కోటగుళ్లలో జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యుల పూజలు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T143843.356.wav?_=1

కోటగుళ్లలో జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యుల పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం లో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సతీమణి వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేసి శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T142912.081-1.wav?_=2

 

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలో ఆవిష్కరించిన విగ్రహానికి పూలమాల వేసి జయంతోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న పోరాటాలు, త్యాగాలు వెనకబడిన వర్గాల గౌరవాన్ని కాపాడటమే కాకుండా సామాజిక సమానత్వానికి మార్గదర్శకమయ్యాయని పలువురు కొనియాడారు. జహీరాబాద్ పట్టణ గౌడ్ సంఘాల అధ్యక్షులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సిరిసిల్లలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-10-7.wav?_=3

సిరిసిల్లలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకల సందర్బంగా సిరిసిల్ల పట్టణంలో ని బైపాస్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గౌడ్ సంఘం నాయకులు తీగల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలిరాజు,బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు,దొరల అరాచకాలను,మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో బీసీలదే రాజ్యాధికారమని అన్ని పార్టీలు దీనికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాలేశ్వరం ముక్తేశ్వర స్వామినీ దర్శించుకున్న – జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T142142.378-1.wav?_=4

 

కాలేశ్వరం ముక్తేశ్వర స్వామినీ దర్శించుకున్న – జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్

మహాదేవపూర్ ఆగస్టు 18 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం లోని కాలేశ్వరం ముక్తేశ్వర స్వామినీ సోమవారం రోజున దర్శనం చేసుకున్న జిల్లా గ్రంధాలయ శాఖ చైర్మన్ కోట రాజబాబు. శ్రావణ మాసం ముగుస్తున్న సందర్భంగా చివరి సోమవారం రోజు కావడంతో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ కోట రాజబాబు కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనంలో భాగంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలకడం తో స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించు కోవడంతో పాటు ఆలయ అధికారులు శాలువాతో సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నాకు పదవిని కట్టబెట్టిన సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు కి, మండల ప్రజలకు మరియు ఎల్లవేళలా నాకు తోడు నీడగా ఉండి నా అభివృద్ధికి తోడ్పడిన తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ శ్రావణమాసం రోజున కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించు కోవడం జరిగింది. అలాగే మండల స్థాయి నుండి జిల్లా స్థాయి పదవి కట్టబెట్టిన మంత్రి శ్రీధర్ బాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ నాయకులకు అండదండగా ఉంటూ ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ అభివృద్ధి దిశగా ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్, కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ప్రధాన అర్చకులు నాగేష్ శర్మ మరియు పురహితులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

కాంట్రాక్టర్ వీరభద్రరావుకు ఘన నివాళులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-9-7.wav?_=5

కాంట్రాక్టర్ వీరభద్రరావుకు ఘన నివాళులు

మందమర్రి నేటి ధాత్రి

సింగరేణి కాంట్రాక్టర్ దివంగత కోనేరు వీరభద్ర రావు ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సన్నిహితులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వీరభద్ర రావు(కోనేరు) ట్రాన్స్ పోర్ట్ పేరుతో సుపరిచితుడైన కాంట్రాక్టర్ కోనేరు వీరభద్రరావు గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందగా, ఆదివారం విజయవాడలో ఆయన కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ప్రథమ వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి ప్రాంతానికి చెందిన పలువురు హాజరై, వీరభద్రరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, వీరభద్రరావుతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరభద్ర రావుకు సింగరేణి తో విడదీయరాని బంధం కలదని తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

వీరభద్ర రావు సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ గా మందమర్రి పట్టణం తోపాటు సింగరేణి వ్యాప్తంగా మంచి పేరు గడించారని తెలిపారు. అప్పట్లో కోల్ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ అంటే సింగరేణి వ్యాప్తంగా వీరభద్ర రావు ట్రాన్స్ పోర్ట్ కు మంచి పేరు కలదన్నారు. పట్టణంలోని ఎంతో మందికి తన ట్రాన్స్ పోర్ట్ లో ఉద్యోగాలు కల్పించడంతో పాటు తన లాగే కోల్ ట్రాన్స్ పోర్ట్ లో రాణించాలనే అనుకునే ఔత్సాహికులకు అవకాశాలు కల్పించడం తోపాటు, వారికి వెన్నుదన్నుగా నిలిచి, సహాయ సహకారాలు అందించారని, అదేవిధంగా ఎంతో మంది నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరభద్రరావు కుటుంబ సభ్యులు ఆయన సతీమణి వెంకటరమణమ్మ, కుమారుడు కోనేరు ప్రసాద్ బాబు, మనవళ్లు డాక్టర్ ఫణికుమార్, కృష్ణకాంత్, వికాస్, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

