కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈనెల 22న హైదరాబాదులోని గన్ పార్క కు ఉద్యమకారులందరూ తరలిరావాలని ఉద్యమ కారుల ఫోరమ్ నాయకులు మందల రవీందర్ రెడ్డి పిలుపినిచ్చారు. ఈ సందర్భంగా మందల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉద్యమకారుని గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన కమిటీ వేయాలి. ప్రతి ఉద్యమకారునికి 250. గజాల స్థలం ఇవ్వాలి. జార్ఖండ్ రాష్ట్రంలో తరహాలో ప్రతి ఉద్యమకారునికి ప్రతి నెల 25 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ప్రతి ఉద్యమకారునికి గుర్తింపు కార్డుతో పాటు. ఉచిత బస్సు రైల్వే సౌకర్యాలు కల్పించాలి. పదివేల కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు నే ఏర్పాటు చేయాలి. డిమాండ్ చేశారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని పిఎసిఎస్ గ్రౌండ్ లో భూపాలపల్లి నియోజకవర్గ ఇందిర మహిళా శక్తి సంబరాలు సెర్ప్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధ్యక్షుతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి సితక్క మాట్లాడుతూ తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ దేశంలోని ఆదర్శంగా నిలిచిందని మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆర్టిసి బస్సులు ఇస్తూ పెట్రోల్ బంకులు ఇస్తూ సోలార్ వంటి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ మహిళా సాధికారత సాధించే దిశగా మహిళలను చైతన్యం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు మహిళలకు జీవిత బీమా కల్పిస్తూ మహిళా సంఘంలో ఉంటూ ఆ సభ్యురాలు మరణిస్తే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీమా సౌకర్యం అందిస్తున్నామని అలాగే 15 సంవత్సరాల అమ్మాయిలను కూడా మహిళా సంఘాలలో చేర్పిస్తున్నామని అన్నారు అలాగే ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తూ ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలకు యూనిఫామ్‌లను కుట్టిచ్చి ఇచ్చే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చామని దీని ద్వారా వాళ్ళు ఆర్థిక అభివృద్ధి సాది స్తున్నారని ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మహిళల కోసం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకె కాక రైతులకు కూడా 2 లక్షల రుణాలు మాఫీ చేసి వారికి పెట్టుబడి సహాయం అందిస్తూ దేశంలోనే రైతు సంక్షేమం కోరిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణిస్తున్నారని మహిళల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సేనని, అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో చిట్యాల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా వెంటనే సీతక్క సానుకూలంగా స్పందించి తప్పకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది , భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న తెగిపోయిన రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని అడగగా వెంటనే హాని ఇవ్వడం జరిగిందని అన్నారు, అనంతరం మహిళలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకు లింకే చెక్కులు, జీవిత బీమా చెక్కులు, టేకుమట్ల చిట్యాల శాయంపేట మండలాలకు ఆర్టీసీ బస్సులను మహిళా సమైక్య లకు మంత్రి సితక్క చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ విజయలక్ష్మి, సర్ప్ డైరెక్టర్ రజిని మరియు డి ఆర్ డి ఎ పి డి బాలకృష్ణ జిల్లా సెర్ప్ అధికారులు, ఎంపీడీవో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, మండల కాంగ్రస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, మధు వంశీ కృష్ణ 6 మండలాల సెర్ప్ అధికారులు ఆరు మండలాల నుంచి వచ్చిన మహిళా సమైక్య సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు మండల జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ప్రస్తుతం జిల్లాలో పండుగ వాతావరణం కనిపిస్తుంది.
ఎట్టకేలకు ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) స్థానాలు ఖరారు కావడంతో ఇక స్థానిక సమరం ఊపదుకోబోతోంది. జిల్లాలో (Nirmal) మొత్తం 18జడ్సీటీసీ స్థానాలు ఉండగా 156 ఎంపీటీసీ స్థానాలకు గానూ మరో ఎంపీటీసీ స్థానం అదనంగా పెరిగింది. దీంతో 157 ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. ఈ స్థానాల సంఖ్య ఖరారు కావడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు పోటీ చేసే ఔత్సాహికులు ఇక రిజర్వేషన్ల ఆధారంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 18 జడ్పీటీసీ స్థానాలుండగా మెజార్టీ స్థానాలు దక్కించుకున్న పార్టీకి జడ్పీ చైర్మన్ పదవి దక్కనుంది.
