చిన్నపాటి వర్షానికే బురదమయం
రోడ్డుపై వరి నాట్లు వేసిన గ్రామస్తులు
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని కౌకొండ గ్రామంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా స్థానికంగా నెలకొన్న సమస్యలను కూడా పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా నడికూడ మండలంలోని కౌకొండ గ్రామాలకు వెళ్లే రోడ్డును బీటీ రోడ్డు వేసేందుకు ఇరువైపులా కంకర వేసి రెండు సంవత్సరాలు కావస్తున్న పనులు ప్రారంభించకపోగా మధ్యలోనే వదిలేశారు. అయితే రాత్రి కురిసిన వర్షానికి వర్షపు నీరు రోడ్డుపై నిల్వడంతో గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రజలు, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,దీంతో కౌకొండ గ్రామస్తులు వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు రోడ్డుపై వరినట్లు వేస్తూ నిరసన తెలిపారు.బిజెపి, డి.ఎస్.పి,బి ఎస్ పి, నాయకులు చుక్క రత్నాకర్, మేకల నరేష్,ఇనుగాల దిలీప్, చుక్క సూర్యం, మేకల విష్ణు, గోల్కొండ చంటి,రోడ్డును త్వరగా పూర్తి చేయాలని పలు పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.