ఎస్టిపిపిలో ఉద్యోగులను బదిలీ చేయాలి.

ఎస్టిపిపిలో ఉద్యోగులను బదిలీ చేయాలి

నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో గల ఎస్టిపిపి లో అనేక ప్రభుత్వ శాఖలలో ముఖ్యంగా సింగరేణి శాఖలో గత పది సంవత్సరాల కు పైబడి ఒకే దగ్గర ఒకే హోదాలో విధులు నిర్వహిస్తున్న అనేకమంది ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్ కి బిఏంఎస్ యూనియన్ తరపున యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు సత్తయ్య మాట్లాడుతూ ఎస్టిపిపి లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న అటెండర్ నుండి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నా వారందరూ ఒకే సంస్థలో ఒకే దగ్గర ఒకే విధంగా విధులు నిర్వహిస్తున్న వారిని వెంటనే గుర్తించి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.గతంలో ఒకే దగ్గర పది సంవత్సరాల కు పైబడి విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేసే జీవో ఉందని ఆ జీవోను మళ్లీ సమీకరించి ఐదు సంవత్సరాలకు పైబడిన వారిని కూడా బదిలీ చేసే విధంగా ఒక కొత్త జీవోను తీసుకురావాలని బలరాం నాయక్ ని కోరారు.సంస్థలలో ఒకే దగ్గర విధులు నిర్వహించడం వల్ల సింగరేణి పవర్ ప్లాంట్ లో భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఎంఎస్ యూనియన్ నాయకులు బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ లక్ష్మారెడ్డి,ప్రధాన కార్యదర్శి దుస్సా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లికి చెందిన గిత్త సాయిచరణ్ తండ్రి ప్రసాద్ అనే యువకుడు పూర్తి వికలాంగుడు తండ్రి కూడా చిన్నతనంలో చనిపోయారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయిచరణ్ ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి తనకు చాలా ఇబ్బంది అవుతుందని ఎలక్ట్రికల్ చార్జింగ్ వెహికల్ కోసమని రెండు రోజుల క్రితం చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యంని కలువగా వెంటనే స్పందించి వికలాంగుల జిల్లా సంక్షేమ సంఘం అధికారితో ఫోన్ లో మాట్లాడి సాయిచరణ్ కు వెహికిల్ తొందరగా అందచేయాలని అధికారులతో మాట్లాడి శుక్రవారం ఎలక్ట్రీకల్ ఛార్జింగ్ వెహికిల్ ను అందజేసిన చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్.మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా సాయి చరణ్ మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలియజేశారు.

విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం.

విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం
• ఎమ్మెల్యే రోహిత్ రావు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

విద్య, వైద్యన్నీ అందిచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ద్యేయమని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలో పర్యటించి జై బాపు, జైసంవిధాన్ లో భాగంగా మండలం లో ర్యాలీ నిర్వహించారు. అలాగే సన్న బియ్యం, ఆరోగ్య ఉప కేంద్రన్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధినీ కాంగ్రెస్ 15 నెలల్లో చేసి చూపిస్తుందని కొనియడారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వైద్య కళాశాల ను కాంగ్రెస్ హయాంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమాదేవి, కాంగ్రెస్ నాయకులు చౌదర సుప్రభాతరావు, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, పట్టణ అధ్యక్షుడు నసిరుద్దీన్, సత్యనారాయణ, లింగం గౌడ్, గుమ్ముల అజయ్, దేశెట్టి సిద్దారములు, సత్యనారాయణ రెడ్డి,శ్యామల మహేష్, అధికారులు ఉన్నారు.

యువజన కాంగ్రెస్ నాయకులు మామిడి దిలీప్ కుమార్.

చొప్పదండి శాసనసభ్యులు డా.మేడిపల్లి సత్యంకి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి

యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా నాయకులు మామిడి దిలీప్ కుమార్

కరీంనగర్, నేటిధాత్రి:

 

ఎఐసిసి అగ్రనేతలు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలని యువజన కాంగ్రెస్ నాయకులు మామిడి దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి, పిహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకుని విద్యారంగం మీద అపారమైన పట్టు ఉన్న నాయకులు మేడిపల్లి సత్యంకు రాష్ట్ర విద్యాశాఖ భాద్యతలను అప్పగిస్తే విద్యాశాఖలో కీలక అభివృదిని సాధించగలరని మామిడి దిలీప్ కుమార్ పేర్కొన్నారు.

