వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా.!

వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా మే 24న జహీరాబాద్‌లో నిరసన కార్యక్రమం జరగనుంది.

◆ – ఈ చారిత్రాత్మక నిరసన సమావేశానికి మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమానీ అధ్యక్షత వహిస్తారు,మౌలానా అబూ తాలిబ్ రెహమానీ మరియు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు.

జహీరాబాద్ నేటి ధాత్ర:

జహీరాబాద్. వక్ఫ్ బచావో దస్తూర్ బచావో ప్రచారం కన్వీనర్ ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖైమి, వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉద్యమం సమాచారం ప్రకారం, వక్ఫ్ బచావో దస్తూర్ బచావో ప్రచారంలో భాగంగా, తహాఫుజ్ దస్తూర్ మరియు అవుకాఫ్ సమావేశం అనే ఆల్ పార్టీ గ్రాండ్ చారిత్రాత్మక నిరసన సమావేశం సంగారెడ్డి జిల్లా స్థాయిలో మే 24, 2025 శనివారం, అస్ర్ ప్రార్థనల తర్వాత రాత్రి 10 గంటల వరకు ఈద్గా మైదాన్ జహీరాబాద్‌లో ఈద్గా మైదాన్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఫకీహ్ అస్ర్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ అధ్యక్షతన జరుగుతుంది, దీనిలో ప్రత్యేక అతిథులుగా ఖతీబ్ షోలా బయాన్ హజ్రత్ మౌలానా అబూ తాలిబ్ రెహ్మానీ, హజ్రత్ మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్, అమీర్ జామియా నిజామియా, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, సభ్యుడు పార్లమెంట్ హైదరాబాద్, మిస్టర్ అక్బర్ నిజామీ, హజ్రత్ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్, జమియత్ ఉలేమా తెలంగాణ అధ్యక్షుడు, హజ్రత్ మౌలానా హుసాముద్దీన్ జాఫర్ పాషా.హజ్రత్ మౌలానా గియాస్ అహ్మద్ రషాది సాహిబ్ హజ్రత్ మౌలానా షఫీక్ ఆలం జామి జమియత్ అహ్లే హదీస్ తెలంగాణ ప్రతినిధి ఖలీద్ ముబాషిర్-ఉల్-జాఫర్ అమీర్ జమాత్-ఇ-ఇస్లామి తెలంగాణ జియావుద్దీన్ నాయర్ అధ్యక్షుడు తమీర్-ఎ-మిల్లత్ శ్రీ అబ్దుల్ అజీజ్ MPI సయ్యద్ మతీనుద్దీన్: ఖాద్రీ సయ్యద్ మసూద్ హుస్సేన్ ముజ్తహిద్ అధ్యక్షుడు అంజుమాన్ మహద్వియ్య ముహమ్మద్ అలీ షబ్బీర్ సలహాదారుడు తెలంగాణ సురేష్ కుమార్ షస్కర్ పార్లమెంటు సభ్యుడు జహీరాబాద్ కె. మాణిక్ రావు అసెంబ్లీ సభ్యుడు జహీరాబాద్ నియోజకవర్గం డాక్టర్ చంద్రశేఖర్ ఇన్-చార్జ్ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తన్వీర్ మాజీ చైర్మన్ తంగానా అజ్మతుల్లా హుస్సేని వక్ఫ్ బోర్డు చైర్మన్ తెలంగాణ అఫ్జల్ హుస్సేన్ ఖుస్రో పాషా చైర్మన్ హజ్ కమిటీ తెలంగాణ అతి ముఖ్యమైన ప్రసంగాలు చేస్తారు. అదనంగా, ఇతర మతాల నాయకులు ప్రసంగాలు ఇస్తారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మౌలానా అతీక్ అహ్మద్ ఖాస్మీ, మౌలానా అబ్దుల్ ముజీబ్ ఖాస్మీ, ముఫ్తీ నజీర్ అహ్మద్ హుసామీ, నజీముద్దీన్ ఘోరీ, అయూబ్, జమాతే ఇస్లామీ, అతిక్ హక్కానీ, అహ్లే హదీత్, అహ్లే హదీథ్, మిస్టర్, యూసుఫ్, ఆప్షన్ కమిటీ సభ్యుడు. బాష్మ్, దావత్ తబ్లీగ్ – హఫీజ్ అక్బర్, అబ్దుల్ ఖదీర్, జమియాత్ ఉలేమా, మిస్టర్ మౌల్వీ ఖాజీ జియావుద్దీన్, మిస్టర్ ఫర్హాన్ ఖాద్రీ, అహ్లే సున్నత్ వాల్ జమాత్, అబ్దుల్ మజీద్, సఫా బైతుల్ మాల్,జమీల్ అర్షద్
కాంగ్రెస్ పార్టీ, మొహియుద్దీన్ షేక్ ఫరీద్ టిఆర్ఎస్ పార్టీ. అథర్ సాహిబ్ అజ్మత్ సాహిబ్ వైస్ చైర్మన్ ఎంఐఎం ముఫ్తీ అబ్దుల్ బాసిత్ సాహిబ్ కోహీర్ మండల్, అబ్దుల్ మజీద్ సాహిబ్ హుజ్రా సంగం మండల్, బషీర్ అహ్మద్ సాహిబ్ హఫీజ్ ఖలీల్ మక్దం పాలి మండల్, ముఫ్తీ జమీర్ నియా లకల్ మండల్ మాట్లాడుతూ, ఈ సమస్య యొక్క ప్రాముఖ్యత మరియు పరిస్థితి యొక్క సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, మతం లేదా మతంతో సంబంధం లేకుండా ఇస్లాం సోదరులందరూ నిర్ణీత సమయంలో నిరసన సమావేశంలో పాల్గొని, తమ జాతీయ ఐక్యత మరియు మతపరమైన మద్దతును ప్రదర్శించి, ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా తమ నిరసనను నమోదు చేసుకోవాలని అన్నారు.

ఫోక్సో చట్టంపై అవగాహన ఉండాలి అదనపు ఎస్పీ.

ఫోక్సో చట్టంపై అవగాహన ఉండాలి: అదనపు ఎస్పీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

అంగన్వాడీ టీచర్లకు ఫోక్సో చట్టంపై అవగాహన ఉండాలని సంజీవరావు అన్నారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలకు బాలికలపై లైంగిక దాడులు జరిగితే ఫోక్సో కేసుగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, హనుమంతు, డిసిపివో రత్నం పాల్గొన్నారు

రాచన్న స్వామి ఆలయంలో.!

రాచన్న స్వామి ఆలయంలో సీనీయర్ సివిల్ జడ్జి ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేటరాచన్న స్వామి ఆలయంలో జహీరాబాద్ సినియర్ సివిల్ జడ్జి కవిత దేవి శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేదాశీర్వాదం చేయడం జరిగింది.

ఆపరేషన్‌ సింధూర్‌తో పెరిగిన భారత ప్రతిష్ట

భారత్‌, చైనా, తుర్కియేలకు ప్రయోగశాలగా మారిన పాక్‌

భౌతికంగా దెబ్బతిన్న పాక్‌, పరోక్షంగా ఓడిన చైనా, తుర్కియే

పహల్గామ్‌ మృతులకు కనీసం సంతాపం తెలపని ఎర్డొగాన్‌

అమెరికా, చైనాలను సవాలు చేసే స్థాయికి ఎదుగుతున్న భారత్‌

డెస్క్‌,నేటిధాత్రి: 