జిల్లాలో కీలకంగా నిలిచే జడ్పీచైర్మన్ పదవిపై ఆటు అధికార కాంగ్రెస్ పార్టీ (Congress) రెండు నియోజకవర్గాలకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ పార్టీలు దృష్టి సారించాయి. ఈ రెండు పార్టీల్లోని పలువురు సీనియర్ నాయకులు జడ్పి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వీరు మొదట జడ్పీటీసీగా గెలిచేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జడ్పీటీసీ గెలిచిన తర్వాతే చైర్మన్ పదవిని ఏ నేతకు కట్టబెట్టాలనే అంశాన్ని ప్రధాన పార్జీలు నిర్ణయించనున్నాయి. రిజర్వేషన్లు తమకు అనుకూంలంగా రానట్లయితే రాజకీయంగా తమ ఉనికికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని వీరు తమ అనుచరుల వద్ద పేర్కొంటున్నారు.
జిల్లాలోని 18 మండలాలకు గానూ ఎంపీపీ (MPP) పదవులపై దృష్టి సారించిన ప్రధాన పార్టీల నేతలు ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది. ఎంపీటీసీ సభ్యులే ఎంపీపీగా ఎన్నిక కానుండడంతో మొదలు తమ ఎంపీటీసీ నియోజకవర్గంపై పట్టుసాధించుకోవాలని యోచిస్తున్నారు. వీరుకూడా రిజర్వేషన్లు (Reservations) తమకు కూలంగా రావాలని కోరుకుంటున్నారు. దీంతో పాటు జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు పోటీ చేసేవారు కూడా ఇప్పటినుంచే తమ సన్నాహాల్లో నిమగ్నమవుతున్నారు. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరగనుండగా సర్పంచ్ పదవులు మాత్రం పార్టీలకు అతీతంగా జరగనున్నాయి. అయినా ప్రధాన పార్టీలు సర్పంచ్ పదవులకు తమ కార్యకర్తలనే రంగంలోకి దించి పరో క్షంగా తమ అభ్యర్థులను ప్రచారం చేయనున్నాయి.
కీలకం కానున్న జడ్పీటీసీ పదవులు…
జిల్లాలో అత్యంత ప్రాధాన్యతగల పదవిగా చెప్పుకునే జడ్పీచైర్మన్ పీఠంపై ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే సీరియస్ గా దృష్టి కేంద్రీకరించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని తమ ప్రతిష్టను ఇనుమడింపజేసుకోవాలని యోచిస్తోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. నిర్మల్, ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీ నేతృత్వంలో కొనసాగుతున్న కారణంగా ఆ పార్టీ జడ్పీటీసీ ఎన్నికలను సవాలుగా తీసుకోనుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ రావడాన్ని కూడా ఆ పార్టీ ప్రతిష్టగా భావిస్తోంది. ఎలాగైనా 15 జడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని జడ్పీచైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డితో పాటు రామారావు పటేల్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారంటున్నారు. వీరికి తోడుగా స్వత్రంత్ర అభ్యర్థులు సైతం జడ్పీటీసీ పోటీకి ఇప్పటి నుంచే సిద్దమవుతుండడం ఆసక్తిని రేకేత్తిస్తోంది.
జహీరాబాద్. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసేవారిని గుర్తించి పార్టీ అధిష్టానం అందలం ఎక్కిస్తుందని దానికి ఉదాహరణ కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రామలింగ రెడ్డి కి ఆత్మ కమిటీ చైర్మన్ నియామకం అని, పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీ అన్ని రకాలుగా అండగా ఉండి అవకాశాలు ఇస్తుందని, గత మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం కృషి చేసిన పట్లోళ్ల రామలింగ రెడ్డి కి జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇవ్వడంపై కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ షౌకత్ అలీ హర్షం వ్యక్తం చేస్తు పార్టీ అధిష్టనానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షౌకత్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఐక్యంగా ముందుకు వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో, నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం పార్టీ అమలు చెస్తూన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని తెలిపారు.
