ఇక మీరు మారరు…మారకపోతే గెలవరు?

`ఇన్ని ఓటములెదురైనా బిఆర్‌ఎస్‌లో మార్పు రావడం లేదు

`నేటిధాత్రి పదే పదే హెచ్చరిస్తూనే వస్తోంది

`అనేక సార్లు గుర్తు చేస్తూనే వస్తోంది

`స్థానిక నాయకత్వాన్ని గుర్తించాలని సూచనలిస్తూనే వుంది

`ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో నాయకత్వం లేదు

`60 లక్షల మంది కార్యకర్తలని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు

`జూబ్లీ ఓటమితోనైనా మేలుకుంటేనే మేలు

`లేకుంటే బీఆర్‌ఎస్‌ అధోగతి పాలు

`భవిష్యత్తులో గెలుపులు చూడలేరు

`విజయాల దరికి కూడా చేరుకోలేరు

`పార్లమెంటు ఎన్నికలలో సున్నా చుట్టినా మార్పు రాలేదు

`ప్రచారార్భాటం తప్ప ప్రజల్లో బీఆర్‌ఎస్‌ నేతలు లేరు

`ఇప్పటికైనా నేల మీదకు దిగిరాకపోతే పార్టీ కోలుకోదు

`గులాబీ రేకులు రాలిపోక తప్పదు

`కేసీఆర్‌ బైటకు రాకపోతే పార్టీ నిలబడలేదు

`పార్టీలో ఆధిపత్యపోరు కొనసాగితే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు

`ఓడిన ప్రతిసారీ విశ్లేషించుకుంటామంటారు

`విశ్లేషించిన దాఖలాలు లేవు

`పదే పదే ఓటమి పాలుకాకుండా చూసుకుంటున్నది లేదు

`సిట్టింగ్‌ సీటును కూడా కాపాడుకోలేకపోయారు

`ఆరు నెలల నుంచి ప్రచారం చేస్తూనే వున్నారు

`మీడియాలో మాత్రమే కనిపిస్తున్నారు

`జనం మధ్యలోకి వెళ్లి ప్రచారం చేసిందేనాడు లేదు

`జిల్లాల నుండి నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేయించారు

`జూబ్లీ హిల్స్‌లో వున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదు

`జూబ్లీ హిల్స్‌ నాయకులతో సంబంధాలు కొనసాగించింది లేదు

`బీఆర్‌ఎస్‌ స్వయంకృతాపరాధం ఎంత కాలం?

`ఇలా అయితే ఓడిపోవడమే ఎల్లకాలం!

హైదరాబాద్‌, నేటిధాత్రి:

