స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో మరోసారి మెరిసిన తిరుపతి..

*స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో మరోసారి మెరిసిన తిరుపతి..

*రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మేయర్, కమిషనర్..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 17:

కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు తిరుపతి నగరపాలక సంస్థ ఎంపికయ్యిందిగురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫ్ఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ లతో కలసి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్.మౌర్య లు అవార్డును అందుకున్నారు. మూడు లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి నగర నగరపాలక సంస్థ సూపర్ స్వచ్ఛ లీగ్ ను కైవశం చేసుకుంది. పరిశుభ్రమైన పరిసరాల ద్వారా ఆరోగ్యకర సమాజం సాధించే లక్ష్యంతో ప్రధాని మోదీ రూపొందించిన స్వచ్ఛ భారత్ విప్లవం కొనసా గుతోంది. ఏటా స్వచ్చ సర్వేక్షణ్ పేరుతో అవార్డులను ప్రకటిస్తూ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను ప్రోత్సహిస్తోందిఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్.మౌర్యతో పాటు పలువురు నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది, నగర ప్రజల తో పాటు ప్రజా ప్రతినిధుల సహకారంతోనే ఈ అవార్డు సాధించగలిగామని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించగలుగుతామని ధీమా వారు వ్యక్తం చేశారు.

ఇంటర్మీడియట్ ఫలితాలలో.!

ఇంటర్మీడియట్ ఫలితాలలో మెరిసిన కక్కిరాలపెల్లి విద్యార్థిని లయశ్రీ
ఇంటర్మీడియట్ ఎం. ఎల్ టి గ్రూపులో స్టేట్ మొదటి ర్యాంక్
ఆరూరి లయశ్రీ రాయపర్తి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని
ఆరూరి లయశ్రీకి గ్రామస్తులు బి. ఆర్. ఎస్ నాయకుల అభినందన

నేటిధాత్రి ఐనవోలు :-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో అయినవోలు మండలం కక్కిరాల పల్లి గ్రామానికి చెందిన ఆరూరి లయశ్రీ ఇంటర్మీడియట్ ఎంఎల్టి గ్రూప్ లో స్టేట్ లో మొదటి ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన ఆరూరి సుమలత ప్రభాకర్ దంపతులకు కుమార్తె లయశ్రీ రాయపర్తి లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతూ ఈ ఘనత సాధించడం విశేషం.ఈ సందర్భంగా కక్కిరాలపెళ్లి గ్రామ బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు లయశ్రీ ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ కంజర్ల రమేష్ మాట్లాడుతూ కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని రాష్ట్రంలోని అత్యుత్తమ ర్యాంకు సాధించడం మన గ్రామానికి గర్వకారణం అన్నారు. చదువులోనే కాకుండా లయశ్రీ సాఫ్ట్ బాల్ కాంపిటీషన్లో నేషనల్ లో సిల్వర్ మెడల్ సాధించడం కూడా విశేషం. ఇలాంటి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లయశ్రీ గ్రామంలోని యువత కే కాకుండా మండలంలోని యువత కూడా ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ బొల్లం ప్రకాష్ మాజీ వార్డు సభ్యులు మంద రజిత కాటబోయిన కుమార్ స్వామి టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నాయకులు యాదగిరి ఏలియా నిమ్మాని వెంకటేశ్వరరావు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version