చెన్నాపూర్ లో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించిన.

చెన్నాపూర్ లో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

shine junior college

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలం చెన్నాపూర్ గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ ఎంపీ కడియం. కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సిఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు

డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌కు ఘన స్వాగతం.

డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌కు ఘన స్వాగతం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

 

 

ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవంలో భాగంగా అమెరికాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా నుండి తిరిగి స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా, సంగారెడ్డి జిల్లా ఝ రా సంగం మండలం మెదపల్లి బీ ఆర్ఎస్ సీనియర్ నేత పరమేశ్వర్ పాటిల్ ఝరాసంగం మండల బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు ఎస్.కె. షోయల్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీపీ విజయకుమార్, ఝరాసంగం మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మాణికప్రభు పాటిల్, యువ నాయకులు నవీన్ పాటిల్ శివకుమార్, సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ యువజన సంయుక్త కార్యదర్శి పోలీస్ ప్రవీణ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం.

రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

shine junior college

జైపూర్ మండలం ఇందారం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది.రైతు వేదికల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ముఖ్య సూచనలు సలహాలు చేశారు.ఈ సందర్భంగా జైపూర్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 75 వేల కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మన రైతులు సుభిక్షంగా ఉండేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను ఇప్పటికి అమలు చేసి వివిధ రాష్ట్రాలకు ఒకదశ,దిశ చూపించారని అన్నారు. అదేవిధంగా రుణమాఫీ,సన్న ధాన్యానికి బోనస్,అన్ని రకాల పంటలకు మద్దతు ధర కొనుగోలు,అన్ని పంటలకు రాయితీపై సూక్ష్మ,సేంద్య పరికరాల సరఫరా వంటివి అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీవో శ్రీనివాసరావు,ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఏఈఓ మాళవిక,పంచాయతీ కార్యదర్శులు,ప్రజా ప్రతినిధులు,రైతులు ప్రజలు పాల్గొన్నారు.

మహాత్ములు లోక కల్యాణం కోసం పుడతారు.

మహాత్ములు లోక కల్యాణం కోసం పుడతారు

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

shine junior college

 

మహాత్ములు లోక కల్యాణం కోసమే పుడతారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ ఆది జగద్గురు పంచాచార్య యుగమానోత్సవము మరియు శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమం భూత్పూర్ రోడ్ లోని వాసవి కళ్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

కాశీ, ఉజ్జయిని ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

MLA Yenna Srinivas Reddy

 

 

పట్టణంలోని ప్రజలు పీఠాధిపతులను దర్శించుకొని వారు ఇచ్చే సందేశాలను వారి ఆశీస్సులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జె.పి.ఎన్ సి.చైర్మన్ కె.యస్. రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలకు ఆకారం.

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలకు ఆకారం

ఎమ్మెల్యే నాయినిరాజేందర్ రెడ్డి

హనుమకొండ, నేటిధాత్రి:

 

shine junior college

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ లోని లష్కర్ సింగారంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి .అర్హులైన లబ్దిదారుల ఇళ్లకు పూజ కార్యక్రమం చేసి,పనులను ప్రారంభించారు.నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నాయిని.ఎన్నో ఏళ్లుగా అద్దె గృహాల్లో ఉంటున్న మాకు సొంత ఇల్లు సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి,ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపి తమ కృతజ్ఞత చాటుకోన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పట్టించుకోని పేదలకు న్యాయం చేయడం మా లక్ష్యమని,ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కల సాకారం కావాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం అని అన్నారు.గతంలో ఎన్నో వాగ్దానాలు చేశారుగానీ, అమలు చేయలేదు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజమైన సంక్షేమ పాలన అమలవుతోంది అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాల అమలుకు ముందుకు సాగుతోందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి నాణ్యమైన, పక్కా ఇళ్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇళ్లను మంజూరు చేసి ప్రతి అర్హుడికి ఇళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.53 వ డివిజన్ పేదలు అధికంగా ఉన్నారని కేటించిన వాటికంటే అధిక ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశారని తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాబాయ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు అజీజ్ ,రహీమున్నీసా నాయకులు ఎర్ర మహేందర్,మట్టెడ అనిల్ కుమార్,శ్యామ్,రేణికుంట ప్రవీణ్,సత్తార్,కాసిం,ఎర్ర చందు ,రజిత్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

బిసిలను దళితులను మోసం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం.

