వరి సాగులో నూకలతో కలుపు నివారణపై అవగాహన

వరి సాగులో నూకలతో కలుపు నివారణపై అవగాహన

పాల్గొన్న.. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి.

 

బాలానగర్ /నేటి ధాత్రి

బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామంలో బుధవారం వరి సాగులో నూకల వినియోగంతో కలుపు నివారణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మట్టి మనిషిగా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రకృతి సేద్యంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల రసాయన ఎరువుల వినియోగం అధికమవుతోందన్నారు.దీని కారణంగా భూమి సారం క్రమంగా తగ్గిపోతోందని, రసాయనాలతో పండించిన ఆహారం ఆరోగ్యానికి హానికరమవుతోందని సూచించారు. నూకలతో కలుపు నివారణ చేయడం ద్వారా ఖర్చులు తగ్గడమే కాకుండా, నేల సారాన్ని కూడా కాపాడుకోవచ్చని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమానికి మండలంలోని పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, మధురాపూర్, లింగారం తదితర ప్రాంతాల నుంచి రైతులు భారీగా హాజరయ్యారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డిని గ్రామస్తులు పూలదండ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హేమాజీపూర్ మాజీ సర్పంచ్ మురళీధర్ రెడ్డి, స్థానిక రైతులు ఆంజనేయులు, వెంకటరెడ్డి, నగేష్, నరసింహారెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా : సర్పంచ్ శశివర్ణ

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా : సర్పంచ్ శశివర్ణ

బాలానగర్ /నేటి ధాత్రి.

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని గుండేడు గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శశివర్ణ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న వార్డులను పరిశుభ్రంగా మార్చినట్లు పేర్కొన్నారు. అలాగే గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని.. పరిశుభ్రతను కాపాడుకోవాలని గ్రామ ప్రజలకు సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మతి స్థిమితం లేని వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు…

మతి స్థిమితం లేని వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

జడ్చర్ల /నేటి ధాత్రి.

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి గ్రామంలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండకళ్ల కుమార్ (34) గత రెండు నెలల క్రితం పెరాలసిస్ వ్యాధి సోకింది. అప్పటినుండి మతిస్థిమితం సరిగా లేదు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన సాయంత్రం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో గాలించినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు.. గురువారం బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.

ఇది బీటీ రోడ్డు.. మట్టి రోడ్డు..

ఇది బీటీ రోడ్డు.. మట్టి రోడ్డు?

నూతన బీటి రోడ్డు శిథిలం.. తాండవాసుల ఆందోళన

బాలానగర్ / నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడగుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలోని దేవుని గుట్ట తండాకు బుధవారం సాయంత్రం బీటీ రోడ్డు నిర్మించారు. 24 గంటలు ముగియక ముందే బీటీ రోడ్డు బీట్లు బీట్లుగా పైకి లేచింది. నాణ్యత లేని రోడ్డు నిర్మించారని తాండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుపెట్టి గ్రామీణ ప్రాంతాలలో ప్రాంతాలకు బీటీ రోడ్డు నిర్మిస్తే.. కాంట్రాక్టర్లు నాణ్యతలేని బీటీ రోడ్డు నిర్మించి ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతతో కూడిన బీటీ రోడ్డు నిర్మించాలని తండావాసులు ఆనంద్ నాయక్, సంతోష్ నాయక్, రమేష్ నాయక్, శ్రీను నాయక్, కిరణ్ నాయక్ కోరారు.

కాంగ్రెస్ పార్టీ గిరిజనులను అవమానపరుస్తుంది

కాంగ్రెస్ పార్టీ గిరిజనులను అవమానపరుస్తుంది.

బాలానగర్ /నేటి ధాత్రి :

 

కాంగ్రెస్ పార్టీ గిరిజనులను అవమానపరుస్తుందని బాలానగర్ మండల బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్ సోమవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి గిరిజనుల ఆస్తులను కొల్లగొట్టి, ప్రశ్నించే బంజారా బిడ్డలను, బంజారా రైతులను, బంజారా ఉద్యోగులను జైల్లో పెడుతున్నారన్నారు. లంబాడ సామాజిక వర్గాన్ని మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం లంబాడ సామాజిక వర్గంకు అవమానం చేసినట్టే అని అన్నారు. ఈ విషయంపై గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో గిరిజనులను తృతీయ శ్రేణి నాయకులుగా పరిగణిస్తున్నారని విమర్శించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version