పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా జహీరాబాద్‌లో.!

పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా జహీరాబాద్‌లో క్యాండిల్‌ మార్చ్‌ …

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద ఘటనపై జహీరాబాద్ ముస్లిం యాక్షన్ కమిటీ. రాజేష్ పెట్రోల్ పంప్ నుండి డాక్టర్ భీంరావు అంబేద్కర్ విగ్రహం వరకు మౌనంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పహల్గామ్ ఉగ్రదాడిని ముస్లిం యాక్షన్ కమిటీ నాయకులు సంయుక్తంగా తీవ్రంగా ఖండించారు. ముస్లిం యాక్షన్ కమిటీ అధ్యక్షుడు జహీరాబాద్ ముహమ్మద్ యూసుఫ్, మౌలానా మౌలానా ముజీబ్ ఖాస్మీ అధ్యక్షుడు జమియత్ ఉలేమా-ఉలేమా హింద్ జహీరాబాద్, ముహమ్మద్ అయూబ్ లైడరీ మరియు క్యాండిల్ లైట్ నిరసన అధ్యక్షుడు ఎంపీజే ముహమ్మద్ మొయిజుద్దీన్ మహమ్మద్ ముస్లిం యాక్షన్ కమిటీ జహీరాబాద్, నామా రవికిరణ్ మాజీ కౌన్సిలర్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఎల్ జనార్దన్ దళిత నాయకుడు, ప్రకాష్ తాజర్ పర్చా, సమీ అడ్వకేట్ మాట్లాడుతూ పహల్గాం ఘటన మానవతావాదమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడి నుంచి వచ్చినా ఉక్కు పంజాతో అణిచివేయాలని, ఉగ్రవాదులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌ మాజీ ఉపాధ్యక్షుడు ఖవాజా మియాన్‌, ఈద్గా కమిటీ అధ్యక్షుడు ముహమ్మద్‌ మజీద్‌, ఉమర్‌ ఫరూక్‌ మసీదు అధ్యక్షుడు అబ్దుల్‌ ఖదీర్‌, జమియత్‌ ఉలామా జహీరాబాద్‌ కార్యదర్శి అబ్దుల్‌ ఖదీర్‌, జట్టే రాజ్‌ కాంగ్రెస్‌ నాయకుడు శ్రీనివాస్‌ అలీపూర్‌, ఎజాజ్‌ పాషా, అయూబ్‌ఖాన్‌, సర్ఖాన్‌, ఎజాజ్‌ పాషా, అయూబ్‌ఖాన్‌, సర్ఖాన్‌ మెహబూబ్ ఘోరీ, నసీరుద్దీన్, ఎంఏ అజీమ్ మహ్మద్ ఫిరోజ్, నస్రుల్లా, వసీం, ముయేజ్ లష్కరీ, అయూబ్ సహారా, మోయిన్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ముహమ్మద్ యూసుఫ్ క్యాండిల్ మార్చ్ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

సమాజ అభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్ర.!

సమాజ అభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్ర -మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల

రామడుగు నేటిధాత్రి:

సమాజాభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్రాని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్ అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల చేత జెండా ఎగర వేయించారు. అనంతరం కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా చెర్మెన్ మాట్లాడుతూ కార్మికుల శ్రమకు గౌరవం కల్పించడమే మే డే ఉద్దేశమని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం మార్కెట్ కమిటీ ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ పిండి సత్యం రెడ్డి, డైరెక్టర్లు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఘనంగా 139వ మేడే దినోత్సవ వేడుకలు.

ఘనంగా 139వ మేడే దినోత్సవ వేడుకలు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ ఏరియాలోని ఐఎన్టీయూసీ బ్రాంచ్ కార్యాలయంలో 139వ మే డే దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించి, వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గురువారం ఏరియా వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు మాట్లాడుతూ…కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి అసువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేవని కీర్తించారు.ఇది సాధారణమైన రోజు కాదని,శ్రమించే ప్రతి గుండె చప్పుడు,పోరాడే ప్రతి ఆత్మ యొక్క గర్జన,తరతరాల కార్మికుల కలలు,ఆకాంక్షలు, అలుపెరగని పోరాటాల సజీవ సాక్ష్యమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గరిగ స్వామి, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కలవేన శ్యామ్,సెంటర్ సెక్రెటరీ లేగల శ్రీనివాస్,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పేరం రమేష్,జీవన్ జోయల్,భీమ్ రవి,మెండే వెంకట్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ముదిగుంట ప్రభుత్వ .