బిసిలను దళితులను మోసం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం

దళితులకు దళిత బందు 12 లక్షల రూపాయలు ఇవ్వాలి

బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు

నేటిధాత్రి చర్ల

 

 

shine junior college

 

బిసిలను మోసం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు విమర్శించారు బిసిలకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో 80 శాతం బిసిలు ఉన్నారు వారికి నష్టం చేస్తే బిసిలు చూస్తు ఊరుకోరని ఏన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పుతారని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయడం లేదు 6 గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పధకం అమలు చేయడం లేదు తులం బంగారం లేదు ఆసరా పెన్షన్లు 4 వేలు లేదు వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలి ప్రతీ మహిళకు 2500 లేదు రైతు భీమా లేదు 500 లకు గ్యాస్ లేదు రాజీవ్ వికాస అనేక వేల మంది నిరుద్యోగులను మోసం చేసారు దళితబందు 12 లక్షలు లేవు జూన్ 2 న నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు అందిస్తామని చెప్పారు దాని విషయం మర్చిపోయారు నిరుద్యోగులు బ్యాంక్ ల ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఏది ఏమైనా బిసి రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేని ఎడల బిసిలు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పరకాల నేటిధాత్రి

 

 

 

Shine Junior Colleges

మున్సిపాలిటీ పరిధిలోని రెండోవార్డ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు బొచ్చు అనూష దశ్వంత్ రెండో వార్డులో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టి ఇల్లు నిర్మాణం కోసం ముగ్గు పోసి ప్రారంభించారు.గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని గత ప్రభుత్వం కేవలం అసమర్థ పాలన కొనసాగించినదని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకునే రీతిలో నడిపిస్తున్నదని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కట్టుకుని బాగుపడాలని అర్హులైన వారికి ఇండ్లు l మంజురు చేసి వారిని ఆదుకునే రీతిలో ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పరకాల మండల ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మడికొండ కవిత చంగల్ రావు, మడికొండ లలిత,బొచ్చు అనిల్,కాంగ్రెస్ నాయకులు బొచ్చు సంపత్,ఏం డి,హాజీ చుక్క శాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

బట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలి.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలి

ఇస్లావత్ దేవన్ కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

Shine Junior Colleges

 

మంగళవారం రోజున ఉదయం 10:00 గంటలకు భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నేతృత్వంలో 8 ఇంక్లైన్ రోడ్ లో నూతనంగా చేపట్టనున్న సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, ఐ ఎన్ టి యు సి. నాయకులు మహిళా కాంగ్రెస్ ఆయా విభాగాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయగలరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

Shine Junior Colleges

భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, పద్దెనిమిది మంది లబ్దిదారులకు ఉత్తర్వుల మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అంతకుముందు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుడైన పాలకుర్తి తిరుపతి – స్వప్న ఇంటి నిర్మాణ పనులను ఎమ్మెల్యే టెంకాయ కొట్టి, మట్టి తీసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుపతి దంపతులకు ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు

తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్.

కేటీఆర్ గారికి మద్దతుగా హైదరాబాద్ తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

◆ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు. డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,బి ఆర్ ఎస్ నాయకులు

◆ రాష్ట్ర మాజి మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా కేసులో CBI ఎదుట హాజరవుతున్న సందర్భంగా వారికి మద్దతుగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కి చేరుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు జహీరాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప‌రిపాల‌న‌లో విఫ‌ల‌మైన కాంగ్రెస్ పార్టీ కావాల‌నే ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను త‌ప్పుడు కేసుల్లో ఇరికించి విచార‌ణ పేరుతో ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఫార్ములా – ఈ రేసు కేసులో మ‌ళ్లీ కేటీఆర్‌ గారికి ACB నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండించారు.

