ఇంటర్మీడియట్ ఫలితాలలో మెరిసిన కక్కిరాలపెల్లి విద్యార్థిని లయశ్రీ
ఇంటర్మీడియట్ ఎం. ఎల్ టి గ్రూపులో స్టేట్ మొదటి ర్యాంక్
ఆరూరి లయశ్రీ రాయపర్తి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని
ఆరూరి లయశ్రీకి గ్రామస్తులు బి. ఆర్. ఎస్ నాయకుల అభినందన
నేటిధాత్రి ఐనవోలు :-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో అయినవోలు మండలం కక్కిరాల పల్లి గ్రామానికి చెందిన ఆరూరి లయశ్రీ ఇంటర్మీడియట్ ఎంఎల్టి గ్రూప్ లో స్టేట్ లో మొదటి ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన ఆరూరి సుమలత ప్రభాకర్ దంపతులకు కుమార్తె లయశ్రీ రాయపర్తి లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతూ ఈ ఘనత సాధించడం విశేషం.ఈ సందర్భంగా కక్కిరాలపెళ్లి గ్రామ బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు లయశ్రీ ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ కంజర్ల రమేష్ మాట్లాడుతూ కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని రాష్ట్రంలోని అత్యుత్తమ ర్యాంకు సాధించడం మన గ్రామానికి గర్వకారణం అన్నారు. చదువులోనే కాకుండా లయశ్రీ సాఫ్ట్ బాల్ కాంపిటీషన్లో నేషనల్ లో సిల్వర్ మెడల్ సాధించడం కూడా విశేషం. ఇలాంటి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లయశ్రీ గ్రామంలోని యువత కే కాకుండా మండలంలోని యువత కూడా ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ బొల్లం ప్రకాష్ మాజీ వార్డు సభ్యులు మంద రజిత కాటబోయిన కుమార్ స్వామి టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నాయకులు యాదగిరి ఏలియా నిమ్మాని వెంకటేశ్వరరావు మోహన్ తదితరులు పాల్గొన్నారు.