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ముదిగుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 19 మంది లో బాలురు(13) బాలికలు(6 )గురు విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో చదివిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు.తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అధిక మార్కులు సాధించి ఉత్తీర్ణత అయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని పేద మధ్య తరగతి విద్యార్థులు అధిక మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరును తీసుకొచ్చారని అన్నారు.అలాగే గ్రామస్తుల సహాయ సహకారాలు,పాఠశాల విద్య కమిటీ చైర్మన్ గుండా సునీత,ఉపాధ్యాయులు చూపిన చొరవతో అధిక మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.

మే డే సంబరాల్లో కార్మికులు.

మే డే సంబరాల్లో కార్మికులు

ఘనంగా పలు సంఘాలు మే డే ను నిర్వహించుట

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సంఘటిత అసంఘటిత కార్మికుల అందరూ మే డేను జరుపుకు న్నారు.వివిధ రంగాలకు చెందిన కార్మికులతో వివిధ యూనియన్ల ఆధ్వ ర్యంలో గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జెండాలను ఎగురవేసి, ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపు కున్నారు చేనేత సహకార సంఘంలోని కార్మికులు, ఎంసిపిఐ యూనియన్ల కార్మి కులు, గ్రామపంచాయతీ కార్మికులు, పలు సంఘాల కార్మికులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికులు తన చెమటను చుక్కలను రక్త మాంసాలను కలిగించి పనిచేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగ కార్మిక దినోత్సవం మేడే కార్మికుల ఐక్యత పోరాటాలను నిదర్శనంగా నిలుస్తూ మేడేను అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ శాయంపేట గ్రామ అధ్యక్షుడు నాలికే రాజమౌళి, సూర్య ప్రకాష్, సునీల్ ,అనిల్ కొమురయ్య, చింతల భాస్కర్ ఉస్మాన్ ,నాగలగాని వీరన్న, గాదే కుమారస్వామి రమేష్ వంగరి సాంబయ్య, అన్ని యూనియన్ సంఘాల కార్మికులు, హమాలి కార్మి కులు, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఐక్యతకు నిదర్శనం మే డే

ఐక్యతకు నిదర్శనం మే డే

వేడుకలకు కార్మికులు సన్నద్ధం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యం లోమే డే సందర్భంగా కార్మికు లకు పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. కార్మికులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మండల అధ్యక్షుడు మాట్లాడుతూ కార్మికుడు తన చెమట చుక్కలను రక్త మాం సాలను కలిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపు కునే పండుగ కార్మిక దినోత్స వం మేడే కార్మికుల ఐక్యత పోరాటాలను నిదర్శనంగా నిలుస్తూ మే డేను అంతర్జా తీయ కార్మిక దినోత్సవంగా అని కూడా పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులకు 300 రూపాయల పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మరియు రోడ్డు పక్కన నివసించే గుడారాల మధ్య జీవనోపాధిగా జీవనం కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయా లన్నారు.ఈ కార్యక్రమంలో మారపేల్లి రవీందర్, దుబాసి కృష్ణమూర్తి, చిందం రవి, మార్కండేయ , కట్టయ్య , శాంత-రవి, రఫీ , ప్రపంచ రెడ్డి, నాగలగాని వీరన్న, రాజేందర్, రాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.

మోడీ చిత్రపటానికి బిజెపి ఆధ్వర్యంలో పాలాభిషేకం.