“గాజా పిల్లలకు బ్రిటన్‌లో వైద్యం”…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T132530.356-1.wav?_=6

“గాజా పిల్లలకు బ్రిటన్‌లో వైద్యం”…

 

 

గాజాలో జరుగుతున్న యుద్ధంలో లక్షలాది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు లేదా తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేసిన 30 నుంచి 50 మంది గాజా పిల్లలను త్వరలో బ్రిటన్‌కు తరలించి వైద్య సేవలు అందించనున్నారు. వీరు తమ కుటుంబ సభ్యులతో కలిసి మూడో దేశం ద్వారా ప్రయాణించనున్నారు, అక్కడ అవసరమైన బయోమెట్రిక్ వివరాలు సేకరించబడతాయి. బ్రిటన్ ప్రభుత్వం, విదేశాంగ శాఖ, హోం ఆఫీస్, ఆరోగ్య శాఖ కలిసి ఈ ఆపరేషన్‌ను సమన్వయం చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు గాజా నుండి అనారోగ్యం, గాయాలతో బాధపడుతున్న పిల్లలను తక్షణమే బ్రిటన్‌కు తీసుకురావాలని ప్రభుత్వానికి లేఖ రాయగా, ఈ నిర్ణయం ఆ విజ్ఞప్తికి ప్రతిస్పందనగా తీసుకున్నట్లు భావిస్తున్నారు.

“సంగారెడ్డి, మెదక్‌లో భారీ వర్షాలు”……

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-6.wav?_=7

సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలు తీవ్రంగా అంతరాయానికి గురయ్యాయి.

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో అత్యధికంగా 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 17 సెంటీమీటర్లు, కల్హేర్ 11.9, కడ్పాల్ 10.6, అన్నసాగర్ 10.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.

ఇక నిన్న సిద్దిపేట జిల్లాలోని గౌరారం అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసి రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్‌లోనూ రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం కురిసి పలు ప్రాంతాలు నీటమునిగాయి. హైదర్‌నగర్ 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కాప్రా, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్ వంటి ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

శ్రావణమాస జగద్గురు రేవణ సిద్దేశ్వరాయ ఆలయంలో ప్రత్యేక పూజలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-7-7.wav?_=8

శ్రావణమాస జగద్గురు రేవణ సిద్దేశ్వరాయ ఆలయంలో ప్రత్యేక పూజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామంలో
శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వరాయ నమః శ్రావణమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పీఠాధిపతి మఠం.శివ లీలమ్మ ఆధ్వర్యంలో అర్చకులు రేవణ సిద్దయ్య స్వామి రుద్రాభిషేకం బిల్వపత్రి పూజలు నిర్వహించిన జొన్నగామ. వీరన్న పాటిల్ కుటుంబ సభ్యులు మరియు నల్లంపల్లి మఠం. శివకుమార్ స్వామి దంపతులు అదే విధంగా గురుజవాడ .వాస్తవ్యులు జగన్ గారి దంపతులు మరియుఅన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి. కార్యక్రమంలో వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

నీట మునిగిన రైతుల పంట పొలాలకు ప్రభుత్వం ఆదుకోవాలి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T130701.101.wav?_=9

 

నీట మునిగిన రైతుల పంట పొలాలకు ప్రభుత్వం ఆదుకోవాలి

బీజేపీ మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం లో
అధిక వర్షాలతో గణపురం మండలంలో మోరంచవాగు ఉప్పొంగడంతో వాగు పరిసర ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను జిల్లా అధికార యంత్రాంగం పరిశీలించి తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతు జిల్లాలో మరి కొద్ది రోజులు అధిక వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసిందని, ఇప్పటికే మోరంచ వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో మండలంలోని సీతారాంపూర్ ధర్మరావుపేట, గణపురం, చెల్పూర్ శివారులో వరద తాకిడికి గురై పంట పొలాలు నీట మునిగాయన్నారు. గత రెండు రోజులుగా వరి పంట నీటిలో మునిగి ఉండటం, పొలాల్లో ఇసుకమేటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కావున తక్షణమే ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి సర్వే చేపట్టి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. అదే వి ధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫలస్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆ పథకాన్ని అమలు చేస్తే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.

