ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ నిర్వహించారు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం సమర్పించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో 22 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా ఉద్యనవవ అధికారి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ ము, జహీరాబాద్ మరియు మొగుడంపల్లి మండలంలో బిందు సేద్యం తో పంటల సాగుకు పరిశీలించి న సంగారెడ్డి జిల్లా ఉద్యనవవ అధికారి సోమేశ్వర రావు.తెలంగాణ ఉద్యానవన శాఖ పథకం ద్వారా రైతులకు రాయితీ లపై అందజేసి న బిందు సేద్య పరికరాల వినియోగాన్నీ ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలోపర్యటించి తనిఖీ చేశారు. మండలం లోని మల్చేల్మా,మొగుడంపల్లి, చిన్న హైదరాబాద్ గ్రామాలలో ఆయన వ్యవసాయ భూములను సందర్శించి సూక్ష్మ సేద్య పరికరాలతో సాగులో ఉన్న పంట పొలాలను అమర్చిన పరికరాలను పరిశీలించి నారు. బిందు సేద్యాన్ని అమలు చేస్తున్న రైతులను ఉద్దేశించి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధానం ద్వారా నీటినిపొదుపు చేసుకోవడం తో పాటు అధిక దిగుబడి సాధించవచ్చని వివరించారు.క్షేత్ర పర్యటన లో జైన్ డ్రిప్ డి సి ఓ విజయకుమార్, నేటఫీమ్ డిసిఓ పాండు,గొల్ల రాజరమేష్, స్వామి రైతులు అంజన్న,శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు

అన్నదాతలకు అండగా ఉంటాం.

అన్నదాతలకు అండగా ఉంటాం

-రైతుల పక్షాన పోరాటం చేస్తాం

-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

మల్కపేట కాల్వ పరివాహక రైతులు కాల్వ నీళ్ల కోసం చేసే పోరాటానికి మద్దతు ఉంటమాని అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. శుక్రవారం దేవుని గుట్ట తండా లో ఎండిపోయిన పంట కాలువ, పంట పొలాలను మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. గత 15 రోజులుగా భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీల్లు లేక అరిగోస పడుతున్నారని తెలిపారు. ఎండుతున్న వరిపోలాన్ని చూడలేక పశువులను మేతకు వదులుతున్న దుస్థితి నెలకొన్నదని అన్నారు. వెంటనే మిడ్ మేనేర్ నీటిని మల్కపేటకు పంపింగ్ చేసి రైతులను ఆడుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణ , పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అందే సుభాష్ ,కొండ రమేష్ గౌడ్ ,నాయకులు నమిలికొండ శ్రీనివాస్, గూగులోత్ పెంటయ్య, అజ్మీర రాజు నాయక్,అజ్మీర తిరుపతి నాయక్, భూక్య ప్రభు, ధరావత్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version