ఎమ్మెల్యే గారితో పాటు గా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,నాల్కల్ మండల మాజీ జడ్పిటిసి స్వప్న భాస్కర్,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్,మాజీ పట్టణ అధ్యక్షులు మోహియుద్దీన్,మాజీ ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,మొగుడంపల్లి మండల పార్టీ జనరల్ సెక్రెటరీ గోపాల్,జహీరాబాద్ మండల బీసీల అధ్యక్షులు అమిత్ కుమార్,మాజీ సర్పంచ్ లు బస్వరజ్,ప్రభు పటేల్ నాయకులు ప్రవీణ్ కుమార్,అశోక్ పాటిల్,రాథోడ్ భీమ్రావు నాయక్, వసీం తదితరులు.

నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో.

నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం మాజి ఎంపీటీసీ రజినీ సంతోష్ మల్లిపాటెల్ గార్ల ఆహ్వానం మేరకు కక్కర్వాడ గ్రామంలో నిర్వహించిన నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ ,పూజ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, ఝరసంఘం పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా,మాజి సర్పంచ్ భోజి రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణలో హాట్ హాట్‌గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్.

తెలంగాణలో హాట్ హాట్‌గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్…

తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది.

హనుమకొండ: తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయాలు భగ్గుమన్నాయి. మాటల తూటాలతో రెండు పార్టీల్లోని నేతలు రెచ్చిపోయారు. భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపణలు చేశారు. వినయ్ భాస్కర్ వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి (Naini Rajender Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెండర్లు ప్రకటించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయని వినయ్ భాస్కర్‌ అన్నారు. పూడికతీత పనుల్లో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని ఆయన చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని చర్చకు రమ్మను తాను సిద్ధమని నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. గతంలో కుడాకు ఒక రూపాయి అయినా నిధులు తెచ్చినట్టు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని నాయిని రాజేందర్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.

బీఆర్ఎస్ నేతలు సామాజిక ఉగ్రవాదులు వీళ్లను ఎన్‌కౌంటర్ చేయాలని నాయిని రాజేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల పరిస్థితి దొంగే దొంగా అన్నట్లుగా ఉందని విమర్శించారు. వరంగల్‌లో కుడా నిధులు దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్‌పై కేసు పెడతామని హెచ్చరించారు. అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆధ్వర్యంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ చీడ పురుగులలాంటి వాళ్లు… వీళ్లను వెంటనే జైళ్లో పెట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగితే ఇక్కడి బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌కి పారిపోతారని నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు.

అభివృద్ధి ప్రదాతలకు క్షీరాభిషేకం.

అభివృద్ధి ప్రదాతలకు క్షీరాభిషేకం

కేసముద్రం మున్సిపాలిటీ అభివృద్ధికి 100 కోట్లు నిధులు మంజూరు చేయడం అభినందనీయం

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాతల చిత్రపటాలకు పాలాభిషేకం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో అమీనాపురం లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా కేసముద్రం మునిసిపాలిటీని ఏర్పాటు చేయడమే కాకుండా మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలలో అంతర్గత రోడ్లు డ్రైనేజీలు వివిధ అభివృద్ధి పనుల క్రింద 100 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినందుకు అభివృద్ధి ప్రధాతలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి, మహబూబాబాద్.

శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ కు పాలాభిషేకం చేసి కేసముద్రం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

అదేవిధంగా గతంలో పాలిటెక్నిక్ కాలేజీని, డిగ్రీ కాలేజీని, అగ్నిమాపక కేంద్రాన్ని, బైపాస్ రోడ్డును, అంబేద్కర్ నుండి కోరుకొండ పెళ్లి క్రాస్ వరకు ఆర్ అండ్ బి రోడ్డును , 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ నియోజకవర్గానికి అదనంగా 1000 ఇండ్లుమంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరగా మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

కే సముద్రం మున్సిపాలిటీని అభివృద్ధి పదములో నడిపించే అభివృద్ధి ప్రదాతలకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, జన్ను కట్టయ్య, సామ సుధాకర్ రెడ్డి, మందుల కృష్ణమూర్తి, వేల్పుగొండ ఏలియా, కుడారి నాగేంద్రబాబు, లాకావత్ బాలు నాయక్, భోగం రమాదేవి, కుక్క ముడి యాకయ్య పాల్గొన్నారు.

మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.

మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

అవినీతిని రూపుమాపి అభివృద్ధి చేసి చూపిస్తా

ప్రతి గ్రామానికి 50 లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

జైపూర్ నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం,రసూల్ పల్లి,జైపూర్ వద్ద శనివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి నియోజికవర్గానికి విచ్చేసిన మంత్రి వివేక్ వెంకట్ స్వామికి కాంగ్రెస్ నాయకులు మేళ తాళాలతో,బాణసంచా కాల్చి మంత్రికి ఘన స్వాగతం పలికి పూలమాలలతో,శాలువాలతో సత్కరించారు.జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికిన సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన పేదవారికి అందే విధంగా కృషి చేస్తానని అన్నారు.అలాగే పేదవారికి సన్న బియ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలియజేశారు.ప్రజా పాలనలో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అక్రమ అరెస్టులకు తావు లేకుండా చూసే బాధ్యత తనదే అని అన్నారు. పేదవారికి ఉచిత విద్య అందించాలనే కృషితో సోమనపల్లి గ్రామంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేలా కృషి చేస్తానని అన్నారు.అలాగే చెన్నూరు నియోజకవర్గం లో అక్రమంగా ఇసుక రవాణా,మట్టి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.నేను ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఎన్నుకున్న నాయకుడిని నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యోగక్షేమాలు చూసుకుంటూ వారికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన పథకాలను అందే విధంగా నా సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

వ్యక్తిగత గొడవలకు పార్టీకి సంబంధం లేదు.

వ్యక్తిగత గొడవలకు పార్టీకి సంబంధం లేదు

జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్

జమ్మికుంట:నేటిధాత్రి

 

 

 

హుజరాబాద్ నియోజకవర్గం లో గత కొద్ది రోజులుగా ఇల్లంతకుంట మండలంలో ఇటు జమ్మికుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు దాడులు చేసుకుంటారని కొంతమంది గిట్టని వాళ్లు పార్టీలో విభేదాలు ఉన్నాయి వాళ్లకు వాళ్లకే పడతలేదు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు అని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది ప్రణవ్ మద్దతుదారులని బల్మూరు వెంకట్ వర్గమని బద్నాం చేస్తున్నారు అలాగే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి అన్ని కార్యక్రమాలు నడిపించినటువంటి పత్తి కృష్ణారెడ్డి నీ ఇందులోకి లాగుతున్నారు హుజురాబాద్ నియోజకవర్గం లో మాది ఒకటే పార్టీ ఒకరే లీడర్ ఆది మా ప్రణవ్ బాబే బల్మూర్ వెంకట్ మా పార్టీ ఎమ్మెల్సీ మేమందరం ఐక్యతతో పని చేస్తాం మా పార్టీలో ఎలాంటి చీలికలు లేవు గొడవలు వ్యక్తిగతంగా పెట్టుకున్నవి పార్టీకి సంబంధం లేదని ఈ పత్రిక ముఖంగా తెలియజేయడం జరుగుతుంది .

పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు.

పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు

అద్దె ఇంట్లో ఉంటున్న వారికి నిరాశే

ఇందిరమ్మ కమిటీల మాయాజాలం

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

శాయంపేట మండలం పెద్ద కోడెపాక గ్రామానికి చెందిన రాజోలు నరహరిఅనే వ్యక్తికి సొంత ఇల్లు లేదు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఇందిర మ్మ ఇళ్లలో అర్హునిగా తన పేరు ప్రకటించారు అయితే మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని గతంలో కలిసిన క్రమంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశానని సాకును చూపి మంజూరైన ఇందిరమ్మ ఇల్లును ఇందిరమ్మ కమిటీ సభ్యులు తొలగించారు. అడిగితే కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమకు అన్యాయం చేశారని బాధితుడు వేడుకొన్నాడు.గత పది సంవత్సరాలుగా కిరాయి ఇంట్లో అద్దెతో జీవనం గడుపు తున్నానని కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎమ్మెల్యే చొరవతో ఇల్లు వస్తుందని ఆశపడిన తమకు స్థానిక ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీరని అన్యాయం చేశారని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి విచారణ జరిపి నాలాంటి వారికి అండగా నిలవాలని ప్రభుత్వం పై నమ్మకం ఉంచాలని కోరడమైనది

కాంగ్రెస్ పై కపట ప్రేమతో పుట్ట కొత్త కుట్ర.

కాంగ్రెస్ పై కపట ప్రేమతో పుట్ట కొత్త కుట్ర.

బానిసలు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ తోనే ఈ స్థాయి.

ఉనికి కోసమే పుట్ట మధుకర్ కొత్త నాటకం, తాను అధికారంలో ఉన్నప్పుడు భార్యకు చైర్మన్ పదవి.

తన కొడుకు పబ్లిక్ సిటీ చెల్లలేదు, శీను బాబు పై అనుచిత వ్యాఖ్యలు.

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పై విరుచుకుపడ్డ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోటి రాజబాబు.

మహాదేవపూర్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై కపట ప్రేమ చూపెట్టి కొత్త కుట్రను తెరలిపి తందుకు పుట్ట మధుకర్ ప్రయత్నిస్తున్నాడని, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. మంథని కేంద్రంగా పుట్ట మధుకర్ చేసిన కామెంట్లపై కోట రాజబాబు తీవ్రంగా ఖండిస్తూ పత్రిక ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బానిసలు కాదని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు గుర్తింపు విలువలు ఇస్తూ పదవులను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారిదని, పుట్ట మధుకర్ గుర్తుంచుకోవాలని అన్నారు, మంథని నియోజకవర్గంలో పుట్ట మధుకర్ ప్రజల్లో ఉనికిని కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై కపట ప్రేమ చూపెడుతూ కొత్త నాటకానికి తీరలేపడం జరిగిందని అన్నారు. నాకు కాంగ్రెస్ పార్టీ 84 లోనే సమితి కోఆప్షన్ సభ్యుడిగా, జిల్లా కార్యవర్గ సభ్యునిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ మహదేవ్పూర్ నుండి రెండు మార్లు సర్పంచ్ గా అవకాశం కల్పించడం జరిగిందని అంతేకాకుండా కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ పదవితో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని, ఒకటి రెండు కాదు అనేక అత్యున్నత స్థానాలు కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ శ్రీపదరావు తో పాటు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తనకు అందించడం జరిగిందని రాజబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని అసత్యపు అర్థం లేని మాటలతో ఒక కొత్త నాటకాన్ని తెరలిపి ప్రయత్నం నియోజకవర్గ ప్రజల వద్ద చల్లదన్న విషయం పుట్ట మధుకర్ గుర్తుంచుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం గౌరవం ఇచ్చిందన్న విషయం పుట్ట మధుకర్ గుర్తుంచుకోవాలని, సాధారణ వ్యక్తిగా ఉన్న పుట్ట మధుకర్ కు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ జడ్పిటిసి స్థానాలు కల్పించిన విషయం మర్చిపోయి కార్యకర్తలను బానిసగా అభివర్ణించడం సిగ్గుచేటని అన్నారు. పుట్ట మధుకర్ ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు వారి సతీమణి శైలజాకు మంథని మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పించడం జరిగిందని, కానీ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇక్కడ న్యాయం చేశారు అని రాజబాబు ప్రశ్నించారు. అలాగే పుట్ట మధుకర్ కొడుకు నియోజకవర్గంలో తిరిగినప్పటికీ కూడా పుట్ట మధుకర్ కు ఎమ్మెల్యే ఎన్నికల్లో కొడుకు పబ్లిసిటీ లో ఫీల్ కావడం జరిగిందని, కోపంతో మంత్రి సోదరు శీను బాబు పై ఆరోపణలు చేస్తున్నాడని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో శీను బాబు కు ప్రధాన కార్యదర్శి నియమించడం పార్టీ అంతర్గత విషయం అని కొడుకు పబ్లిసిటీ ఫెయిల్ అయితే సంవత్సరాల కాలంగా పెద్దపల్లి మంథని నియోజక వర్గాల్లో పార్టీ కోసం ఒక కార్యకర్తల పనిచేస్తున్న శీను బాబుకు గౌరవం దక్కిందన్న విషయం పుట్ట మధుకర్ జీర్ణించుకోలేకపోతున్నాడని కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయంపై మాట్లాడే నైతిక హక్కు పుట్ట మధుకర్ కు లేదన్న విషయం గుర్తుంచుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు.