“రామంతపూర్ విషాదం: కేటీఆర్, కవిత ఆవేదన”

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-6-9.wav?_=10

“రామంతపూర్ విషాదం: కేటీఆర్, కవిత ఆవేదన”

హైదరాబాద్‌ ఉప్పల్‌ రామంతపూర్‌ గోకులే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపులో రథానికి విద్యుత్‌ తీగలు తగలడంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.

హైదరాబాద్‌లో భారీ వర్షాల హెచ్చరిక…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-5-5.wav?_=11

హైదరాబాద్‌పై మరోసారి వర్ష విరుపు కాబోతోంది.

వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న గంటల్లో నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు మరో రెండు రోజులపాటు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జల్లులు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

నిన్న కురిసిన కుండపోత వర్షం ఇప్పటికే నగర వాసులను ఇబ్బందులకు గురిచేసింది. లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారిపోయాయి. రోడ్లు జలమయమై ట్రాఫిక్ కష్టాలు పెరిగాయి. ముఖ్యంగా కుత్బుల్లాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. నీరు నిలిచిపోయిన ప్రదేశాలను జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పునరుద్ఘాటిస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ఇప్పటికే పలు జిల్లాలకు ప్రభుత్వం అలర్ట్‌లు జారీ చేసింది.

బహుజన రాజ్యాధికారమే ఆగిన ధ్యేయం.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T124359.652.wav?_=12

 

బహుజన రాజ్యాధికారమే ఆగిన ధ్యేయం.

సర్వాయి పాపన్న గొప్ప పోరాట, విప్లవకారుడు.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

పీడితులు, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు, గొప్ప బహుజన విప్లవకారుడు, ధీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా.. మహబూబ్ నగర్ నగరం పద్మావతి కాలనీ, గ్రీన్ బెల్ట్ లో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుల, మత, జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం దాదాపు 350 ఏండ్ల కిందనే కృషి చేసిన బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, 17వ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో దక్కన్‌పై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకొని తొలి బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప వీరుడు తొలి బహుజన రాజు అని ఆయన చెప్పారు.
బహుజన కులాలను ఏకం చేసి గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకొని జమీందారుల ఆస్తులను కొల్లగొట్టి పేద ప్రజలకు పంచిపెట్టాడన్నారు. తన సైన్యం ద్వారా చిన్న చిన్న సంస్థానాలను ఆక్రమించుకుంటూ, తన సొంత ఊరు ఖిలాషాపూర్‌ను రాజధానిగా చేసుకుని, 1675లో సర్వాయిపేట కేంద్రంగా తన రాజ్యాన్ని స్థాపించాడన్నారు. ఆ తర్వాత ఎన్నో ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్న పాపన్న. ఔరంగజేబు మరణానంతరం మొఘల్ రాజు బహదూర్ షా పాపన్నను స్వయం పాలకునిగా సంధికి ఆహ్వానించి కొంత కప్పం చెల్లించి గోల్కొండ కోటకు రాజుగా కొనసాగవచ్చని బహదూర్ షా ప్రతిపాదన చేశాడని, దానికి అంగీకరించిన పాపన్న, మొఘల్ గోల్కొండ కోటపై బహుజనుల జెండాను ఎగురవేశాడని చెప్పారు. అయితే ఇది నచ్చని జమీందార్లు, దేశముఖ్‌లు, జాగీర్దార్లు పాపన్న పరిపాలనలో తాము కొనసాగలేమని, ఆయనను పదవి నుంచి తప్పించాలని బహదూర్ షాను వేడుకోవడంతో పాపన్నను బంధించి తేవాలని ఆయన సైన్యాన్ని ఆదేశించారు. మొఘల్ సైన్యం పెద్ద ఎత్తున పాపన్నపై మూకుమ్మడిగా దాడికి దిగగా, పాపన్న తీవ్రంగా గాయపడి కొన్నిరోజుల ఆజ్ఞాత జీవితం గడిపారని, ఆయన మరణంపై వివిధ కథలు ప్రచారంలో ఉన్నా ఆయన ఒక యోధుడిగా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

 

 

నిజాం పాలకులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల అభ్యున్నతికి కృషి చేశారని, ఆయన బాటలో బహుజనులు, గౌడ కులస్తులు నడవాలని పిలుపునిచ్చారు, సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పాపన్న గౌడ్ స్పూర్తి నేటి యువతకు ఆదర్శంగా ఉండేలా ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో శంకుస్థాపన చేసుకుంటున్నామని, తెలంగాణలో ప్రతి గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన చరిత్ర భవిష్యత్ సమాజానికి తెలిసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, టి.పీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇందిర, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

మీరట్ టోల్ బూత్ వద్ద జవాన్‌పై దాడి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-4-5.wav?_=13

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఓ టోల్ బూత్ వద్ద ఆర్మీ జవాన్‌పై దాడి జరిగిన ఘటన సంచలనంగా మారింది.

