ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
మిషన్ భగీరథ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ జహీరాబాద్ డివిజన్ నూతన డి. ఈ గా నియమితులైన జి. సృజన్ చక్రవర్తి గురువారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, మాజీ మంత్రి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్లను మర్యాదపూర్వకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డివిజన్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల వివరాలను ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్ లకు డి ఈ సృజన్ చక్రవర్తి వివరించారు.
◆- అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల్ తాజా మాజీ మండల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ పాలనలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. 50 సంవత్సరాలలో జరుగని అభివృద్ధి గత ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో జరిగి దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్న ఒక్క బిల్లు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామాల అభివృద్ధికి అప్పులు తెచ్చి పనులు చేసామన్నారు. పనులకు సంబందించిన బిల్లులు రాకపోవడంతో కొందరు మాజీ సర్పంచ్లు తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సీఎం రేవంత్రెడ్డికి చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాజీ సర్పంచ్లను ఆదుకోవాలని కోరారు.
ప్రపంచ మీడియా, మేధోమదన సంస్థల్లోకి చొచ్చుకెళ్లిన చైనా
అందువల్లనే ఈ తప్పుడు కథనాల ప్రవాహం
ఎంత తప్పుడు ప్రచారం చేసినా అది తాత్కాలికమే
నిజం కచ్చితంగా బయటపడుతుంది
భారత్ ముందు చైనా ఆయుధాలు ఎందుకూ కొరగావన్న సత్యం వెల్లడైంది
ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు భారత్ వైపు
భారత్ నెత్తిన పాలుపోసిన పాకిస్తాన్
మన రక్షణ ఎగుమతులు మరింతగా పెరిగే అవకాశం
ఆసియా, ఆఫ్రికా దేశాలు చైనాను నమ్మలేని పరిస్థితి
హైదరాబాద్,నేటిధాత్రి:
భారత్‌ాపాకిస్తాన్‌ల మధ్య సంఘర్షణలు జరుగుతున్న వేళ, చైనా, తుర్కియేలు విపరీతంగా తప్పుడు ప్రచారాన్ని కొనసాగించాయి. జరిగిన వాస్తవానికి పూర్తి భిన్నంగా వీటి ప్రచారం వున్న నేప థ్యంలో, వీటి ఓవర్ యాక్షన్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ టైమ్స్‌కు చెందిన ఎక్స్ ఖాతాను బ్లాక్ చేయడమేకాదు తుర్కియే బ్రాడ్‌కాస్ట్ టీఆర్‌టీపై నిషేధం విధించింది. పహల్గామ్ సంఘటన తర్వాత భారత్ చేపట్టిన చర్యల నేపథ్యంలో గ్లోబల్ టైమ్స్ పాక్‌కు అనుకూలంగా వార్తా కథనాలను రాసింది. అంతేకాకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసింది. ఉగ్రవాదుల స్థావరాలను ప్రపంచ దేశాలు సమర్థిస్తుంటే, చైనా మీడియా వీటిపై తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. నిజానికి ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు అండగా చైనా, తుర్కియే, అజర్‌బైజాన్ లు నిలిచాయి. ఈ ఆపరేషన్‌కు ముందే ఎప్పటినుంచో చైనా తన రక్షణ ఉత్పత్తులను పాక్‌కు ఎగుమతి చేయగా, తుర్కియే ఆపరేషన్ సమయంలో కొన్ని వందల డ్రోన్లను పాకిస్తాన్‌కు అందజే సింది. అంతేకాకుండా వాటిని ఉపయోగించే విషయంలో శిక్షణ ఇచ్చేందుకు తన సైనికులను కూడా పంపినట్లు ఇప్పుడిప్పుడే స్పష్టమైన సమాచారం అందుతోంది. ముఖ్యంగా భారత్ చేసిన దాడుల్లో ఇద్దరు తుర్కియే సైనికులున్నారన్న సంగతి కూడా బయటపడిరది. తాజాగా చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల పేర్లను మార్చేసింది. దీంతో భారత్ దీనిపై తీవ్ర అభ్యంత రం తెలపడమే కాదు, పేర్లు మార్చినంతమాత్రాన వాస్తవాలు మారిపోవు. అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికీ భారత్‌లో భాగమనేనని మన విదేశాంగశాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.
కాల్పుల విరమణకోసం భారత్ కోరిందంటూ ప్రచారం
కాల్పుల విరమణ ప్రకటన వెలువడగానే ఒక్కసారిగా పాశ్చాత్య మీడియా, ఇందుకు భారత్ భారత్ అభ్యర్థించిందని లేదా అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం తో ఒప్పుకున్నదంటూ అసత్య ప్రచారం మొదలుపెట్టింది. ఈవిధంగా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ సాధించిన ఆధిపత్యాన్ని, మరింత బలపడిన నరేంద్రమోదీని బలహీన పరచడానికి ఒక పద్ధతి ప్రకారం మీడియా దుష్ప్రచారం చేసింది. ముఖ్యంగా చైనా ఆయుధసంపత్తి ఎంతోఆధునికమైనది మాత్రమే కాదు శత్రు దుర్భేద్యమంటూ ఊదరకొట్టేశాయి. నిజానికి పాక్ ఉపయోగించిన చైనా రక్షణ వ్యవస్థలు, చైనా విమానాలను భారత్ తుత్తినియలు చేసింది. జరిగిన ఈ అసలు విషయాన్ని కావాలనే తొక్కిపట్టడం ద్వారా, భారత్ సాయుధ సంపత్తి బలాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువ చేసి చూపడం ప్రధాన లక్ష్యంగా ఈ మీడియా ప్రచారం కొనసా గింది. ఇదే సమయంలో ఈ ఆపరేషన్‌లో భారత్ తీవ్ర నష్టాలను చవిచూస్తున్నదని, పాకిస్తాన్ అ ప్రతిహతంగా విజయపథంలో పయనిస్తున్నదంటూ పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడ్డా యి. పాక్‌కు చైనా సరఫరా చేసిన అత్యాధునిక ఆయుధ సంపత్తి మొత్తం తుక్కుగా మారిపోతున్న తరుణంలో, పాక్ విజయాన్ని, చైనా సామర్థ్యాన్ని ఆకాశానికెత్తేస్తూ అంతర్జాతీయ మీడియా రా స్తున్న కథనాల వెనుక అసలు కారణమేంటి?