మోడీ చిత్రపటానికి బిజెపి ఆధ్వర్యంలో పాలాభిషేకం

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి)

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత దేశవ్యాప్తంగా కులగణనకు మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నందునా బుదవారం జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో, జనాభా లెక్కలతోపాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకల్లో కులగణన తప్పుల తడకగా లెక్కలు చేసి మళ్లీ లెక్కిస్తామని ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని విస్మరించిందని అధికారం పోయాక విమర్శలు తప్ప చేసేది ఏం లేదు కానీ మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా బీసీ, sc, st లు మరియుప్రతి కులస్తులు అందరూ స్వాగతిస్తున్నారు ఈ కులగణణ ‘సమ్మిళిత వృద్ధి’ వేగం గా పుంజుకుంటుందని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరులో జన, కులగణనను ప్రారంభించి, రెండేళ్లలో ముగించనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చిత్ర పటానికి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్ జిల్లా కార్యదర్శి గజ బింకర్ చందు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనగంటి నరేష్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పండగ మాధవి, బీజేవైఎం ఉపాధ్యక్షుడు దూడం శివప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు చొప్పదండి అంజన్న, ఊరగొండ రాజు, మోర శ్రీహరి, పంపరి అర్జున్, చొప్పదండి శ్రీనివాస్, కోడం శ్రీనివాస్, ఇంజాపూరి మురళి, దుమాల శ్రీకాంత్, మహేశుని అనిల్, దూడం సురేష్, టవటం రాజలింగం, నాగుల శ్రీనివాస్, చొక్కి శీను, పచ్చునూరి సురేష్, వేముల సురేష్, గాలి శీను, కర్నే రేవంత్, కోడం రవి, తాటిపాముల విష్ణు, జింగం శ్రీనివాస్, వేముల పోశెట్టి, నల్లగొండ సాయిచంద్, భాగయ్య, ఆడెపు వేణుమాధవ్, చిలుక శ్రీకాంత్ కర్నె గణేష్, మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రభంజనం.

పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రభంజనం

మండల ర్యాంకులు సాధిం చిన బాలికల పాఠశాల విద్యార్థులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాల విద్యార్థులు నామని అక్షయ 549, డి. సాయి శ్రీ 546, ఎండి అమ్రీన్ 527 మార్కులు సాధిం చి స్కూల్ టాపర్లుగా మరియు మండల స్థాయిలో ఒకటవ, రెండవ, నాలుగవ స్థానాలు కైవసం చేసుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు శ్రీలత తెలిపారు. పాఠశాలలో 16 మందికి గాను 15 మంది పాసయ్యారు. 94% ఉత్తీర్ణత సాధించారు జడ్పీ హెచ్ఎస్ బాలుర పాఠశాల రంగు సంజయ్ 529 సాధించారు.

Students

 

16 మందికిగాను 15 మంది పాసయ్యారు. 94% ఉత్తీర్ణత సాధించారు. గురు కుల పాఠశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారు విద్యార్థుల మార్కులు 567, రెండవ స్థానం 560 మార్కు లతో పాటు 500 పైగా మార్కులు 38 మంది విద్యార్థులు సాధించారు. కేజీవిపి ప్రభుత్వ పాఠశాలలో 504మార్కులు సాధించారు. పెద్దకోడేపాక పాఠశాలలో కూడా ఉత్తమ ఫలితాలు సాధించారు. పాఠశాల ప్రధానో పాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల కృషి క్రమశిక్షణ అంకితభావంతో సహా అత్యు త్తమ ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రుల సహకారంతో ఈ ఫలితాలు సాధించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానో పాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ పోరాటాలను.

మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ పోరాటాలను బలోపేతం చేద్దాం

టియుసిఐ నేత కొమరం శాంతయ్య

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

టియుసిఐ గుండాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గురువారం మే డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంధా) కార్యాలయం వద్ద టియుసిఐ జెండాను ఆ సంఘం గుండాల ఏరియా కమిటీ కార్యదర్శి కొమరం శాంతయ్య ఆవిష్కరించారు. జవ్వాజి సెంటర్ లో టియుసిఐ గుండాల ఏరియా కమిటీ అధ్యక్షులు గడ్డం రమేష్ ఆవిష్కరించారు. పెట్రోల్ బంకు వద్ద టియుసిఐ ఏరియా కమిటీ సభ్యులు వసంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో టియుసిఐ ఏరియా కమిటీ కార్యదర్శి కొమరం శాంతయ్య, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంధా) జిల్లా నాయకులు ఈసం శంకర్, వాంకుడోత్ అజయ్ లు మాట్లాడుతూ కార్మికులు చికాగో నగరంలో 1986 మే 1న పాలకవర్గాల దమన కాండలో తమ రక్తాన్ని చిందించి, ఉరికొయ్యాలని సైతం లెక్కచేయకుండా పోరాడిన పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని దినాన్ని ప్రపంచమంతా ఆమోదించిందని వారన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కుల్ని కాలరాస్తుందని, కార్మిక వర్గం పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ ,మిగతా 29 చట్టాలను నాలుగు లేబర్ కోడులను ఆమోదించి అమలు చేయడం వల్ల కార్మికులు కట్టు బానిసలుగా మారబోతున్నారని అన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాంత్రీకరణ పేరుతో ఎనిమిది గంటల పనిని పెంచుతూ 12 గంటలు పనిచేయిస్తూ కార్మికుల రక్తాన్ని మరింత పీల్చి పిప్పి చేస్తున్నారని వారన్నారు. భారత రాజ్యాంగం, కోర్టుల గురించి గొప్పలు వల్లించే పాలకులు సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు తీర్పుని ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. శ్రామిక వర్గం జీవించడానికి సరిపడే వేతనాలు ఇచ్చేంతవరకు కార్మిక లోకం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం కార్పోరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అప్పగించడం హేయమైన చర్యాగా వారు పేర్కొన్నారు. కార్మిక లోకం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ,కార్మికుల రెగ్యులరైజేషన్ ,సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ ఉద్యోగ భద్రతకై జీవించడానికి సరిపడే వేతనాలు ,పెన్షన్ పెంపు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలు నిలుపుదల కోసం 139వ మే డే స్ఫూర్తితో పోరాటాలను ఉదృతం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ ఏరియా కమిటీ నాయకులు మొక్క నరి, కోడూరి జగన్, మాచర్ల కోటి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకులు పూనెం మంగయ్య, తెల్లం రాజు , పూనెం లక్ష్మయ్య ,ఈసం కృష్ణ , వూకే శ్రావణ్, ధరావత్ వాగ్య, కల్తి వెంకన్న, సనప కిషెంధర్, మోకాల పాపయ్య, ధరావత్ ఆల్యా ,ధరావత్ మోహన్, ఉప్పు రాజ్ కుమార్, ఉప్పు వెంకటేశ్వర్లు, జాటోత్ భాను , ఎస్ కే వసీం, నునావత్ శంకర్, ఉప్పు మహేష్ ,గంగాధరి కార్తీక్, నాగెల్లి తరుణ్ ,వాగబోయిన జగ్గారావు, ఎస్కె కర్ముళ్లా, ఎస్కె బిల్లా తదితరులు పాల్గొన్నారు.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. మంగళవారం పెండింగ్‌లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జహీరాబాద్ ఎమ్మెల్యే కోట నుండి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు.

 

President

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.

రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ,

రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 892 వ బసవ జయంతి మహోత్సవ శోభా యాత్రలో పాల్గొన్న

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్ జహీరాబాద్ పట్టణంలో రాష్ట్రీయ బసవ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వరుని శోభా యాత్రలో పాల్గొని ప్రజలకు బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వీరశైవ సమాజం సభ్యులతో కలిసి బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఈ సందర్భంగా
మాజీ మంత్రి,మాట్లాడుతూ బసవన్న చూపిన మార్గంలో అందరూ నడవాలని మరియు మహిళ సాధికారత కోసం,బడుగు బలహీనవర్గాల సమానత్వం కోసం, అస్పృశ్యత నివారణ కోసం,వారు ఎంతో కృషి చేసిన గొప్ప మహానియుడని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బసవ దళ్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పటేల్,మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు కండేం. నర్సింలు,ఏయంసి.డైరెక్టర్ శేఖర్,కాంగ్రెస్ నాయకులు హుగెల్లి రాములు,వీరశైవ సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అద్భుతమైన ఫలితాలు సాధించిన మామిడి గి పాఠశాల.!

