వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
◆:- బిఆర్ఎస్ యువ నాయకులు షేక్ సోహెల్ డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ బిఆర్ఎస్ యువ నాయకులు షేక్ సోహెల్ డిమాండ్ చేశారు. పత్తి, సోయాబీన్, తొగరి, పెసర, వరి, మొక్కజొన్న వంటి పంటలు నష్టపో యాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సర్వే చేయించి, నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కౌలు రైతులకు సకాలంలో ఎరువులు అందించాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు పంట బీమా అమలు చేయాలని అన్నారు. మార్కెట్లో ధరలు అందుబాటులో లేని పక్షంలో, ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.