తప్పుడు కథనాలు
నిజానికి అమెరికా ఒత్తిడి మేరకు పాక్ డీజీఎంఓ, మనదేశ డీజీఎంఓకు ఫోన్ చేసిన తర్వాత మాత్రమే కాల్పుల విరమణకు కేంద్రం అంగీకరించింది. కానీ పాశ్చాత్య మీడియా కథనాలు భారత్ ముందుగా కాల్పుల విమరణ కోరుకున్నదని పేర్కొన్నాయి. అంటే ఓటమి భయంతో భారత్ ముందుగానే కాల్పుల విరమణకు ముందుకొచ్చిందన్న రీతిలో వీటి రాతలు కొనసాగాయి. కేవ లం ‘పరస్పర అవగాహనతో’ తీసుకున్న చర్యమాత్రమేనని, కాల్పుల విమరణ కాదని భారత్ ఎంతగా చెప్పినా ఈ మీడియా పట్టించుకోలేదు. ఈవిధంగా భారత్ నియంత్రణ సామర్థ్యాన్ని, మొ త్తం ఆపరేషన్ నిర్వహించిన తీరును తక్కువచేసి చూపడానికే యత్నం జరిగింది. ముఖ్యంగా అ మెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ల ఒత్తిడికి నరేంద్రమోదీ లంగిపోయారని పాశ్చాత్యమీడియా ప్రచారం చేసింది. ఆవిధంగా అంతర్జాతీయంగా ఎంతో దృఢమైన నాయకుడిగా, విస్పష్టవైఖరితో కూడిన దౌత్యాన్ని నెరపుతారని నరేంద్రమోదీ పొందిన గుర్తింపును దెబ్బతీయాలన్న పన్నాగం ఈ రాతల వెనుక సుస్పష్టంగా కనిపించింది. నిజానికి ఈవిధంగా ఒక లక్ష్యంతో వ్యూహం ప్రకారం పనిచేసిన మీడియా కేవలం నరేంద్రమోదీపైన మాత్రమే కాదు డోనాల్డ్ ట్రంప్ సామర్థ్యంపై కూడా అనుమానాలు కలిగేలా వార్తలు వండివార్చింది. ముఖ్యంగా కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇది కనీసం రెండున్నర గంటలు కూడా అమల్లో లేదని, తర్వాత కాల్పులు మళ్లీ మొదలయ్యాయంటూ చెప్పడం ద్వారా, ట్రంప్ యంత్రాంగం భారత్`పాకిస్తాన్‌లను కాల్పుల విరమణను పాటించేలా చేయడంతో విఫలమైందని పేర్కొనడం ద్వారా, ప్రపంచ వ్యాప్తంగా అమెరికా పలుకుబడి క్షీణిస్తున్నదనడానికి దీన్ని ఉదాహరణగా చూపడానికి యత్నించింది.
పాశ్చాత్య మీడియాపై చైనా పలుకుబడి
ఈవిధమైన మీడియా రాతలను పరిశీలిస్తే పశ్చిమదేశాల మీడియా సంస్థలపై చైనా పలుకుబడి ఏవిధంగా వున్నదీ అర్థమవుతుంది. పాశ్చాత్య దేశాల విశ్వవిద్యాలయాలు, పలుకుబడి కలిగిన మేధావులు, మీడియా సంస్థల్లో చైనా పలుకుబడి వేళ్లూనుకొని పోవడంతో, దీన్ని ప్రతి అంశంలోతనకు సానుకూలంగా మలచుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. ఇంతటి స్థాయిలో బలీయంగా విస్తరించడం వల్ల చైనా అంతర్జాతీయ దృక్కోణాలను తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోవ డం లేదా మలచుకోవడం చేస్తున్నది. ఇప్పుడు మనదేశాన్ని వివిధ కోణాల్లో దెబ్బకొట్టడానికి ప్ర యత్నిస్తోంది. ముఖ్యంగా మన వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని బలహీనపరచడం, జాతీయ, అంతర్జాతీయంగా మోదీ నాయకత్వాన్ని అస్థిరం చేయడం, భౌగోళిక రాజకీయంగా ట్రంప్ పలుకుబడిని దెబ్బతీయడం వంటి ప్రక్రియల ద్వారా చైనా తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించుకోవాలని చూ స్తున్నది.
అంతర్లీన పరిణామాలు
కాల్పుల విరమణపై ట్రంప్ చేస్తున్న ప్రకటనలకంటే ఎవ్వరికీ పట్టని అంతర్లీనంగా, ఆకస్మికంగా మనదేశంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించాలి. మొదటిది రిపబ్లికన్ టీవీకి చెందిన అర్నబ్ గోస్వామి, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాలు ఒక్కసారిగా మౌనం వహించడం వెనుక కారణమేంటనేది పరిశీలిస్తే…పాకిస్తాన్‌లోకి డీఓయి విమానం ఎన్111ఎస్‌జెడ్ (ఎ03191) విమానం పాకిస్తాన్‌కు చేరుకోవడం. అంటే అణు రేడియోధార్మికతకు సంబంధించి ఏదో అత్యవసర పరిస్థితి ఏర్పడిరదన్నమాట. ఇక్కడ భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు మౌనం పాటించాయి. పాకిస్తాన్‌లో అణువ్యవస్థలో లీకేజీ సమాచారాన్ని తన ఇంటెలిజన్స్ వర్గాలద్వారా తెలుసుకున్న చైనా ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. ముందుగా భారత్‌తో వున్న వాస్తవాధీనరేఖ దగ్గరకు తన సైనిక దళాలను పెద్దఎత్తున మోహరించడం ప్రారంభించింది. ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా ఇదేవిధంగా వ్యవహరించింది. చైనా పరిస్థితి భారత్‌ను గందరగోళంలోకి నెట్టేసిందనే చెప్పాలి.
