అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. పిల్లల పట్ల నెహ్రూ కి ఉన్న ప్రేమను స్మరించుకుంటూ, 1954 నుండి ఆయన జయంతిని బాలల దినోత్సవం గా జరుపుతున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వన్ సెంటర్ దోమల యశోద, టు సెంటర్ జి లలిత.ఆయా పద్మ విద్యార్థులు పాల్గొన్నారు.