అతివిశ్వాసం ఎక్కువైతే అసలుకే మోసం వస్తుందని, అధపాతాలమే దిక్కవుతుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను చూస్తే అర్ధమౌతోంది. ఎవరు నొచ్చుకున్నా, ఎవరు కాదనుకున్నా ఇదే నిజం. ప్రజలు చెబుతున్న నిజం. కార్యకర్తలు, నాయకులు చెప్పుకుంటున్న వాస్తవం. ఏ పార్టీ అయినా నిజంలో వున్నప్పుడే విజయం సిద్దిస్తుంది. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు దూరంగా వుంటూ ఊహల్లో అగ్రనేతలుంటే ఫలితాలు జూబ్లీహిల్స్‌ లాగే వుంటాయి. బిఆర్‌ఎస్‌ నాయకులు అతి విశ్వాసమే జూబ్లీహిల్స్‌లో మరో సారి పార్టీ కొంప ముంచింది. బిఆర్‌ఎస్‌ పార్టీ మాగంటి గోపీనాద్‌ మరణం నాటి నుంచి ప్రచారంలోనే వుంది. కాని ప్రజల్లో లేదు. ఇది ఇప్పటికైనా కేసిఆర్‌, కేటిఆర్‌లు తెలుసుకోవాలి. పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. సాదారణ ఎన్నికల్లో ఓడిపోయి నాటి నుంచి వరుసు ఓటమిలను చవిచూస్తున్నా బిఆర్‌ఎస్‌ అధినాయత్వం మేలుకోవడం లేదు. నేల మీదకు రావడం లేదు. ఎంత సేపు ప్రభుత్వ వైఫల్యాలే గెలిపిస్తాయనుకుంటే బిఆర్‌ఎస్‌కు మనుగడ వుండదు. ఇది గతంలో అనేక సార్లు రుజువైంది. కళ్లముందు అనేక గుణపాఠాలున్నా, ఇంకా బిఆర్‌ఎస్‌ పాఠాలు నేర్చుకోకపోతే విజయాలు కష్టం. ఓటములే ఎదురవడం ఖాయం. సాదారణ ఎన్నికల ముందు బిఆర్‌ఎస్‌ శ్రేయోభిలాషులు ఎంతో మంది చెప్పారు. కొంత మంది బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు చెప్పారు. వాళ్లకంటే ముందు నేటిదాత్రి పదే పదే చెబుతూనే వచ్చింది. ఒక రకంగా హెచ్చరిస్తూనే వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న, అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను తప్పించకపోతే పార్టీ కోరికోరి ఓటమి తెచ్చుకున్నట్లౌవుందని చెప్పడం జరిగింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలను మార్చాలని వారి గురించి సమగ్రమైన వివరాలు కూడా నేటిదాత్రి అందించింది. కాని ఆ సూచనలు పూచికపుల్లగా భావించింది. ఓటమి కొని తెచ్చుకున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లోనూ అదే తప్పు చేసింది. సానుభూతిని నమ్ముకొని నిండా మునిగింది. అన్ని సార్లు సానుభూతి పనిచేయదు. దుబ్బాకలో రామలింగారెడ్డి ఓటమిని చూసైనా కేసిఆర్‌ మారలేదు. ఆనాడు రామలింగారెడ్డి మరణం వల్ల సానుభూతి కన్నా, వరుస ఓటములు ఎదుర్కొన్న రఘునందన్‌ రావు వైపు ప్రజలు గెలిపించారు. జూబ్లీహిల్స్‌లో ఏం తొందరొచ్చిందని అందరికంటే ముందుగానే సునీతను ప్రకటించారు. అంత కొంపలు మునిగిపోయేంత తొందర ఎందుకు పడ్డారు. జూబ్లీహిల్స్‌లో గోపీనాధ్‌ చేసిన అరాచాలు లేవా? గోపీనాద్‌ చేసిన అక్రమాలు లేవా? ప్రజలు కూడా అదును చూసి, బిఆర్‌ఎస్‌కు మరోసారి పాఠం నేర్పారు. జూబ్లీహిల్స్‌ ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధిని పదే పదే రౌడీ రౌడీ అంటూ బిఆర్‌ఎస్‌ చేసిన ప్రచారం కూడా వికటించింది. ప్రభుత్వ వ్యతిరేకతను మాత్రమే పరిగణలోకి తీసుకొని బిఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తూ వెళ్లింది. కాని గ్రౌండ్‌లో ప్రజల ఆలోచనలు ఎలా వున్నాయన్నది తెలుసుకోలేదు. గ్రౌండ్‌లో వుండే బిఆర్‌ఎస్‌ నాయకులను గుర్తించలేదు. వారి అభిప్రాయాలు తెలుసుకోలేదు. వారి సూచనలు తెలుసుకునే ప్రయత్నం అసలే చేయలేదు. ఎవరిని నమ్ముకున్నారు. ఆంద్రాకు చెందిన యూట్యూబ్‌ చానళ్లను నమ్ముకున్నారు. తెలంగాణకు చెంది, ఉద్యమ ప్రస్దానంలో వున్న వున్న బిఆర్‌ఎస్‌ అనుబంధ మీడియాను పక్కన పెట్టారు. క్షేత్ర స్దాయి పరిస్దితుల మీద పూర్తి పట్టున్న తెలంగాణ మీడియాను దూరం పెట్టుకున్నారు. పైపై ప్రచారాన్ని నమ్ముకొని నిండా మునిగారు. అటు మీడియా విషయంలోనూ తప్పటగులు వేసినట్లే, పోల్‌ మేనేజ్‌మెంటు అనుభవం వున్న నాయకులను రంగంలోకి దించలేదు. బిఆర్‌ఎస్‌లోవున్న ఎంతోమంది సీనియర్‌ నాయకులకు పక్కన పెట్టారు. అనేక ఎన్నికలు ఎదుర్కొని విజయం సాదించిన నాయకులకు దూరం పెట్టారు. పైగా జూబ్లీహిల్స్‌లో ప్రజలకు అందుబాటులోవుండి, ప్రజలకు నాడి తెలిసిన నాయకులకు బాద్యతలు అప్పగించలేదు. వారికి విలువే ఇవ్వలేదు. దాంతో బిఆర్‌ఎస్‌ ప్రజలకు దగ్గరకాలేకపోయింది. అయినా జూబ్లీ హిల్స్‌లో రైతు సమస్యలు ప్రస్తావిస్తే ఓట్లు రాలుతాయా? జూబ్లీహిల్స్‌లో ప్రజా సమస్యలను మీద స్పందిస్తే ఓట్లు రాలుతాయా? అన్నది గుర్తించలేకపోయారు. బాకీ కార్డు అని పట్టుకొని తిరిగారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హమీలను నమ్ముకొని ప్రచారం సాగించారు. ప్రభుత్వం ఇచ్చి, అమలు కాని హమీలను నమ్ముకున్నారు. ప్రజల్లో వాటిపై ఎక్కడా వ్యతిరేకత కనిపించడం