదారులను వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్ కట్టడి చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో
సిపిఐ నాయకులు ఆరే రాజు, మాస్కే సుదీర్, బెజ్జంకి యాకంబ్రచారి, రాచర్ల రాజేందర్, మంద నవీన్ లు పాల్గొన్నారు.

సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు.

కార్మికులహక్కుల సాధనకు సమరశీల పోరాటం చేయాలి

సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు

కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పురమల్ల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

చికాగో వీధుల్లో కార్మిక వర్గం చిందించిన నెత్తుటి చారికలు నేటికీ స్ఫూర్తిదాయకమని, పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం వంటి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి కార్మికులపై ఉందని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు ఉద్ఘాటించారు. మే డే సందర్భంగా కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో కాల్వ నర్సయ్య యాదవ్ చిత్రపటం వద్ద జరిగిన మే డే వేడుకలో అరుణపతాక ఆవిష్కరణ చేశారు. ఈసందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ, అప్పటి దుర్మార్గపు ప్రభుత్వం కార్మికుల గొంతు నొక్కాలని ప్రయత్నించినా, వారి ఐక్య పోరాటం ముందు తలవంచక తప్పలేదని గుర్తు చేశారు. న్యాయమైన వేతనాలు, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, జీతంతో కూడిన సెలవులు, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు, కార్మిక సంక్షేమ చట్టాలు వంటి ఎన్నో విజయాలు ఆపోరాటాల ఫలితమేనని ఆయన అన్నారు.
నేడు పరిస్థితులు మళ్లీ మారుతున్నాయని, పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో కార్మిక వర్గం మరింత ఐక్యంగా, సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు.
సమానత్వం కోసం జరిగే ఈపోరాటంలో ప్రతి ఒక్క కార్మికుడు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ, కార్మికుల హక్కులను హరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఆటోరిక్షా, హమాలి కార్మికుల నుండి మొదలుకొని అడ్డా కూలీల వరకు ప్రతి ఒక్క కార్మికుడు “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అనే చారిత్రాత్మక నినాదంతో స్ఫూర్తి పొంది, సమానత్వం కోసం, తమ హక్కుల కోసం ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని అన్నారు. కార్మిక శక్తికి తిరుగులేదని నిరూపించే సమయం ఆసన్నమైందని పురమళ్ళ శ్రీనివాస్ అన్నారు. ఈజెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బొమ్మకల్ సిపిఐ గ్రామ కార్యదర్శి కాల్వ శ్రీనివాస్ యాదవ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ బీరం ఆంజనేయులు, హమాలి నాయకులు మేకల చంద్రయ్య, రాయమల్లు,పాశం మోహన్, గాలిపెల్లి సుధాకర్, మాదరవేణి సంపత్, పెంటమీద ఐలయ్య, పుట్టపాక శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version