చర్ల మండలం వీహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు రేగళ్ల సుధాకర్ ఆధ్వర్యంలో ఈనెల 24 న టీఎన్జీవో ఖమ్మం ఫంక్షన్ హాల్ నందు మహా గర్జన సన్నాహక సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సారధ్యంలో వికలాంగుల పెన్షన్ పెంచుటకు వితంతువుల చేయూత 4వేల రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో వికలాంగులు మరియు వితంతువులు భారీ బహిరంగ సదస్సు నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాను వికలాంగులకు నెలసరి 6000 రూపాయలు ఇవ్వాలని వితంతువులకు 4 వేల రూపాయలు ఇవ్వాలని హెచ్ఐవి పేషెంట్లకు ఏఆర్టి పెన్షన్ పెంచాలని వృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్ గత ఎలక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి చర్ల మండలం వికలాంగులు వితంతువులు చేయుత పెన్షన్ దారులు ప్రతి ఒక్కరూ మరియు మండల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ నాయకులు భారీ సంఖ్యలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మచ్చ రాజా వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నం రామ్మూర్తి మండల ప్రధాన కార్యదర్శి పూసం ముత్యాలరావు కార్తీక్ ఇల్లందుల జైరామ్ గుద్దేటి నాగరాజు బోయిల్లా ప్రవీణ్ సురేష్ రెడ్డి సతీష్ సాగర్ సుబ్రహ్మణ్యం శంకరాచారి కమల నానమ్మ తదితరులు పాల్గొన్నారు
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జెయు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, ఎన్ యుజె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు పావుశెట్టి శ్రీనివాస్, నాగపురి నాగరాజ్, ములుగు జిల్లా అధ్యక్షులు చల్లగురుగుల రాజు, ప్రధాన కార్యదర్శి సంఘ రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులు నాగపురి హరినాథ్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, ఉపాధ్యక్షులు కందికొండ గంగరాజు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, జాయింట్ సెక్రెటరీ దాడి బిక్షపతి, జనగాం జిల్లా అధ్యక్షుడు యు. నరేందర్, మహబూబ్ బాద్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ ధీర్, కార్యదర్శి సతీష్ చారి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, కార్యదర్శి దొమ్మాటి రవి, ఉపాధ్యక్షులు బండారి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం ములుగులో జరిగింది. టిఎస్ జెయు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మాట్ల సంపత్, కార్యవర్గ సభ్యులుగా గండ్రాతి విజయాకర్, టిఎస్ జెయు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మందాటి రజిని, ఉపాధ్యక్షురాలుగా పోచంపల్లి రజిత లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా యూనియన్ సభ్యులు చల్లూరు మహేందర్ పెండం బిక్షపతి, ధనుంజయ్, రాము తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని ఆలయాలను సీజీఎఫ్ నిధులతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి రూరల్ మండలం ఆజంనగర్, గొల్లబుద్దారం గ్రామాలల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆజంనగర్ గ్రామంలో రూ.10 లక్షలతో శ్రీ శివ కేశవస్వామి దేవాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్లబుద్దారం రూ.50 లక్షలతో శ్రీ రామాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో అన్ని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు భూపాలపల్లి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం రామాలయంలో ఎమ్మెల్యే మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండలం అధ్యక్షుడు సుంకర రామచంద్రయ్య తాసిల్దార్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
హీరో విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసు.. విషయం ఏంటంటే..
పార్టీ పతాకంలో ఎరుపు, పసుపు, ప్రత్యేక రంగుల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై, అఫిడివిట్ దాఖలు చేయాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసు జారీచేసింది.
చెన్నై: పార్టీ పతాకంలో ఎరుపు, పసుపు, ప్రత్యేక రంగుల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై, అఫిడివిట్ దాఖలు చేయాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్(Vijay)కు మద్రాసు హైకోర్టు నోటీసు జారీచేసింది. తొండై మండల సన్నోర్ ధర్మ పరిపాలనసభ అధ్యక్షుడు పచ్చయప్పన్ మద్రాసు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లో… తొండై మండల సన్నోర్ ధర్మ పరిపాలన సభ తమిళనాడు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విభాగంలో నమోదుచేసి ట్రస్ట్‌గా పనిచేస్తుందన్నారు.