లేదన్నది గుర్తించలేదు. పైగా అధికారంలో వున్న పార్టీ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి అన్ని రకాల వనరులు వుంటాయి. ఈ మాత్రం బిఆర్‌ఎస్‌ గుర్తించలేదు. ఇంకా మూడేళ్లపాటు కాంగ్రెస్‌ అధికారంలో వుంటుంది. పైగా ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి కూడా నవీన్‌పై వుంటుందన్న ఆలోచన బిఆర్‌ఎస్‌ చేయలేదు. సునీత మీద వుండే సానుభూతి ఒక రకమైతే, నవీన్‌ మీద వున్న సానుభూతి మరో రకమైంది. కాంగ్రెస్‌ పార్టీ నవీన్‌ యాదవ్‌ ఎంపికతోనే సగం గెలిచినట్లైంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో నవీన్‌ యాదవ్‌ బలమైన నాయకుడు. మాస్‌ లీడర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. బస్తీలలో మంచి గుర్తింపు వున్న నాయకుడు. స్దానికుడు. ప్రజలకు సుపరిచితుడు. పైగా తెలంగాణకు చెందిన నాయకుడు. అన్నింటికీ మించి బిసి నాయకుడు. బిసీల వాదం పోలరైజ్‌ అవుతున్న సమయంలో అగ్ర కులానికి చెందిన సునీతను రంగంలోకి దింపడమే బిఆర్‌ఎస్‌ చేసిన మొదటి తప్పు. బిసి నాయకుడిని రౌడీ, రౌడీ అంటూ పదే పదే ప్రజలకు నచ్చని పదాన్ని వాడడం రెండో తప్పు. బస్తీలలో ప్రజలకు బిఆర్‌ఎస్‌ దగ్గర కాకపోవడం మూడో తప్పు. క్షేత్ర స్ధాయిలో వున్న నాయకులకు ప్రచార బాద్యతలు అప్పగించకపోవడం నాలుగో తప్పు. ఆంధ్రాకు చెందిన వాళ్ల ఓట్లను నమ్ముకొని ముందుకెళ్లడం ఐదోతప్పు. ఆంద్రాకు చెందిన మీడియాను ఇంకా బిఆర్‌ఎస్‌ భుజాల మీద మోసుకుంటూ వెళ్లడం ఆరో తప్పు. సిఎం. రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగినప్పుడైనా, బిఆర్‌ఎస్‌ మొత్తం ప్రచారంలో పాలు పంచుకోకపోడం ఏడో తప్పు. అన్నింటికీ మించి కేసిఆర్‌ జూబ్లీ వైపు కన్నెత్తి చూడకపోవడం ఎనమిదోతప్పు. ఎందుకంటే కేసిఆర్‌ నివాసం జూబ్లీహిల్స్‌లోనే వుంటుంది. కేసిఆర్‌ ప్రచారంలోకి రాకపోయినా గెలుస్తామని అనుకోవడం తొమ్మిదోతప్పు. కేసిఆర్‌ వచ్చి ఓడిపోతే ఆ కాస్త పరువు పోతుందని భయపడడం పదో తప్పు. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎన్నిక చిన్నదైనా, పెద్దదైనా ప్రజల్లోకి రావాలి. ప్రచారం సాగించాలి. గెలవడం కోసం ఎంత పెద్ద నాయకుడైనా ఒక మెట్టు దిగాలి. ప్రదాన మంత్రి మోడీ రాష్ట్రాల ఎన్నికలవేళ ఎలా వుంటారో తెలుసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు అసెంబ్లీ ఎన్నికకు ప్రచారం రాకపోవడం అధిపత్యాన్నే చూపిస్తుంది. జనాల మీద ప్రేమ కనిపించదు. అధికారంలోవున్నంత కాలం కేసిఆర్‌జనంలోకి రాలేదని, రావడం లేదనేదే ప్రధాన విమర్శ. ముఖ్యమంత్రిగా వున్న రేవంత్‌ రెడ్డి ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అభ్యర్ది ఎంపిక విషయంలోనూ తొందరపడలేదు. ఏడు రోజుల పాటు నిర్విరామంగా ప్రచారం సాగించారు. సుమారు 15 కార్నర్‌ మీటింగులు పెట్టారు. కష్టపడి పార్టీ అభ్యర్ధిని గెలిపించుకున్నారు. తన నాయకత్వాన్ని పదిలం చేసుకున్నారు. ఇదీ నాయకుడికి వుండాల్సిన ప్రధాన లక్షణం. అంతే కాని చట్ట సభకు ఎన్నికయ్యే ఎమ్మెల్యే ఎన్నికకంటే పెద్ద ఎన్నిక ఏముంటుంది? బిఆర్‌ఎస్‌ పార్టీ అగ్ర నాయకులు దృష్టిలో అసెంబ్లీ ఎన్నిక చాలా చిన్నదిగా కనిపిస్తోందా? ఓడిపోయినా, ఇంకా అధికారంలోనే వున్నామన్న భ్రమల్లోనే వున్నారా? పార్లమెంటు ఎన్నికల ముందు రైతులు ఆగమైపోతున్నారని కేసిఆర్‌ కాలుకు బలపంకట్టుకొని తిరిగినా జనం ఎందుకు కనికరించలేదు. ఒక్కసీటులోనైనా ఎందుకు గెలిపించలేదన్నదానిపై ఇప్పటికీ అధ్యయనం చేయలేదు. సాదారణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ నాయకులంతో చర్చింది లేదు. ఎందుకు ఓడిపోయామన్నదానిపై అంతర్మధనం లేదు. అలవి కాని హమీలిచ్చి కాంగ్రెస్‌ గెలిచిందని మాట్లాడుకుంటే సరిపోతుందా? రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది అని కేసిఆర్‌ చెప్పిన మాటే ఆయనే మర్చిపోయారా? గెలవడానికి రాజకీయ పార్టీ అనేక మార్గాలను ఎంచుకుంటుంది? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే 2104లో ఇచ్చిన హమీలన్నీ బిఆర్‌ఎస్‌ అమలు చేసిందా? ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందా? దళితులకు మూడెకరాలు ఇవ్వడం సాధ్యం కాదని చేతులేత్తేయలేదా? కాంగ్రెస్‌ ఇప్పుడు అదే చేస్తోంది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్‌ తప్పులను ఎత్తి చూపడం కాదు. బిఆర్‌ఎస్‌లో వున్న లోపాలను సరిదిద్దుకోవాలి. అంతర్గత కలహాలు పక్కన పెట్టుకోవాలి. పార్టీ నాయకులను గ్రూపులుగా విడదీయం మానుకోవాలి. పార్టీని క్షేత్ర స్దాయిలో పునాదులు నిర్మాణం చేసుకోవాలి. జేజేలు కొట్టేవారే కాదు, ఓట్లు వేసేవారిని సంపాదించుకోవాలి.

ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవాలి ఎమ్మెల్యే జీఎస్సార్.

ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవాలి ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

విద్య వికాసానికి మూల మని, అందుకే ప్రతీ ఒక్కరు గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానం పొందాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కోట రాజ బాబు అధ్యక్షతన నిర్వహించిన 58 వ గ్రంథాలయాల వారోత్సవాల వేడుకలకు ముఖ్య అతిథిగా వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ విద్య ప్రగతికి దోహదం చేస్తుందని, ప్రతీ ఒక్కరు విద్యను అభ్యసించాలని సూచించారు. అదేవిధంగా జీవిత పాఠాలు కూడా నేర్పిస్తుందని అన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, నేడు సెల్‌ ఫోన్‌లు వచ్చిన తర్వాత ప్రతీ విషయాన్ని గూగుల్‌లో సెర్చ్‌ చేసి చూస్తున్నారని అన్నారు. అయితే వీటి వలన అనారోగ్యాలతో పాటు అవసరం లేని వాటిని గ్రహించి జీవితం అదుపు తప్పిపోయే ప్రమాదం ఉందని వివరించారు. సెల్‌ఫోన్‌ అవసరమే కానీ అతిగా వాడకూడదని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు అదనపు కొత్త భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరి చేస్తామని,అందులో అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రకాల పుస్తకాల కొరకు 10 లక్షల రూపాయలు ఎస్ డి ఎఫ్ నిధుల నుండి ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ కోటా రాజబాబు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

మహిళా శక్తి క్యాంటిన్ సభ్యులకు స్పెషల్ ట్రైనింగ్…

మహిళా శక్తి క్యాంటిన్ సభ్యులకు స్పెషల్ ట్రైనింగ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా సమైక్య ఆఫీస్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ సభ్యులకు కోకో కోలా కంపెనీ నిర్వాహకులు కృష్ణ రుచికరమైన వంటలు, చేవట్ట విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెర్చ్ అధికారి హమీద్, ట్రైనర్ సుజాత, పీఎం నాగరాజు, డీపీఎం రాము, ఏపీఎం సమత పాల్గొన్నారు. జహీరాబాద్, ఝురసంగం, ఇస్నాపూర్, సంగారెడ్డి టౌన్, పత్తూర్లలో కొనసాగుతున్న క్యాంటిన్ల సభ్యులకు ఈ శిక్షణ అందించారు.

జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా బాలసభ ఏర్పాటు చేసి విద్యార్థు. మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులై పాఠశాలల్లోని కొన్ని కొన్ని సబ్జెక్టులు తీసుకొని పాఠశాలలోని తరగతులకు ఉపాధ్యాయులై పాఠశాల బోధనలు చేయడం జరిగింది అలాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా దినోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. పిల్లల పట్ల నెహ్రూ కి ఉన్న ప్రేమను స్మరించుకుంటూ, 1954 నుండి ఆయన జయంతిని బాలల దినోత్సవం గా జరుపుతున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వన్ సెంటర్ దోమల యశోద, టు సెంటర్ జి లలిత.ఆయా పద్మ విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా బాలసభ ఏర్పాటు చేసి విద్యార్థు. మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులై పాఠశాలల్లోని కొన్ని కొన్ని సబ్జెక్టులు తీసుకొని పాఠశాలలోని తరగతులకు ఉపాధ్యాయులై పాఠశాల బోధనలు చేయడం జరిగింది అలాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా దినోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

కపాస్ కిసాన్ యాప్ వెంటనే రద్దు చేయాలి.

కపాస్ కిసాన్ యాప్ వెంటనే రద్దు చేయాలి.

#బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి .
నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

కపాస్ కిసాన్ యాపను రద్దుచేసి ఎలాంటి నిబంధనలు లేకుండా సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని ప్రకృతి వైపరీత్యాల వలన తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి తేమ పేరుతో ఆంక్షలు విధించకూడదని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో రైతు సంఘ నాయకులు మామిళ్ల మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై కుమారస్వామి మాట్లాడుతూ 1970లో ఏర్పాటు చేసిన సీసీఐ రైతు పండించిన పత్తిని కొనుగోలు చేస్తూ వస్తున్నది . మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చే ప్రయత్నం చేయడంతో రైతాంగం చేసిన తీవ్రమైన ప్రతిఘటనతో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసి నల్ల చట్టాలను రద్దు చేసినట్టు ప్రకటించినప్పటికీ రైతాంగం మీద కుట్రలు చేస్తూనే ఉన్నది అన్నారు. ఓపెన్ మార్కెట్లో పత్తి నీ అమ్ముకోకుండా కపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రైతాంగం స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్ లో చూపించిన తేదీ సమయం ప్రకారం ఎకరానికి ఏడు క్వింటాళ్ల వరకు మాత్రమే అమ్ముకునే నిబంధనలు విధించడం ఎనిమిది శాతం కన్నా తేమ ఎక్కువగా ఉంటే ధరలో తేడాలు ఉంటాయని పేర్కొనడం రైతులకు అన్యాయం చేయడమే అన్నారు. కౌలు రైతులు పేద సన్నా చిన్నకారు రైతులు ఈ అకాల వర్షాలకు పంటలతో తీవ్రంగా నష్టపోయి పెట్టుబడి రానీ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు మండలంలో ఇప్పటివరకు అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగం యొక్క పంట వివరాలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన పత్తి రైతులకు కనీసం ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు .రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రైతాంగానికి అండగా నిలవాలన్నారు లేనిచో రైతు సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతం చేయడం తప్పదని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ జన్ను జయరాజు సిపిఎం పార్టీ మండల నాయకులు బొడిగె సమ్మయ్య , గోనె సంజీవయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లకు నష్టపరిహారం ఇప్పించండి…

ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లకు నష్టపరిహారం ఇప్పించండి…

శాంతినగర్ కాలనీవాసులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే ఫోర్ గడ్డ శాంతినగర్ కాలనీ సమీపంలో రామకృష్ణాపూర్ ఉపరితల గని రెండో దఫ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 3 రోజున ప్రజాభిప్రాయ సేకరణ ఉన్న సందర్భంగా శాంతినగర్ కాలనీవాసులు తమ అభిప్రాయాలను ముందస్తుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ లకు కాలనీవాసుల అందరి సంతకాలు సేకరించి వినతి పత్రాలు అందించారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడారు. మొదటి దఫా పనులు జరిగిన సందర్భంగా బాంబు బ్లాస్టింగ్ లతో కాలనీలలోని ఇల్లుల గోడలు పగిలిపోయాయని, దుమ్ముకు ప్రజలంతా అనారోగ్య బారిన పడ్డారని తెలిపారు. మళ్లీ రెండో దఫా పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలనీ వాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించి ప్రస్తుతం ఉన్న ఇండ్లకు నష్టపరిహారం కేటాయిస్తే కాలనీ నుండి వెళ్లిపోతామని కలెక్టర్, ఆర్డిఓ ,మున్సిపల్ కమిషనర్, జిఎం లకు వినతి పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు.

రాష్ట్ర క్విజ్‌లో పులి కీర్తనకు ప్రథమ బహుమతి…

టీ-సాట్, టీఎస్ జిహెచ్ఎంఏ రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలో మల్యాల విద్యార్థినికి పులి కీర్తన కు ప్రథమ బహుమతి.

చందుర్తి, నేటిధాత్రి:

 

తెలంగాణ స్కిల్స్ అకడమిక్ అండ్ ట్రైనింగ్ (T-SAT) మరియు తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో టీ-సాట్ రాష్ట్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలో రాజన్న జోన్ జట్టు ప్రథమ స్థానాన్ని పొందింది.
రాజన్న జోన్ జట్టుకు చందుర్తి మండలం మల్యాల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పులి కీర్తన ప్రాతినిథ్యం వహించినారు.
రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులకు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మెమెంటో, అభినందన పత్రం మరియు క్యాష్ ప్రైస్ అందజేసినారు.
రాష్ట్రస్థాయి క్విజ్ పార్టీలో ప్రతిమ స్థానం పొందిన పులి కీర్తనను సిరిసిల్ల జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షురాలు జోగినపల్లి అనురాధ, ప్రధాన కార్యదర్శి మోతీలాల్, చందుర్తి మండల విద్యాధికారి వినయ్ కుమార్, మల్యాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర మరియు గ్రామస్తులు అభినందించినారు.

వనపర్తి లో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా ఇండ్లు కూల గోట్టుకున్నారు..