కాల్పుల విరమణ తర్వాత నగ్రోటా, వైష్ణోదేవి సమీపంలో దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి.మందుగుండు సామగ్రి, సైనిక పరికరాలకు ఇవి చాలా కీలకం. డ్రోన్ దాడుల కారణంగా ఇక్కడ విస్ఫోటనాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఈ దాడులను చైనా`పాకిస్తాన్‌లుఉమ్మడిగా చేసినట్టుగా భావించాలి. కశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అప్పటివరకు పేలుళ్ల గురించి మాట్లాడుతూ, ఒక్కసారిగా సైలెంటయిపోయారు. బహుశా శ్రీనగర్‌కు సమీపంలో జరుగుతున్న దాడులను మన బలగాలు తక్షణమే అడ్డుకొని నిర్వీర్యం చేయడమే కాకుండా భద్రతా కారణాల రీత్యా ఏవిధమైన వ్యాఖ్యలు చేయవద్దని అబ్దుల్లాకు చెప్పివుండవచ్చు. ఇదే సమయంలోఅమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ మన ప్రధానికి ఫోన్ చేసి అణులీకేజీ, చైనా మోహరింపుల గురించి సమాచారం అందజేసివుండవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ సార్వభౌమత్వానికి ఇబ్బంది ఏర్పడితే తాను స్వయంగా కలుగజేసుకుంటానని చైనా అంతకుముందు హెచ్చరించడం గమనా ర్హం. ఇదే సమయంలో హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు కూడా మౌనం పాటించడం వ్యూహాత్మకమే. ఎందుకంటే ప్రతిదాడులకు వ్యూహాలు పన్నుతున్నప్పుడు మాత్రమే ఇటువంటి మౌనం కనిపిస్తుంది. పాకిస్తాన్ కూడా ఆకస్మికంగా కాల్పుల విరమణను పాటిం చడానికి అమెరికా ఒత్తిడి, అంతర్గత అనిశ్చితి కారణం కావచ్చు. ఇదే సమయంలో చైనా దన్ను గా రావడంతో, పాకిస్తాన్ మళ్లీ రెచ్చిపోవడం మొదలైంది. అయితే చైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగినట్లయితే ఇది ప్రపంచయుద్ధానికి దారితీసివుండేదని కొందరు నిపుణుల అంచనా. చైనా` యుఎస్`రష్యాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో, భారత్‌పై సైనికచర్యతో పాటు, అమెరికా లక్ష్యాలపై కూడా దాడిచేసే పరిస్థితి ఏర్పడిరది. జె.డి.వాన్స్ ముఖ్యంగా సి.ఐ.ఎ. మరియు డి.ఐ.ఎ. హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీని అలర్డ్ చేసివుండవచ్చు. ఇదే సమయంలో పెద్దఎత్తున చైనా సైనికుల మోహరింపును అమెరికా ఉపగ్రహాలు గుర్తించినట్టు కూడా కొన్ని వార్తలు తెలియజేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అర్నబ్ గోస్వామి, ఒమర్ అబ్దు ల్లాతో పాటు అత్యున్నతస్థాయి మంత్రులను కూడా మౌనంగా వుండమని మన సైన్యం కోరివుండవచ్చు. మొత్తం మీద చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్ కుప్పకూలిపోవడం, చైనాకు ఆగ్రహం కగిలించి తన సైన్యాలను మోహరించాలని భావించవచ్చేమో.
మొత్తంమీద చెప్పాలంటే ఆపరేషన్ సిందూర్ కొన్ని వాస్తవాలను ప్రపంచానికి వెల్లడిరచింది. మొదటిది భారత్ తిరుగులేని సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించింది. పాకిస్తాన్ సంప్రదాయిక రక్షణ సామర్థ్యం కుప్పకూలిపోగా, దాని అణ్వస్త్ర సామర్థ్యంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. భారత్ నిరంతరాయంగా జరిపిన దాడులు, అసలు పాకిస్తాన్ బలహీనతలను బట్టబయలు చేశాయి. ముఖ్యంగా చైనా అందించిన అన్ని ఆయుధవ్యవస్థలను భారత్ తుత్తినియలు చేయడం పాకిస్తాన్ కు పెద్దదెబ్బ. చైనాను అడగలేదు…భారత్‌ను ఎదుర్కొనలేదు. ఇదీ దాని దుస్థితి. ఒకరకంగా చెప్పాలంటే పాక్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని భారత్ నిర్వీర్యం చేసివుండవచ్చు. వ్యూహాత్మకంగా ఇప్పుడు పాక్ పూర్తిగా భారత్ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడిరది.