మాజీ చీఫ్ విప్ రావుల పరామర్శ.!

వనపర్తి లో మృతురాలు కుటుంబాన్ని మాజీ చీఫ్ విప్ రావుల పరామర్శ.

వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తిలో 23వ వార్డుకు చెందిన శారద విద్యామందిర్ అధినేత ,ఉపాధ్యాయురాలు శ్రీమతి వి.యస్.కళావతి గారు ఇటీవల గుండెపోటుతో మరణించారు ఈ.విషయం తెలుసుకున్న మాజీ చీఫ్ విప్ రావుల చంద్రశేఖర్ రెడ్డి మృతు రాలు నివాసానికి వెళ్లి కుమారులు శ్రీను,మురళీ పాండులను పరామర్శించి ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు . రావుల వెంట మీడియా ఇంచార్జి నందిమల్ల.అశో క్,ఉంగ్లం. తిరుమల్ నాయుడు ,నందిమల్ల. రమేష్, జోహే బ్ హుస్సేన్, సునీల్ వాల్మీకి, తోట.శ్రీను తదితరులు ఉన్నారు

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం.

పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం:ఎమ్మెల్యే కడియం
దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం
చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఓ చారిత్రాత్మక నిర్ణయం అని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.చిల్పూర్ మండలంలోని శ్రీపతి పెళ్లి, మల్కాపూర్, చిన్న పెండ్యాల గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై రేషన్ కార్డుదారులకు శుక్రవారం సన్న బియ్యం పంపిణీ చేసి కార్యక్రమం ప్రారంభించారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని దళారులకు అమ్ముకోవద్దని సూచించారు.రాష్ట్రంలో పెద్దవాళ్లు, పేదవాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఒకే రకమైన అన్నం తినాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

Sanna Rice

 

ఆనాడు 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి ఎన్టీ రామారావు ఎలా గుర్తుండిపోయారో ఈ రోజు సన్న బియ్యం పంపిణీ చెస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా అదే స్థాయిలో గుర్తిండిపోతుందని అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం అక్రమ మార్గల్లో రాష్ట్రం దాటి, దేశం దాటి పోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందించే బియ్యం పేదల కడుపు నింపాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఒక్కరికీ 6కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసిందని అన్నారు.సన్న బియ్యం పంపిణీ లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పంపిణీ జరగాలని ప్రభుత్వం అందించే సన్న బియ్యంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వచ్చే వర్షాకాలంలోపు మల్లన్న గండి లిఫ్ట్ పనులను పూర్తి చేసి చిల్పూర్ మండలానికి సాగునీరు అందించే బాధ్యతనాదని హామీ ఇచ్చారు.నియోజకవర్గ అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుండి ప్రతీ రోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాని వెల్లడించారు.ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాలువల వెంట తిరుగుతూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కాలువల నిర్మాణం, పూడికతీత, చెట్ల తొలగింపు వంటి పనులను వేగవంతం చేసి పంటలకు సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మరో ఏడాది కాలంలో నియోజకవర్గం లోని ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్దే నా ఏకైక ఎజెండా అని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే వరకు విశ్రమించనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు,మండల రేషన్ డీలర్లు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శుక్రవారం సంగారెడ్డి లోని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్పీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శుక్రవారం సంగారెడ్డి లోని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్పీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/నేటి ధాత్రి

 

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం మాదాయ పల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప్పలా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఉప్పల వెంకటేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. రూ. 3 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ హైమావతి రామస్వామి, యాదయ్య, సుధాకర్, దశరథం, లక్ష్మీనారాయణ, పరంజ్యోతి, యాదయ్య, శేఖర్, యాదయ్య, పెంటయ్య, రామస్వామి, మైసయ్య, జంగయ్య, మైసయ్య, లక్ష్మయ్య, మల్లేష్, పరుశరాములు, పర్వతాలు, సత్యం, రాజు, రవి, కుమార్, భగవంతు, రమేష్, శ్రీశైలం, అశోక్, వినోద్, సతీష్, ప్రశాంత్, గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జైబాపు, జై భీమ్, జైసం విధాన్ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు

శాయంపేట నేటిధాత్రి:

