కోటగుళ్లలో జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యుల పూజలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సతీమణి వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేసి శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.