ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగంపెంచాలి.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి డిసిఓ వాల్య నాయక్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం మైలారం గ్రామంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని సహకార సంఘం జిల్లా డిసిఒ వాల్య నాయక్ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జి లను ఆదేశించారు గణపురం పిఎసిఎస్ చైర్మన్ కన్నె బోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓద్దుల పల్లె మైలారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు వర్ష ప్రభావం సూచనల నేపథ్యంలో మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని సూచించారు ఈ సందర్భంగా రైతులతో కొనుగోలు కు సంబంధించి ముఖాముఖి మాట్లాడారు కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలను ట్యాబ్ ఎంట్రీలను తక్షణమే పూర్తి చేయాలని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు ధాన్యం విక్రయించిన రైతులకు వారం రోజుల్లో డబ్బులు పడేలా చూడాలన్నారు రైతులు ధాన్యం విక్రసించిన వెంటనే ట్రక్ సీట్ ఇవ్వాలన్నారు అకాల వర్షాలు వస్తున్నాయని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిలువ లేకుండా తక్షణమే కేటాయించిన మిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు కొనుగోలు ప్రక్రియలో కేటాయించిన బిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు కొనుగోలు కేంద్రాలలో తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేయొద్దని ఆయన సూచించారు అకాల వర్షాలు వస్తున్నందున కొనుగోలు కేంద్రాలో పరదాలను సిద్ధంగా ఉంచాలని ఆయన తెలిపారు కొనుగోలు జరిగిన తదుపరి రైతులకు బాధ్యత లేదని కొనుగోలు కేంద్రాల్లో ఇన్చార్జీలు పూర్తిగా బాధ్యత వహించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఈ సి ఓ పుట్ట సురేష్ ఓద్దుల పల్లె ఇన్చార్జి కుక్క ముడి సంపత్ మైలారం ఇంచార్జి కండే కుమార్ రైతులు పాల్గొన్నారు

విజయవంతంగా ముగిసిన వేసవి శిక్షణా శిబిరం.

విజయవంతంగా ముగిసిన వేసవి శిక్షణా శిబిరం

రామాయంపేట మే 16 నేటి ధాత్రి (మెదక్):

రామాయంపేట పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని వినియోగించుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు దైనందిన జీవితంలో పాటించాల్సిన నియమాల గురించి తెలియజేశారు.

summer CAMP

విద్యార్థులు చదువుతోపాటు వివిధ రకాల విషయాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. యోగ, చిత్రలేఖనం మరియు క్రీడల వల్ల భవిష్యత్తులో కలిగే ఉపయోగాలను విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పిటిఐ లు మల్లేశం, కవిత, యోగ శిక్షకులు భరత్, డ్రాయింగ్ టీచర్ యాదమ్మలను అభినందించారు. శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, నోట్ బుక్స్ మరియు స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎంఐఎస్ సంతోష్, ఉపాధ్యాయులు రాధిక, జయ పాల్గొన్నారు.

జిల్లా కమిటీలో మార్పులు చేర్పులు.

జిల్లా కమిటీలో మార్పులు చేర్పులు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

తెలంగాణ ఆర్ఎంపి అండ్ పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ రిజిస్టర్ నెంబర్ 89 /2019,జిల్లా కమిటీ లో మార్పులు చేర్పులు గురించి గత 11 సంవత్సరముల నుండి మంచిర్యాల జిల్లాలో ఈ కమిటీ కొనసాగుచున్నది. దానిలో భాగంగా ఆర్ఎంపి అండ్ పి.ఎం.పి ఐక్యత కొరకు వారి సమస్యలపై పనిచేస్తు,మహాసభలు పెడుతూ,అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, ఆర్ఎంపి మరియు పి.ఎం.పి ల సమస్యల పైన చర్చలు జరిపి మన పరిధి వరకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రాథమిక వైద్యం చేయవలెనని అవగాహన కల్పించడం జరిగినది.అనివార్య కారణాలవల్ల ఈ జిల్లా కమిటీలో మార్పులు చేర్పులు చేయడం జరిగినది ప్రస్తుతం నిర్ణయించిన జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు దొంతుల మొoడయ్య,ఉపాధ్యక్షుడు శైలేంద్ర రాము చారి,ప్రధాన కార్యదర్శి మేడిపల్లి విజయ్,సహాయ కార్యదర్శి కొయ్యల రాజు, కోశాధికారిగా తంగేళ్లపల్లి రాజేందర్,గౌరవ అధ్యక్షుడు డిఆర్ బెంజిమెన్,ముఖ్య సలహాదారు కుంచాల శంకరయ్య గా నిర్ణయించడం జరిగింది.