పహల్గామ్‌ దాడి, అనంతరం భారత్‌ సిందూర్‌ పేరుతో చేపట్టిన సైనికచర్యతో పాకిస్తాన్‌ను తిరిగి లేవలేని స్థితికి అణచివేసిన వైనం, ఈ క్రమంలో త్రివిధ దళాల సమన్వయంతో వ్యవహరించ డం, మరోవైపు తన పటిష్టమైన దౌత్యంతో ప్రపంచ దేశాలను తనకు అనుకూలంగా మలచుకోవడం వంటి అంశాలు ఇప్పుడు భారత్‌ను అంతర్జాతీయ సమాజంలో అత్యున్నతస్థాయిలో నిలిపా యి. దేనికైనా కాలం రావాలన్నది ఒక సూక్తి. ఇప్పటివరకు పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదంతో నానా ఇబ్బందులు పడిన భారత్‌ ఇప్పుడు, ఆ దేశానికి ‘ఈ పని ఎందుకు చేశామా?’ అని బాధపడే స్థాయిలో బుద్ధి చెబుతోంది. ముఖ్యంగా ‘సీమాంతర ఉగ్రవాదం’పై తాను నిరంతరం కొనసాగి స్తున్న పోరులో ప్రపంచ దేశాల మద్దతును పొందగలుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం యూరప్‌ మరియు ఇతర పాశ్చాత్య దేశాలు ఉగ్రవాదం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో భారత్‌ చేస్తున్న పోరుకు వీటినుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. కేవలం మతాన్ని నమ్ముకొని ఇస్లామిక్‌ దేశాల మద్దతు పొందాలని చూస్తున్న పాక్‌ యత్నాలు ఇప్పుడు సఫలం కావడంలేదు. మతం కంటే వాణిజ్యం అధికమన్న సత్యాన్ని గుర్తించడంతో అతిపెద్ద మార్కెట్‌గా వున్న భారత్‌ను కాదని అవి అడుగుముందుకేయలేని పరిస్థితి. ఇదే సమయంలో పాక్‌కు మద్దతివ్వడంవల్ల ఒరి గేది ఏమీలేదన్నది కూడా వాటికి బాగా తెలిసొచ్చింది. కాకపోతే ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో తుర్కియే, అజర్‌బైజాన్లు మాత్రం పాక్‌కు అండగా నిలిచాయి. ఇప్పుడు ఆ రెండు దేశాలు ప్రపంచంలో ఏకాకిగా మారక తప్పదు. నిజం చెప్పాలంటే గతంలో భారత్‌కు ప్రపంచ దేశాల్లో పలుకుబడి చాలా పరిమితంగానే వుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి గా మారిపోయింది. దౌత్యవిధానాల్లో సమూల మార్పులు తీసుకొని రావడమే కాదు, గ్లోబల్‌ సౌత్‌కు నాయకురాలిగా తన ను తాను నిరూపించుకుంటోంది. ముఖ్యంగా గ్లోబల్‌ సౌత్‌లో వుండే అభివృద్ధి చెందుతున్న దేశాల వాణిని వినిపించడంలో భారత్‌ ఎంతో సమర్థవంతంగా వ్యవహరి స్తోంది. జీ`20 అధ్యక్షురాలిగా, ఆఫ్రికన్‌ యూనియన్‌కు ఇందులో శాశ్వత సభ్యత్వం కల్పించి తన నాయకత్వ పటిమను నిరూపించుకుంది. జి`20 న్యూఢల్లీి డిక్లరేషన్‌ను సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించడం, భారత్‌ పేర్కొంటున్న ప్రస్తుతం ప్రపంచ ఎదుర్కొంటున్న సమస్యలకు సమానమైన ప్రాధాన్యతతో సమ్మిళిత పరిష్కారాలు సాధించాలన్న వాదనకు గట్టి మద్దతు లభించినట్లయింది. అంతేకాదు సుస్థిరాభివృద్ధి, ఉగ్రవాదానికి వ్యతిరేక పోరు, మౌలిక సదుపాయాల విస్తరణ, వాతావరణ మార్పు అంశాలపై ప్రపంచ దేశాలను ఏకతాటిమీదకు తీసుకొని రాగలిగింది. 

ఇటీవల జరిగిన పహల్గామ్‌ దాడి నేపథ్యంలో భారత్‌ వేగంగా, తీవ్రస్థాయిలో స్పందించిన తీరు ప్రపంచాన్ని అబ్బురపరచింది. భారత్‌ సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సాధించిన అద్భుతమైన ప్రగతి, సైనికచర్యల సందర్భంగా త్రివిధ దళాల మధ్య సమన్వయం ఎంతటి ఉత్తమ ఫలితాలి స్తాయన్న సత్యాన్ని ప్రపంచం గుర్తించింది. అంతేకాదు భారత్‌ వద్ద వున్న నాణ్యమైన మరియు బలమైన సాంకేతికతను ప్రపంచ దేశాలు విస్పష్టంగా గుర్తించాయి. ఒకవైపు ఆపరేషన్‌ సింధూర్‌ను నిర్వహిస్తూనే మరోవైపు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆంక్షల కమిటీ, ఉగ్రవాద నిరోధక విభా గం, ఉగ్రవాద నిరోధక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరేట్‌లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను వివరించడం ద్వారా తగిన మద్దతును కూడగట్టగలిగింది. భారత భూభాగంలో దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌ ఉగ్రవాదుల కార్యకలాపాలను యు.ఎన్‌.కు మరింత వివరంగా చెప్పి మద్దతు కూడగట్టడానికి యత్నించింది. భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పు డు ఇచ్చిన వివరణలకు ప్రపంచ దేశాలు మద్దతునిచ్చాయి.

చురుకైన దౌత్యం, ప్రపంచ వేదికలపై చూపిన నాయకత్వ పటిమ, తన భద్రతకు సంబంధించినఅంశాలను ప్రపంచ దేశాలకు వివరించిన విధానం, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మిత్రులను సంపాదించిపెట్టింది. గత ప్రభుత్వాల కాలంలో భారత్‌ పలుకుబడి చాలా పరిమితంగానే వుండేది. మతం పేరుతో ఇస్లామిక్‌ దేశాలతో పాకిస్తాన్‌ సన్నిహిత సంబంధాలు నెరపడం, అణ్వస్త్రాలుకలిగిన ఏకైక ఇస్లామిక్‌ దేశంగా తనను తాను ప్రదర్శించుకున్న పాకిస్తాన్‌, ఆపరేషన్‌ సింధూర్‌ దెబ్బకు పూర్తిగా కుదేలైంది. ఇప్పుడు తాను అణ్వస్త్రదేశమని చెప్పుకోవడానికి కూడా ఏమీలేదు. కేవలం కొద్ది గంటల్లో పాకిస్తాన్‌కు చెందిన 1/3వ వంతు వైమానిక దళాన్ని భారత్‌ ధ్వంసం చేసింది. ఎఫ్‌`16, జె.ఎఫ్‌`17 యుద్ధ విమానాలను చూపి భయపెట్టిన పాక్‌కు ఇప్పుడు అవికూడా ధ్వంసం కావడంతో భారత్‌ సత్తా ఏంటో తెలిసొచ్చింది. భారత్‌ ఇంతటిస్థాయిలో రక్షణ మరియుసాంకేతిక రంగంలో అభివృద్ధి సాధిస్తుందని పాక్‌ ఎంతమాత్రం ఊహించలేదన్నది స్పష్టమైంది. అర్మీనియా ఓటమికి ఉపయోగపడిన తుర్కియే డ్రోన్లను ఉపయోగించి భారత్‌ను దెబ్బతీయాలనుకున్న పాక్‌ అతివిశ్వాసం నిండా ముంచింది. పాక్‌ ప్రయోగించిన అన్ని డ్రోన్‌లను కుప్పకూల్చ డంతో పాకిస్తాన్‌ అయోమయంలో పడగా, తుర్కియే అహంకారాన్ని అణచివేసినట్టయింది. ఇక చైనా ఆయుధాల సంగతి ఎంత తక్కువ చెబితే అంతమంచిది. అన్ని వందలకోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన రక్షణవ్యవస్థలు ఎందుకూ పనికిరానిరీతిలో భారత్‌ చేతిలో ధ్వంసం కావడం, పాకిస్తాన్‌ను హతాశురాలిని చేస్తే, చైనా ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే భారత్‌, చైనా, తుర్కియే దేశాలకు పాకిస్తాన్‌ ఒక ప్రయోగశాలగా మా రింది. తమ ఆయుధాలు, సాంకేతికత ఎట్లా పనిచేశాయో ఈ దేశాలు ఒక అంచనాకు రాగా, ఈ ‘ప్రయోగాల’ దెబ్బకు పాక్‌ ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఒక విఫలదేశంగా, ఉగ్రవాద ఉత్పత్తికేంద్రంగా, మతపిచ్చతో నిండిపోయిన దేశంగా తనకంటూ ఒక ముద్రను వేసుకుంది. భారత్‌ చేతిలో చావుదెబ్బలు తిని, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిన దౌర్భాగ్యపు ఘనత దక్కించుకున్న దేశం కూడా పాకిస్తానే! కాల్పుల విరమణ జరగకపోతే ఈపాటికి తనకంటూ ఒక గు ర్తింపు లేని దయనీయస్థితికి పాక్‌ చేరుండేది. 