వనపర్తి లో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా ఇండ్లు కూల గోట్టుకున్నారు

విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి

తెలుగుదేశం పార్టీ నేత కొత్త గొల్ల శంకర్

వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణంలో వివేకానంద చౌరస్తా నుండి మర్రికుంట కొత్త బస్టాండ్ ఆర్డీవో ఆఫీస్ లైన్ కొందరు తమ ఇండ్లను స్వచ్ఛందంగా ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా తమ ఇండ్లను కులగోట్టుకున్నారని వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ నేత కొత్త గొల్ల శంకర్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు పానగల్ రోడ్డులో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా ఇండ్లు కూలగొట్టుకున్నారని ఆయన తెలిపారు గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తిలో రోడ్ల విస్తరణ కొరకు నిధులు మంజూరు చేయించారని రాజీవ్ చౌక్ అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ పాత బజారు వరకు దాదాపు రోడ్ల విస్తరణ పూర్తి చేయించారని గుర్తు చేశారు .శ్రీ రామ టాకీస్ దగ్గర సెంటర్ డివైడరింగ్ పాత యూకో బ్యాంక్ క్రాసింగ్ దగ్గర ఏర్పాటు చేయాలని వాహనాలు ఎటు పోవాలని అర్థం కాక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఎమ్మెల్యే మెగారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆర్ అండ్ బి మున్సిపల్ అధికారులు స్పందించి కర్నూల్ రోడ్ పాన్ గ ల్ ల రోడ్డు చిన్నగా ఉండడంవల్ల వెంటనే కులగొట్టాలని ఆయన డిమాండ్ చేశారు . రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోయే వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి ఆదుకోవాలని ఆయన కోరారు . వనపర్తి జిల్లా కేంద్రం విస్తరించి పోయిందని ప్రతి ఇంట్లో కార్లు ద్విచక్ర వాహనాలు ఉన్నాయని రోడ్లు ఇరుకుగా ఉండడంవల్ల నడపడానికి ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు స్వచ్ఛందంగా పానగల్ రోడ్డు కర్నూల్ రోడ్డు లో రోడ్ల విస్తరణ కొరకు ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా కుల గోట్టుకున్నందుకు వారికి వనపర్తి ప్రజల తరఫున కొత్త గొళ్ల శంకర్ కృతజ్ఞతలు తెలిపారు

సిరిసిల్లలో ఉచిత వైద్య శిబిరం

సిరిసిల్లలో ఉచిత వైద్య శిబిరం
– సిరిసిల్ల బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

బాలల దినోత్సవం పురస్కరించుకొని శాంతినగర్ లో పోకల భవాని, బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సరయు హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ టి. రవళి మరియు డాక్టర్ టి. సాయికుమార్ పర్యవేక్షణలో శుక్రవారం శాంతినగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మహిళలకు మరియు పిల్లలకు వైద్య పరీక్షలు చేసి తగు మందుల పంపిణీ జరిగినది..
బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలకు మంచి వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఇట్టి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది అలాగే మహిళలందరికీ వైద్య పరీక్షలు చేసి తగు మందులు అందించడం జరిగినది తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ టి. రవళి, డాక్టర్ టి సాయికుమార్ కు కృతజ్ఞతలు అలాగే ఇట్టి కార్యక్రమంలో పాలుపంచుకున్న శాంతినగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.. ఇట్టి కార్యక్రమంలో అడప సంతోష్, వడ్నాల శేఖర్ బాబు, వెలిశాల అభినయ్, కొంపెల్లి విజయ్, రామారావు, సోమిశెట్టి పూజిత, చోడబోయిన కౌసల్య, కమటం మంజుల, చెవిటి మల్లీశ్వరి, సువర్ణ, సౌజన్య, రూప, మహిళా బృంద సభ్యులు పాల్గొన్నారు.

ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు https://cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు.

నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీతో ఇక కాంగ్రెస్ కు తిరుగులేదు…

నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీతో ఇక కాంగ్రెస్ కు తిరుగులేదు

అభివృద్ధికి డోకా లేదు

ఇక నుంచి ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దే గెలుపు-కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన నవీన్ యాదవ్ కు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన వెలిచాల

కరీంనగర్, నేటిధాత్రి:

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ సాధించడంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు తిరుగులేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తారని తెలిపారు. శుక్రవారం వెలిచాల రాజేందర్ రావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని అక్కడి ప్రజలు నిరూపించారనీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇరవై ఐదు వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ కు రాజేందర్ రావు హర్థిక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి సింపతి ఏమాత్రం పని చేయలేదని ప్రజలు ఆదరించలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం రికార్డని రాజేందర్రావు అన్నారు. నవీన్ యాదవ్ అతని తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ పై బీఆర్ఎస్ నేతలు విష ప్రచారం చేశారనీ, వాటిని జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పి కొట్టారని బీఆర్ఎస్ నేతలకు తగిన గుణపాఠం చెప్పారని మండిపడ్డారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి రాజేందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి జూబ్లీహిల్స్ లో అన్ని వర్గాల ప్రజలు మైనార్టీలు సినీ పరిశ్రమకు చెందిన వారు ప్రతి ఒక్కరు కృషి చేయడం అభినందనీ యమని పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తారని రాజేందర్ రావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ఫలితాలు పునరావృతం అవుతాయనీ, ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపని రాష్ట్రంలో తిరుగులేదని రాజేందర్రావు పేర్కొన్నారు.