పోగొట్టుకున్న ఫోన్ ను సీఈఐఆర్ తో పొందవచ్చు.

— పోగొట్టుకున్న ఫోన్ ను సీఈఐఆర్ తో పొందవచ్చు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

ప్రశాంతను వ్యక్తి మూడు నెలల క్రితం తన మొబైల్ ఫోన్ను నిజాంపేటలో పోగొట్టుకున్నాడు. బాధితుడు వెంటనే నిజాంపేట పోలీస్ స్టేషన్లో సీఈఐఆర్ వెబ్సైట్లో అప్లై చేశారు. సిఈఐఆర్ వెబ్సైట్ ద్వారా మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి శుక్రవారం బాధితుడికి మొబైల్ ఫోన్ అందజేసినట్లు నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే అధైర్య పడకుండా మీసేవ కేంద్రాల్లో, పోలీస్ స్టేషన్లో సిఈఐఆర్ అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని మండల ప్రజలకు సూచించారు.

భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన.

— భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన
• జూన్ 2 నుండి భూ భారతి దరఖాస్తుల స్వీకారణ
• అకాల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి

మెదక్ ఆర్డీఓ రమాదేవి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకువచ్చిన భూ భారతి పై రెవెన్యూ సిబ్బందికి మెదక్ ఆర్డీఓ రమాదేవి అవగాహన కల్పించారు. ఈ మేరకు నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్నీ ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు.. మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 2 న భూ భారతికి సంబంధించి దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందన్నారు. భూమిలకు సంబంధించిన సమస్యల పై సంబంధిత ధ్రువ పత్రాలను జోడించి దరఖాస్తు ఫామ్ తో కలిపి అధికారులకు అందివాలన్నారు. భూ భారతి లో దరఖాస్తు చేసుకున్న సమస్యలను విచారించి పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. సత్వర సమస్యల పరిష్కారం కోసం భూ భారతి నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యడం జరిగిందన్నారు. అలాగే అకాల వర్షాల దృశ్య కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అరబోసిన రైతులు టార్పాలిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వేగవంతగా కొనుగోలు జరపాలని ఇంచార్జులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యుటీ తహసీల్దార్ రమ్యశ్రీ,సీనియర్ అసిస్టెంట్ రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు ప్రీతీ, ఇమాద్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

పశువులను సంరక్షించేందుకే గోశాలకు తరలింపు…

పశువులను సంరక్షించేందుకే గోశాలకు తరలింపు…

పశువులు వాహనదారుల ప్రమాదాలకు కారణమైతే యజమానులపై చర్యలు..

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, పట్టణ ఎస్ఐ రాజశేఖర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని పలు ఏరియాలలో రోడ్లపై సంచరిస్తున్న పశువులను మున్సిపల్ శాఖ,పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గోశాలలకు తరలించారు.రోడ్లపై సంచరించే పశువులను పశు యజమానులు వాటిని తమ ఇంటికి తీసుకువెళ్లాలని గత ఐదు నెలలుగా పత్రిక ప్రకటనలు ఇచ్చినప్పటికీ కొందరు యజమానులు పశువులను రోడ్లపై వదలడంతో గోశాలలకు తరలిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఆర్ కె పి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మానవాళినీ ఇబ్బందులకు గురి చేసే ఏ జీవులైనా సరే కుక్క, గోవు, పశువు ఏదైనా తరలించే హక్కులు మునిసిపాలిటీ అధికారులకు ఉంటాయని కమీషనర్ గద్దె రాజు తెలిపారు .

Cowshed

 

పశువులను సంరక్షించేందుకే వాటిని గోశాలలకు తరలిస్తున్నామని వారు అన్నారు. పశువులు రోడ్లపై సంచరిస్తూ పాదాచారులకు, వాహనదారులకు, వ్యాపారస్తులకు, కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో పశువులను గోశాలలకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు.