తమపై దాడిచేసిన భారత్‌పై ప్రతీకారానికి అణ్వాయుధాలు ఇవ్వాలని ఒకవేళ మిగిలిన ఉగ్రవా దులు డిమాండ్‌ చేస్తే, కాదనే పరిస్థితి బహుశా పాకిస్తాన్‌కు వుండదు. దేశ రాజకీయ నాయక త్వం, సైన్యం అంతటి దుస్థితికి దిగజారిపోయాయి. రాజకీయ నాయకుల మాటలు సైన్యం వినదు, సైన్యంలో ఉన్నతాధికార్ల మాటలను దిగువస్థాయి అధికార్లు పట్టించుకోరు. ఎవరూ ఎవరి మాటా వినరు. ఇదీ ప్రస్తుత పాక్‌ దుస్థితి!

ఇవన్నీ ఒక ఎత్తయితే, ప్రస్తుతం సింధూనది నీరు నిలిచిపోవడంతో, దేశ ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడిరది. ఈ సమస్యను పరిష్కరించకపోతే దేశంలో తిరుగుబాటు రావడం ఖాయం. ఇప్పటికే నదీజలాల విషయంలో పంజాబ్‌, సింధ్‌ రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతు న్నాయి. సింధ్‌ ప్రజలు నీటికోసం తిరగబడుతున్నారు. బెలూచిస్తాన్‌ దాదాపు స్వాతంత్య్రం ప్రక టించుకునే దశకు వచ్చేసింది. అసలు పాక్‌ సైన్యం ఖైబర్‌ ఫక్తూన్‌క్వా, బెలూచిస్తాన్లలో అడుగు పెట్టలేని దుస్తితి. ఈ ప్రాంతాల్లో పాక్‌ ప్రభుత్వ అధికారం చెల్లడంలేదు. ఇంతటి దుస్థితిని ఎదుర్కొంటూ, ఇంకా కశ్మీర్‌ పాట పాడటం, ఉగ్రవాదులను ఎగదోసి మారణకాండకు పాల్పడటం ద్వారా పాక్‌ ఇప్పటివరకు సాధించిందేమీ లేదు. ఇప్పుడు ఈ ఉగ్రవాదులే తనను మింగే స్థాయికిచేరుకున్నారు. 

మొత్తంమీద చెప్పాలంటే ఆపరేషన్‌ సింధూర్‌, పాక్‌ను అథ్ణపాతాళానికి తొక్కేస్తే, భారత్‌ సామ ర్థ్యం ఆకాశాన్నంటింది. ప్రపంచాన్నే తనవైపుకు తిప్పుకుంది. భవిష్యత్తులో చైనా తన వ్యూహాలను మార్చుకొని, కొత్త పంథాలో భారత్‌ను ఇబ్బంది పెట్టడానికి యత్నించవచ్చు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు బలీయమైన వ్యవస్థలుగా పేరును సుస్థిరం చేసుకున్న తరుణంలో, ఇప్పుడు భారత్‌ వాటిని తలదన్నే రీతిలో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం, ముఖ్యంగా చైనాకు మింగుడుపడటంలేదు. తన ప్రాక్సీగా పాకిస్తాన్‌ను ప్రయోగించాలన్న ఆశలూ గల్లంతయ్యాయి. క మ్యూనికేషన్‌ రంగం ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల విస్తరించిన నేపథ్యంలో పాతచింతకాయ పచ్చడి వంటి తప్పుడు వార్తలను ప్రసారం చేయడం వల్ల అభాసుపాలవడం తప్ప ఏవిధమైన ప్రయోజనం వుండబోదని స్పష్టమైంది. చైనా సాంకేతిక లసుగులు అర్థం చేసుకున్న అమెరికా మరింత కఠినంగా వ్యవహరించవచ్చు. అయితే వాణిజ్యంలో మాత్రం పరస్పర లాబాలే ప్రాతిపదిక కనుక ఇందుకు మినహాయింపు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ‘ఆధిపత్యం’ అనేది మనం కోరుకుంటే రాదు… కేవలం ‘సామర్థ్యం’ వల్లనే వస్తుందనేది ఆపరేషన్‌ సింధూర్‌ ప్రపంచానికి వెల్ల డిరచింది.

మందమతులు..మతిలేని కుసంస్కారులు!

`మన మహిళలను గౌరవించలేని దౌర్భాగ్యులు!

`అందరికీ ఇంగ్లీషు రావాలని రూల్‌ వుందా?

`మంత్రి కొండా సురేఖ కు ఇంగ్లీషు రాకపోతే తప్పా!

`తెలంగాణలో తెలుగు తెలిస్తే చాలు!

`తెలుగులో మాట్లాడడం వస్తే చాలు.

`గతంలో బొడిగె శోభ విషయంలో కేసిఆర్‌ బుద్ధి హీనులను చెడుగుడు ఆడుకోలేదా? 

`మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డిని గౌరవం కేసిఆర్‌ కాపాడలేదా!

`మంత్రి కొండా సురేఖ పై ట్రోల్‌ ను కాంగ్రెస్‌ నాయకులు ఖండిరచరా!

`ఆమెకు అండగా నిలవరా?

`మీడియాలో సోకాల్డ్‌ సీనియర్లలో ఎంత మందికి ఇంగ్లీషు వచ్చు!

`అక్షర దోషాలు లేకుండా తెలుగు కూడా రాయలేని వాళ్లే ఎక్కువ!

`పెద్ద మీడియా వీడియోలకు ధంభ్‌ నెయిల్స్‌లో అన్నీ తప్పులే!

`అక్షరం ముక్క రాని వాళ్లు కూడా మీడియా పెద్దలు కావడం లేదా!

`మీడియాలో మిడిమిడి జ్ఞానం వున్న వాళ్లు మంత్రి సురేఖను విమర్శిస్తారా!

`మీడియాలో వున్నంత మాత్రాన అందరూ మేధావులు కాదు.

`ప్రజా సేవ చేసే వారికి ఇంగ్లీషుతో పని లేదు.

`ప్రజా సమస్యలు తెలిస్తే చాలు.

`ప్రజలకు మేలైన, మెరుగైన సేవలందిస్తే చాలు.

`బిసి. మహిళా మంత్రి సురేఖ అంటే అంత చిన్న చూపా!

హైదరాబాద్‌,నేటిధాత్రి:   