పరకాలలో కాంగ్రెస్ శ్రేణుల గెలుపు సంబరాలు…

పరకాలలో కాంగ్రెస్ శ్రేణుల గెలుపు సంబరాలు

రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపే

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్

పరకాల,నేటిధాత్రి

 

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందిన సందర్బంగా పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా కాల్చి,స్వీట్లు పంచి సంబరాలను జరుపుకున్నారు.ఈ గెలుపు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనమని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలుపుతూ గెలుపొందిన నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలే కాక తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని ఎన్నిక ఏదైనా గెలుపు ఇకనుండి కాంగ్రెస్ పార్టీ దే అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,ఏఎంసీ వైస్ చైర్మన్ బుజ్జన్న,రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మడికొండ శ్రీను,సమన్వయ కమిటీ సభ్యులు,చిన్నాల గోనాథ్ ఈర్ల చిన్ని,పంచగిరి జయమ్మ,చందుపట్ల రాఘవరెడ్డి,దుబాసి వెంకటస్వామి,పసుల రమేష్,మార్క రఘుపతి గౌడ్,సదానందం గౌడ్,పోరండ్ల సంతోష్,మడికొండ సంపత్ కుమార్,మంద నాగరాజు,రఘు నారాయణ,దార్నా వేణుగోపాల్,బొమ్మ కంటి చంద్రమౌళి,దుప్పటి సాంబశివుడు,బొచ్చు భాస్కర్,దావు పరమేశ్వర్,దుగ్గేల వినయ్,బాసాని సుమన్,సురేష్,బండారి కృష్ణ,మచ్చ సుమన్,నాగరాజు,సదన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏజెన్సీలో ఆదివాసీల చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి..

ఏజెన్సీలో ఆదివాసీల చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి

ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్

గుండాల,నేటిదాత్రి:

 

గుండాల మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల ముఖ్య నాయకుల సమావేశం పూనెం రమణ బాబు అధ్యక్షతన జరిగింది
ఈ సమావేశనికి ముఖ్య అతిధిగా ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు వి సి దొర పాల్గొని మాట్లాడుతూ గుండాల మండల కేంద్రం లొకి 1970 తర్వాత నుంచి నేటి వరకు విచ్చలవిడిగా వలస గిరిజనేతరలు వస్తున్నా కానీ స్థానిక పంచాయతీ అధికారులు కానీ మండల స్థాయి అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరించడం ఏజెన్సీ ప్రాంతంలో ఎవరి కొరకు మీరు ఇక్కడి నియమించబడ్డారు అని తెలుసుకోవాలని అన్నారు.
నేటి తెలంగాణకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుల రాష్ట్రాల నుంచి మరియు తెలంగాణలోని మైదన ప్రాంతాల నుంచి గిరిజనేతరులు మరియు లంబాడీలు గుండాలకు విచ్చలవిడిగా 1/70 చట్టానికి విరుద్ధంగా వలసలు వచ్చి, ఏదేచ్చగా అధిక ధరలు వెచ్చించి భూములు కొని,
బహుళ అంతస్తులు నిర్మించుకొని వ్యాపారాలు,వడ్డీ వ్యాపారాలు యదేచ్ఛగా చేస్తున్న కానీ పంచాయితీ అధికార్లు కాని రెవిన్యూ అధికార్లు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఇక్కడ 1/70 చట్టం ఉందా లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.గుండాల మండల పరిధిలోని వలస గిరిజనేతరుల ఆదీనంలో ఉన్న భూలను ప్రభుత్వం వెంటనే హస్తంగతం చేసుకొని,ఎల్టీఆర్ కేసులు నమోదు చేసి,బహుళ అంతస్తులు వ్యాపార గిడ్డంగులను నేలమట్టం చేయాలనీ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
దీని కొరకు వచ్చే నెల డిసెంబర్ 2న గుండాల తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేయాలి అని సన్నాహక సమావేశం నిర్వహించారు. దానికి ఆదివాసులు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లొ ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు పెండెకట్ల మహేష్,గోగ్గేలా సుధాకర్,పూనెం వసంత్,
జబ్బ సుధాకర్ ,తాటి పాపారావు,తెల్లం కిరణ్, చీమల ప్రశాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జరుపుకున్న బాలల దినోత్సవం…

ఘనంగా జరుపుకున్న బాలల దినోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్ లో నవంబర్ 14 చాచా నెహ్రూ పుట్టిన దినోత్సవం సందర్భంగా బాలల దినోత్సవం విద్యార్థినీ విద్యార్థులు చాచా నెహ్రూ వేశాధారణ లో పాల్గొని ఆటపాటలతో మరియు ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు వి శ్వేత ఉపాధ్యాయులు సాయి కుమార్ పవన్ కుమార్ మల్లయ్య ఈశ్వరమ్మ సుస్మిత నాగజ్యోతి స్రవంతి మరియు పాఠశాల కరస్పాండెంట్ బి నాగన్న గారు పాల్గొన్నారు,

వారసత్వ సంపదలను కాపాడుకోవడం మన బాధ్యత- తల్లోజు ఆచారి.

