ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లకు నష్టపరిహారం ఇప్పించండి…
శాంతినగర్ కాలనీవాసులు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే ఫోర్ గడ్డ శాంతినగర్ కాలనీ సమీపంలో రామకృష్ణాపూర్ ఉపరితల గని రెండో దఫ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 3 రోజున ప్రజాభిప్రాయ సేకరణ ఉన్న సందర్భంగా శాంతినగర్ కాలనీవాసులు తమ అభిప్రాయాలను ముందస్తుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ లకు కాలనీవాసుల అందరి సంతకాలు సేకరించి వినతి పత్రాలు అందించారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడారు. మొదటి దఫా పనులు జరిగిన సందర్భంగా బాంబు బ్లాస్టింగ్ లతో కాలనీలలోని ఇల్లుల గోడలు పగిలిపోయాయని, దుమ్ముకు ప్రజలంతా అనారోగ్య బారిన పడ్డారని తెలిపారు. మళ్లీ రెండో దఫా పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలనీ వాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించి ప్రస్తుతం ఉన్న ఇండ్లకు నష్టపరిహారం కేటాయిస్తే కాలనీ నుండి వెళ్లిపోతామని కలెక్టర్, ఆర్డిఓ ,మున్సిపల్ కమిషనర్, జిఎం లకు వినతి పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు.
