రోటీ పిండిలో విషం..

రోటీ పిండిలో విషం.. భర్త సహా 8 మందిని లేపేయాలని ప్లాన్..

భర్త, అతడి కుటుంబీకులను చంపేందుకు ఓ కోడలు మహత్తరమైన స్కెచ్ వేసింది. విషం కలిపిన గోధుమ పిండితో చపాతీలు తయారుచేసి అత్తమామల కుటుంబాన్ని లేపేయాలని ప్లాన్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ దారుణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఇష్టం లేని పెళ్లి చేశారనో.. ప్రియుడి కోసమో.. భర్త నచ్చలేదనో.. ఇలా ఏదొక కారణంతో కట్టుకున్న మొగుణ్ని దారుణంగా మర్డర్ చేసే భార్యల గురించి ఈ మధ్య తరచూ వినే ఉంటారు. కానీ, ఈ మహిళ స్టైలే వేరు. భర్త తిట్టాడని కాదు.. తోడికోడలు నవ్విందని అన్నట్టుగా.. ఓ మహా ఇల్లాలు వదినతో గొడవ జరిగిందని భర్తను, అతడి తరపు ఫ్యామిలీని చంపేందుకు మహత్తరమైన ప్లాన్ వేసింది. ఒకే దెబ్బతో అందరినీ లేపేయాలనే కసితో విషం కలిపిన గోధుమపిండితో చపాతీలు తయారుచేసి అందరికీ తినిపించాలని కుట్ర పన్నింది.

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తింట్లో గొడవలతో విసిగిపోయిన మాల్తీ దేవీ భర్త సహా అతడి కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నింది. ఒక రోజున సల్ఫోస్ అనే విషపూరిత రసాయనాన్ని గోధుమ పిండిలో కలిపి చపాతీలు తయారుచేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో మాల్తీ వదిన మంజూ దేవి పిండి నుంచి వింత వాసన రావడం గమనించింది. ఏదో చేస్తోందనే అనుమానంతో ఇంట్లో అందరికీ చెప్పింది. దీంతో అత్తమామలు మాల్తీ దేవిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పేసింది. కుటుంబం మొత్తాన్ని ఒకేసారి చంపేందుకు పిండిలో విషం కలిపానని స్వయంగా అంగీకరించింది.

కరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కియా బాజా ఖుర్రామ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన జరిగింది. రోజువారీ తగాదాలు, మానసిక హింసతో విసిగిపోయిన మాల్తీ తండ్రి ప్రసాద్, సోదరుడు బజరంగీతో కలిసి ఈ కుట్ర పన్నింది. ఇంట్లో కలహాలు మొత్తం కుటుంబాన్నే చంపాలనే నిర్ణయానికి దారి తీస్తాయని తెలుసుకుని స్థానికుల ఆశ్చర్యపోతున్నారు. మాల్తీ దేవికి ఆమె వదిన, అత్తమామలతో తరచూ గొడవలయ్యేవని గ్రామస్థులు అంటున్నారు. ఈ మొత్తం ఘటన గురించి మాల్తీ భర్త బ్రిజేష్ కుమార్ వెంటనే కరారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మాల్తీతో పాటు ఆమె తండ్రి, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. విషం కలిపిన గోధుమ పిండిని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ప్రణాళిక, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే అభియోగాలతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తులో భాగంగా ముగ్గురినీ విచారణ చేస్తున్నారు. అయితే, ఇప్పటికే నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది.

మద్యం సహా ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం.

