కాయ్​ రాజా కాయ్​.. రాష్ట్రంలో జోరుగా ఐపీఎల్​ బెట్టింగ్​…

కాయ్​ రాజా కాయ్​.. రాష్ట్రంలో జోరుగా ఐపీఎల్​ బెట్టింగ్​…

◆”-: బెట్టింగ్​ సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్న పోలీసు అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

నాడు… అగ్గిపుల్లా…. సబ్బుబిల్లా… కాదేది.. కవితకనర్హం… అన్నారు మహాకవి శ్రీశ్రీ.. నేడు.. కాదేది బెట్టింగ్‌కు అనర్హమంటూ…. అనతి కాలంలోనే ధనార్జనే ధ్యేయంగా కొందరు యువకులు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌లకు ఒడిగడుతున్నారు. అంతర్జాతీయంగా క్రికెట్‌ అంటే అంతులేని మోజు… ఆట చూడడం ఒక ఎత్తైతే.. మరో కోణంలో ఆటలో గెలుపొటములపై బెట్టింగ్‌ల ద్వారా లక్షల రూపాయలు వెచ్చించి కుటుంబాలను వీధికీడుస్తున్న సంఘటనలు ఉమ్మడి సంగారెడ్డి జిల్లా కాలం నుంచి ప్రస్తుత జహీరాబాద్ నియోజకవర్గ వరకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఏటేటా వేసవి వినోదంగా ప్రపంచ క్రికెట్‌ లీగ్‌లకే మెగా లీగ్‌గా ఆవిర్భవించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మ్యాచ్‌లు ఆరంభమవుతున్నాయంటేనే చాలు. జహీరాబాద్ ప్రాంతం లో బెట్టింగ్‌ ముఠాలు రహాస్యంగా రంగంలోకి దిగుతాయి. ఇలా గత అనేక సంవత్సరాలుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు సాగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు పోలీసులకు పట్టుబడిన వారు రాజకీయ అండదండలతో ఎలాగోలా బయటకొస్తున్నారు. మళ్లీ ఏడాది నాటికి నాడు పట్టుబడి పొగోట్టుకున్న పైకాన్ని తిరిగి రికవరీ తరహాలో సంపాదించుకుంటున్నారు. కొందరయితే ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలు ఎప్పుడు ఆరంభమవుతాయా…? అంటూ ఎదురుచూస్తూ బెట్టింగ్‌ల కోసం పందెం కోళ్లను సిద్ధం చేసినట్లు ప్రత్యేకంగా ఈ ఆటపై ఆసక్తి… బెట్టింగ్‌లపై ఆశలు ఉన్న వారిని ఏరి కోరి సంసిద్ధులను చేస్తున్నారు.

భారీ మొత్తంలో పందాలు..

జహీరాబాద్ లో ఏర్పాటు తర్వాత బెట్టింగ్‌ బ్యాచ్‌ల దందాకు అంతులేకుండా పోయింది. రోజు జనంలో కలిసి తిరిగే యువకుల్లో కొందరూ బెట్టింగ్‌ల ద్వారా అనతికాలంలోనే లక్షల రూపాయలు సంపాదించే దొడ్డి దారి మార్గంగా ఎంచుకుంటున్నారు. వీరికి అధికారంలో ఎవరున్నా వారి మద్దతు లభిస్తూ వస్తోంది. ఇప్పుడు ఐపీఎల్‌ మార్చి 26వ తేదీ నుంచి ఆరంభమైన ఈ క్రికెట్‌ లీగ్‌లలో పెద్దపెద్ద జట్లు ఆడినప్పుడు భారీ మొత్తంలోనే పందాలు కాస్తున్నారు. శని, ఆదివారాలు వీకేండ్‌ రెండేసి మ్యాచ్‌లు ఉండడంతో ఆ రోజుల్లోనైతే పందాలకు అడ్డుఅదుపు లేదు. నేరుగా రూ.100కు రూ.1000 చొప్పున లాభాలు చూపి ఈ గేమ్‌లో అమాయకుల్ని దింపుతున్నారు. వందతో మొదలెట్టిన ఆట వేలు ఆపై లక్షల రూపాయలకు చేరుకుంటోంది. వివిధ చోట్ల అప్పులు చేసి మరి ఈ రొంపిలోకి దిగి కొందరు నిండా మునిగి వీధులపాలవుతున్నారు. 

ఆన్‌లైన్‌ గేమ్‌ల్లో..