అద్భుతమైన ఫలితాలు సాధించిన మామిడి గి పాఠశాల విద్యార్థులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిగి లో మొత్తం 30 మంది విద్యార్థులు ఈ సారి పదవ తరగతి పరీక్షలకు హాజరైనారు. అందులో 30 మంది విద్యార్థులు కూడా పాసైనారు గత సంవత్సరం లాగా ఈసారి కూడా పాఠశాల విద్యార్థులు 100% ఫలితాలు సాధించడం జరిగింది.

Students

 

A1 గ్రేడ్ సాధించిన విద్యార్థులు ముగ్గురు ఉన్నారు. 500 లకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 30 లో 19 మంది విద్యార్థులు ఉన్నారు.

పది ఫలితాల్లో 99.75 శాతం ఉత్తీర్ణత : ఎంఈఓ.

పది ఫలితాల్లో 99.75 శాతం ఉత్తీర్ణత : ఎంఈఓ…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

2024 25 విద్యాసంవత్సరానికి గాను -నిర్వహించిన పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో మండలంలో 99.75 శాతం ఉత్తీర్ణత సాధించారని మండల విద్యాధికారి మారుతి రాథోడ్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం విడుదలైన పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో వివరాలను వెల్లడించడం జరిగిందన్నారు. మండలంలో 8 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థునులు 416 గురు పరీక్షలు రాయగా 415 గురు ఉత్తీర్ణులయ్యారని ఎంఈఓ తెలిపారు. మిర్జాపూర్ (బి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని సాదియా సౌసీన్ 600 గాను 579 మార్కులు సాధించి మండలంలోని టాపర్ గా నిలిచింది.

Exams

 

మెటల్ కుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి 600 గాను 565 మార్కులు, మిర్జాపూర్ (బి) ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని నవీనా 600 గాను 561, మమ్మద్ జునీద్ 600 గాను 559 మార్కులు సాధించి ప్రతిభను చాటారు. న్యాల్ కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గొల్ల సాయి మార్చ్ 20న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలవడంతో కేవలం మొదటి రోజు పరీక్షను మాత్రమే వ్రాసి మిగిలిన 5 పరీక్షలు వ్రాయలేక పోవడంతో మండలంలో శతశాతం ఉత్తీర్ణత సాధించలేక పోయింది. 416 గురు విద్యార్థునులకు గాను 415 గురు విద్యార్థునులు వార్షిక పరీక్షల్లో హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన విద్యార్థునులు అందరు ఉత్తీర్ణత సాధించారు.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. మంగళవారం ముస్లిం షాది ఖానా పెండింగ్‌లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

 

Congress

షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హాయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కోట నుండి 20 లక్షలు మంజూరైన నిధులు మంజూరు చేశారన్నారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే కాంగ్రెస్ లో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.

కె జి ఎన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభం.

కె జి ఎన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభం

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపల్ పట్టణం కేంద్రంలో కేజీఎన్ ఎంటర్ప్రైజెస్ బుధవారం ప్రారంభోత్సవం జరిగింది, కేజియన్ ఎంటర్ప్రైజెస్ యజమాన్యం సాన్ ఉల్ఖాన్, ఇస్రార్ ఖాన్, కేసముద్రం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటు ధరలలో ఇంటీరియర్ డెకరేషన్ ఫాల్ సీలింగ్ వినియోగదారులకు అతి తక్కువ ధరలలో ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ డెకరేటర్ చేసి అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు కేసముద్రం పట్టణంలో ఫాల్స్ సీలింగ్ మెటీరియల్ తో ఫిట్టింగ్ చేసేవారు అందుబాటులో లేరని ఇకనుండి కేసముద్రం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అందరికీ సరైన అందుబాటు ధరల్లో సౌలభ్యం ఉంటుందని అన్నారు. వినియోగదారులు ఎవరైనా పాల్ సీలింగ్ డిజైన్ చేయించుకోవాలనుకునేవారు కేజీఎన్ ఎంటర్ప్రైజెస్ పట్టణ కేంద్రంలో పొట్టి శ్రీరాములు సెంటర్ కూడలిలో షాప్ నూతనంగా ప్రారంభించామని వినియోగదారులు నేరుగా మమ్మల్ని సంప్రదించి మీకు అందుబాటు ధరల్లో పాల్ సీలింగ్ మెటీరియల్ తో మీకు నచ్చిన డిజైన్ లో ఫిటింగ్ చేసి అనుకున్న టైంలో అందిస్తామని పేర్కొన్నారు.