ఈ సభ జెండాను ఎరుపు, పసుపు రంగులతో రూపొందించామన్నారు.నిర్ధిష్ట రంగులు వినియోగించే హక్కు తమ సభకు మాత్రమే ఉందన్నారు. కానీ, నటుడు విజయ్ 2024లో ప్రారంభించిన టీవీకే జెండాలో ఎరుపు, పసుపు రంగులున్నాయని, అందువల్ల టీవీకే జెండాలోని రంగులు తొలగించేలా ఉత్తర్వులు జారీచేయాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ గురువారం విచారించిన హైకోర్టు న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ రామమూర్తి… ట్రేడ్ మార్క్ సర్టిపికెట్ సరుకులకు మాత్రమే వర్తిస్తుంది,
రాజకీయ పార్టీల జెండాలకు ఎలా వర్తిస్తుంది? అని ప్రశ్నించారు. ట్రేడ్ మార్క్ సర్టిఫికెట్ సరుకులకు మాత్రమే కాకుండా సేవలకు వర్తిస్తుందని, స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్ట్‌లకు కూడా ఈ సర్టిఫికేట్ వర్తిస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. అనంతరం న్యాయమూర్తి, ఈ పిటిషన్‌పై టీవీకే అధ్యక్షుడు విజయ్ అఫిడివిట్ దాఖలుచేయాలని ఉత్తర్వులు జారీచేసి, విచారణ వాయిదావేశారు.
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన కర్క బోయిని కుంటయ్యకు వారి కుటుంబ సభ్యులను సిరిసిల్ల బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో కలిసిన బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఈ సందర్భంగా. ఇటీవల పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య పాల్గొన మాజీ ఎంపిటిసి కుంటయ్యకుటుంబానికి ఇచ్చిన హామీ ప్రకారం తన చిన్న కుమార్తె పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి అలాగే పెద్ద కుమార్తె వివాహ పూర్తి బాధ్యతను తమదేనని. కుంటయ్య కుటుంబానికి తెలియజేసిన మాజీ మంత్రి కేటీ రామారావు. ఇట్టి కార్యక్రమంలో. బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు తో పాటు. జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు. టే స్కబ్. చైర్మన్ కొండూరి రవీందర్రావు మాజీ జెడ్పిటిసి అరుణ. పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల పందెం మొదలైంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పార్లమెంట్ స్థానానికి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్రావు, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుర్ర సత్యప్రసన్నరెడ్డి, సీనియర్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడంతో పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అధికారంలో లేకపోవడం, ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చినా ఆటు సంస్థాగత పదవులు గానీ, ఇటు నామినేటెడ్ పదవులు (Nominated Posts) దక్కక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, క్రియాశీల కార్యకర్తలు, గ్రామీణస్థాయి నాయకుల్లో ఇప్పుడు ఉత్సాహం మొదలైంది. పార్టీ ఆధిష్టానవర్గం సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడమే కాకుండా ఉమ్మడి జిల్లాల స్థాయిలో (Karimnagar) ఇన్చార్జీలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించడంతో వారు తమకు అప్పగించిన బాధ్యతల్లో పనిచేయడం ప్రారంభించారు.. ఉమ్మడి జిల్లా సంస్థాగత ఇన్చార్జి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (MLC Addanki Dayakar) ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లాల్లో పర్యటన ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన సమావేశం ఏర్పాటు చేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక జిల్లా ఉపాధ్యక్షున్ని, ప్రతి బ్లాక్ నుంచి ఒక ప్రధాన కార్యదర్శిని, ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శిని తీసుకుంటామని ప్రకటించారు. క్షేత్రస్థాయి నేతలు ఆయా పదవుల క్రీడ కోసం అప్పుడే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా తీవ్రమైన పోటీ నెలకొన్నది.
ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేతలు..