ప్రత్యక్ష పందెం ఒకటయితే ఇంకా ఆన్‌లైన్‌ గేమ్‌ల్లో అనేక రకాల బెట్టింగ్‌లు ఇప్పుడు జోరుగా నడుస్తున్నాయి. రమ్మీ సర్కిల్‌, రమ్మీ కల్చర్‌, డిఫాబెట్‌ లాంటి ఆప్లికేషన్‌లు తెలంగాణలో నిషేదం ఉన్నప్పటికి ఇంకా రహాస్యంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. బెట్టింగ్‌ చేసే వారు ముందుగా ఒక ఐడీని క్రియేట్‌ చేసుకుని సదరు అప్లికేషన్‌లో లాగిన్‌ అయి తన బ్యాంకు అకౌంట్‌ను లింకప్‌ చేసుకుని డబ్బులు జమ చేసి ఆడుతున్నారని తెలుస్తోంది. ఇందులోనే ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌, బాల్‌ టు బాల్‌, ఓవర్‌ టై ఓవర్‌, ఎకా్ట్రస్‌, ఫోర్‌, సిక్స్‌, వికెట్‌ ప్లేయిర్స్‌పై రకరకాల బెట్టింగ్‌లు కాస్తున్నారంటున్నారు.

క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొంటే కఠిన చర్యలు – ఎస్ఐ రాజేందర్ రెడ్డి

జహీరాబాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ ప్రారంభం కావడంతో, క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ మండల చారక్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేందర్ రెడ్డి మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో జూదం అనే ఉచ్చులో పడి, తమ జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకోవద్దని ఆయన యువతకు సలహా ఇచ్చారు. క్రికెట్ బెట్టింగ్ కారణంగా కుటుంబాలు నాశనమవుతాయని, అప్పుల్లో కూరుకుపోతాయని, ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని ఎస్ఐ అన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ యాప్‌ల (టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్) ద్వారా పనిచేసే బెట్టర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. యువత, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను పర్యవేక్షించాలని, మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిస్తే, వెంటనే 100కు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్ఐ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

యువత జీవితాలు నాశనం చేసుకోవద్దు.. ఎస్సై క్రాంతి కుమార్ పటేల్

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్, ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత బెట్టింగ్లో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, దీనివల్ల అప్పుల పాలై కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ కు పాల్పడేవారిపై నిఘా ఉంచి, అక్రమాలకు పాల్పడితే పిడి యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ పేర్కొన్నారు.

బెట్టింగ్ ముఠాలకు ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ వార్నింగ్…

బెట్టింగ్ ముఠాలకు ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ వార్నింగ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్ ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ కీలక విజ్ఞప్తి చేశారు. క్రికెట్ను కేవలం ఒక క్రీడగా మాత్రమే ఆస్వాదించాలని, బెట్టింగ్ అనే మాయలో పడి విలువైన జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. ఇవాళ (నేటి ధాత్రి ) ప్రత్యేక పత్రికలో ఆయన ఈ అంశాలను వెల్లడించారు. గతంలో ప్రభుత్వం వందలాది బెట్టింగ్ యాప్లను నిషేధించినప్పటికీ, నిర్వాహకులు ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా కొత్త రూపంలో ఈ దందాను కొనసాగిస్తున్నారని ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ తెలిపారు.. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఆన్లైన్ ద్వారానే కాకుండా, నగర శివార్లలోని ఫామ్ హౌస్లు, ఇతర రహస్య హస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్లైన్ బెట్టింగ్లపై కూడా పోలీసుల ప్రత్యేక నిఘా ఉందని స్పష్టం చేశారు.

ఆన్లైన్ గేమ్స్..ఆగమైన ఊరు…

ఆన్లైన్ గేమ్స్..ఆగమైన ఊరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండల ఆయా గ్రామాలకు చెందిన యువకులు ప్రైవేట్ వ్యాపారాలు కంపెనీలో జాబ్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న.
తన ఫ్రెండ్ను చూసి ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో తెలిసివారి దగ్గర 5 నుంచి 10 రూపాయల మిత్తికి రూ.20 లక్షల వరకు అప్పులు చేస్తున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో చేసేదేమీ లేక తమకున్న భూమిలు ఫోన్లు బంగారము అమ్మి అప్పులు తీర్చేస్తున్నారు.

