కుక్కల భారీ నుండి కాపాడండి సార్లు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలకు గాయపరుస్తున్న వీధి కుక్కల భారీ నుండి కాపాడండి సార్లు అని ప్రజలు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో నిత్యం పదుల సంఖ్యలో కుక్కలు తిరుగుతూ స్థానిక ప్రజలను,మండల కేంద్రానికి వచ్చే వారిని గాయపరుస్తున్నాయని మైనారిటీ నాయకులు మహమ్మద్ అమీర్ ఆరోపించారు.కుక్కలు దాడికి పాల్పడుతున్నాయని బయంతో విద్యార్థులు, మహిళలు జంకుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.వెంటనే పంచాయతీ అధికారులు చొరువతీసుకోని కుక్కల బారినుండి కాపాడాలని అమీర్ కోరారు.