కొలువుదీరిన నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం..

కొలువుదీరిన నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం

నడికూడ,నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులచే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నూతన పాలక వర్గంచే మండలంలోని గ్రామాల్లో గ్రామ ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ నడికూడ మండలంలో ఇటీవల నిర్వహించిన స్థానిక ఎన్నికలలో అన్ని గ్రామ పంచాయతీల సర్పంచుల,ఉప సర్పంచ్ ల వార్డు సభ్యుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు నిర్వహించడం జరిగింది.
నూతన సర్పంచులగా ఎన్నికైన సర్పంచులు,వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పార్టీలకతీతంగా ముందుకు సాగి గ్రామాలను అభివృద్ధి పరుస్తామని హామీలు ఇచ్చారు.ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయా గ్రామాల్లో జన సందోహం పండగ వాతావరణం ఏర్పడగా ఈ సమావేశంలో హామీలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నడికూడ గ్రామ సర్పంచ్ కుడ్ల మలహల్ రావు,కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత, సర్వాపురం గ్రామ సర్పంచ్ భోగి శ్రీలత,ధర్మారం గ్రామ సర్పంచ్ భాషిక ఎల్ల స్వామి, కంఠాత్మకూరు గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి, రామకృష్ణాపూర్ సర్పంచ్ పెండ్లి లక్ష్మి,నర్సక్కపల్లె గ్రామ సర్పంచ్ కోడెపాక ముత్యాలు, పులిగిల్ల గ్రామ సర్పంచ్ ఇనుగాల పద్మ,రాయపర్తి గ్రామ సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్,ముస్తాలపల్లి గ్రామ సర్పంచ్ మాకమల్ల వెంకటేష్, నార్లాపూర్ గ్రామ సర్పంచ్ పెద్దబోయిన రవీందర్ యాదవ్,చర్లపల్లి గ్రామ సర్పంచ్ బండి రేణుక,వరి కోలు గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,వెంకటేశ్వర్ల పల్లె గ్రామ సర్పంచ్ పెండ్యాల మహేందర్ రెడ్డి,ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version