 విమర్శకు వివాదానికి తేడా వుంటుంది. ప్రతి విషయాన్ని విమర్శించొచ్చు. కాని ప్రతి విషయాన్ని వివాదం చేయొద్దు. కాని సోషల్‌ మీడియా యుగంలో ఏది నిజమో! ఏది అబద్దమో!! తెలుసుకోకుండానే అన్ని విషయాల మీద వివాదాలు ముసురుకుంటున్నాయి. ఎవరు ఏం మాట్లాడినా తప్పులు తీస్తున్నారు. తప్పులు దొర్లితే ఎవరైనా, ఏదైనా మాట్లాడొచ్చు. కాని రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం లేకుండానే సోషల్‌ మీడియా మూలంగా వివాదాలు ఉదృతమౌతున్నాయి. ఒక రకంగా నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాయకులు ఎంత చిత్తశుద్దితో మాట్లాడినా పెడర్దాలు తీసున్నారు. వివాదాలకు కేంద్రం చేస్తున్నారు. అదే ఇప్పుడు ఇబ్బందికరమైనపోయింది. ప్రజలు కూడా ఏది నిజం? ఏది అబద్దం అని తెలుసుకునే ఆలోచన చేయడం లేదు. అబద్దం అంత అందగా అల్లుతున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన ఓ వ్యాఖ్యలో పరమార్ధం పక్కన పడేశారు. ఆమె గొప్పదనం మరుగున పడేశారు. సమాజం కోసం ఆమె చెప్పిన మాటలను వక్రీకరించారు. గతంలో పనులు విషయంలో జరిగిన వాటిని ఆమె ఉటంకించారు. కాని ప్రజా ప్రభుత్వంలో అలాంటివి లేవని, నిజాయితీ వుందని ఆమె మాటల్లోని అంతరార్ధం. కాని ఆమె మాటలను పూర్తిగా వక్రీకరించారు. మంత్రులు తప్పులు చేస్తున్నారన్న భావన వచ్చేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అది తప్పని వారికి కూడా తెలుసు. కాని ప్రజలు అబద్దాలను వెంటనే నమ్మేస్తారు. అది అబద్దమని తెలిసే లోపు కొంత డ్యామేజీ జరిగిపోతూనే వుంటుంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ విషయంలో పనిగట్టుకొని ఆమె రాజకీయ ప్రత్యర్ధులు, వ్యతిరేకులు ఇలాంటివి లేనిపోనివి సృష్టిస్తున్నారు. ఆమె రాజకీయ జీవితాన్ని పలుచన చేయాలని చూస్తున్నారు. కాని ఆమె రాజకీయ అనుభవం ఎంతో ఉన్నతమైంది. గొప్పది కూడా…మా అనుకునే వారిని ఎంత గా కడుపులో పెట్టుకొని కొన్ని వేల మందిని చూసుకున్నారు. కొండా దంపలులు ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తునిచ్చారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. వారి జీవితంలో పోరాటమే తప్ప, ఆరాటం ఎక్కడా కనిపించదు. అలాంటి కొండా కుటుంబం మీద ఇటీవల పనిగట్టుకొని కొంత మంది సాగిస్తున్న అసత్య ప్రచారం వల్ల వారికి వచ్చే నష్టమేమీ లేదు. కాని ప్రజల్లో కొండా దంపతులను పలుచన చేసి శునకానందం పొందాలని చూస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ప్రపంచ సుందరి పోటీలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు ఇంగ్లీషు రాదంటూ రాద్దాంతం చేశారు. కాని దేశబాషలందు తెలుగు లెస్స అని చెప్పిన మంత్రి కొండా సురేఖ మాటలను బుద్దిమాంద్యం కలిగిన కొన్ని మీడియా సంస్ధలు హేళన చేశారు. తెలంగాణలో వున్న వారికి తెలుసు వస్తే చాలు. ఇంగ్లీషు రావాల్సిన అసవరం లేదు. కొండా సురేఖ అదికారి కాదు. ఆమె పాలకురాలు. ప్రజా ప్రతినిధి. ప్రజా సేవలో వున్న నాయకురాలు. అలాంటి మంత్రికి ఇంగ్లీష్‌ రాదంటూ కొన్ని మీడియా సంస్దలు పనిగట్టుకొని పనికి రాని ప్రచారం చేశాయి. కొండా సురేఖ ఉన్నత విద్యావంతురాలు. మన దేశంలో ఎంత ఉన్నత విద్యావంతులైనా సరే చాలా మందికి ఇంగ్లీష్‌ను స్పష్టంగా మాట్లాడడం ఇప్పటికీ రాదు. ఇంగ్లీష్‌ అనేది ఒక బాష. ఐఏఎస్‌లు చదువుకున్న వారు కూడా ఇంటర్వూలలో తమ ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలు రాస్తారు. ఇంటర్యూలు కూడా పూర్తిచేస్తారు. తర్వాత ఇంగ్లీష్‌ భాషను నేర్చుకుంటారు. ఆ మాత్రం తెలియని అజ్ఞానులంతా మీడియాలో చేరుతున్నారు. మంత్రి కొండా సురేఖను ట్రోల్‌ చేస్తున్న మీడియా సంస్ధల అధినేతలు, అందులో పనిచేసే జర్నలిస్టులెవరికీ ఇంగ్లీష్‌ పరిజ్ఞానం వుండదు. ఎవరికీ సరైన ఇంగ్లీష్‌ రాదు. కేవలం మీడియా వుందన్న అహంతో పెద్ద మీడియా సంస్దలు కూడా తప్పుడు వార్తలు సృష్టించడం గొప్ప అనుకుంటున్నారు. ప్రపంచంలో ఇంగ్లీష్‌ ఒక్కటే అందరూ అనుకరించరు. అనుసరించరు. అనేక దేశాలు తమ మాతృబాషనే గుర్తిస్తారు. చైనా లాంటి దేశంలో ఇంగ్లీష్‌ను ఎవరూ వాడరు. వారి ఇంటర్నెట్‌ సౌకర్యం కూడా చైనీస్‌లోనే వుంటుంది. స్పెయిన్‌లో స్పానిష్‌నే వాడతారు. మనం ఇంగ్లీష్‌ అనుకొని మోసపోతున్న అనేక పదాలు, లాటిన్‌ బాషకు సంబందించినవి. ప్రపచంంలోని ఏ దేశానికి ఆ దేశానికి సంబందించిన బాషలే అదికార బాషలు. మనదేశంలోనే సుమారు కొన్ని వందల బాషలున్నాయి. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో తమిళ్‌ తప్ప మరో బాష వారు మాట్లాడరు. తమిళనాడుకు చెందిన ఎంపిలు పార్లమెంటులో కూడా తమిళ్‌లోనే ప్రశ్నిస్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా తమిళంలోనే వారు మాట్లాడతారు. జాతీయ అంతర్జాతీయ వేదికలమీద కూడా వారి మాతృబాషలోనే మాట్లాడతారు. ఈ మాత్రం పరిజ్ఞానం లేని కొన్ని మీడియా సంస్దలు మంత్రి కొండా సురేఖపై లేనిపోని వివాదాలు సృష్టించాలనుకోవడం వారి వెలం వెర్రి తనానికి పరాకాష్ట అని చప్పాలి. నిజం చెప్పాలంటే వార్తలు ప్రసారం చేసిన, చర్చలు ఏర్పాటు చేసిన మీడియా సంస్దలు మంత్రి కొండా సురేఖకు బే షరతుగా క్షమాపణ చెప్పాలి. గతంలో ఇదే మీడియా బిఆర్‌ఎస్‌ హాయాంలో ఎమ్మెల్యేలపై లేనిపోని చులకన వ్యాఖ్యలు చేసినప్పుడు కేసిఆర్‌ ఎంతో బలంగా వారికి మద్దతు పలికారు. ఎమ్మెల్యేలకు అండగా నిలిచారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన మీడియాను తెలంగాణలో బ్యాన్‌ చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిదులపై లేనిపోని వార్తలు రాసి, రాద్దాంతాలు సృష్టిస్తే బాగుండదని హెచ్చరించారు. రెండు ప్రధాన మీడియా సంస్దలను తెలంగాణలో ప్రసారాలు నిలిపివేశారు. ఆ సమయంలో బొడిగేశోభ శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కాస్త తడబడ్డారు. ఒకానొక సమయంలో మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి అసెంబ్లీలో తెలంగాణలో నిత్యం వాడుకునే ఒక మాటను అనడాన్ని తప్పు పడితే కేసిఆర్‌ వివరణ ఇచ్చారు. తెలంగాణలో వ్యవహరిక బాషలోని పదాన్ని జగదీశ్వరరెడ్డి అనడం పెద్ద పొరపాటు కాదని సమర్ధించారు. కాని రెండు రోజులుగా మంత్రికొండా సురేఖపై మీడియాలో వస్తున్న వార్తలపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎందుకు స్పందించడం లేదు. ఆమెకు ఎందుకు అండగా నిలవడం లేదు. మీడియాను ఎందుకు హెచ్చరించడం లేదు. తప్పుడు కథనాలు వేయొద్దని ఎందుకు సూచించడం లేదు. ఆమెకు సపోర్టు చేయడానికి కూడా కాంగ్రెస్‌ నాయకులకు మనసు రావడం లేదా? ఆ మధ్య మరో మహిళా మంత్రి సీతక్కకు కూడా ఇదే విధంగా నిండు అసెంబ్లీలో అవమానం జరిగింది. అప్పుడు కూడా ఏనాయకుడు స్పందించలేదు. ఒక్క నేటి దాత్రి మాత్రమే ఆ రోజు అందరికన్నా ముందుగా స్పందించింది. ఏంఐఎంకు చెందిన ఎమ్మెల్యే మంత్రి సీతక్కకు హిందీ రాదంటూ చేసిన వ్యాఖ్యలపై నేటిదాత్రి అక్షర సమరం సాగించింది. మంత్రి సీతక్కకు ఎంఐఎం. క్షమాపణ చెప్పేదాకా పోరాటం చేసింది. ఇప్పుడు మీడియాలోని ఓ వర్గం మంత్రి కొండా సురేఖకు ఇంగ్లీష్‌ రాదంటూ లేనిపోని రాద్దాంతం చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత మంది ముఖ్యమంత్రులకు ఇంగ్లీష్‌ వచ్చింది? తెలంగాణకు చెందిన చెన్నారెడ్డికి తప్పకి ఏ ముఖ్యమంత్రికి పెద్దగా ఇంగ్లీష్‌ పరిజ్ఞానం లేదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన టి. అంజయ్య ఎంతో గొప్ప ముఖ్యమంత్రిగా పేరు పొందారు. కార్మిక పక్ష పాతిగా కీర్తిని పొందారు. అలాంటిది మంత్రి కొండా సురేఖకు ఇంగ్లీష్‌ రాకపోవడం ఏదో నేరమైనట్లు, వెకలి వార్తలు రాస్తున్నారు. ఇలాంటి వార్తలు మీడియా సమాజానికే తలవంపులుతెస్తాయి. ఇక మంత్రి కొండాసురేఖ అనని మాటలను కూడా తీసుకొచ్చి ప్రసారం చేస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు ఏం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఏం చేస్తున్నారు. మీడియాకు ఇంత విచ్చలవిడితనం మంచిది కాదు. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటల్లో మంచిని వెతికే ఓపిక లేని వాళ్లు అబద్దాలు సృష్టించారు. పారిశ్రామిక వేత్తలను కూడా ప్రజా సేవ చేయమని మంత్రి చెప్పారు. ప్రజలకు ఉపయోపగపడే మంచి పనులు చేయాలని కోరారు. అప్పుడు తాము ఎంతో సంతోషిస్తామని గొప్ప మాట చెప్పారు. కాని ఆ మంచిని వదిలేసి, కమీషన్‌ గురించి వార్తలు రాసి మంత్రిని తక్కువ చేయాలనుకుంటే కుదరదు. మీడియాలో వచ్చే ప్రతి వార్తకు స్పందించాల్సి వస్తే రాజకీయాల్లో ఒక్క నాయకడు కూడా మిగలరు. ఏ ఒక్కరు రాజకీయాలు చేయలేరు. ప్రజా సేవకు ఎవరూ ముందుకు రాదు. మీడియా అంటే ప్రజాసేవ కాదు. ప్రజాసేవ చేసేవారికి ప్రజల కష్టాలు తెలియజేసే వారధిగా వుండాలి. ప్రజల మేలుకోసం పనిచేయాలి. అంతే తప్ప ప్రజా సేవ చేసేవారిపై లేనిపోని వార్తలు రాస్తూ పోతే, ప్రజలకు మీడియానే తీరని అన్యాయం చేసినట్లౌవుంది.

