రామన్ పాడు గ్రామంలో క్రికెట్ పోటీలు ప్రారంభించిన సర్పంచ్
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కొత్త కోట మండలం రామన్ పాడు గ్రామములో
క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సర్పంచ్ అఫ్రీన్ బేగం అంజాద్ అలీ ప్రారంభించారు
గ్రామ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ మూడు రోజులపాటు ఆడుతున్న సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్అఫ్రీన్ బేగం అంజాద్ అలీ ప్రారంభించి టాస్ ఎగర వేసారు ఈ సందర్భంగా సర్పంచ్ యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆటలు మానసిక ప్రశాంతతనం ఏకాగ్రతను ఇస్తూ శారీరక దృఢత్వని ఇస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ యువకులు పాల్గొన్నారు
