యూసుప్ పూర్ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం…

యూసుప్ పూర్ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం.

◆-: సర్పంచిగా పదవి బాధ్యతలు స్వీకరించిన పట్లోల్ల సంగారెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల్ యూసుప్ పూర్ గ్రామ పంచాయతీ లో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు పొందిన అభ్యర్థి పట్లోళ్ళ సంగారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సభలో ముందుగా పంచాయతీ కార్యదర్శి సంగీత సర్పంచ్ కు వార్డ్ మెంబర్సకు అందరికి ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞ చేయించారు. నూతనంగా సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పట్లోళ్ళ సంగారెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో సమగ్ర అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానని పేద బడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కొలువుదీరిన నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం..

కొలువుదీరిన నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం

నడికూడ,నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులచే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నూతన పాలక వర్గంచే మండలంలోని గ్రామాల్లో గ్రామ ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ నడికూడ మండలంలో ఇటీవల నిర్వహించిన స్థానిక ఎన్నికలలో అన్ని గ్రామ పంచాయతీల సర్పంచుల,ఉప సర్పంచ్ ల వార్డు సభ్యుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు నిర్వహించడం జరిగింది.
నూతన సర్పంచులగా ఎన్నికైన సర్పంచులు,వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పార్టీలకతీతంగా ముందుకు సాగి గ్రామాలను అభివృద్ధి పరుస్తామని హామీలు ఇచ్చారు.ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయా గ్రామాల్లో జన సందోహం పండగ వాతావరణం ఏర్పడగా ఈ సమావేశంలో హామీలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నడికూడ గ్రామ సర్పంచ్ కుడ్ల మలహల్ రావు,కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత, సర్వాపురం గ్రామ సర్పంచ్ భోగి శ్రీలత,ధర్మారం గ్రామ సర్పంచ్ భాషిక ఎల్ల స్వామి, కంఠాత్మకూరు గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి, రామకృష్ణాపూర్ సర్పంచ్ పెండ్లి లక్ష్మి,నర్సక్కపల్లె గ్రామ సర్పంచ్ కోడెపాక ముత్యాలు, పులిగిల్ల గ్రామ సర్పంచ్ ఇనుగాల పద్మ,రాయపర్తి గ్రామ సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్,ముస్తాలపల్లి గ్రామ సర్పంచ్ మాకమల్ల వెంకటేష్, నార్లాపూర్ గ్రామ సర్పంచ్ పెద్దబోయిన రవీందర్ యాదవ్,చర్లపల్లి గ్రామ సర్పంచ్ బండి రేణుక,వరి కోలు గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,వెంకటేశ్వర్ల పల్లె గ్రామ సర్పంచ్ పెండ్యాల మహేందర్ రెడ్డి,ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సర్పంచిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీకాంత్…

సర్పంచిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీకాంత్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి రూరల్ మండలం కొంపెల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి శ్రీకాంత్ పోటీ చేసి గెలుపొందడం జరిగింది సోమవారం రోజున గ్రామ సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన కొంపెల్లి గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు గ్రామంలో అభివృద్ధి చేసి చూపెడతానని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

దళితులకు పెద్ద పీట… ఆదర్శ రాజకీయాలకు నాంది…

దళితులకు పెద్ద పీట… ఆదర్శ రాజకీయాలకు నాంది

నర్సింహుల గూడెం సర్పంచ్‌గా పోలేపల్లి శివశంకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
దళితులకు పెద్ద పీట… ఆదర్శ రాజకీయాలకు నాంది
ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అందరూ దళితులే!!

నేటి ధాత్రి అయినవోలు:-

 

 

 

నర్సింహుల గూడెం గ్రామంలో ఆదర్శ రాజకీయాలకు నాంది పలికిన సంఘటనగా పోలేపల్లి శంకర్ రెడ్డి సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిలిచింది. సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులుగా అంతా దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులే ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయడం గ్రామ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టంగా మారింది.

సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, సామాజిక న్యాయం–సమానత్వం అనే మూల సూత్రాలను ముందుకు తెచ్చే విధంగా సర్పంచ్ శంకర్ రెడ్డి వ్యవహరించిన తీరు ప్రజల్లో విశేష స్పందనను రాబట్టింది. గ్రామ పాలనలో దళితులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, వారిని నిర్ణయాధికార స్థానాల్లో నిలబెట్టడం ద్వారా సమాజంలో సమాన అవకాశాల దిశగా బలమైన అడుగు పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ,
“గ్రామ అభివృద్ధి అందరిదీ. కులాలు, వర్గాలు అనే తేడా లేకుండా నర్సింహుల గూడెాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. పాలనలో దళితుల భాగస్వామ్యం పెరగడం సామాజిక మార్పుకు నాంది” అని తెలిపారు.
గ్రామంలో మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, విద్య, మహిళా సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే గ్రామపంచాయతీ నిర్ణయాలు పారదర్శకంగా, ప్రజల భాగస్వామ్యంతో తీసుకుంటామని హామీ ఇచ్చారు.సర్పంచ్ శంకర్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ఈ పాలక మండలి, దళిత సాధికారతకు మాత్రమే కాకుండా గ్రామాభివృద్ధికి కూడా దిశానిర్దేశం చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలపడుతోంది. నర్సింహుల గూడెం గ్రామం రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలవాలన్న ఆకాంక్షతో ప్రజలు ఈ కొత్త పాలనపై ఆశలు పెట్టుకున్నారు.

సర్పంచుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్..-

సర్పంచుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్

#సర్పంచుల విజయంలో కీలక పాత్ర పోషించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్

ములుగు, నేటిధాత్రి:

 

రాష్ట్ర మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు
ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలో 12 కి 12 వార్డులు కాంగ్రెస్ పార్టీ బలపరచిన వార్డు సభ్యులు విజయం సాధించి 806 ఓట్ల భారీ మెజారిటీతో బిఆర్ఎస్ బలపరచిన అభ్యర్థిపై గెలుపొందిన ధారావత్ సరిత & సారయ్య,ఉప సర్పంచ్ పోరిక భద్రు నాయక్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అదే విధంగా
దేవగిరిపట్నం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి ఇస్లావత్ పూలమ్మ &సంతోష్ మరియు ఉప సర్పంచ్ ఇట్టబోయిన రాజు యాదవ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పొట్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి కందికొండ భాగ్యలక్ష్మి & రమేష్ ఉప సర్పంచ్ పాలడుగుల మురళి,వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపిన ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ములుగు మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికయిన సర్పంచులు గ్రామంలోని ప్రతి సమస్యనీ పరిష్కరించే విధంగా పని చేస్తూ గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరికి సహకరించాలని సూచించారు
ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క ఇచ్చిన ప్రతి హామీని తొందరలోనే ప్రారంభించి ప్రతి హామీ పూర్తి చేస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, పాక్స్ మాజీ వైస్ చైర్మన్ మర్రి రాజు యాదవ్,ములుగు మాజీ ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి,యూత్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల రేవంత్ యాదవ్,పత్తిపల్లి మాజీ సర్పంచులు బుర్రి రజిత,శ్రీలమంతుల రవీంద్రాచారి,దేవగిరిపట్నం మాజీ సర్పంచ్ ఎన్నారెడ్డి,పొట్లపూర్ మాజీ సర్పంచ్ అంకిరెడ్డి ములుగు పట్టణ యూత్ అధ్యక్షుడు అభినయ్ చారి,మైనారిటీ నాయకులు అజ్జు,యూత్ నాయకులు చందు, కన్ని,ఆయా గ్రామ కమిటీల అధ్యక్షులు సీనియర్ నాయకులు, యూత్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version