అభ్యుదయ కవితా పతాక శ్రీ శ్రీ.

అభ్యుదయ కవితా పతాక శ్రీ శ్రీ

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 30:

 

 

సమాజంలోని అసమానతలపై తన రచనలతో అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ, శ్రామిక జీవన సౌందర్యాన్ని ఎలుగెత్తి చాటిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు అని కొనియాడారు.
బుధవారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రం మరియు అభ్యుదయ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జయంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా
తిరుపతిబాలోత్సవం అధ్యక్షులు
నడ్డి నారాయణ అధ్యక్షతన
శ్రీ శ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన రచనలను చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో వేమన విజ్ఞాన కేంద్రం ప్రధానకార్యదర్శి మల్లారపు నాగార్జున, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యువశ్రీ మురళి, డాక్టర్ నెమిలేటి కిట్టన్న,తిరుపతి జిల్లా రచయితల సంఘం కార్యదర్శులు మన్నవ గంగాధర ప్రసాద్,పేరూరు బాలసుబ్రమణ్యం
సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ ఓ.వెంకటరమణ,
తదితరులు పాల్గొన్నారు.

కె జి ఎన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభం.!

కె జి ఎన్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపల్ పట్టణం కేంద్రంలో కేజీఎన్ ఎంటర్ప్రైజెస్ బుధవారం ప్రారంభోత్సవం జరిగింది, కేజియన్ ఎంటర్ప్రైజెస్ యజమాన్యం సాన్ ఉల్ఖాన్, ఇస్రార్ ఖాన్, కేసముద్రం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటు ధరలలో ఇంటీరియర్ డెకరేషన్ ఫాల్ సీలింగ్ వినియోగదారులకు అతి తక్కువ ధరలలో ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ డెకరేటర్ చేసి అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు కేసముద్రం పట్టణంలో ఫాల్స్ సీలింగ్ మెటీరియల్ తో ఫిట్టింగ్ చేసేవారు అందుబాటులో లేరని ఇకనుండి కేసముద్రం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అందరికీ సరైన అందుబాటు ధరల్లో సౌలభ్యం ఉంటుందని అన్నారు. వినియోగదారులు ఎవరైనా పాల్ సీలింగ్ డిజైన్ చేయించుకోవాలనుకునేవారు కేజీఎన్ ఎంటర్ప్రైజెస్ పట్టణ కేంద్రంలో పొట్టి శ్రీరాములు సెంటర్ కూడలిలో షాప్ నూతనంగా ప్రారంభించామని వినియోగదారులు నేరుగా మమ్మల్ని సంప్రదించి మీకు అందుబాటు ధరల్లో పాల్ సీలింగ్ మెటీరియల్ తో మీకు నచ్చిన డిజైన్ లో ఫిటింగ్ చేసి అనుకున్న టైంలో అందిస్తామని పేర్కొన్నారు.

తిప్పనగుల్లలో పౌర హక్కుల దినోత్సవం.

