ఈ నెల 18న అమోఘ్ లీలా ప్రభుజీ బీదర్ రాక.

ఈ నెల 18న అమోఘ్ లీలా ప్రభుజీ బీదర్ రాక.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణంలోని జగన్నాథ్ మందిరానికి ఈనెల 18న ప్రముఖ ఆధాత్మిక ప్రవచన కర్త శ్రీ ఆమోఘ్ లీలా ప్రభుజీ దాస్ రానున్నట్లు 11 జగన్నాథ్ మందిరం ప్రతినిధులు డాక్టర్ నీలేష్ ప్రభుజీ తెలిపారు. ఆ రోజు 12 గంటలకు బీదర్ పట్టణంలోని షాపూర్ గేట్ కు చేరుకుంటారని అన్నారు. అక్కడినుండి బైక్ ర్యాలీ తో పాటు కీర్త నలు చేస్తూ శోభా యాత్ర జరుపుతూ మధ్యాహ్నం 2 గంటలకు జగన్నాథ్ మందిరం చేరుకుంటారని వివరించారు. సాయంత్రం 5 గంటలకు ప్రభుజీ ప్రవచనం, మహాప్రసాదం ఉంటుందని తెలిపారు. మరుసటి రోజు 19న ఉదయం ప్రభుజీ బీదర్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలైన నర్సింహా స్వామి ఝర్నా, పాపనాశ్ మందిరాలను సందర్శిస్తారన్నారు అనంతరం జగన్నాథ్ మందిరంలో భాగవత్ కథ, భక్తులతో ముఖాముఖి, ఆధ్యాత్మిక విషయాలలో సందేహాలు వాటి నివృత్తి, నరసింహ హారతి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. జహీరాబాద్ ప్రాంతం నుండి వచ్చే భక్తులకు రెండు రోజుల పాటు మహాప్ర సాదం ఉంటుందని తెలియజేసారు. భక్తులందరూ సాంప్రదాయ వస్త్రధార ణతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version