MLA lays foundation stone for construction of Indiramma’s houses

శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు పాల్గొన్నారు. రైస్ మిల్లు నుండి అంబేద్కర్ కూడలి వరకు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మనదేశ రాజ్యాంగం అమలు లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాం క్షలు నెరవేరటంలేదని, ప్రధా నికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్,గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్రగ్రంథమన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగా న్ని బీజేపీపార్టీ అనగాదొక్కా లని చూస్తుందని అన్నారు అమిత్ షా అంబెడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించాలని అన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాల ను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు

 

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. గట్లకానిపర్తి గ్రామంలో ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు న్న పథకాలలో ఒకటి ఇందిర మ్మ ఇండ్లు అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఉన్నవా రికి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకం ఉపయోగిం చుకోవాలని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. గత పదేళ్ల నుండి నిరుపేదలకు గత ప్రభుత్వం ఇళ్లను ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమా లల్లో వివిధ శాఖల అధికా రులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు

నిజాంపేట, నేటి ధాత్రి

 

చలో HCU కార్యక్రమానికి తరలిన ఏబీవీపీ విద్యార్థి నాయకులను నిజాంపేట పోలీసులు ముందస్తుగా అక్రమ అరెస్టులుచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) భూములను కాపాడేందుకు పోరాడుతున్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమన్నారు.
క్యాంపస్‌లో 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఇందిరమ్మ పాలనలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై దమనకాండ ఆపాలని
HCU భూములను రక్షించాలన్నారు.
విద్యార్థుల గొంతును నొక్కాలని చూస్తే, తెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం మరింత మిన్నంటుతుంది! రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువత ఏకమై ప్రభుత్వంపై ప్రతిఘటన తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే .

వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే .

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

ఈరోజు తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో శ్రీ మహాలక్ష్మి గోదాసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తృతీయ బ్రహ్మోత్సవాలకు ( జాతార) సందర్భంగా స్వామి వారి కల్యాణ మహోత్సవం లో పాల్గొన్న మన ప్రియతమ నేత ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.

అలాగే ఆవంచ గ్రామంలో మహా గణపతి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు,మండల నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే.. పేదలకు సంక్షేమ పథకాలు

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామంలో గురువారం.. ఏఐసీసీ ఆదేశాల మేరకు.. జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామంలో పాదయాత్రగా వెళ్లి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..

బూర్గుల గ్రామం నుండి హేమాజీపూర్ గ్రామానికి రూ. 1 కోటి 62 లక్షలతో బీటీ రోడ్డు మరమ్మత్తులు చేపడతామని, భవిష్యత్తులో డబుల్ బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

హేమాజీపూర్ గ్రామంలో అసంపూర్తిగా ఆగిపోయిన గ్రామపంచాయతీ, కమ్యూనిటీ హాల్, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

Congress

 

అనంతరం బిల్డింగ్ తండా, కోయిలకుంట తండా నేల బండ తండా, లింగారం, గాంధీ పాలెం తండాలలో పాదయాత్ర సాగింది.

గాంధీ పాలెంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వల్మిడి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.!

వల్మిడి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

 

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండలంలోని వల్మిడి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈనెల 6న జరగబోయే శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి ఈరోజు ఆలయ పరిసరాల్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అధికారులు, పోలీస్ శాఖ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, భక్త సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ, వల్మిడి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వేలాది మంది భక్తులను ఆకర్షించే పవిత్ర ఉత్సవం. ఈ వేడుకలు భక్తులంతా భద్రంగా, ఆధ్యాత్మికంగా అనుభవించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పరిసరాల్లో శుభ్రత, తాగునీరు, శాశ్వత టెంట్‌ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ వంటి చర్యలు తీసుకోవాలి. పోలీస్ శాఖ భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. పెను తాకిడిని దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చూడాలి అని తెలిపారు. అలాగే, అన్నదానం, ప్రసాద విభాగాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో క్యూలైన్లను మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, హరికథలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాలి అని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీవో, తహసీల్దార్, పోలీస్ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వల్మిడి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం విశేషంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

ప్రజా పాలనలోనే వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం.

ప్రజా పాలనలోనే వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం

రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క..