సంస్థాగత ఇన్చార్జి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పా టు చేయడంతో డీసీసీ పదవిని ఆశిస్తున్నవారు అలర్ట్ అయి అందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధానంగా పదవి కోసం ప్రస్తుతం కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పార్లమెంట్ స్థానానికి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్రావు, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుర్ర సత్యప్రసన్నరెడ్డి, సీనియర్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి పోటీ పడుతున్నారు
వీరంతా వారి వారి స్థాయిల్లో ఆటు మంత్రులతో, పార్టీలో కీలక నేతలతో కలిసి తమకు పదవి, లభించేలా చూడాని కోరుతున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి జిల్లాలోనే ఉన్న అద్దంకి దయాకర్‌ను కలిసి తాను ఎన్ఎస్ఈయూఐ నుంచి పార్టీ ప్రస్థానం ప్రారంభించి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరకు వచ్చి అంకితభావంతో పనిచేస్తున్నానని, మార్కెట్ కమిటీ చైర్మన్ గా, మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా గత రెండు దశాబ్దాలుగా సేవలందించానని, తన కష్టాన్ని గుర్తించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. మరి దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?
కార్మిక సంఘాల నాయకులను గనుల పైన నీలదీయండి
కార్మికులకు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం పిలుపు
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
సింగరేణిలో ఎన్నికలు జరిగి 18 నెలలు కాలం గడుస్తున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?అని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు నిలదీశారు. గురువారం నస్పూర్ కాలనీలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం బెల్లంపల్లి రీజినల్ సెక్రెటరీ సమ్ము రాజయ్య ఆధ్వర్యంలో టీఎస్ యుఎస్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ,సింగరేణిలో ఎన్నికలు జరిగి 18 నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఎన్నికలలో గుర్తింపు పొందిన ఏఐటీయూసీ,ప్రాతినిత్య ఐఎన్టియుసి కార్మిక సంఘాలు ఎన్నికలలో పెద్ద పెద్ద మేనిఫెస్టోలలో కార్మిక సమస్య చేర్చి మా సంఘానికి ఓట్లు వేసి గెలిపించండి మీకు ఇస్తున్న హామీలు తూచ తప్పకుండా కంపెనీతో కొట్లాడి పోరాడి సమస్యలు పరిష్కరిస్తామని కార్మికుల ఓట్లు దండుకొని గెలుపొందిన ఏఐటీయూసీ,ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘాల నాయకులు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని, కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పరిష్కరింపబడలేదని గుర్తింపు ప్రాదీనీత్య సంఘాలు కార్మిక హక్కులు సాధించడంలో విఫలం చెందాయని,కేవలం ఈ రెండు సంఘాలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. కార్మికుల హక్కుల కోసం కాదని కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీల అమలకై కంపెనీతో గుర్తింపు ప్రాతీనిద్య సంఘాలు పోరాడాలని గత ఏడు సంవత్సరాల కాలం నుండి సింగరేణిలో మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని,కార్మికులకు 300 గజాల ఇంటి స్థలం పట్టణ ప్రాంతాలలో కేటాయించాలని,శరీరక శ్రమ మీద ఆధార పడి పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని అన్నారు.బొగ్గు గనుల ప్రాంతంలో బొగ్గు ఆదరిత పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సింగరేణిలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. డిపెండెంట్ ఉద్యోగాల ఇన్వల్యూషన్ విషయంలో కొనసాగుతున్న కుంభకోణంపై ధర్యాప్తి జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుల వారసునికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.బొగ్గు తట్ట పనిని కూడా సింగరేణి సంస్థ నిర్వహించాలి.ఎట్టి పరిస్థితులలో ప్రవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించరాదని డిమాండ్ చేశారు.సింగరేణిలో అక్రమంగా తొలగించిన డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గనులను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను ఆపాలి.సింగరేణి పబ్లిక్ రంగ సంస్థల కొనసాగించాలి. కేంద్రం బొగ్గు గనులను బహిరంగంగా వేలం వేసే పద్ధతిని ఆపి తెలంగాణకే సింగరేణి సంస్థలను అప్పజెప్పాలి. 