రజపుత్ రెజిమెంట్‌లో పనిచేస్తున్న కపిల్ కవాడ్, తన సెలవులు ముగించుకుని శ్రీనగర్‌లోని పోస్ట్‌కి వెళ్లేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో భుని టోల్ బూత్ వద్ద భారీగా ట్రాఫిక్ ఉండటంతో కపిల్ టోల్ సిబ్బందిని తన గ్రామం టోల్ మినహాయింపు పొందిన ప్రాంతంలో ఉందని చెప్పాడు. చిన్న వాగ్వాదం కాస్తా పెద్ద గొడవగా మారి, ఐదుగురు టోల్ సిబ్బంది కపిల్ మరియు అతని కజిన్‌పై దాడి చేశారు.

ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో సరూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నలుగురిని అరెస్ట్ చేసి, మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపుతున్నాయి. సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టే సైనికుడికి ఇలాంటి అవమానం జరగడం చాలా దురదృష్టకరమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T122634.798-1.wav?_=14

 

భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం

భక్తిశ్రద్ధలతో శ్రావణమాస పూజలు.. సర్వ దర్శనానికి 3 గంటల సమయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. సోమవారం శ్రావణ మాస సందర్భంగా భక్తులతో కిక్కిరిసి పోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. తెలుగు రాష్ట్రాలు ఉండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తదితర ప్రాంతాల భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మందుగా భక్తులు ఆలయం స్వామి వారి అమృత పుష్కరిణిలో స్నానాలు ఆచరించి జల లింగానికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు “ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి నామాన్ని స్మరిస్తూ” గర్భాలయంలోని శ్రీ పార్వతీ సమేత కేతకి సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా భారీగా తరలివచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం కోసం మూడు గంటల సమయం పడుతోంది. ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

స్వామి వారికి ప్రత్యేక పూజలు..

 

 

 

సోమవారం శ్రావణమాస సందర్భంగా ఆలయంలోని శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవా, అభిషేకం, క్షీరాభిషేకం, పాలాభిషేకం, మహా మంగళ హారతి క్రతువును నిర్వహించారు. అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళహారతి నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించారు,
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ శేఖర్ పటేల్ , ధర్మ కర్త కంతనం మల్లయ్య స్వామి కార్యనిర్వాహణ అధికారి రుద్రాయ స్వామి, తగిన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T122002.725-1.wav?_=15

 

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు.

చిట్యాల,నేటిధాత్రి :

 

 

జయశంకర్ జిల్లా భూపాలపల్లి చిట్యాల మండలం
గోపాలపురం గ్రామంలో గౌడ సంఘం అధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని నారాయణ గౌడ్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని నారాయణ మాట్లాడుతూ
సామాన్య గౌడ గీత కార్మికుని కుటుంబంలో పుట్టి చరిత్ర సృష్టించిన బహుజన వీరుడు
నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన అలుపెరగని పోరాట యోధుడు
భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా అసమాన పోరు చేసిన ధీరుడు
మొఘలాయిల పెత్తనంపై సమర శంఖారావాన్నిపూరించి
గోల్కొండ కోటాపై జెండాను ఎగరేసిన తొలి తెలుగు చక్రవర్తి
వందల ఏండ్ల క్రితమే అణగారిన ప్రజల ఆత్మ గౌరవాన్నివెలుగెత్తి చాటుతూ, సామాజిక న్యాయాన్నిఅమలు చేసిన సమరసేనాని, తొలి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం కుటుంబ సభ్యులు పోశాల రాజు, పోశాల పైడయ్య, బత్తిని సదయ్య, పులి కిరణ్, పులి యుగేంధర్ , కోరుకోప్పుల అశోక్, కోల వేంకటేష్, మూల పైడయ్య, కోల మొగిళి, గ్రామస్తులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-3-5.wav?_=16

సింగరేణి కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి..

కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సుభిక్షంగా ఉంటుంది…

మందమర్రి జిఎం దేవేందర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

సింగరేణి సంస్థలో పనిచేసే అధికారుల, కార్మికుల, వారి కుటుంబ సభ్యుల, రిటైర్డ్ కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సాధించిందని కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ అన్నారు. రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కార్మికుల సౌకర్యార్ధం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు జిఎం తెలిపారు. అనంతరం జిఎం దేవేందర్ మాట్లాడారు.

Singareni Focus on Workers’ Health

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత పై దృష్టి సారిస్తూనే కార్మికుల ఆరోగ్యం పై సైతం యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, కార్మికుల ఆరోగ్యం పై తగు జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల నుండి కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, యూరాలజిస్ట్, గ్యాస్ట్రో వైద్య నిపుణులను రామకృష్ణాపూర్ ఆస్పత్రికి ప్రత్యేకంగా రప్పించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య పరీక్షలలో సమస్యలు ఉన్నవారికి ప్రత్యేక వైద్యం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఫిట్ సెక్రటరీలు నాగేంద్ర బట్టు, వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.

వర్ష బీభత్సం తీవ్ర పంట నష్టం మహిళ రైతు ఆవేదన.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T121410.690-1.wav?_=17

 

వర్ష బీభత్సం తీవ్ర పంట నష్టం మహిళ రైతు ఆవేదన.

చిట్యాల, నేటిధాత్రి : 

 

 

చిట్యాల మండలం ముచినిపర్తి గ్రామానికి చెందిన మూల లక్ష్మి అనే మహిళ రైతు మూడెకరాల్లో పత్తి చేను వేయగా గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి చేన్లోకి నీరు రావడంతో మూడు ఎకరాల పంట పూర్తిగా నీట మునిగింది
ప్రైవేట్ బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చి పంట పెట్టుబడి పెడితే ప్రకృతి వైపరీత్యానికి రైతు పలవుతున్నాడని మహిళా రైతు ఆవేద వ్యక్తం చేసింది దీనికి తోడు చేను పక్కన ఉన్న మరో రైతు కట్టలాగా మట్టితో నింపడంతో చేనులో ఉన్న నీరు బయటకు పోకుండా అందులోనే నిలిచి పంట పూర్తిగా మాడిపోయింది ప్రకృతి చేసిన వైపరీత్యానికి రైతుకు ఆత్మహత్య శరణ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు ముందు వరుసలో ప్రాధాన్యమిస్తున్న వ్యవసాయ రంగంలో నష్టపోతున్న మహిళా రైతుకు సాయం అందించి ఆదుకోవాలని పలువురు వేడుతున్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2-6.wav?_=18

గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

నిజాంపేట్, నేటి ధాత్రి

నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం స్థానిక రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద గౌడ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ చత్రపతి అని పిలువబడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌడ కులంలో పుట్టడం గర్వ కారణం అని మొగులు సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ని ప్రభుత్వం పట్టించుకునే పాపను పోలేదన్నారు. ఆ మహనీయుని చరిత్రను పాఠ్యపుస్తకంలో చేర్చాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటుకు కృషి చేస్తున్నారని వచ్చే జయంతి వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల సభ్యులు బజార్ సిద్దా గౌడ్, వెల్దుర్తి బాల్ రాజా గౌడ్, బజార్ వెంకట గౌడ్,చంద్ర గౌడ్, బజారు చిన్న తిరుమల గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్,బజారు రంజిత్ గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్,అంజా గౌడ్, పర్షరాములు గౌడ్, వినయ్ గౌడ్, బొప్పాపూర్ రాజు గౌడ్, సత్య గౌడ్, చంద్రకాంత్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు పెడితెనే పంచాయతీలకు ఫండ్స్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-1-5.wav?_=19

ఎన్నికలు పెడితెనే పంచాయతీలకు ఫండ్స్

ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం కొర్రీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

చిన్న పంచాయతీల పరిస్థితి దారుణం..