పొంగులేటి నాయకత్వంలో శాఖల్లో విప్లవాత్మక మార్పులు

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ప్రజలకు మరిన్ని సదుపాయాల కల్పన

రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం

రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రజలకు మరిన్ని సౌకర్యాల కల్పనకు కృషి

డాక్యుమెంట్లు కూడా దరఖాస్తు దారులే నింపే సదుపాయం

కేవలం పది, పదిహేను నిముషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ పూర్తి

ధరణి పోర్టలో అక్రమాల నేపథ్యంలో భూభారతి అమల్లోకి

పొంగులేటి నాయకతమంటే సంస్కరణలకు కొత్తబాట వేసినట్టే

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌ మరియు ఐÊ బి శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు సం బంధించిన శాఖల్లో సమూలమైన మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందాలన్న లక్ష్యంతో ఈ సంస్కరణలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే శాఖ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ కావడంతో, అమ్మకాలు కొనుగోళ్లు జరిపే ప్రజలకు అన్నిరకాల సదుపాయాలు, సత్వరమే పనులు పూర్తవడానికి వీలుగా ఈశాఖలో మార్పులను అమల్లోకి తెచ్చారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లకోసంవచ్చేవారు ,కార్యాలయాల్లో తగిన సదుపాయాలు లేకపోవడంతో బయట ఎక్కడో చెట్లకింద, హోటళ్లలో కూర్చొని నానా అగచాట్లు పడుతున్నారు. అదీకాకుండా రాతపోతలు, స్టాంపుల కొనుగోలు వంటి వాటికోసం సమీపంలోని డాక్యుమెంట్‌ రైటర్లను ఆశ్రయించడం, పని పూర్తయ్యేవరకు బjట రోడ్లపై కాలక్షేపం చేయాల్సి వస్తోంది. ఇటువంటి దుస్థితిని నివారించేందుకు పొం గులేటి శ్రీని వాసరెడ్డి రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు అధికార్లకు ఆదేశాలు జారీచే శారు. ఇదేసమయంలో రాష్ట్రంలో చాలా రిజిస్ట్రార్‌, సబ్‌`రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఇప్పుడు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సొంతభవనాలను దశలవారీగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు కొత్తగా నిర్మించే కార్యాలయాల్లో విజిటర్స్‌ కోసం ప్రత్యే కంగా విశాలమైన హాలు వుండేలా చూస్తున్నారు. దీనివల్ల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిరిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయానికి వచ్చేవారు ఈ హాల్లో కూర్చోవచ్చు. అదేవిధంగా తాగునీరు మరియు ఇతర సదుపాయాల కల్పనకు పొంగులేటి చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలావుండగా రిజిస్ట్రేషన్‌ శాఖలో కార్యకలాపాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా పొంగులేటి ఆదేశాలతో అధికార్లు స్లాట్‌ బుకింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వ్యవసాయేతర స్థిరాస్తుల అమ్మకాలు`కొనుగోళ్లకు సంబంధించి ఈ స్లాట్‌ బుకింగ్‌ సబ్‌`రిజిస్ట్రార్‌ మరియు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అందుబాటులో వుంటాయి. అయితే దీన్ని దశలవారీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పుడు అమలు జరుపబోయే స్లాట్‌ విధానంలో మొత్తం పనిగంటలను 48 స్లాట్లుగా విభజించారు. ముఖ్యంగా దరఖాస్తుల వెల్లువను, విపరీతమైన రద్దీని నివారించేందుకు ఈవిధానం పనికొస్తుందని మంత్రి పొంగులేటి తెలి పారు. ఇదే సమయంలో ఒకే ఆస్తిని రెండు రిజిస్ట్రేషన్లు చేసే అవకాశాలను నిరోధించేందుకు కూడా ఈ స్లాట్‌ వ్యవస్థ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ చ ట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు. ఈ సరికొత్త విధానం కింద రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు కేవలం 10 నుంచి 15 నిముషాల్లో పూర్తికానున్నాయి. అయితే అత్యవసరంగా రిజిస్ట్రేషన్‌ అవసరమైన వారు, స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం వుండదు కనుక, అటువంటివారు సాయంత్రం 5 నుంచి 6 గంటలలోపు తమ రిజిస్ట్రేషన్లను పూర్తిచేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిం చింది.
దరఖాస్తు దారులు తెలంగాణ ప్రభుత్వ పోర్టల్‌లోకి వెళ్లి తమకు అనుకూలమైన తేదీలో స్లాట్‌ను బుక్‌చేసుకోవాల్సి వుంటుంది. తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం 144 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో24 కార్యాలయాల్లో ఈ స్లాట్‌ బుకింగ్‌ను అమలు చేయనున్నారు. ఈ 24 కార్యాలయాలు వరు సగా అజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి, సదాశివపేట, ఖుద్బుల్లాపూర్‌, వల్లభ్‌నగర్‌, షంషాబాద్‌, సరూర్‌నగర్‌, చంపాపేట్‌, పెద్దపల్లి, రామగుండం, కూసుమంచి, ఖమ్మం (ఆర్‌.ఒ), మేడ్చెల్‌ (ఆర్‌.ఒ), మహబూబ్‌నగర్‌ (ఆర్‌.ఒ), జగిత్యాల్‌, నిర్మల్‌, వరంగల్‌ కోట, వరంగల్‌ రూరల్‌, కొత్త గూడెం, ఆర్మూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌ మరియు నాగర్‌కర్నూల్‌.
పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉదాహరణకు, మేడ్చెల్‌, ఖుద్బుల్లాపూర్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయల్లో పని ఒత్తిడి అధికంగా వుంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒత్తిడిని తట్టుకు నేందుకు మరో ఇద్దరు`సబ్‌ రిజిస్ట్రార్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు కార్యాయాల్లో స్లాట్లను 144కు పెంచారు. ఇదేసమయంలో సబ్‌`రిజిస్ట్రార్లకు సమానంగా పని బాధ్యతలు అప్పగించడం వల్ల, ఏ ఒక్కరిమీదో పని ఒత్తిడి పూర్తిగా పడే అవకాశముండదు. ఉ దాహరణకు చంపాపేట్‌, సరూర్‌నగర్‌ రిజిస్ట్రార్లను అనుసంధానం చేయడం ద్వారా వేగంగా రిజిస్ట్రేషన్లు పూర్తికావడమే కాదు, ఎంతో సమయం కలిసొస్తుంది. ఈ అధునిక విధానంలో పొంగులేని నేత్వృంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం దరఖాస్తుదారులే తమ డాక్యుమెంట్లను పూర్తిచేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు మంత్రి నిర్దేశం మేరకు రిజి స్ట్రేషన్‌ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో ఒక మాడ్యూల్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీని ప్రకారం దరఖాస్తుదారులు తమ డాక్యుమెంట్లను పూర్తిచేసుకోవచ్చు. ప్రారంభంలో దీన్ని సేల్‌డీడ్‌లకు వ ర్తింపజేస్తారు. అయితే ఆవిధంగా పూర్తిచేయడం ఐచ్ఛికం కూడా. దీనివ్ల డాక్యుమెంట్‌ రైటర్లపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం డాక్యుమెంట్లపై అన్‌లైన్‌ లో సంతకం చేసే విధానాన్ని (ఇ`సైనింగ్‌) అందుబాలోకి తెచ్చింది. దీనివల్ల సమయాభావం బాగా తగ్గుతుంది. దీనివల్ల పార్టీలు, సాక్షుల సంతకాల సేకరణ మరింత సులువు కాగలదు.
అంతకుముందు ఈ ఏడాది మొదట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వం వహిస్తున్న రెవెన్యూ శాఖలో కూడా ‘భూభాతి’ పేరుతో పూర్తి సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం గత శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందింది. గవర్నర్‌ జిష్నుదేవ్‌వర్మ భూభారతి (రికార్డు హక్కులు) చట్టానికి ఆమోదముద్ర వేయ డంతో ఇది అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటివరకు అమల్లో వున్న రెవెన్యూచట్టం`2020 రద్ద యింది. దీనికింద అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ ధరణి పోర్టల్‌పై అనేక ఫిర్యాదులు రావడంతో, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం దాని స్థానంలో ‘భూభారతి’ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇప్పటివరకు వు న్న ధరణి డిజిటల్‌ ప్లాట్‌ఫాం స్థానంలో భూభారతి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ అమల్లోకి వచ్చింది. పొంగులేటి మంత్రిగా వున్న రెవెన్యూ, రిజ్రిస్ట్రేషన్‌ మంత్రిత్వశాఖల్లో విప్లవాత్మక మార్పులు రావడంవిశేషం.
సంస్కరణాభిలాషి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంజిల్లా వాసి. ఆయన 2014లో వైఎస్‌ఆర్‌సీపీ తరపున ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎం.పి.గా ఎన్నికయ్యారు. తర్వాత కెసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రసమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌స్‌ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన లింగాల కమలరాజుకు మద్దతు ఇచ్చారు. అయితే 2023లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్‌ పార్టీనుంచి సస్పెండ్‌ చేశారు. తర్వాత 2023 జులై 2 ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదేరోజు ఖమ్మంలో ‘తెలంగాణ జన గర్జన’ పేరుతో ఖమ్మంలో పెద్ద బహిరంగసభ జరిగింది. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఆయన సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి 56,650 ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ, హౌజింగ్‌ మరియు సమాచార మంత్రిత్వశాఖలను నిర్వహిస్తున్నారు.