ఇదే గ్రామంలో వ్యవసాయంచేసుకుంటూ జీవనం సాగించే కొందరు వ్యక్తులు.. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డారు. చివరకు గేమ్స్ ఆడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంతగా బానిసయ్యారు. గేమ్స్ లో పెట్టేందుకు తెలిసిన చోటల్లా అధికవడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలోనే అసలు, వడ్డీలు కలిపి సుమారు రూ. లక్షల వేలలో వరకు అప్పులు చేసుకుంటున్నారు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి ఒత్తిడి చేస్తుండడంతో తనకున్న బంగారం ఫోన్లు భూములను అమ్మి కట్టేస్తున్నారు,

ఈజీ మనీపై ఆశతో అప్పులపాలైన యువకులు 11 నూటికి 5 నుంచి 10 రూపాయల చొప్పున మిత్తికి తెచ్చి ఆటలు అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముతున్న తల్లిదండ్రులు

స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ పేకాట, బెట్టింగ్ల వ్యసనం గ్రామాలకు సైతం పాకింది. తక్కువ టైమ్లో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో చాలా మంది ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు బానిసలుగా మారుతున్నారు. ఇందుకోసం అందిన కాదలా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి గేమ్లలో పెద్దు న్నారు. సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల చాలాగ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు ఝరసంగం కోహిర్ మొగుడంపల్లి నాల్కల్ జహీరాబాద్ మండ
లంలోని ఒక్కొక్క గ్రామంలోనే సుమారు 20 మంది యువకులు ఒకరిని చూసుకుంటూ ఒకరు ఆన్లైన్ పేకాట, బెట్టింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని పైసలు పెట్టి భారీగా నష్టపోయారు.

మొదట్లో వందలు పెద్దే వేలు రావడంతో ఇదేదో లాభసాటిగా ఉందని నమ్మిన బాధితులు. చివరకు లక్షల రూపాయలు తెచ్చి పెట్టే స్థాయికి చేరారు. భారీ మొత్తంలో పెట్టిన డబ్బులన్నీ కోల్పోవడంతో ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలన్న ఆశతో అప్ప చేసి మళ్లీ పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఒక్కొక్క గ్రామానికి చెందిన ఒక్కో యువకుడు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పులపాలయ్యారు. అప్పులవాళ్ల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు తమకున్న ఎకరా, అర ఎకరం పొలాన్ని అమ్మి కొడుకులు చేసిన అప్పులు తీరుస్తున్నారు.

కుటుంబాల్లో గొడవలు

ఆన్లైన్ గేమ్స్ తో యువకులు ఆర్థికంగా నష్టపో తుందదంతో పాటు కుటుంబాల్లో గొడవలు జరు గుతున్నాయి. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య, భార్మా, భర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. అప్పులు తీర్చేందుకు కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తుండటం, భూములు అమ్మే పరిస్థితి తలెత్తుతుండటంతో పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకు నేదాకా వెళ్లాయి. ‘ఆ పిలగాడు ఫోన్లో గేమ్ ఆడి మస్త్ పైసలు పోగొట్టిందట… మస్తు అప్పు అయ్యింది. కొంత భూమి అమ్మేసిండు, అయినా ఇంకా అప్పు ఉందట, ఇంకింత భూమి అమ్మితే గాని అప్పు తీరేట్టులేదు అనే మాటలు చల్మెడ గ్రామంలో వినిపిస్తున్నాయి.

రూ.10 మిస్తీకి తెస్తున్నరు

ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన యువకులు కొందరు ప్రైవేట్ ఫైనాన్స్ అప్పులు తీసుకుంటు న్నారు. దీనిని అదనుగా తీసుకుని ప్రైవేట్ ఫైనాన్స్
వ్యాపారులు వందకు రూ.5 నుంచి రూ.10 వరకు మిత్త వసూలు చేస్తున్నారు. దీంతో అసలుతో పాటు మిత్తీ భారీగా పెరిగిపోతున్నది. మండల కేంద్రమైన నిజాంపేటలో కొంతమంది ఎలాంటి ప్రభుత్వ అను మతులు లేకుండా ఫైనాన్స్ లు నడిపే వ్యక్తులు అధిక వడ్డీకి అప్పులు ఇస్తుండడంతో పాటు, ష్యూరిటీగా భూములను ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని, నిర్ణీత గడువులోగా అప్పు, మిత్రీడబ్బులు చెల్లించకుంటే ఆ భూములు తమవరం చేసుకుంటున్నట్లు తెలిసింది

అవగాహనతో అడ్డుకట్ట

గ్రామలలో అనేక మంది యువకులు ఆన్లైన్ గేమ్స్ ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవడంతో పాటు భూములు అమ్ముకునే పరిస్థితి నెలకొన్నది. యువత ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లకుండా పోలీసులు ఆయా గ్రామలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే అధిక వడ్డీకి అప్పులిస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దు

యువత బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లొద్దు. అప్పల ఊబిలో చిక్కుకోవద్దు. గ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్ పై అవగాహన కల్పిస్తాం. అలాగే, భూములు కుదవబెట్టుకొని అధిక వడ్డీలకు అప్పులిస్తున్నవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తాం.

ఝరాసంగం మండల ఎస్సై క్రాంతికుమార్ పటేల్

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version