మద్యం సహా ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం : ఎమ్మెల్యే హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని
నెరవేర్చకపోగా కేసీఆర్ అమలు చేసిన పథకాలను కూడా నిలిపివేసిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్ గ్రామంలో జరుగుతున్న దుర్గమ్మ మాత జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన హరీష్ రావు స్థానిక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు చేసినా, కరోనా వచ్చిన కేసీఆర్ ఎప్పుడూ రైతుబంధు ఆపలేదని వానకాలం రైతుబంధు ఎగ్గొట్టి యాసంగిని మూడెకరాలకు పరిమితం చేశారున్నారు.
కేసీఆర్ పది వేలు ఇస్తే మేం రూ.12 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ వానాకాలం వచ్చినా ఇప్పటివరకు రైతుబంధు ఊసే లేదు. జహీరాబాద్, నారాయణఖేడ్ లకు కేసీఆర్ హయాంలో అత్యధికంగా 100 కోట్ల రూపాయల రైతుబంధు వచ్చేది. ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ప్రీమియం చెల్లించక పోవడంతో గత నాలుగు నెలలుగా చనిపోయిన రైతులకు బీమా సొమ్ము రావడం లేదని ఆరోపించారు. మెదక్, సిద్దిపేటకు నేషనల్ సీడ్ కార్పొరేషన్ విత్తనాలు సప్లై చేయాలని, మరికొన్ని జిల్లాలు స్టేట్ సీడ్ కార్పొరేషన్ సీడ్ పంపిణీ బాధ్యతలు అప్పగించారన్నారు.ఇద్దరు కలిసి స్టేట్ కు, ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేస్తున్నారు..బీరు విస్కీ ధరలు పెంచి చివరకు విత్తనాల ధరలు పెంచిన రేవంత్ రెడ్డి ప్రజలకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్ర ఆదాయం పెంచి రైతులకు పంచాడని అదే మీరేం చేస్తున్నారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. వైన్స్ ధరలు పెంచావు, జనుము, జీలుగ తదితర పచ్చిరొట్టె ఎరువుల ధరలు పెంచి రైతులకు ఇచ్చే రైతుబంధు, రైతు బీమాలు ఇస్తలేవని ధ్వజమెత్తారు. ఇచ్చేది ఎగవేస్తున్నావ్ ఉల్ట రైతుల వద్ద గుంజేస్తున్నావ్ వంటూ ..ఈ వైఖరిని ఏమనుకోవాలన్నారు. ధాన్యానికి బోనస్ బోనస్ అని బోగస్ చేసేస్తున్నావని, యాసంగిలో సన్న వడ్లకు ఇచ్చే బోనస్ రూ.850 కోట్ల బకాయిల్లో ఒక్క పైసా కూడా రైతులకు చెల్లించ లేదని ఆరోపించారు.బోనస్ పైసలు, రైతు బంధు డబ్బులు, యాసంగిలో ఒక్క పైసా ఇవ్వని రైతులను మోసం, దగా చేసిన రేవంత్ రెడ్డి ఏం మొహం పెట్టుకుని సంగారెడ్డికి వస్తున్నాడనిప్రశ్నించారు. యూరియా బఫర్ స్టాక్ తగ్గిపోయిందని, గత ప్రభుత్వం వేసవిలోనే ఎరువులు కొరత లేకుండా చూసేదన్నారు. 25 శాతం ధాన్యం ఇంకా కల్లాలోనే ఉందని కరీంనగర్ మెదక్, నల్గొండ వరంగల్ ఇతర జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో బస్తాల్లోని ధాన్యం మొలకెత్తి రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. మెదక్ జిల్లాలో రైతులు రాస్తారోకోలు చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని, మంత్రులు దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అన్ని సెంటర్లలో అదే పరిస్థితి ఉందంటూ.. అధికారులు నీ మాట వినడం లేదా అని ఎద్దేవాచేశారు. అప్పుల విషయంలో తప్పుగా మాట్లాడుతూ నీ పరువునే కాక రాష్ట్రం పరువును తీయడం అది కాదని, నీ పరువు నీవు తీసుకున్న పర్వాలేదు కానీ రాష్ట్రం పరువు తీయకని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు నా సొంత నిధులని కలిపి కోటి రూపాయలతో బసవేశ్వర విగ్రహాన్ని కడితే ఈ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారా?జహీరాబాద్ నియోజకవర్గానికి రేవంత్ ఏం ఇచ్చిండు? ఇవ్వకపోగా కేసీఆర్ ఇచ్చిన రూ.25కోట్లను వాపస్ తీసుకున్నడు. జహీరాబాద్ మున్సిపాలిటీకి కేసీఆర్ రూ.30 కోట్లు ఇస్తే వాటిని కూడా వాపస్ తీసుకున్నాడు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు వినతి మేరకు గ్రామీణ రోడ్లకు కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేస్తే అవి కూడా గుంజుకున్నడని ఆరోపించారు.జహీరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి కి నిజంగా ప్రేమ ఉంటే వాపస్ తీసుకున్న నిధులని వెంటనే ఇవ్వాలి. పాతవి ఇచ్చి కొత్తగా వంద కోట్ల రూపాయలని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నా. బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు. సంగారెడ్డి జిల్లాని సస్యశ్యామలం చేసే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుని పునరుద్దరించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నా. సర్పంచులు, మండల, జిల్లా పరిషత్ లకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తరపున డిమాండ్ చేస్తున్నా. ఇక్కడి నుంచి నేరుగా జాడి మల్కాపూర్ బయలుదేరి వెళ్లి దుర్గమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాలలో హరీష్ రావు తో పాటు ఎమ్మెల్యే కొనేంటి మాణిక్యరావు, స్థానిక నేతలు ఎం.శివకుమార్, మాణిక్యం, గుండప్ప, రాజేందర్, విజయ్ కుమార్, శ్రీనివాస్ ఇతర జిల్లా, స్థానిక నేతలు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version