వధూవరులను ఆశీర్వదించిన కరుణాకర్ రెడ్డి.

వధూవరులను ఆశీర్వదించిన కరుణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రానికి చెందిన పోతర్ల రమాదేవి రవీందర్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ వెడ్స్ భవాని రిసెప్షన్ వేడుకలకు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు నారగాని దేవేందర్ గౌడ్ కట్ల శంకర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు గాజర్ల చింటూ గౌడ్, మార్క సాయి గౌడ్, ఎండి వాజిత్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

కోటగుళ్ళు గోశాల గోమాతలకు దానా బస్తాల వితరణ.

కోటగుళ్ళు గోశాల గోమాతలకు దానా బస్తాల వితరణ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు గోశాల గోమాతలకు గణపురం మండల కేంద్రానికి చెందిన పెద్దపల్లి విరాట్ చారి రమాదేవి ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు గోశాల గోమాతలకు దానా బస్తాలు అందజేసిన దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

వనపర్తి లో ఉపాధ్యాయుల.!

వనపర్తి లో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

వనపర్తి నేటిధాత్రి :

జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ సురభి మరియు విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ వనపర్తి లో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ శిబిరాన్ని సందర్శిం చారు. జిల్లా కలెక్టర్ మ్యాథమెటిక్స్ శిక్షణ శిబిరాన్ని సందర్శించి ఉపాధ్యాయులతో గణిత శాస్త్రం యొక్క లోటుపాట్లను చర్చిం చారు. వనపర్తి జిల్లాలో 450 పదవ తరగతి విద్యార్థులు గణిత శాస్త్రములో ఫెయిల్ అయినారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోనే వెనుకబడిన విద్యార్థులకు ప్రాథమిక గణిత శాస్త్రం యొక్క పద్ధతులను తార్కిక ఆలోచన పద్ధతులను కాన్సెప్ట్ వారిగా విద్యార్థులకు బోధించాలని సూచించారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో తమ ప్రతిభను మెరుగుపరచుకుంటే మిగతా అన్ని సబ్జెక్టులలో గణితశాస్త్ర ప్రభావంతో అన్ని అంశాలలో చురుకుగా విద్యార్థులు ఉంటారని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గణిత శాస్త్ర అభివృద్ధి కొరకు విద్యార్థులలో తగు మెలకువలు నేర్పించుట కొరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్క విద్యార్థి పదవ తరగతిలో ఉత్తీర్ణులు అగుటకు తన వంతు సహాయం చేస్తానని దానికి కొరకు ఉపాధ్యాయులు తగిన సమయం కేటాయించి విద్యార్థులకు గణితశాస్త్రం మెలకువలను నేర్పాలని సూచించినారు.
కలెక్టర్ వెంట రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి మేడం జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ గారు పరీక్షల నిర్వహణ విభాగం అధికారి గణేష్ జిల్లా సమన్వయకర్తలు శేఖర్ మహానంది యుగంధర్ సెంటర్ ఇన్చార్జిలు ఆనంద్ గురురాజు గారు జిల్లా రిసోర్స్ పర్సన్స్ లు పాల్గొన్నారు

ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్.