ఏం మాట్లాడినా ఎదుటి వాళ్లు మెచ్చాలని అనేది ఒక సామెత. ఎందుకంటే నోటి నుంచి ఏ మాట వచ్చినా అది అందరూ వినడానికే..ఆ మాట అందంగా వుండాలి. అర్దమయ్యేలా వుండాలి. అర్ధం చేసుకునేలా వుండాలి. అంతే కాని అవతలి వారు ఆశ్చర్యపోయేలా వుండొద్దు. ఆందోళన చెందేలా వుండొద్దు. ఇది మనకు పెద్దలు నేర్పిన పాఠం. కాని రాను రాను రాజకీయాల్లో మాటల హద్దులు లేనట్లే పాలకుల మాటలకు కూడా హద్దులుండాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. నాయకులు అదర్శంగా వుండాలి. పాలకులకు ఇంకా ఆదర్శంగా వుండాలి. అయితే ఇక్కడ తెలంగాణ విషయంలో మాత్రం ఎవరు ఏం చెబుతున్నారో ఎవరికీ అర్దం కావడం లేదు. గతంలో పదేళ్లపాటు పాలించిన కేసిఆర్ తెలంగాణ సంపన్న రాష్ట్రం. దేశంలోనే అత్యధిక దనిక రాష్ట్రం అంటూ లెక్కలు చెప్పేవారు. తాను ఎక్కడో వున్న రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లానని లెక్కలు చేప్పేవారు. 90వేల ఆదాయం వున్న రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్లక పెంచానని అంటూ వుండేవారు. దేశ జాతీయ వృద్ది రేటుకన్నా, రాష్ట్ర వృద్ది రేటు ఎక్కువ అంటూ లెక్కలు ప్రజల ముందు పెట్టేవారు. ఇక అప్పుల విషయంలో దేశంలో తెలంగాణ కన్నా ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఎన్నో వున్నాయంటుండేవారు. అప్పుల్లో 24 స్దానంలో మాత్రమే వుందనే వారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం తెలంగాణకంటే నాలుగు రెట్లు ఎక్కువ అప్పులున్నట్లు ఆర్ధిక సూచీలు ప్రజల ముందు వుంచేవారు. దానికి తోడు తెలంగాణలో పెరిగిన సాగు స్ధిరీకరణ వల్ల తెలంగాణ రైతాంగం ఆదాయం గణనీయంగా పెరిగిందని అంటుండేవారు. ఒకప్పుడు ముప్పై లక్షల ఎకరాల్లో సాగు సాగితే ఇప్పుడు కోటిన్నర ఎకరాల్లో సాగు సాగుతోందని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇక పారిశ్రామిక రంగం విషయానికి వస్తే ఐటి రంగంలో ఎంతో పురోగతి సాధించామన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఐటి ఎగుమతులు రూ.30వేల కోట్లు మాత్రమే వుంటే, పదేళ్ల కాలంలో 2లక్షల కోట్లకు పెరిగిందని నిపుణలు కూడా చెబుతున్నారు. మరి ఎక్కడ లోపం జరుగుతోంది. ఏ రంగంలో పురోభివృద్ది జరగక్కపోయినా తెలంగాణలో వ్యవసాయం రంగంలో మాత్రం విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన మాట వాస్తవం. అందరూ అంగీకరించాల్సిన సత్యం. తెలంగాణ రాకముందు ఎంత సాగు జరిగేది? తెలంగాణ వచ్చిన రెండు మూడు సంవత్సరాలలోనే ఎంత విస్తీర్ణం పెరిగింది అనేది కూడా స్పష్టమైన లెక్కలున్నాయి. సాగుతో రైతులు సంతోషంగానే వున్నారు. పదేళ్ల కాలంలో ఒక్క ఏడాదిలో కూడా కరువు అనే మాట వినిపడలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఏ పార్టీ వరి కొయ్యలు పట్టుకొచ్చింది లేదు. పైగా తెలంగాణ సాగు మొత్తం కరంటు మీదనే ఆదారపడి సాగుతుంది. రైతులకు ఉచితకరంటు ఇరవై నాలుగు గంటలు ఉచితంగానే ఇస్తున్నారు. కరంటు లేదన్న మాట ఏ రైతు పదేళ్లలో అడిగింది లేదు. ధర్నాలు, నిరసనలు చేసింది లేదు. అంటే రాష్ట్రంలో ఆర్ధిక పరిపుష్టి అనేది ఏర్పడిరదని చెప్పడానికి ఇదే సంకేతం. కాకపోతే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పదే పదే తెలంగాణ దనిక రాష్ట్రం కాదు. అంటూనే వుండేది. ఊపర్ షేర్వానీ..అందర్ పరేషాని అని ప్రచారం సాగిస్తూనే వుండేది. కేసిఆర్ చెప్పేవన్నీ అబద్దాలే అంటూ ప్రజలకు చెబుతుండేవారు. కాని తీరా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే సరికి కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ధనిక రాష్ట్రమే అని చెప్పడం మొదలు పెట్టింది. ఎందుకంటే అప్పుల పాలైన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారంటూ ప్రజలు కూడా ప్రశ్నించారు. దాంతో కాంగ్రెస్ తన వాయిస్ మార్చేసింది. తెలంగాణ కర్నాటక కంటే ధనిక రాష్ట్రమే అంటూ చెప్పడం మొదలు పెట్టింది. కాని అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లంకెబిందెలున్నాయనుకుంటే, మట్టి కుండలు కూడా లేవంటూ చెప్పడం మొదలు పెట్టారు. అంటే ప్రజలను ఆయన తొలి రోజు నుంచే ప్రభుత్వ పధకాల విషయంలో సంసిద్దులను చేసే ప్రయత్నం చేశారు. కాని ప్రతిపక్ష బిఆర్‌ఎస్ ఊరుకోలేదు. తరుముతూ వచ్చింది. అయినా పరిగెత్తేందుకు అక్కడ మైదానం లేదు. ఎదురుతిరిగి సమాదానం చెప్పాల్సిన అసవరం లేదు. అందుకే లేదన్న మాట చెబితే చాలు.. రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని చెప్పుకుంటూ పోతే చాలు అనుకున్నారు. ఏడాదిన్న కాలంగా అదే చెబుతున్నారు. ఇక్కడొక విషయాన్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పధకాలలో ప్రదానమైన పించన్లు అందిస్తున్నారు. అదే రెండు వేలతో సరిపుచ్చుతున్నారు. ఎన్నికల మందు ఇచ్చిన వాగ్ధానం అటకెక్కించారు. రెండు వేలు మాత్రం టంచన్‌గా ఇస్తున్నారు. ఎన్నికల్లో చెప్పినట్లు 4వేల రూపాయలు ఇవ్వమని చెప్పడం లేదు. ఇంకా తమకు సమయం వుందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు మాట మార్చేశారు. ఆరు గ్యారెంటీలలో కేవలం పించన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రం ఎక్కడా ఆపడం లేదు. పించన్లలో 4వేలు మర్చిపొమ్మని చెప్పినట్లే..కళ్యాణ లక్ష్మిలో తులం అడగొద్దన్నట్లు పరోక్షంగా స్పష్టత ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే బంగారం తులం లక్ష దాటిపోయింది. ఇక ఇవ్వడం సాధ్యం కాకుండాపోతోంది. ఇంతకీ తెలంగాణ ధనిక రాష్ట్రమా? అప్పుల భారం మోయలేకుండా వుందా?అన్నది తేలాలి. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక ప్రవాహం. పార్టీలు మారినా, కొత్త పాలకులు విచ్చినప్పుడు దానిని కొనసాగించడమే ఆనవాయితీ. అంతే గాని, గత పాలకులు అప్పుల కుప్ప చేసిపెట్టారని గెలిచిన తర్వాత చెప్పడం అనేది సరైంది కాదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇస్తున్న హమీల అమలుకు ఎలాంటి కసరత్తు చేస్తున్నారని మీడియా ప్రశ్నిస్తే, రాష్ట్ర బడ్జెట్‌పై పూర్తి అవగాహన వుందన్నారు. మరి ఇప్పుడు ఆదాయం లేదంటున్నారు. తాజాగా ఉద్యోగులు తమ సమస్యల సాధన కోసం సమ్మెకు దిగుతామంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా అదే బాటలో నడుస్తామంటున్నారు. ఈ సమయంలో ఉద్యోగులతో సిఎం. రేవంత్‌రెడ్డి సంక్షేమ పధకాలు ఆపమంటారా? వచ్చే రూపాయిని ఉద్యోగ సంఘాల చేతుల్లో పెట్టేస్తా..ఎలా పంచుతారో పంచండి అని బంతిని వారి కోర్టులోకి నెట్టేశారు. పరోక్షంగా తెలంగాణ ఉద్యోగులకు ఇప్పటికే ఎక్కువ జీతాలున్నాయి. ఇంకా గొంతెమ్మ కోరికలు తీర్చే ప్రసక్తి లేదని ఒక రకంగా తేల్చి చెప్పారు. కాని ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలన్నీ తీర్చేస్తామన్నారు. అమాయకులైన ప్రజలకు ఏం చెప్పినా వింటారు గాని, ఉద్యోగులు ప్రభుత్వాలు చెప్పినట్లు విన్న సందర్బాలు ఎప్పుడూ లేదు. కొంత కాలం ఓపిక పట్టినా, ఎప్పుడో అప్పుడు మళ్లీ నిరసనల రాగం అందుకుంటారు. పెన్ డౌన్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు. ఇక్కడే సిఎం. రేవంత్‌రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పించన్లు ఆపమంటారా? ధరలు పెంచమంటారా? అని కూడా ఉద్యోగులను ప్రశ్నించారు. అంటే పరోక్షంగా దరల పెంపునకు ప్రభుత్వం తయారుగా వుందన్న విషయం చెప్పకనే చెప్పేశారు. అటు కరంటు, ఇటు బస్సు చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు బారీగా పెంచే యోచన చేసేలా వున్నారు. కాకపోతే స్దానిక సంస్దల ఎన్నికల దాకా ఆగుతున్నారు. నిజంగానే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందా? అంటే తెలంగాణకంటే ఎక్కువ అప్పులున్న రాష్ట్రాలు దేశంలో మరో 24వున్నాయి. వాటికి లేని ఇబ్బందులు తెలంగాణకే వస్తున్నాయా? కొత్త అప్పులు పుట్టడం లేదా? ఈ మాటను జనం నిజమే అని నమ్ముతారా? ఎందుకంటే మన దేశం రాష్ట్రాల సమాఖ్య. అంటే కేంద్రంతో సమానమైన అదికారాలు రాజ్యాంగం కల్పించబడిరది. కాకపోతే చేసే అప్పుల విషయంలో కేంద్రం కొంత కనికరం చూపాల్సిన అవసరం వుంటుంది. కేంద్ర రాష్ట్రాల మద్య సఖ్యత వున్నా, లేకున్నా తెలంగాణకు రావాల్సిన అప్పులు ఎలాగూ వస్తూనే వుంటాయి. ఒకరిని బ్రతిమిలాడి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేసిఆర్ ఈ విషయంలో ఎన్నడూ అప్పు పట్టుడం లేదన్న మాట చెప్పింది లేదు. కాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నారు. అన్నదే ఇప్పుడు రకరకాల వాదనలకు దారి తీసింది.
