టీ-సాట్, టీఎస్ జిహెచ్ఎంఏ రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలో మల్యాల విద్యార్థినికి పులి కీర్తన కు ప్రథమ బహుమతి.
చందుర్తి, నేటిధాత్రి:
తెలంగాణ స్కిల్స్ అకడమిక్ అండ్ ట్రైనింగ్ (T-SAT) మరియు తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో టీ-సాట్ రాష్ట్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలో రాజన్న జోన్ జట్టు ప్రథమ స్థానాన్ని పొందింది.
రాజన్న జోన్ జట్టుకు చందుర్తి మండలం మల్యాల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పులి కీర్తన ప్రాతినిథ్యం వహించినారు.
రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులకు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మెమెంటో, అభినందన పత్రం మరియు క్యాష్ ప్రైస్ అందజేసినారు.
రాష్ట్రస్థాయి క్విజ్ పార్టీలో ప్రతిమ స్థానం పొందిన పులి కీర్తనను సిరిసిల్ల జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షురాలు జోగినపల్లి అనురాధ, ప్రధాన కార్యదర్శి మోతీలాల్, చందుర్తి మండల విద్యాధికారి వినయ్ కుమార్, మల్యాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర మరియు గ్రామస్తులు అభినందించినారు.