వనపర్తి లో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

వనపర్తి నేటిధాత్రి :

 

జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ సురభి మరియు విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ వనపర్తి లో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ శిబిరాన్ని సందర్శిం చారు. జిల్లా కలెక్టర్ మ్యాథమెటిక్స్ శిక్షణ శిబిరాన్ని సందర్శించి ఉపాధ్యాయులతో గణిత శాస్త్రం యొక్క లోటుపాట్లను చర్చిం చారు. వనపర్తి జిల్లాలో 450 పదవ తరగతి విద్యార్థులు గణిత శాస్త్రములో ఫెయిల్ అయినారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోనే వెనుకబడిన విద్యార్థులకు ప్రాథమిక గణిత శాస్త్రం యొక్క పద్ధతులను తార్కిక ఆలోచన పద్ధతులను కాన్సెప్ట్ వారిగా విద్యార్థులకు బోధించాలని సూచించారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో తమ ప్రతిభను మెరుగుపరచుకుంటే మిగతా అన్ని సబ్జెక్టులలో గణితశాస్త్ర ప్రభావంతో అన్ని అంశాలలో చురుకుగా విద్యార్థులు ఉంటారని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గణిత శాస్త్ర అభివృద్ధి కొరకు విద్యార్థులలో తగు మెలకువలు నేర్పించుట కొరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్క విద్యార్థి పదవ తరగతిలో ఉత్తీర్ణులు అగుటకు తన వంతు సహాయం చేస్తానని దానికి కొరకు ఉపాధ్యాయులు తగిన సమయం కేటాయించి విద్యార్థులకు గణితశాస్త్రం మెలకువలను నేర్పాలని సూచించినారు.
కలెక్టర్ వెంట రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి మేడం జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ గారు పరీక్షల నిర్వహణ విభాగం అధికారి గణేష్ జిల్లా సమన్వయకర్తలు శేఖర్ మహానంది యుగంధర్ సెంటర్ ఇన్చార్జిలు ఆనంద్ గురురాజు గారు జిల్లా రిసోర్స్ పర్సన్స్ లు పాల్గొన్నారు

కాసింపూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

కాసింపూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం..

నిజాంపేట నేటి ధాత్రి:

నిజాంపేట మండల పరిధిలోని కాసింపూర్ గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున 5 లక్షల వ్యయంతో శుక్రవారం గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణ పనులకు సహకరించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ నాయకులు నీలం కనకరాజు,కుంటకనకరాజు, దావీద్,ప్రశాంత్,మధు, రవి,స్వామి,కొమురయ్య, బిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.

గట్లకానిపర్తి గ్రామంలో వారం సంత ప్రారంభం.

గట్లకానిపర్తి గ్రామంలో వారం సంత ప్రారంభం

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం గట్లకా నిపర్తి గ్రామంలో వారం సంత ( ఒక రోజు అంగడి ) ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇట్టి కార్యక్ర మంలో డైలీ వజెస్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, జర్నలిస్టులు, మహిళలు, యువతీ యువకులు, వ్యాపారస్థులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సంత ను ప్రారంభించడం జరిగింది. గ్రామంలో ఏర్పాటు చేసిన సంతలో దాదాపు 33 మంది వ్యాపారస్థులు తమ స్థాళ్ళను ఓపెన్ చేసి ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇట్టి సంతలో గట్లకానిపర్తి ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల ఉన్న సూరంపేట్, పులుకుర్తి, నర్సింహులపల్లి మరియు పోచారం గ్రామాల ప్రజలు తమకు కావాల్సిన సరుకులు తీసుకోవడం జరిగింది. పలు గ్రామాలనుండి వ్యాపారస్థులు వచ్చి సంతలో స్టాళ్ళు ఏర్పా టు చేయడం జరిగింది.గ్రామం లో ఏర్పాటు చేసిన వారం సంత గ్రామ ప్రజలకు మరియు చుట్టు ప్రక్కన ఉన్న గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగక రంగా ఉందని సంత ఏర్పా టుకు కృషి చేసిన గ్రామ అభివృద్ధి కమిటీని ప్రజలు అభినందించడం జరిగింది.

రక్షణ శాఖకు 50 వేల కోట్ల.

రక్షణ శాఖకు 50 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం

వనపర్తి నేటిధాత్రి:

చైనా పాకిస్తాన్ నుంచి భద్రతా సవాళ్లు ఎదుర్కొంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమీషా.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రక్షణ శాజకు 50 వేల కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ వనపర్తి న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ పై మాట్లాడుతూ ఇది ప్రపంచ దేశాలలోనే చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. ఏ దేశంలో రక్షణ రంగానికి కేటాయించని బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 7 లక్షల కోట్లు దాటిందని గతంలో ఉన్న 6.81 లక్షల కోట్లు ఉందని వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో మరో 50 వేల కోట్లు కేటాయించడం వల్ల రక్షణ రంగం బడ్జెట్ ఏడు లక్షల కోట్లకు దాటిపోతుందని ఆయన అన్నారు. భారత సరిహద్దులు నిరంతరం నిలువ నీడ లేకుండా ఎండ.

Bharatiya Janata Party.

వర్షం. చలి లెక్కచేయకుండా రక్షణ దళాలు దేశ రక్షణ కోసం కాపలా కాస్తున్నారని దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఎంతటికైనా త్యాగం చేస్తుందని అందుకే అధునాతన ఆయుధాల కొనుగోలు కోసం లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపుతూ వీరోచితంగా దేశ సైనికులు కుటుంబాలను వదులుకొని పనిచేస్తున్నారని దేశ సైనికులు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులలో 26 మంది ప్రయాణికులు మరణించడం నా తర్వాత జరిగిన పరిణామాల వల్ల పాకిస్తాన్ భారత్ మధ్యన జరుగుతున్న అంతర్గత పోరాటం అందరికీ తెలిసిన విషయం అయినా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రముకలను తుద ముట్టించడంలో పై చేయి సాధించిందని ఆయన అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగానికి దేశ సరిహద్దుల్లో భద్రత కాస్తున్న భద్రత దళాలకు ఈ బడ్జెట్ ధైర్యాన్ని నింపుతుందని సైనికులలో ఆత్మ సైర్యాని కోల్పోకుండా గుండె ధైర్యం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.బడ్జెట్ మరింత పెంచినందుకు భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి దేశ ప్రజల తరపున ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ కి మున్నూర్ రవీందర్ కృతజ్ఞతలు  తెలిపారు

రక్షణ శాఖకు 50 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు.

రక్షణ శాఖకు 50 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం

వనపర్తి నేటిధాత్రి:

 

 

 

చైనా పాకిస్తాన్ నుంచి భద్రతా సవాళ్లు ఎదుర్కొంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమీషా.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రక్షణ శాజకు 50 వేల కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ వనపర్తి న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ పై మాట్లాడుతూ ఇది ప్రపంచ దేశాలలోనే చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. ఏ దేశంలో రక్షణ రంగానికి కేటాయించని బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 7 లక్షల కోట్లు దాటిందని గతంలో ఉన్న 6.81 లక్షల కోట్లు ఉందని వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో మరో 50 వేల కోట్లు కేటాయించడం వల్ల రక్షణ రంగం బడ్జెట్ ఏడు లక్షల కోట్లకు దాటిపోతుందని ఆయన అన్నారు.

BJP State Council Member

 

భారత సరిహద్దులు నిరంతరం నిలువ నీడ లేకుండా ఎండ. వర్షం. చలి లెక్కచేయకుండా రక్షణ దళాలు దేశ రక్షణ కోసం కాపలా కాస్తున్నారని దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఎంతటికైనా త్యాగం చేస్తుందని అందుకే అధునాతన ఆయుధాల కొనుగోలు కోసం లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపుతూ వీరోచితంగా దేశ సైనికులు కుటుంబాలను వదులుకొని పనిచేస్తున్నారని దేశ సైనికులు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులలో 26 మంది ప్రయాణికులు మరణించడం నా తర్వాత జరిగిన పరిణామాల వల్ల పాకిస్తాన్ భారత్ మధ్యన జరుగుతున్న అంతర్గత పోరాటం అందరికీ తెలిసిన విషయం అయినా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రముకలను తుద ముట్టించడంలో పై చేయి సాధించిందని ఆయన అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగానికి దేశ సరిహద్దుల్లో భద్రత కాస్తున్న భద్రత దళాలకు ఈ బడ్జెట్ ధైర్యాన్ని నింపుతుందని సైనికులలో ఆత్మ సైర్యాని కోల్పోకుండా గుండె ధైర్యం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.బడ్జెట్ మరింత పెంచినందుకు భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి దేశ ప్రజల తరపున ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ కి మున్నూర్ రవీందర్ కృతజ్ఞతలు  తెలిపారు

బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు.