కొత్తగూడ, నేటిధాత్రి :

 

ప్రజా పాలన లోనే వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టుల యొక్క చిరకాల ఆకాంక్ష అయిన ఇళ్ల స్థలాల మంజూరు సమస్యను కూడా పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క పేర్కొన్నారు.

గురువారం నాడు టీయూడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక శాసన సభ్యురాలు, రాష్ట్ర మంత్రివర్యులు సీతక్కకు ములుగు క్యాంప్ కార్యాలయంలో ఐజేయు సభ్యులు కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి వర్కింగ్ జర్నలిస్టులను అన్యాయాలకు గురి చేసినటువంటి దుస్థితి గత పాలకులదేనని, కెసిఆర్ కు వత్తాసు పలికే కొన్ని మీడియా యాజమాన్య సంస్థలతో కుమ్మక్కై మీడియా రంగాన్ని అనేక విభాగాలుగా విభజించి ఫోర్త్ ఎస్టేట్ అనే రంగాన్ని పూర్తిగా కనుమరుగు అయ్యే విధంగా వ్యవహరించిన తీరు నాటి పాలకుల పాపమేనని, కచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ఇళ్ల స్థలాల మంజూరు,ఆరోగ్యశ్రీ ,హెల్త్ కార్డుల మంజూరు, వర్కింగ్ జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించే విధంగా

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో విధి విధానాలు చేపడుతున్నామని, కచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు చిరకాల ఆకాంక్ష కోరికైనా ఇళ్ల స్థలాల మంజూరుకు కచ్చితంగా తన వంతు కృషి ఉంటుందని అన్నారు..

ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల అధ్యక్షుడు ఎస్. కె .సల్మాన్ పాషా, జిల్లా నాయకులు శెట్టి పరశురాం, మహమ్మద్ అజ్మీర్, మండల ఉపాధ్యక్షులు గోగు విజయ్ కుమార్, దేశ వెంకటేశ్వర్లు, మండల ప్రచార కార్యదర్శిలు తీగల ప్రేమ్ సాగర్, ఈక నరేష్, ఉబ్బని శ్రీహరి, గంగిశెట్టి రాకేష్ వర్మ, ముఖ్య సలహాదారులు బొజ్జ సునీల్, యూనియన్ నాయకులు చాపల శ్రీనివాస్, నాంపల్లి రాజ్ కుమార్, తాటి సుదర్శన్, బిక్షపతి, గట్టి సుధాకర్, అశోక్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు…

రేషన్ షాప్ ముందు మోడీ ఫోటో.

రేషన్ షాప్ ముందు మోడీ ఫోటో

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

ప్రతి రేషన్ షాపు ముందు నరేంద్రమోడీ ఫోటో పెట్టాలి — బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబీ దేవ్

కల్వకుర్తి మున్సిపాలిటీ సిల్లారుపల్లిలోని 9వ రేషన్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ పథకం బిజెపి నాయకులు ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈఉగాదికి ప్రారంభించిన 6కేజీల సన్నబియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా 5కేజీలు ఉన్నందున తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా పెట్టాలని అందుకు అనుగుణంగా కలెక్టర్లు ఆర్డీవోలు ఎమ్మార్వోలు రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని లేని యెడల బిజెపి నాయకులు ఉరువాడ తిరిగే ప్రజల ముందుకు మీ కుట్రలను బయట పెడతామని కల్వకుర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు గన్నోజు బాబీదేవ్ హెచ్చరించారు…
ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ వివేకానంద, మాజీ అధ్యక్షులు నరసింహ, గంగాధర చారీ,బీజేవైఎం జిల్లా సెక్రెటరీ నరేష్ చారి, నాయకులు శ్రీకాంత్, పర్వతాలు, శివ, అరవింద్ రెడ్డి, కుమార్, రేషన్ డీలర్ మహమ్మద్ సిరాజుద్దీన్, లబ్ధిదారులు పాల్గొన్నారు

కామరెడ్డి లో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

కామరెడ్డి పల్లి గ్రామంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

సొమ్ము కేంద్రానిది సోకేమో రాష్ట్ర ప్రభుత్వానిదా

బిజెపి మండల అధ్యక్షులు కాసాగాని రాజ్ కుమార్ గౌడ్

పరకాల నేటిధాత్రి

మండలంలోని కామారెడ్డి పల్లి గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం ద్వారా
అందరికీ ఆహారం పౌష్టిక సమాజం భాగంగా ప్రతి పేదవాడికి కడుపు నింపే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పతకంలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పథకంలో 5 కిలోల బియ్యం కేంద్రప్రభుత్వం 1 కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదని అన్నారు.