7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.

కల్వకుర్తి మున్సిపాలిటీ పట్టణంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

శనివారం కలకుర్తి మున్సిపాలిటీలోని 7వ వార్డులో హనుమాన్ నగర్, గాజులవాడ, అంబేద్కర్ నగర్, కాలనీలలో కల్వకుర్తి నియోజకవర్గo ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఈరోజు ఉదయం బృంగి ఆనంద్ కుమార్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమo నిర్వహించారు7వ వార్డులో 17మంది నిరుపేద కుటుంబాలకు ఇండ్లు మంజూరు కావడం జరిగింది. అందులో పది మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేసి ముగ్గు పోశారు.ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ శ్రీలత గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు జ్యోతి, మాజీ కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు మాజీ కౌన్సిలర్స్ లక్ష్మీ చిన్నరామిరెడ్డి, నేరటి చిన్న, బాలునాయక్, బృంగి ప్రవీణ్, వర్కాల భాస్కర్ రెడ్డి, మబ్బు సాయిలు, చంద్రకాంత్ రెడ్డి, జమ్ముల శ్రీకాంత్, రావుల శ్రీనివాసులు, రేష్మా బేగం, ఝాన్సీ, జ్యోతి, గంగావతి, రాహుల్, వర్షపాకల శేఖర్, సైదులు యాదవ్, ఆంజనేయులు, కార్తీక్, తరుణ్, పరుశురాములు, షమీం, రియాజ్ ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం:-

పొన్నం బిక్షపతి గౌడ్ జయశంకర్ భూపాలపల్లి బిఎస్పి అధ్యక్షులు:-

టేకుమట్ల, నేటిధాత్రి:-

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శనివారం నాడు టేకుమట్ల మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పేరుతో అధికార పార్టీ నాయకులను అందలం ఎక్కిస్తూ వారు చెప్పిన వారికే ఇండ్లను మంజూరు చేస్తూ, గ్రామంలో లేని వారికి స్థిరమైన గృహాలు ఉన్నవారికి కూడా ఇండ్లను మంజూరు చేస్తున్నారని అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ నిజమైన నిరుపేదలను ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా గుర్తించకుండా చేస్తున్న అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులతో కుమ్మక్కై ఇట్టి దందా నడిపిస్తున్నారని అన్నారు. తక్షణమే ఇట్టి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని లేని ఎడల పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవోలు కలెక్టరేట్ ముందు ఇందిరమ్మ ఇండ్లకు అర్హులయ్యే పేదలతో ధర్నా రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ మండల తదితర నాయకులు పాల్గొన్నారు

ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

కల్వకుర్తి మండలంలోని కుర్మిద్ద తండా గ్రామంలో శనివారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లని పంపిణీశారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు హనుమంత్ నాయక్,రాము నాయక్, లక్ష్మణ్ నాయక్, పులియ నాయక్, సేవ్య నాయక్, శక్రు నాయక్, కమలమ్మ, శాంతి, సరోజా, శోభా,ఆశ వర్కర్లు,గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version