బి ఆర్ ఎస్. నాయకుల ముందస్తు అరెస్టులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

.తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధును. ఈరోజు తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జిల్లాకు అధికార పార్టీ నాయకులు మంత్రులు ఎప్పుడు వచ్చిన ముందస్తు అరెస్టు చేయడం సరికాదని ఈ సందర్భంగా. తెలియజేస్తూఎప్పుడు. ఎ నాడు భయపడలేదని తెలంగాణ ఉద్యమంలో ఎన్నో జైలు జీవితాలు గడిపామని ఎన్నో అరెస్టులు అయ్యామని ఈ సందర్భంగా తెలియజేశారు అరెస్టు అయిన పరామర్శించిన తంగళ్ళపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజన్న బిఆర్ఎస్ మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు పడిగల రాజు. ఎగుమామిడి వెంకటరమణారెడ్డి .మాజీ. రవి. తంగళ్ళపల్లి మండల. జాగృతి అధ్యక్షులు. కందుకూరి రామ గౌడ్. జగత్.గుండు ప్రేమ్ కుమార్.. నాయకులు మాట్లాడుతూఇకముందు అయినా అధికార పార్టీ నాయకులు గాని మంత్రులుగాని జిల్లా పర్యటన సందర్భంలో ఇలాంటి అరెస్టు చేయడం సరికాదని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అధికారం ఉందని అది అందరిసొత్తు కాదని. దృష్టిలో ఉంచుకొని అక్రమ అరెస్టులు చేయడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేశారు

11KVవైర్లు వేలాడుతున్న పట్టించుకోని అధికారులు.

11 కెవి వైర్లు వేలాడుతున్న పట్టించుకోని అధికారులు

నిజాంపేట్, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామ రైస్ మిల్ పక్కన రైతు టేకుమల్లె యాదయ్య పోలంలో వేలాడుతున్న 11 కెవి కరెంటు వైర్లు నెత్తి పైన మీటర్ దూరంలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. అని ఎన్నిసార్లు సంబంధిత లైన్మెన్ కు విద్యుత్ అధికారులకు తెలిపిన ఫలితం లేకుండా ఉందని ప్రస్తుతం ఆ స్థలంలో వరి పంటలు కోసి ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సందర్శించి ఆ యొక్క వేలాడుతున్న వైర్ల నుంచి ప్రమాదం జరగకుండా కాపాడుతారని రైతు యాదయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత విద్యుత్ అధికారులు బాధ్యత వహించాలని రైతు యాదయ్య తెలిపారు.

వినూత్న రీతిలో పిటిఎం.

వినూత్న రీతిలో పిటిఎం

నడికూడ నేటిధాత్రి:

 

ప్రజల వద్దకే పాలన అన్నట్లుగా నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఉపాధి హామీ కార్మికుల వద్ద వినూత్న రీతిలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారముగా ప్రతి శుక్రవారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశము ఏర్పాటు చేయవలసి ఉన్నది.ఈరోజు శుక్రవారం అయినందున ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ రెండు రోజుల ముందుగానే తల్లిదండ్రులకు సమావేశం యొక్క వివరాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియచేసినప్పటికీ పాఠశాలకు ఎవరు రాకపోవడం వలన వారు ఎక్కడున్నారో తెలుసుకుని ఉపాధి హామీ పని చేస్తున్న దగ్గరకు వెళ్లి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు,ఉచిత యూనిఫామ్స్,రాగి జావా, మధ్యాహ్న భోజనం,ఉచిత నోట్ బుక్స్ గురించి తెలియజేశారు.అదే విధంగా మధ్యలో చదువు మానేసినటువంటి వారికి ఓపెన్ ఇంటర్లో గాని, ఓపెన్ టెన్త్ లో కానీ దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చర్లపల్లి లో కానీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపర్తిలో కానీ జైన్ కావాలని సూచించారు.వయోజనుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమం గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మండలం లో ఉన్న ఉగ్రవాదులను వెంటనే గుర్తించాలి.

మండలం లో ఉన్న ఉగ్రవాదులను వెంటనే గుర్తించాలి :-

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన మండల కేంద్రానికి చెందిన ఎండి ముజాహిద్ అనే వ్యక్తి మీద రామడుగు పోలీసు స్టేషన్ లో పిటీషన్ ఇవ్వడం జరిగినది.

 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని, భారత ప్రధాని నరేంద్రమోదీ మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి మూడు రోజులు గడుస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

సాక్షాత్తు దేశ ప్రధాని జైలుకి వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో పెడితే ఇంటెలీజిన్స్ డిపార్ట్మెంట్ ఎంచేస్తుందని ప్రశ్నించారు.

 

పాకిస్థాన్ లో ఉన్నటువంటి అధైల్ జైల్ ఈవ్యక్తికి ఎలా తెలుసని, మరి అతడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

వెంటనే ఆవ్యక్తిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టి, అతడికి ఉన్న ఉగ్రవాద సంబంధాలు బయట పెట్టాలని కోరారు. మండలంలో ఉన్న పలు మదర్సలో ఇతర దేశస్తులు నివాసిస్తున్నారని వెంటనే వారిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

మోడీ మీద పోస్టు చేసిన ఈవ్యక్తి మీద వెంటనే దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని, అతడిని ప్రభుత్వ ఉద్యోగం విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈసందర్భంగా అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్లలో కి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

వెంటనే ఆవ్యక్తి మీద కేసు నమోదు చేయాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని బిష్మించుకొని ఉండడంతో కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు కారుపాకల అంజిబాబు, జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శి కడారి స్వామి

జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిట్టవేణి అంజిబాబు, బద్ధం లక్ష్మారెడ్డి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శిలు ఎడవెల్లి లక్ష్మణ్, బండారి శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు గోపు అనంత రెడ్డి, దయ్యాల వీరమల్లు, దైవల తిరుపతి, రాగం కనకయ్య, జంగిలి కరుణాకర్, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.

చిన్న దోమలు ప్రాణంతకమైనవి.

చిన్న దోమలు ప్రాణంతకమైనవి

మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం నేటి ధాత్రి:

జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశానుసారము మండల వైద్యాధికారి అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి మండలంలో డెంగ్యూ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భాగంగా సిబ్బంది ప్రజలకు వినిపించేలా దోమతెరలు వాడండి దోమ కాటు నుండి రక్షణ పొందండి చిన్న దోమ ప్రాణాంతకమైనది దోమలు ప్రజారోగ్యానికి ప్రాణాంతకమైనవి నిలువ నీళ్లు దోమలకు ఇల్లు వేపాకు పొగ దోమలకు సెగ ప్రతి శుక్రవారం మరియు మంగళవారము డ్రైడే పాటించాలని చెప్పుతూ స్లొగన్స్ ఇవ్వడంతోపాటు ర్యాలీ నిర్వహించారు వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని తన ఇంటి చుట్టూ నీరు నిల్వలు ఉండకుండా చూసుకోవాలని జ్వరం వచ్చిన వెంటనే ఆరోగ్య కేంద్రం కు వచ్చి డాక్టర్ని సంప్రదించాలని తెలుపుతూ డెంగ్యూ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బంది పి ఎచ్ ఎన్ గ్రేసీ మను స్టాఫ్ నర్స్ రవళి ఝాన్సీ ఎల్ టీ అనిల్ పార్మాసిస్ట్ జగదీశ్ ఎ ఎన్ ఏమ్స్ స్రవంతి రమాదేవి దుర్గ కళావతి సునీత ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఇంచార్జి లు బొల్లం దీప్తి లావణ్య శ్రీను పాల్గొన్నారు

అక్కన్నపేటలో బడిబాట కార్యక్రమం.

అక్కన్నపేటలో బడిబాట కార్యక్రమం.

రామాయంపేట మే 16 నేటి ధాత్రి (మెదక్):

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో బడిబాట కార్యక్రమం శుక్రవారం అక్కన్నపేట ఎంపీపీ ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సేవలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు. ప్రభుత్వ బడుల్లో అందుతున్న ఉచిత విద్య, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ తదితర అంశాలను గ్రామంలో తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట ఎంపీపీ ఎస్ హెచ్ఎం సావిత్రి, ఉపాధ్యాయులు రాoచంద్రారెడ్డి, సాయి చందర్, పంచాయతీ కార్యదర్శి సరితా దేవి, మాజీ ఉపసర్పంచ్ గంగాధర్, మరియు శ్రీనివాస్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version