Modi.

 

కరోనా సమయం నుండి 2028 వరకు కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ప్రతి వ్యక్తికి 5 కిలోలు ఉచితంగా ఇస్తుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక వ్యక్తికి ఒక కిలో ఇస్తూ మొత్తం మేమే ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది అందుకోసమే లబ్ధిదారులకు తెలియజేసే విధంగా రేషన్ షాప్ వద్ద నరేంద్రమోదీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.అలాగే ప్రతి రేషన్ షాప్ డీలర్లు రేషన్ షాప్ ల వద్ద నరేంద్ర మోడీ ఫోటో పెట్టేలా చొరవ తీసుకోవాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిడి మహేందర్ రెడ్డి,62 వ బూత్ అధ్యక్షులు తండ కుమారస్వామి,శెక్తి కేంద్ర ఇంచార్జి ఎదునూరి లింగయ్య, మాజీ సర్పంచ్ చిర్ర చక్ర పాణి, బీజేవైఎం నాయకులు కాసగాని సాయి కుమార్, ప్రమోద్ కుమార్,తడుక సురేష్,వి ఎన్ రెడ్డి,కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్..

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సంగీతం శ్రీనివాస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ
నేడు బిజెపి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆహార భద్రత చట్టంను (ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా)ను
తీసేయడానికి ప్రయత్నించింది కేంద్ర బిజెపి ప్రభుత్వం, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి పన్నును కేంద్ర ప్రభుత్వం అనుభవిస్తుంది. నేడు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన అటువంటి నిధులు కేవలం 100 రూపాయలలో కేవలం 42 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది.అంతేతప్ప వేరే రాష్ట్రాల్లో బీహార్ గాని, ఉత్తరప్రదేశ్ కాని రాష్ట్రాలలో పది రూపాయలకు 8 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం పై వివక్షత చూపుతో చూస్తున్నారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఆహార భద్రత చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పేదలందరికీ ఉచితంగా సరఫరా చేస్తుంది.అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర దేవరాజు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెలుముల తిరుపతిరెడ్డి స్వరూప, సిరిసిల్ల మహిళా పట్టణ అధ్యక్షురాలు కామూరి వనిత నలినీకాంత్, మ్యాన ప్రసాద్, గోలి వెంకటరమణ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ అధ్యక్షులుగా కట్ల మహేష్ ఎన్నిక.

కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ అధ్యక్షులుగా కట్ల మహేష్ ఎన్నిక.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాలమండలం లోని చల్లగరిగే గ్రామంలో
శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ ఆదేశాల మేరకు గురువారం రోజున చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్* అధ్యక్షతన చల్లగరిగే యూత్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది..చల్లగరిగే గ్రామ యూత్ అధ్యక్షులు గా కట్ల మహేష్ ఉపాధ్యక్షులుగా:దూడపాక శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్*గా: సిరిపేల్లి నరేష్ ప్రధాన కార్యదర్శి*గా దూడపక సురేందర్ సహాయ కార్యదర్శిగా పినగాని సురేష్, గొల్లపెల్లి నగేష్ సెక్రటరీగా అల్లె ప్రవీణ్ ప్రచార కార్యదర్శులుగా గువ్వ శ్రీకాంత్.కార్యవర్గ సభ్యులు గా
.గొల్లపెల్లి అనిల్
దూడపాక లక్ష్మణ్
.అల్లె తిరుపతి
దూడపాక రాజు
.వేమునూరి రాకేష్ లను ఎన్నుకున్నారు,
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బండిరాజు మండల యూత్ నాయకులు గోపగాని శివ చిరంజీవి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు సన్న బియ్యం పంపిణి.

పేదలకు సన్న బియ్యం పంపిణి

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

Distribution of fine rice to the poor

బిజనేపల్లి మండలం కేంద్రం, మంగనూర్ గ్రామంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొస్తున్నామన్నారు. అందులో భాగంగా, ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది” అని తెలిపారు. రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. ఈ పథక ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు..

లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా అమలవ్వాలని, బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ పథకం విజయవంతంగా అమలుకావడానికి ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version