కేసముద్రం మండలంలోని మహిళా సాధికార మండల సమాఖ్య కార్యాలయంలో లోని సిఐలు గుట్టుచప్పుడు కాకుండా చేతివాటం ప్రదర్శిస్తూ మహిళా సంఘాల మహిళలను అడ్డగోలుగా లక్షల రూపాయలు దోచుకు తింటున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. మండలం లోని కోరుకొండ పల్లి గ్రామానికి చెందిన మహిళ సంఘాల రోదన అంతా ఇంతా కాదు. వివరాల్లోకి వెళితే కోరుకొండ పల్లి గ్రామానికి చెందిన రెండు ఒక మహిళ స్వయం సహాయక సంఘాల బ్యాంకు నుండి లోను పొందారు కానీ అట్టిలోనూ డబ్బులు సంఘంలోని మహిళా సభ్యులకు పంచకుండా అట్టి మొత్తం డబ్బులను తన సొంత అవసరాలకు స్వాహా చేశాడు ఇట్టి విషయమై పలుమార్లు సంఘం సభ్యులు నిలదీయగా రేపిస్తామాపిస్తా అంటూ కాలయాపన చేస్తూ ఉన్నాడు చివరకు విసిగి వేసాగిన మహిళా సంఘం సభ్యులు గట్టిగా నిలదీయడంతో మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అట్టి డబ్బులు నేను చెల్లించను మీకు దిక్కున కాడ చెప్పుకోండి ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ మహిళల పట్ల దుర్భాష వాడుతూ బెదిరింపులకు దిగుతున్నాడని సంఘం సభ్యులు ఆపోతున్నారు చివరకు గురువారం నాడు ఆ సంఘాల మహిళలు వెలుగు ఆఫీస్ ముందు ధర్నా కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది ఇంత చేసినా కూడా సంబంధింత పైగా అధికారులకు అంటే ఎంత నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు చివరకు ఆ అధికారులే ఎవరికీ చెప్పకండి అంటూ గుట్టు చప్పుడు కాకుండా ఇట్టి బాగోతాన్ని వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని గతంలో ఇలాంటి మహిళా సంఘాల చేతివాటం ప్రదర్శించి మహిళా సంఘాలలోని డబ్బులను లక్షలకు లక్షలు కాజేసిన సంఘటనలు జరిగాయని పలువురు భావిస్తున్నారు. ఇంత చీకటి కుంభకోణాలు జరుగుతున్న సీఎంపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వెనక అంతర్యం ఏమిటో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు .ఇప్పటికైనా సంబంధిత వెలుగు కార్యాలయ అధికారులు స్పందించి బాధ్యులైన అధికారులను అలాగే ఇట్టి బాగోతానికి సూత్రధారి అయిన అతన్ని ఉద్యోగం నుండి తొలగించి అతని నుండి అట్టి మొత్తాన్ని కాబట్టి మహిళా సంఘాలకు ఇవ్వవలసిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి డిసిఓ వాల్య నాయక్
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండలం మైలారం గ్రామంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని సహకార సంఘం జిల్లా డిసిఒ వాల్య నాయక్ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జి లను ఆదేశించారు గణపురం పిఎసిఎస్ చైర్మన్ కన్నె బోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓద్దుల పల్లె మైలారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు వర్ష ప్రభావం సూచనల నేపథ్యంలో మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని సూచించారు ఈ సందర్భంగా రైతులతో కొనుగోలు కు సంబంధించి ముఖాముఖి మాట్లాడారు కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలను ట్యాబ్ ఎంట్రీలను తక్షణమే పూర్తి చేయాలని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు ధాన్యం విక్రయించిన రైతులకు వారం రోజుల్లో డబ్బులు పడేలా చూడాలన్నారు రైతులు ధాన్యం విక్రసించిన వెంటనే ట్రక్ సీట్ ఇవ్వాలన్నారు అకాల వర్షాలు వస్తున్నాయని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిలువ లేకుండా తక్షణమే కేటాయించిన మిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు కొనుగోలు ప్రక్రియలో కేటాయించిన బిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు కొనుగోలు కేంద్రాలలో తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేయొద్దని ఆయన సూచించారు అకాల వర్షాలు వస్తున్నందున కొనుగోలు కేంద్రాలో పరదాలను సిద్ధంగా ఉంచాలని ఆయన తెలిపారు కొనుగోలు జరిగిన తదుపరి రైతులకు బాధ్యత లేదని కొనుగోలు కేంద్రాల్లో ఇన్చార్జీలు పూర్తిగా బాధ్యత వహించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఈ సి ఓ పుట్ట సురేష్ ఓద్దుల పల్లె ఇన్చార్జి కుక్క ముడి సంపత్ మైలారం ఇంచార్జి కండే కుమార్ రైతులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరితే తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ రిటైర్డ్ ఉద్యోగి తన ఆవేదన
వీణవంక, ( కరీంనగర్ జిల్లా ) నేటి ధాత్రి :
నేటి ధాత్రి :వీణవంక మండల పరిధిలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు 23 మంది వివిధ రకాల వాణిజ్య, వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న విషయంపై సమాచార హక్కు చట్టం కింద అదే ప్రాంతానికి చెందిన ముదిగంటి రఘునాథ్ రెడ్డి గ్రామం ఇప్పలపల్లి, 86 సంవత్సరాల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సమాచారం కోరినట్లు చెప్పారు. ఉన్నతాధికారుల నుండి సరైన స్పందన లేకపోవడంతో సమస్యను హైదారాబాద్ ప్రజా దర్బార్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఏట్టకేలకు స్పందించిన అధికారులు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో పవన్ సమక్షంలో ఈ నెల 3న విచారణ చేపట్టగా.. ఆ సమయంలో తనపై దుకాణ సముదాయ ఏర్పాటు చేసుకున్న పలువురు దుర్భాషలాడినట్లు ఆరోపించారు. తక్షణమే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇట్టి విషయంపై వీణవంక పోలీస్ స్టేషన్ లో ఈ నెల 10న, కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ కి ఈ నెల 13న సైతం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనకు మోతుకు కోమాల్ రెడ్డి, గడ్డం నారాయణ, కళ్యాణ్ ల నుండి బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో వారి నుండి తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నట్లు చెప్పారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరి మాజీ ఎంపీటీసీ నేనావత్ వెంకట్ రాము కూతురు నేనావత్ వందన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వందనాకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వందన ఉన్నత విద్యలు చదివి తిరుమలగిరి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, వెంకటేశ్వర రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తాండవాసులు పాల్గొన్నారు.