2024-2025 కంపెనీకి వచ్చిన లాభాల నుండి 40 శాతం లాభాలను కార్మికులకు పంచాలి.సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కుల కోసం ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ నీరేటి రాజన్న,గోదావరిఖని రీజినల్ కార్యదర్శి ఎం ఎఫ్ బేగు, పి.చంద్రశేఖర్,గుంపుల సారయ్య తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. అరు దశాబ్దాలుగా జరిగిన జలదోపిడి ఒక ఎత్తు అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్‌గా మారి తెలంగాణను ఢిల్లీ లో తాకట్టు పెట్టారని.బనకచర్ల గురించి చర్చ అయితే పోను అన్న రేవంత్ రెడ్డి ఎలా మీటింగ్‌కి పోయాడు. చంద్రబాబు కి తొత్తు రేవంత్ రెడ్డి.అదిత్యనాథ్ సాగునిటి సపహాదారుడుగా పెట్టుకోవడమే పెద్ద తప్పు. అలాంటిది ఎలా పెట్టుకున్నాడని ప్రశ్నించాడు.కాళేశ్వరం, సితారామ ప్రాజెక్టు లకి అనుమతులు ఇవ్వోద్దని అడ్డుకున్నదే చంద్రబాబు నాయుడు.తెలంగాణ హక్కులని కాపాడడానికి కెసిఅర్ ఉన్నాడనీ కేటీఆర్ తెలిపారు. ఒకపక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయినా మరోపక్క చంద్రబాబు కోవర్టులా పాలన జరుగుతుందని చెప్పాడు.బనకచర్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చకపోతే మరొసారి ఉద్యమానికి బిఅర్ఎస్ సిద్దం అవుతుంది తెలిపారు. నేడు ఆంధ్ర పాలకుల కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు కనుసైగలలో నడుస్తుంది.చిలుక రేవంత్ రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబువి. ఇచ్చంపల్లి ప్రాజెక్టు గతంలో ఉన్న ప్రాజెక్టే. గోదావరి జలాల విషయం లో తెలంగాణ కి ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండానే బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారు.సి.యం రేవంత్ కి ఏ బేసన్ లో ఏ ప్రాజెక్టు ఉందన్న విషయం తెలియదు అని మీడియా ముఖంగా తెలియజేశారు. రేవంత్ రెడ్డి కి తెలిసింది రియల్ ఎస్టేట్ వ్యాపారమే. కెసిఆర్ రాయలసీమ,ఆంధ్రా కూడా బాగుండాలి మావాట తెలాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించాలని చుస్తున్నాడు అని తెలిపారు..
వనపర్తి రెండో వార్డ్ లో కార్యకర్తలతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్త లతో కలిసి 2వ వార్డులో వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి పర్యటించి రెండో వార్డు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు . ఈ సందర్భంగా 2వ వార్డు ప్రజలు కొందరు ఇందిరమ్మ ఇల్లు మంజూర అయిందని అన్నదమ్ములు ఉన్నారని ఇల్లు ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం సరి పోవడం లేదని ప్రభుత్వ ఇల్లు మంజూరైన వారు మంజూరు అయినవారు తన తన దృష్టికి తెచ్చారని విషయం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు . కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వనపర్తి పట్టణ ప్రజలను వార్డుల్లో పలకరించగా సన్న బియ్యం కొన్ని సిసి రోడ్లు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పరీక్షలు వ్రాసి అర్హులు అయితే ప్రవేటు ఉద్యోగాలు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీనవర్గాలకు స్లం ఏరియాలకు పేరు ఉన్నదని అభివృద్ధి విషయంలో ముందంజలో ఉంటుందని ఎమ్మెల్యే మేగారెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ కౌన్సిల ర్ లుగా పోటీ చేసే అభ్యర్థులను గెలిపించి చైర్మన్ గా ఎన్నుకొవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వనపర్తి అభివృద్ధి చేసుకుందామని అన్నారు ఇంకా రెండో వార్డులో కొంతమంది ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మించుకోవడానికి ఆర్థిక స్తోమత స్థలం లేదని మాకు డబుల్ బెడ్ రూములు కేటాయించాలని నిరుపేదలు అడిగారని ఈ విషయం అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్తు ఇనుప స్తంభాల గురించి ఎమ్మెల్యే దృష్టి కి తెచ్చారుఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ కాంగ్రెస్ నేతలు తైలం శేఖర్ ప్రసాద్ రహీం మీడియా సెల్ కోఆర్డినేటర్ డి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు ఉన్నారు