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఇటు కేంద్రం, అటు ఎస్ఎఫ్సీ (రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధులు ఆగిపోయాయి. నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్య చర్యలు, డ్రైనేజీల నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్, ట్రాక్టర్లకు డీజిల్ కొనుగోలు వంటి వాటి కోసం ఇబ్బందిగా మారింది. వీధి దీపాల ఏర్పాటు, మరమ్మతులు, తాగునీటి పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులు వస్తున్నాయని సెక్రటరీలు వాపోతున్నారు. ఆదాయ వనరులు లేని చిన్న పంచాయతీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. అసలే వర్షా కాలం.. గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతాయని, పారిశుధ్య చర్యలు ఎలా చేపట్టాలో తెలియడం లేదని సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీలు నిధుల లేమితో సతమతమ వుతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడంతో పల్లెల్లో అభివద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ.3,600 కోట్లు రావాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులుని లిచిపోయాయి. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించాలని కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేసినా… రూల్స్ ఒప్పుకోవని చెప్పిన్న ట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశం కారణంగా

◆:- మంత్రి సీతక్క విన్నవించినా ససేమిరా

◆:- కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రూ.3,600 కోట్లు

◆:- ఎస్ఎఫ్సీ నుంచి మరో రూ.1,500 కోట్లు

◆:- రూ.70 కోట్లకుపైగా స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీల సొంత నిధులతో గ్రామాల్లో పనులు

◆:- బీసీ రిజర్వేషన్ల ఆలస్యంతో స్థానిక ఎన్నికలు ఆలస్యం

స్థానిక ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్కార్ కసరత్తు చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో నిధులివ్వాలని మంత్రి అడగగా, నిబంధనల ప్రకారం గ్రామాల్లో పాలక వర్గాలు కొలువుతీరితేనే నిధులు చెల్లిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 15 నెలలుగా స్టేట్ ఫైనాన్స్ ఫండ్ (ఎస్ఎఫ్సీ) రూ.1,500 కోట్లపైనే రావాల్సి ఉండగా.. ఆ నిధులు కూడా పల్లెలకు అందలేదు. దీంతో పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు తమ సొంత నిధులతో పల్లెల్లో అభివద్ధి పనులు చేప డుతున్నారు.

రూ. 3,600 .. కోట్లు పెండింగ్

రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగిసి 18 నెలలు దాటింది. 2024 ఫిబ్రవరిలో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. అప్పటి నుంచి పాలక వర్గాలు లేకపోవడంతో పంచాయతీలకు కేంద్రం విడుదల చేయాల్సిన నిధులను ఆపేసింది. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ప్రతి నెలా రూ.180 కోట్లు రావాల్సి ఉండగా.. 18 నెలలకు మొత్తం రూ.3,600కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు పూర్తయి పాలక వర్గాలు ఏర్పాటు చేస్తేనే ఈ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఢిల్లీ వెళ్లి నిధులు విడుదల చేయాలని పలుమార్లు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. పం చాయతీల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సన్నాహాలు చేస్తోందని, 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం కసర త్తు చేస్తుందని చెప్పారు. త్వరలో స్థానిక ఎన్నికలపై సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులివ్వాలని కోరినా.. కేంద్రం నిరాకరించింది.

రూ. 70 కోట్లకు పైగా సొంత నిధులు..

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎఫ్సీ నిధులు సైతం 18 నెలలుగా విడుదల కావడం లేదు. మొత్తం రూ.1,560 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. నిధులు రాకపోవడంతో పల్లెల్లో వివిధ పనులకు
తామే సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత నిధులు రూ.70 కోట్లకు పైగా ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టామని వాపోయారు. కొన్ని నిధులు స్థానిక రాబడి (పన్నులు, ఫీజులు) నుంచి సమకూరుతున్నా.. అభివృద్ధి పనులకు సరి పోవడం లేదని పేర్కొంటున్నారు. నిధుల కొరత కారణంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి సౌకర్యాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టలేని పరి స్థితి నెలకొందని చెప్పారు. పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర నిధులు కీలక మని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పల్లెలకు వచ్చే నిధులను గ్రామాల్లో విద్యుత్, నెట్ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు. ఇతర ఖర్చులకు వినియోగిస్తుంటారు. నిధులు ఆగిపోవడంతో ఈ చె లింపులు నిలిచిపోయాయి. తాము సొంతంగా ఖర్చు చేసిన వాటికి ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు కోరుతున్నారు.

పేకాట రాయలు అరెస్ట్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T120004.140-2.wav?_=20

 

పేకాట రాయలు అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ రూరల్ పరిధిలోని: హొతి బి గ్రామ శివారులోని ఒక రేకుల షెడ్డు వద్ద కొంత మంది వ్యక్తులు పేకాట ఆడుచుండగా 08 మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద రూపాయలు నగదు .55,350/- మరియు 8 మొబైల్స్, 7 ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకొని వీరి అందరి పైన సుమోటో కేసు నమోదు చేసినట్లు
యస్.ఐ. యం.కాశీనాథ్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version