మంద మహేష్ బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్
గణపురం నేటి ధాత్రి :
గణపురం మండల పోలీసులు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ముందస్తు అక్రమ అరెస్టులను నిరసిస్తూ బి జే వైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ఆరోగ్యం అనే ప్రజల యొక్క కనీస అవసరాలను మరిచిపోయి ప్రపంచ అందగత్తెల పోటీలు నిర్వహించడానికి ఉన్న సమయం చదువుకునే విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్స్ అకాల వానలతో చేతికొచ్చిన పంటలను కోల్పోతున్న రైతులను పరామర్శించడానికి సమయం ఉండాదని ఎద్దేవ చేశారు సరస్వతి పుష్కరాలకు కోట్ల రూపాయల డబ్బుతో భక్తుల సౌకర్యాలకు పూర్తిస్థాయిలో నిర్మాణాలు కాకపోయినా ఆగమేఘాల మీద పుష్కరాలు నిర్వహిస్తు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారని అన్నారు
బాల్ బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ పిల్లలకు వైట్ టోపీలు
సీనియర్ కోచ్ మామిడిశెట్టి రవీందర్
గణపురం నేటి ధాత్రి
Ball badminton
గణపురం మండల కేంద్రంలో బాల్ బ్యాడ్మింటన్ భూపాలపల్లి జిల్లా సీనియర్ కోచ్ మామిడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో బాల్ బ్యాడ్మింటన్ సమర్ కోచింగ్ కు పిల్లలకు ఎండ దెబ్బ తాకకుండా వైట్ క్యాప్ లను స్పాన్సర్ చేసిన ఉప్పుగల్లు గ్రామానికి చెందిన సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఉమ్మడి వరంగల్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వైట్ క్యాప్ లను బహుమతి గా ఇచ్చారు ఇందులో పాల్గొన్న వారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు సాంబయ్య సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రమేష్ చిరంజీవి సతీష్ మహేందర్ బుచ్చి రెడ్డి హంచత్ ఈర్ల స్వామి పాల్గొన్నారు ఈ యొక్క గణపురం క్యాంప్ కే కాకుండా వేములపల్లి క్యాంపు కూడా 20 టోపీలను అందజేయడం జరిగింది ఇంకా ఏ అవసరం పడ్డ నన్ను అడగండి అని అన్నారు
వివాహ శుభకార్యంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన
★ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి :
కోహిర్ మండలంలోని మనియర్పల్లి గ్రామ. కాంగ్రెస్ నాయకులు దేవదాస్ గారి సోదరుని కుమారుని వివాహనికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ గారు,జె జె కన్స్ట్రక్షన్ జావీద్ భాయ్,ఎస్సి సెల్ ఛైర్మెన్ అనిల్,కోహిర్ పట్టణ అధ్యక్షులు శంషీర్,మాజీ సర్పంచ్ రచన్న,గ్రామ కాంగ్రెస్ నాయకులు రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరుక ళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి నాగవల్లి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించినారు స్వామివారికి విశ్వక్సేన ఆరాధన స్వస్తి పుణ్యా వచనము ద్వాదశ ఆరాధన లతో వివిధ రకాల పుష్పాలతో పుష్ప యాగాన్ని దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి యాగ్నీకులు వీరవల్లి వేణుగోపాలాచార్యు లు వేదమంత్రాలు మధ్య నిర్వహించినారు మత్స్యగిరి స్వామి శ్రీదేవి భూదేవిల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి వేద పారాయణాలను చేసుకుంటూ దేవాలయం చుట్టూ 12 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఊరేగించారు ఒక్కొక్కసారి ఒక్కో వాయిద్యం తో 12 రకాల వాయిద్యాలతో 12సార్లు దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు అనంతరం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి పండిత సన్మానం చేసినారు పండిత సన్మానంతో శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ముగిశాయని చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్ సైనా రెడ్డి కృపాకర్ రెడ్డి గట్ల భగవాన్ రెడ్డి శివరామకృష్ణ రెడ్డి మనీష్ రెడ్డి కందగట్ల కోటేశ్వరరావు సామల రవీందర్ కుసుమ శరత్ బాబు దిండిగాల వంశీ కాంబత్తుల ప్రకాష్ బాసని వెంకటేశ్వర్లు నామనిశివ భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, డప్పుర్ గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, పిడుగు పాటుతో గ్రామానికి చెందిన మల్గి ఇస్మాయిల్ కుమారుడు సాబేర్ (15) మృతి చెందాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఓ చెట్టు కింద ఉండగా పిడుగు పాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులైన మరో ఐదుగురికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
బైక్ ఇప్పించడం లేదని బావిలోకి యువకుడు ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన న్యాల్కల్ మండలం మామిడిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన సాల్మన్ (32) బైక్ ఇప్పించాలని తల్లితో తరచుగా గొడవపడేవాడు. గురువారం కూడా తల్లితో గొడవపడి బయటికి వెళ్లి గ్రామంలో ఉన్న బావిలో దూకాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గ్రామస్తులు సాల్మన్ ను బయటకు తీశారు.
పలు సంఘాల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు..మజ్జిక పంపిణీ.