తిప్పనగుల్లలో పౌర హక్కుల దినోత్సవం

నిజాంపేట్, నేటి ధాత్రి

నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుళ్ల గ్రామంలో బుధవారం రోజున పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎస్ఐ జైపాల్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని ఉద్దేశాలను తెలుపడం జరిగింది. గ్రామంలో ఎస్సీ ఎస్టీలను కులం పేరుతో ఎవరైనా దూషిస్తే మా దృష్టికి తీసుకురావాలని గుడిలోకి, బడిలోకి, రానివ్వకుండా కులం పేరుతో మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, హోటళ్లల్లో అందరికీ ఒకేలాగా ఒకే తీరు గ్లాసులల్లో చాయ్ ఇవ్వాలని మీకు వేరు మాకు వేరు అనే పద్ధతిని ఉంటే అటువంటి అంశాలపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని కోనేరు రంగారావు సిఫారసుల మేరకు ప్రతినెల చివరి రోజున మండలంలోని ఏదో ఒక గ్రామంలో ఇలాంటి పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం చేపడతామని, ఆ గ్రామాలలో ఏవైనా కులాల వారీగా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో జీవించాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు సమాన అవకాశాలు సమాన విద్య అందరికీ అందించే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇమాద్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి శ్యామల పోలీస్ సిబ్బంది గ్రామస్తులు చంద్రం, యాదగిరి, రాజు, నవీన్, గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్స్ ను తిప్పికోట్టండి.

కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్స్ ను తిప్పికోట్టండి

గుండాల(టీయూసిఐ)మేడే పిలుపు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఆఫ్ ఇండియా (టీయూసిఐ)
139 వ మేడే, పోస్టర్లను గుండాల మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ పార్టీ కార్యాలయం లో పోస్టర్లు
ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వెల్డింగ్ ఆటో అండ్ మోటర్ మెకానిక్ వర్కర్స్(టీయూసిఐ)
మండల నాయకులు మొక్క మరీ అధ్యక్షతన వహించగా
గుండాల మండల కమిటీ కార్యదర్శి గడ్డం రమేష్ మాట్లాడుతూ ప్రియమైన
కార్మికులారా 1886 మే ఒకటి పాలక వర్గాల ధమాకాండలో చికాగో (అమెరికా)
కార్మికవర్గం రక్తం చిందించి ఉరికంబాలను
సైతం లెక్కచేయక సాధించిన పోరాట ఫలితమే 8 గంటాల పనిని ప్రపంచం ఆమోదించాల్సి వచ్చింది,
139 సంవత్సరం ల క్రింద ఇంతగా శాస్త్ర సంకేతిక పరిజ్ఞానం రవాణా అభివృద్ధి చెందని కాలం మన దేశంలో ఆనాడు మనిషి సాగటు అయుర్దాయం 40 సం,రాలు
నేడు 70 సంవత్సరాల మానవ జాతినే నాశనం చేసిన కాలర మాసుచీ క్షయ
గత్తరలాంటి వ్యాధులను
తరిమి ఏసిన వైద్య విజ్ఞానం ఒక్కనాడు కరువుతో అల్లాడి లక్షలాది మంది తిండి లేక అమానుషంగా మరణించారు.కనీసం మంచినీరు కూడా అందించని
దురావస్థ నుండి తాగు నీరందించడంతో వ్యవసాయరంగం విప్లవాత్మక మార్పులతో ప్రపంచానికే తిండి గింజలు అందించే శక్తి వచ్చింది కరువు కాటకాల నుండి బయట పడ్డారు.కానీ పాలకుల చర్యల ఫలితంగా తిండి లేక అలమటించే స్థితి అవడం సిగ్గుచేటు.
నేడు యాంత్రీకరణతో
శ్రామికుడు 8.గం„ల పనిని 4.గం„లు కూడా చేసిన సరిపోతుంది పెట్టుబడిదారులు నేడు కార్మిక రక్తాన్ని మరింతగా పిల్సిపిప్పి చేసి సంపద పోగేసుకోవడానికి
12 గం„ల పని పెంపుదల ముందుకు తీసుకొస్తున్నారు.ఇన్పోసిస్ అధినేత నారాయణమూర్తి వారానికి 70 గం„లు పనిచేయాలని ఆదివారం కూడా పనిచేయాలని
ఎల్, టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వారానికి 90 గం„లు పని చేసి ప్రపంచంలోనే
అగ్రగామిగా నిలవాలని చీలుక పలుకులు వల్లిస్తున్నారు.దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ లో పని గంటల పెంపు ప్రతిపాదించారు. దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకున్నట్లు
అధిక పనిగంటలతో శ్రమజీవుల రక్తాన్ని పీల్చిపిప్పి చేసే లక్ష్యం తప్ప మరొకటి కాదు 8 గంటల పనితోనే పారిశ్రామక వేతనాలు గణనీయంగా అభివృద్ధి అయ్యరు ప్రపంచంలోనే ఆదాని మూడవ స్థానానికి దేశంలో అంబానీలు అత్యంత సంపదగల వారిగా నిలిచారు
12 గంటాల పనితో ఎంతో అభివృద్ధి కావాలనుకున్నారు.
ఇప్పటికే 70 శాతం దేశ సంపద కేవలం ఐదు శాతం గల ధనికుల చేతుల్లో ఉందని 30 శాతం సంపద 95 శాతం గల ప్రజల చేతుల్లో ఉందని సర్వేలు ఘాోషిస్తున్నాయి.ఈ స్థితిలో పని గంటల పెంపును మే డే స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపుని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీయూసి ఐ నాయకులు మాచర్ల కోటేష్, మహేష్, తరుణ్, కార్తీక్, ఎస్.కె యాకూబ్, తదితరులు పాల్గొన్నారు,

