సన్ వాల్లీ హై స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సన్ వాల్లీ హై స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. పిల్లల పట్ల నెహ్రూ కి ఉన్న ప్రేమను స్మరించుకుంటూ, 1954 నుండి ఆయన జయంతిని బాలల దినోత్సవం గా జరుపుతున్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రీడా పోటీలు, నాటికలు, నృత్యాలు, పాటలు, వక్తృత్వ వికాస పోటీలు, వ్యాసరచన వంటి ఎన్నో రంగుల కార్యక్రమాలు విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించాయి.
ప్రత్యేక ఆకర్షణగా చిన్నారులు తమ భవిష్యత్ కలలను ప్రతిబింబించే విధంగా వివిధ వేషధారణల్లో హాజరయ్యారు. డాక్టర్, లాయర్, పోలీస్, ఐఏఎస్ ఐపీఎస్ బిజినెస్‌మ్యాన్, సైంటిస్ట్, టీచర్ మొదలైన వృత్తుల వేషధారణలో విద్యార్థులు అందంగా ప్రదర్శన ఇచ్చారు.
పిల్లలు ఈ విధంగా పాల్గొనడం ద్వారా, “ఇదే మా కల… రేపు నిజంగానే ఈ స్థానాల్లో మెరిసే వ్యక్తులమవుతాం” అని తమ ఆశయాలను స్పష్టంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా సన్ వాల్లీ హై స్కూల్లో ప్రిన్సిపాల్ వేముల శేఖర్ మాట్లాడుతూ
నేటి చిన్నారులే రేపటి భారత పౌరులు. పిల్లల కలలు చిన్నవైనా, పెద్దవైనా—ప్రతి కలకు విలువ ఉంది. పిల్లలకు మంచి విద్య, సత్సంకారాలు, ధైర్యం, మార్గనిర్దేశనం ఇవ్వడం ద్వారా వారిని సమాజానికి ఉపయోగపడే నాయకులుగా తయారుచేయాలి. స్కూల్ విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి గర్వకారణం అవుతారని నాకు నమ్మకం” అని తెలిపారు.
తరువాత విద్యార్థులకు చాక్లెట్లు, స్వీట్లు, బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఇన్చార్జీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