Cowshed

 

పశువులను ఇలాగే రోడ్లపైకి వదిలేస్తే వాహనదారులు ప్రమాదానికి గురైనట్లయితే పశు యజమానులపై తగు చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ హెచ్చరించారు. సరైన ఆధారాలతో ఎవరైనా పశువుల యజమానులు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే పశువులను వాటి యజమానులకు అప్పగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి వెటర్నరీ డాక్టర్ తిరుపతి, మూగజీవుల సేవా సంఘం సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ డెంగ్యూ దినోత్సవం.

జాతీయ డెంగ్యూ దినోత్సవం

– డెంగ్యూ డే సందర్భంగా

– ప్రజల కు అవగాహన కల్పించేందుకు ర్యాలీ.

– దోమల వ్యాప్తిని అరికడుదాం.

డాక్టర్ గుగులోతు రవి

మరిపెడ నేటి ధాత్రి:

దోమల వ్యాప్తిని అరికట్టి డెంగ్యూ వ్యాధిని సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల వైద్యాధికారి డాక్టర్ గూగులోతు రవి పేర్కొన్నారు,డెంగ్యూ డే సందర్భంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మరిపెడ పట్టణం కార్గిల్ సెంటర్ మరియు బస్టాండ్ సర్కిల్‌ వరకు అవగాహన ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ ఆర్ధోవైరస్‌ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు.ఇది మనిషి నుండి మనిషికి ఏడిస్‌ ఈజిప్టై దోమలద్వారా సంక్రమిస్తుందన్నారు.ఈ జాతి దోమ పైన నల్లని, తెల్లని చారలు ఉండుటవలన దీనిని టైగర్‌ దోమ అనికూడా పిలుస్తారన్నారు. ఈ దోమలు ఇంటిలోపల, ఆవరణలో ఉండి,పగటిపూట మాత్రమే కుడతాయన్నారు.ఇవి ఎక్కువ దూరం (400 మీటర్లు) ఎగరలేవని, అన్ని రకాల దోమలకంటే ఈ దోమ చాలా బరువైనదగా ఉంటుందన్నారు.డెంగ్యూ వైరస్‌ తో ప్రభావం అయిన దోమలోనే కాకుండా దోమ గుడ్లలో కూడా ఈ వైరస్‌ ఉంటుందన్నారు.కాబట్టి త్వరితగతిన ఎక్కువ మందికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. ఈ దోమ మంచినీటి నిల్వలలో మాత్రమే గుడ్లు పెడుతుందని,ఈ వైరస్‌ వలన ఒకటి కంటే ఎక్కువసార్లు కూడా డెంగీ రావచ్చన్నారు,వ్యాధి లక్షణాలు ముఖ్యం గా
ఆకస్మికంగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి,విపరీతమైన కండరాలు,కీళ్ళ నొప్పులు
కళ్ళు నొప్పులు, కంటి కదలిక తగ్గటం,నొప్పి,ఒక్కొక్కసారి శరీరంలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతాయన్నారు
చిగుళ్ళ నుండి రక్తస్రావం
అధిక దాహం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు.
డెంగీ వ్యాధి మూడు రకాలుగా బయటపడవచ్చు..
డెంగీ జ్వరం,డెంగీ హెమరేజ్‌ జ్వరం,డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ గా వెల్లడి అవుతుందన్నారు.
నివారణ చర్యలు ముఖ్యం గా ఇంటిలోపల, ఇంటి ఆవరణలో ఎక్కడా మూతలేకుండా కొద్దిగా నీళ్ళుకూడా నిల్వ ఉండకూడదన్నారు
ఉదాహరణకు పూలకుండీల క్రింద, పెంకులు, కొబ్బరిబోండాలు, రుబ్బురోళ్ళు, పనికిరాని వస్తువులు, పాతటైర్లు, తాగి పడేసిన టీ కప్పులు, సీసాలు, , నీటి ట్యాంకులు, సంప్‌ లు, కూలర్లు, నీటి గుంటలుల్లో ఈ దోమ ఉత్పత్తి అవుతుందన్నారు.
దోమలు కుట్టకుండా దోమతెరలు వాడుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ స్వామి, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపెర్వైసోర్స్ కృష్ణ, ఆచార్యులు, సుదర్శన్, లక్ష్మి కుమారి, మాధవి, పల్లె దవాఖాన సిబ్బంది సాయి శ్రీ, సిరి, సతీష్, ఝాన్సీ, తరణి, హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, నర్సయ్య, ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

గర్భవతులు పిల్లలు వేసవిలో.!