వరంగల్/నర్సంపేట నేటిధాత్రి:
గీసుకొండ గ్రామ శ్రీమంతుడు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ 75 వ జన్మదినం సందర్భంగా గీసుకొండ సోషల్ సర్వీస్ టీం,స్థానిక గీతా లక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం ఆధ్వర్యంలో కొనాయమాకుల బస్ స్టాండ్ లో ప్రయాణీకులు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సంపేట బస్ డిపో ఎంఎఫ్ ప్రభాకర్, ఏఈ నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సరస్వతీ పుష్కరాల సందర్భంగా మండుటెండల్లో విధులు నిర్వహించనున్న బస్ డ్రైవర్లు, కండక్టర్లకు 100 మందికి తెల్ల రుమాళ్లను కూడా లక్ష్మీనారాయణ సౌజన్యంతో పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో గీసుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి, మాజీ చైర్మన్ రామా కుమారస్వామి, ఆర్టీసీ ఉద్యోగి వంగల రాంబాబు,గీసుకొండ సోషల్ సర్వీస్ టీం సభ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ, మహ్మద్ సోనీ,యాదగిరి కుమారస్వామి,పసుల సంపత్, వటుకుల రవికుమార్, గీతా లక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం అధ్యక్ష కోశాధికారులు కర్ణకంటి రజిత, కత్తి హేమలత, గౌరవ సలహాదారులు కక్కెర్ల సుజాత, వీరగొని హేమలత,పసుల సునిత తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు
మల్లాపూర్ మే 15 నేటి ధాత్రి:
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన మాదం నాగరాజు ప్రమాదవశాత్తు ఇటీవల విద్యుత్ షాక్ తగిలి మరణించడం జరిగింది మండలానికి చెందిన అఖిలభారత మహాసభ మండల యాదవ సభ్యులు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారికి ఆర్థికంగా అండగా ఉంటామని అదేవిధంగా ప్రభుత్వపరంగా ఏదైనా అవసర నిమిత్తం అందుబాటులో ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధనరేకుల సంతోష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేష్, కార్యవర్గ సభ్యులు బండారి వెంకటేష్, మండల అధ్యక్షుడు సంగ గంగారాజం, జిల్లా యూత్ అధ్యక్షులు రేబ్బటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి మహేష్, మామిడి తిరుపతి, రాజలింగం మాదం రాజేందర్, రాజు గణేష్ , అంజయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో కో-పరేటివ్ సెంటర్లో పనిచేస్తున్న హమాలీల వద్దకు ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న వెళ్లి మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన జరిగేటువంటీ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులు కొట్లాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా చేసిందని దీని ద్వారా పెట్టుబడిదారి,కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండడానికె ఈ విధంగా చేయడం జరిగిందని, ఇది కార్మికులకు ఎంతో నష్టదాయకమని ఆయన అన్నారు. వాటిని రద్దు చేయాలని అదేవిధంగా అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం,అసంఘటిత రంగాల కార్మికులకు సమగ్ర చట్టం చేయకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు;వేటగాని శ్రీనివాస్,కలపాక వంశీ,జల్లే జాన్సన్,యాటగాని రాములు,గడ్డం నరసయ్య,పానుగంటి రాములు,అయినల శ్రీనివాస్,చాగంటి రాములు,కలపాక శ్రీను,మునుగోడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం: రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో అష్ట తీర్థాల సంగమంగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర దేవాలయానికి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకుగాను అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశిం చారు. బుధవారం మండల కేంద్రమైన ఝరాసంగం ఎంపీడీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం వచ్చే మార్గంలో పారిశుద్ధ్య, మొక్కల సంరక్షణ వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవి ధంగా గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చూసు కోవాలన్నారు. త్రాగునీటి సమస్య ఉన్న గ్రామాలను ముందుగా గుర్తించి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు అంద జేయాలన్నారు. మేదపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని గ్రామస్తులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావే శంలో జిల్లా పరిషత్ సీఈవో జానకిరామ్ రెడ్డి, డీపీఓ సాయి బాబా, జహీరాబాద్ ఆర్డీఓ రాజిరెడ్డి, ఎంపీడీవో సుధాకర్, తహసీల్దార్ తిరుమల రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎంపీ మల్లు రవి పత్రిక సమావేశం నిర్వహించి ఈ నెల 18వ తేదీన అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరు గ్రామంలో గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా గిరి జల సౌర వికాస్ పథకాన్ని రూ. 12,600 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభిస్తారని నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పత్రిక సమావేశం నిర్వహించి తెలియజేశారు. ఇందిర జల సౌర వికాస్ పథకం ద్వారా గిరిజనులు అభివృద్ధికి,వారి సంక్షేమం కోసం,వారు ఆర్థికంగా బలపడడానికి తోడ్పాడుతుంది అని ఎంపీ మల్లు రవి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గిరిజనులు అధిక సంఖ్యలోపాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్ ,కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గోదావరి వద్ద ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేసి మా పుట్ట కొడుతున్నారు.
వెంటనే స్కూల్ బస్సులను నిలిపివేయాలి.
పెద్ద మొత్తంలో ఆటో డ్రైవర్ల నిరసన. రోడ్డుపై బైఠాయి.
మహదేవ్పూర్ -నేటి ధాత్రి;
కాలేశ్వరం బస్టాండ్ వద్ద స్థానిక ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు బస్టాండ్ నుండి గోదావరి వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉండడంతో స్థానిక ఆటోల్లో భక్తులకు తరలించడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా భక్తులను ఆటోలో తరలించడంతో స్థానిక ఆటో డ్రైవర్లకు ఉపాధి కలుగుతుంది. కానీ పుష్కరాల సందర్భంగా మండలానికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలల వాహనాలను భక్తుల కు గోదావరి వద్ద తరలించుటకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఉపాధి కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తక్షణమే స్కూల్ బస్సులను తీసివేయాలంటూ ఆటో డ్రైవర్లు సుమారు రెండు గంటల పాటు ధర్నా కొనసాగించడం జరిగింది. పోలీసుల జోక్యంతో ఆటో డ్రైవర్లు ధర్నా ను విరమించినట్లు తెలుస్తుంది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.