వారసత్వ సంపదలను కాపాడుకోవడం మన బాధ్యత- తల్లోజు ఆచారి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

కల్వకుర్తి పట్టణంలోని గచ్చుబావి శుద్ధి కార్యక్రమం గత మూడు రోజులుగా దిగ్విజయంగా కొనసాగుతుంది మూడవరోజు మాజీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి పాల్గొన్నారు.ముందుగా శివాలయం దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పూజలో పాల్గొన్న అనంతరం సేవా కార్యక్రమంలో పాల్గొని కాసేపు మట్టికుప్పల తట్టలు మోశారు తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన తల్లోజు ఆచారి కల్వకుర్తి పట్టణంలో పెద్ద ఎత్తున యువత స్వచ్ఛందంగా తరలిరావడం శుభపరిణామం వారసత్వ సంపద అయినటువంటి గచ్చుబావి పరిరక్షణ కోసం ప్రతిరోజు ఒక గంట సమయం కేటాయించి కాపాడుకోవాలనే ఆలోచన చాలా గొప్పదని వారసత్వ సంపదలు మన సంస్కృతికి సాంప్రదాయానికి మూల స్తంభాలని హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఒక ఆధ్యాత్మిక కేంద్రం అలాంటి కేంద్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉందని ఇంతటిపాల్గొన్నారు. మాహాత్కార్యంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ శివయ్య కృపను పొందాలని ఇకపై తరచూ గచ్చుబావిని సందర్శిస్తుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు యువత పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

సన్ వాల్లీ హై స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు…

సన్ వాల్లీ హై స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సన్ వాల్లీ హై స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. పిల్లల పట్ల నెహ్రూ కి ఉన్న ప్రేమను స్మరించుకుంటూ, 1954 నుండి ఆయన జయంతిని బాలల దినోత్సవం గా జరుపుతున్నారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రీడా పోటీలు, నాటికలు, నృత్యాలు, పాటలు, వక్తృత్వ వికాస పోటీలు, వ్యాసరచన వంటి ఎన్నో రంగుల కార్యక్రమాలు విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించాయి.
ప్రత్యేక ఆకర్షణగా చిన్నారులు తమ భవిష్యత్ కలలను ప్రతిబింబించే విధంగా వివిధ వేషధారణల్లో హాజరయ్యారు. డాక్టర్, లాయర్, పోలీస్, ఐఏఎస్ ఐపీఎస్ బిజినెస్‌మ్యాన్, సైంటిస్ట్, టీచర్ మొదలైన వృత్తుల వేషధారణలో విద్యార్థులు అందంగా ప్రదర్శన ఇచ్చారు.
పిల్లలు ఈ విధంగా పాల్గొనడం ద్వారా, “ఇదే మా కల… రేపు నిజంగానే ఈ స్థానాల్లో మెరిసే వ్యక్తులమవుతాం” అని తమ ఆశయాలను స్పష్టంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా సన్ వాల్లీ హై స్కూల్‌లో ప్రిన్సిపాల్ వేముల శేఖర్ మాట్లాడుతూ
నేటి చిన్నారులే రేపటి భారత పౌరులు. పిల్లల కలలు చిన్నవైనా, పెద్దవైనా—ప్రతి కలకు విలువ ఉంది. పిల్లలకు మంచి విద్య, సత్సంకారాలు, ధైర్యం, మార్గనిర్దేశనం ఇవ్వడం ద్వారా వారిని సమాజానికి ఉపయోగపడే నాయకులుగా తయారుచేయాలి. స్కూల్ విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి గర్వకారణం అవుతారని నాకు నమ్మకం” అని తెలిపారు.
తరువాత విద్యార్థులకు చాక్లెట్లు, స్వీట్లు, బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఇన్‌చార్జీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ సంబరాలు…

కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ సంబరాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకొని బాణసంచా కాల్పులు జరిపి సంబురాలు చేసుకున్నారు.అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నందు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం పైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మంత్రులుమంత్రులు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎంతో కృషి చేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయమని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సానుభూతిపరులను గెలిపించి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనకు పట్టం కట్టి వారికి మరింత బలం చేకూర్చాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోవిద్యార్థుల చైతన్య సదస్సు ఏర్పాటు..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-14T162455.135.wav?_=1

 

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోవిద్యార్థుల చైతన్య సదస్సు ఏర్పాటు

 

పరకాల,నేటిధాత్రి
ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు బొచ్చు ఈశ్వర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్వీ కాలేజ్ చైర్మన్ శ్రీనివాస్ చారి మరియు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సంతోష్ హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు దేశంలో విద్యార్థులు మత్తుకు బానిసలావుతున్నారని చదువుకు దూరం అవుతూ మత్తుకు బానిస అవుతూ చదువుని దూరం చేసుకుంటు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చకుండా మత్తుకు బానిసై వారి నాశనం చేసుకుంటున్నారని విద్యార్థులు చదువుకొని తల్లిదండ్రులకు మరియు గురువులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షులు కార్యదర్శులు చెన్నూరు సాయికుమార్, బీరెడ్డి జస్వంత్,జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్,ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొజ్జ హేమంత్, విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version