భూభారతి రైతులకు ఒక వరం.

భూభారతి రైతులకు ఒక వరం

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్య శారదా

#నెక్కొండ,

నేటి ధాత్రి;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిని దరిదాపుల్లో లేకుండా చేసి భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ భూభారతి రైతుకు ఒక వరం రైతులు ఈ భూభారతిని సరైన విధంగా వినియోగించుకోవాలని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి బుధవారం అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూభారతి రికార్డుల్లో తప్పులు సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సెక్షన్ 5, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాసు పుస్తకాలు, ఆపిల్ వ్యవస్థ రివిజన్ అధికారాలు, గ్రామ రెవెన్యూ రికార్డులు, రికార్డుల నకలు పొందడం ఎలా, తదితర అంశాలపై రైతులకు ఒక అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తున్నదని, అధికారులు గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు భూభారతి విధివిధానాల కరపత్రాలు గ్రామాల్లో పంపిణీ చేయాలని, ఆయన అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, 39 గ్రామపంచాయతీలు ఉన్నాయని, మండలంలో మొత్తం విస్తీర్ణం 49,466 ఎకరాల భూమి ఉందని, 33,250 ఎకరాల పట్టా భూములు ఉన్నాయని, అలాగే 6862 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, 25491.36 ఎకరాల భూమికి పట్టాదారు పాస్బుక్కులు ఇప్పటివరకు ప్రభుత్వం సరఫరా చేసిందని,6293 ఎకరాల భూములపై వివాదాస్పదమైన ఆరోపణలతో కేసులు ఉన్నాయని అలాగే 4120, వివిధ కారణాలతో పట్టా భూములకు ఇంకా పట్టాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా రైతుకు సులభమైన మార్గంలో మీ భూ సమస్యలు పరిష్కారానికై ఈ భూభారతి విధానం వచ్చిందని అన్నారు. నెక్కొండ మండలంలో భూ యజమానులు 15145 ఉన్నారని, 15145 ఖాతా నెంబర్లు కలిగి ఉన్నారని, ఇప్పటివరకు మండలంలో ఆర్ఓఆర్ కంప్యూటర్ లో నిక్షిప్తం అయినావి 15145, ఇవి కాక 6293 పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఉన్నాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి, ఏ డి ఏ దామోదర్ రెడ్డి, నెక్కొండ తహసిల్దార్ వేముల రాజ్ కుమార్, నెక్కొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ,నర్సంపేట వ్యవసాయ మార్కెట్ఠ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కీ అశోక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, పలు గ్రామాల మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు మహిళా సంఘ ప్రతినిధులు మహిళ సంఘల మహిళలు, రైతులు, మహిళ రైతులు,లతోపాటు సిఐ సన్నాయిల శ్రీనివాస్, ఎస్ఐ మహేందర్లు, బందోబస్తు నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version