గర్భవతులు పిల్లలు
వేసవిలో
తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైనుపాక గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలను శుక్రవారం రోజున అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసిన సూపర్వైజర్ జయప్రద ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండాకాలం అయినందున గర్భవతులు బాలింతలు పిల్లలు తీసుకోవలసిన ఆహార ఆరోగ్య వ్యక్తిగత శుభ్రత మంచినీటి ప్రాముఖ్యత గూర్చి వివరించనైనది ముఖ్యంగా ఈ సమయంలో ఫంక్షన్స్ తీర్థయాత్రలు వెళ్లకుండా చల్లటి వాతావరణంలో ఎప్పుడు కూలర్ ఏసివద్ద ఉండకుండా చెట్ల నీడలో ఎక్కువ సమయం గడపాలని మసాలాలతొ కూడిన భోజనము కాకుండా చిరుధాన్యాలతో కూడిన భోజనం తినాలి అని బయట తిను బండారాలు తినకుండా కూల్డ్రింక్స్ కు దూరంగా ఉండాలని చల్లటి మజ్జిగ నిమ్మరసం దోసకాయ వాటర్ మినరల్ లాంటి పానీయాలు తీసుకోవాలని వివరించనైనది అలాగే తల్లులు పిల్లలు ముఖ్యంగా కిశోర బాలికలు మొబైల్ కి దూరంగా ఉండాలని వివరించి గర్భవతులు పిల్లల బరువు ఎత్తు చూసి గర్భవతి బాలింతలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కరుణ సుభద్ర సుజాత ఆయాలు అస్మ సరోజన మహిళలు హాజరైనారు.

గాలి వానకు కొడిశలమిట్ట గ్రామం ఆగమాగం.

గాలి వానకు కొడిశలమిట్ట గ్రామం ఆగమాగం

 

భయాందోళనలో గిరిజనులు

అంధకారంలో పందెం -కోడిశెనపెట్ట గ్రామాలు

కొత్తగూడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని కొడిశల మిట్ట గ్రామంలో గురువారం మధ్య వీచిన గాలులకు వానకు గ్రామం అంత అతుల కుతులoగా మారింది
ఫోన్ సౌకర్యం కూడా లేని గ్రామం కావడంతో అటువైపు అధికారుల పర్యవేక్షణ కరువైంది వారి బాగోవులను పట్టించుకున్న అధికారులకు ఆ గ్రామాన్ని ఇప్పటి వరకు సందర్శించిన దాకలాలు లేవు
రాత్రి వీచిన గాలి వర్షానికి గ్రామంలో కొన్ని ఇండ్ల పైన పెంకలు. రేకులు కొట్టుకుపోయి రోడ్డుకు ఇరువైపుల చెట్లు పడడంతో ఇబ్బందిగా మారింది
అధికారులు స్పందించీ గ్రామాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు…

బడిబాట ఉల్లాస్ పై పేరెంట్స్ కు అవగాహన కార్యక్రమం.

బడిబాట ఉల్లాస్ పై పేరెంట్స్ కు అవగాహన కార్యక్రమం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలజడ్పీహెచ్ పాఠశాలలో పేరెంట్ టీచర్ సమావేశాలు బడిబాట మరియు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చిట్యాలలో పేరెంట్ టీచర్ సమావేశాలు జరిగినవి. ఈ సందర్భంగాఎంఇఓ కోడేపాక రఘుపతి మాట్లాడుతూ అందరూ విద్యావంతులైనప్పుడే ఆ సమాజం బాగుంటుందన్నారు. ప్రభుత్వ విద్యా సౌకర్యాలను వినియోగించుకొని ప్రతి పౌరుడు అభివృద్ధి పథంలో కొనసాగాలని కోరారు. 15 సంవత్సరాలు పైబడిన పిల్లలు సైతం ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బైరం కల్పన, ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీరామ్ రఘుపతి, మహిళా సంఘం నాయకురాళ్లు,, అంగన్వాడి టీచర్లు భాగ్యలక్ష్మి,మరియు వివో ఏ చందర్, కోమల ఉపాధ్యాయులు బండారి సదయ్య, గోపగాని భాస్కర్, బొమ్మ.రాజమౌళి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న.

నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామంలో పుసల్పహాడ్ తుకారం గంగమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మాజీ ఎంపీటీసీ శివ నంద శ్రీపతి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధారెడ్డి యువజన నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల తల్లిదండ్రుల సమావేశం.

జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల తల్లిదండ్రుల సమావేశం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

మండలంలోని వర్షకొండ గ్రామం లోని రైతు వేదిక లో జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కలిసి తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ దంతుల శ్యామల తూక్కారం మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఆవుల లావణ్య పాల్గొన్నారు, ఈ సంవత్సరం పాఠశాల సాధించిన ఫలితాలను ప్రధానోపాధ్యాయులు రాజేందర్ వివరించారు 527 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన నారే లహరి, 525 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచిన హర్షిని లను సమావేశంలో అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య దొరుకుతుందని అందరు కూడా మన గ్రామంలో ఉన్న వర్షకొండ జడ్పీ పాఠశాల యందు వారి పిల్లల్ని చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివకృష్ణ, మహేష్, అనిత, సుజాత గారలు పాల్గొన్నారు. సుమారు వందమంది పేరెంట్స్ పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ నూతన భవనానికి మోక్షం కలిగేనా.

గ్రామపంచాయతీ నూతన భవనానికి మోక్షం కలిగేనా!

ఏండ్లు గడుస్తున్న భవన నిర్మాణం కలగానే మిగిలి పోతుందా!

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి మోక్షం ఎప్పుడు అనేది మండల ప్రజలు ఆలో చనలో పడ్డారు. గత ప్రభుత్వం నూతన భవనానికి శంకుస్థాప నలు చేసి పనులు మొదలు పెట్టకపోవడం వల్ల ప్రజాప్రతిని ధులు అధికారుల మీద ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తు న్నారు.మెరుగైన పాలనఅందిం చేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాలను నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి భవనాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక రూపొందిం చాలి.గత ప్రభుత్వం పంచా యితీ కార్యాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గ్రామాల అభివృ ద్ధి ద్యేయం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని నూతన భవన నిర్మాణానికి అవకాశం కల్పించి, త్వరగా నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని ప్రజలు కోరుతు న్నారు.గత ప్రభుత్వం అభి వృద్ధి చేయని ఘనత. ఎక్కడ ఉన్న గొంగడి అక్కడే ఉన్నట్టు అనిపించింది. దీంతో గ్రామపం చాయతీ నూతన భవనానికి మోక్షం కలుగుతుందా!

నూతన గ్రామపంచాయతీ భవనం ఏర్పాటు చేయండి.

నూతన గ్రామపంచాయతీ భవనం ఏర్పాటు చేయండి

ప్రభుత్వమే నిర్మించాలి

నేటిధాత్రి

 

 

 

గ్రామపంచాయతీ కార్యాల యంలో గదులు లేక ఆరు బయటనే సమావేశాలు, వస్తువులను భద్రపరచడం, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం సాధ్యం కావట్లేదు ఇలాంటి సమస్యలు ఎదురవు తున్నాయి.మండల మేజర్ గ్రామపంచాయతీ కాబట్టి నూతన భవనాన్ని ప్రత్యేక హంగులతో ప్రభుత్వం భవన నిర్మాణం చేపట్టాలి.నూతన భవన నిర్మాణం పూర్తి చేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతుంది కాబట్టి భవన నిర్మాణ పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు

హరిహర వీరమల్లు గర్జించేది అప్పుడే…

హరిహర వీరమల్లు గర్జించేది అప్పుడే అభిమానులకు పండగే.

 

నేటి ధాత్రి:

 

 

 

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘హరి హర వీరమల్లు'(hari hara Veera mallu) . 

ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ఇదొకటి. 