నాగర్ కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి వనమహోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మన ప్రియతమ నాయకుడు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కల్వకుర్తి రోడ్డులో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పునాదులు వేశారు. అంతేకాకుండా, మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం సమీపంలో నూతనంగా మంజూరైన డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అభివృద్ధి పథంలో మరో అడుగు వేసారు.పర్యావరణ పరిరక్షణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోన్న ప్రజాప్రతినిధికి అభినందనలు.ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ రమణ రావు , మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ జంగయ్య ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ , మాజీ ఎంపీపీ బండా పర్వతాలు ,తెల్కపల్లి మండల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల మండలంలో మహిళా సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించిన చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి* ఈనెల 18వ తారీకున మహిళా సదస్సు కార్యక్రమానికి పంచాయతీరాజ్ మహిళా ,శిశు ,సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విచ్చేస్తున్న సందర్భంగా సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను ముమ్మరం పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిళా సదస్సు చిట్యాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నాం జిల్లాలోని మహిళలందరూ విచ్చేసి సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన అందులో భాగంగానే శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పతకాలు , మహిళల సాధికారిక అనేక అంశాలపై ప్రసంగిస్తారు కావున వివిధ మండలాల గ్రామాల్లోని మహిళలు విధిగా జిల్లాలోని ప్రతి ఒక్క మహిళ యొక్క ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి డి డిపిఎంలు ఎంపీడీవో జయశ్రీ ఎంపీ ఓ రామకృష్ణ జిల్లా అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , కాంగ్రెస్ నాయకులు చిలుముల రాజమౌళి బుర్ర శ్రీను బుర్ర మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై కాశీనాథ్ తెలిపారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి యువత మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని జహీరాబాద్ రూరల్ ఎస్సై కాశీనాథ్ అన్నారు. రంజోల్ గ్రామంలో యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ సహకారంతో రంజోల్ వాకింగ్ వారియర్స్ పేరుతో 25 మంది యువకులకు వాకింగ్ షూస్ తో పాటు టీ షర్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు _ మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేందుకు టీ షర్ట్లు షూస్ పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. మత్తు పదార్థ వినియోగం సరదాగా మొదలై వ్యసనంలా మారి చివరకు జీవితాన్ని నాశనానికి దారితీస్తుందన్నారు. మత్తు పదార్థాలు సేవించడం ఆరోగ్యానికి హానికరమని, వినియోగించే వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
SS Kashinath
ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉండేందుకువాకింగ్ తో పాటు వ్యాయామం చేయడం అలవర్చుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి టీషర్టులతో పాటు షూస్ అందించడం జరుగుతుందని తెలిపారు.
పరకాల నేటిధాత్రి 18 జులై శుక్రవారంరోజున పరకాల పట్టణంలో స్థానిక పద్మశాలి భవన్ లో బిఆర్ఎస్ మండల మరియు గ్రామస్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని,ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిధులుగా హాజరువ్వానున్నారని మాజీ వైస్ ఎంపీపి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశానికి పట్టణ మరియు మండల,గ్రామ పార్టీ,మరియు అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు,మాజీ జెడ్పిటీసి,ఎంపిటిసి,సర్పంచ్ లు,కోఅప్షన్ సభ్యులు,సోసైటీ ఛైర్మెన్లు,కమిటీ సభ్యులు,యూత్ విభాగం,పార్టీ శ్రేణులు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు.
గుండె సమస్యతో బాధపడుతున్న నిరుపేదకు కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం
రాయికల్, జూలై 16, నేటి ధాత్రి.
మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన సామల్ల లక్ష్మీనారాయణ గుండె సమస్యతో బాధపడుతూ నిరుపేదరికంతో ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న యూత్ కాంగ్రెస్ సేవా సమితి, ఇటిక్యాల వారు చలించిపోయారు. మానవతా దృక్పథంతో స్పందించి, లక్ష్మీనారాయణ కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు
ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పదివేల రూపాయల సహాయం
మంగపేట పీఏసీఎస్ చైర్మెన్ తోట రమేష్ 5000/-
ములుగు జిల్లా యువజన విభాగం యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ 5000/-
బీఆర్ఎస్ జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి రెండువేల రూపాయలు చొప్పున బాలిక తండ్రి కి అందజేత
మంగపేట నేటి ధాత్రి
మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామానికి చెందిన మాటూరి కోటేశ్వరరావు కూతురు వర్షిత (12) అనుకోకుండా వేడి నీళ్లు పడటం తో శరీరం అంతా కాలిపోయింది.ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది.వైద్యానికి సుమారుగా లక్ష రూపాయలు దాకా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పగా, డబ్బుల కొరకు తీవ్ర ఇబ్బంది పడుతున్న కోటేశ్వర్రావు బాధ ను స్థానిక బీఆర్ఎస్ నాయుకులు ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారిని,పీఏసీఎస్ చైర్మెన్ తోట రమేష్ ను ,ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ ,బీఆర్ఎస్ జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి వారికి తెలియజేయగా వారు తక్షణమే స్పందించి ఇరవై రెండు వేల రూపాయలను బాలిక తండ్రికి స్థానిక బీఆర్ఎస్ నాయకుల ద్వారా అందజేశారు .అడగగానే స్పందించి సాయం అందజేసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు,తోట రమేశ్ కు , బాడిశ నాగ రమేష్ ,కొమరం ధనలక్ష్మి లకు బాలిక కుటుంబ సభ్యులు,స్థానిక బి ఆర్ ఎస్ నాయుకులు,గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.అదేవిధంగా దాతలు బాలిక వైద్యానికి తమ వంతుగా సాయం అందజేయాలని స్థానికులు కోరారు. కార్యక్రమం లో మునిగెల నరేష్ , గుండారపు పూర్ణయ్య, బట్ట శ్రీను , బట్ట రవీందర్, గుండారపు రమేష్, గుంటుపల్లి రవి, బట్ట ధర్మావతి, కన్నమ్మ, మాణిక్యం బట్ట నర్సింహా రావు, పొనగంటి గోపయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యుల నీ సన్మానించిన జ్యోతి పండాల్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జ్యోతి పండాల్ తన నివాసంలో ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యులని సన్మానించడం జరిగింది. 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేసి ఏ బి సి డి ఎస్సీ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ గారికి అండగా ఉండి వారికి సహాయం అందించి, అలాగే మొన్న మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకను జరుపుకున్న సందర్భంగా పార్టీలకి అతీతంగా అందరి నాయకులను పిలిచి సన్మానించి వారి మంచి మనసుని చాటుకున్నారు, వారి మంచి మనసుని అభినందిస్తూ మన జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులని మరియు ఇన్చార్జిలందరినీ కూడా సన్మానించడం జరిగింది. అలాగే మొన్న జరిగిన తీన్మార్ మల్లన్న బీసీ మీటింగ్ కి చాలా కృషి చేసి ఆ మీటింగ్‌ని చాలా విజయవంతం చేసినందుకు గాను తీన్మార్ మల్లన్న టీం సభ్యులకి కూడా సన్మానం జరిగింది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఒక చిన్న గ్రామంలో ఒక్క మీటింగ్ తో రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి మన జహీరాబాద్ పేరుని ఎక్కడికో తీసుకెళ్లిన పవర్ ఫుల్ టీం కి జ్యోతి పండాల్ అభినందించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యోతి పండాల్, తీన్మార్ మల్లన్న టీం జహీరాబాద్ ఇన్చార్జి నరసింహ, శ్రీకాంత్, హనుమంతు, రాకేష్, ఉల్లాస్ మాదిగ జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్, జయరాజ్ మాదిగ ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, నిర్మల్ కుమార్ మాదిగ మొగుడంపల్లి ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్, టింకు మాదిగ జహీరాబాద్ మండల ఇన్చార్జ్ ఎమ్మార్పీఎస్, సుకుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ కార్యదర్శి జహీరాబాద్, జీవన్ మాదిగ ఎమ్మార్పీఎస్, రాఘవులు, సాయికుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.