భారీ అంచనాలు ఉన్న ఏ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘హరి హర వీరమల్లు'(hari hara Veera mallu) . 
ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ఇదొకటి. 
భారీ అంచనాలు ఉన్న ఏ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూడవ పాటను ట్రైలర్‌తో పాటు ఆవిష్కరించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్ పనులతో మెరుపు వేగంతో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ  చిత్రం, జూన్ 12న బాక్సాఫీస్ దగ్గర గర్జించనుంది.  ఈ మేరకు మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.  జూన్ 12న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. (Harihara veeramallu Release Date)

ఆలస్యాల మధ్య పగ్గాలు చేపట్టిన దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, కొద్ది నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ, వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి కృషి చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’ గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా, ప్రపంచం మెచ్చే గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా.. ప్రేక్షకుల హృదయాలను, బాక్సాఫీస్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి

ఇబ్రహీంపట్నం నేటి ధాత్రి:

మండలంలోని వర్షకొండ గ్రామంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొల్లెవైన శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాని కంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పదని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటుందని మరియు మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని తొందర తొందరగా కొనుగోలు చేస్తుందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా జాగ్రత్త పడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగ ధ్యావత్ విజయ్. మరియు కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు,

18న బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ.

18న బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ.

◆- కరపత్రం విడుదల చేసిన పీఠాధిపతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ జగద్గురు మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ ఈనెల 18న నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సంబంధిత కరపత్రాన్ని, గోడపత్రికను శుక్రవారం బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో పీఠాధిపతులు మహామండలేశ్వర్ శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ విడుదల చేశారు. వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో హాజరై బసవేశ్వర విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ నెల 18న అమోఘ్ లీలా ప్రభుజీ బీదర్ రాక.

ఈ నెల 18న అమోఘ్ లీలా ప్రభుజీ బీదర్ రాక.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణంలోని జగన్నాథ్ మందిరానికి ఈనెల 18న ప్రముఖ ఆధాత్మిక ప్రవచన కర్త శ్రీ ఆమోఘ్ లీలా ప్రభుజీ దాస్ రానున్నట్లు 11 జగన్నాథ్ మందిరం ప్రతినిధులు డాక్టర్ నీలేష్ ప్రభుజీ తెలిపారు. ఆ రోజు 12 గంటలకు బీదర్ పట్టణంలోని షాపూర్ గేట్ కు చేరుకుంటారని అన్నారు. అక్కడినుండి బైక్ ర్యాలీ తో పాటు కీర్త నలు చేస్తూ శోభా యాత్ర జరుపుతూ మధ్యాహ్నం 2 గంటలకు జగన్నాథ్ మందిరం చేరుకుంటారని వివరించారు. సాయంత్రం 5 గంటలకు ప్రభుజీ ప్రవచనం, మహాప్రసాదం ఉంటుందని తెలిపారు. మరుసటి రోజు 19న ఉదయం ప్రభుజీ బీదర్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలైన నర్సింహా స్వామి ఝర్నా, పాపనాశ్ మందిరాలను సందర్శిస్తారన్నారు అనంతరం జగన్నాథ్ మందిరంలో భాగవత్ కథ, భక్తులతో ముఖాముఖి, ఆధ్యాత్మిక విషయాలలో సందేహాలు వాటి నివృత్తి, నరసింహ హారతి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. జహీరాబాద్ ప్రాంతం నుండి వచ్చే భక్తులకు రెండు రోజుల పాటు మహాప్ర సాదం ఉంటుందని తెలియజేసారు. భక్తులందరూ సాంప్రదాయ వస్త్రధార ణతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు.

న్యాల్కల్: ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం రాజవరంలోని స్వయంభు వరసిద్ధి వినాయక ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వరసిద్ధి గణపతికి అర్చకులు పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. గరికలతో మహా పూజ కార్యక్రమాన్ని చేశారు. గణపతికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఆగని నీటి కష్టాలు….

ఆగని నీటి కష్టాలు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ 12వ వార్డులో గత వారం పది రోజులుగా ప్రజలకు సరిపడా మంచి నీరు బోర్, మంజీరా నీరు రావటం లేదు. ప్రతి ఎండాకాలం వచ్చిందంటే చాలు హౌసింగ్ బోర్డు చివరి కాలనీ లో నీటి సమస్య ప్రతిసారి ఉంటుంది. అంబంధిత అధికారులకు తెలిసిన పటించుకోవడం లేదు. వాటర్ మ్యాన్ డబ్బులు తీసుకొని తెలిసిన వారికి గంటల కొద్ది నీరు వదులుతున్నారు. కాని సామన్య ప్రజలకు మాత్రం కొద్దిసేపు వదిలి ఆఫ్ చేస్తున్నారు. పై స్థాయి అధికారులు స్పందించి కాలనీ వాసులు కొత్త బోర్ వేయించి మంచి నీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version