సరస్వతి పుష్కరాలకు బస్సుల ఏర్పాటు. !

సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు

రోజుకు 10 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి

పరకాల డిపో మేనేజర్ రవి చందర్

పరకాల నేటిధాత్రి :

 

ఈ నేల 15 నుండి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడువు తున్నట్టు డిపో మేనేజర్ రవిచందర్ ఓ ప్రకతనలో తెలిపారు.రోజుకు 10 ప్రత్యేక బస్సులు పరకాల నుండి కాళేశ్వరంకు నడుపుతున్నట్టు తెలిపారు.ఈ పుత్యేక బస్సులకు చార్జీలు పరకాల నుండి కాళీశ్వరంకు పెద్దలకు 190రూపాయలు పిల్లలకు 110రూపాయలు గా నిర్ణయించినట్టు తెలిపారు.ఏదైనా వివరాలకు 9705479088,7382 926774 నంబర్లను సంప్రదించాలని,భక్తులందరు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు .!

శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు

మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్

జవహర్ నగర్ నేటి దాత్రి:

 

 

మేడ్చల్ మార్కాజిగిరి జిల్లా

జవహర్ నగర్ మున్సిపాలిటీలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం లో భాగంగా యాదవ సంఘం మరియు జవహర్ నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్,మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్,సీనియర్ నాయకులు కల్లేపల్లి సదానంద,తదితరులు పాల్గొన్నారు

దేశం విజయం పై ప్రత్యేక పూజలు .

దేశం విజయం పై ప్రత్యేక పూజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత త్రివిధ దళాల సైనికుల యోగక్షేమాల కోసం వేలాలలోని మల్లన్న దైవ క్షేత్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణలో పాల్గొన్న సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేయడం పై హర్షం వ్యక్తం చేశారు.అమాయకులైన భారత పర్యాటకులను చంపినందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత్ మరింత దీటైన జవాబు ఇవ్వాలని సంఘీభావం తెలిపారు.దేశ భద్రత,రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్దంగా ఉండాలని దేశ ప్రజలను కోరారు.దేశమంతా ఒకే గళంతో మన సైన్యానికి స్పూర్తిని ఇవ్వాలని పేర్కొన్నారు.

పాకిస్థాన్ పై భారత సైన్యం విజయం సాధించాలని.!

సంగారెడ్డి: పాకిస్థాన్ పై భారత సైన్యం విజయం సాధించాలని ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం మధ్యాహ్నం స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళ హారతి ఇచ్చి మహా నివేదన చేయడం జరిగింది.
భారత్ త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని,మన సైనికులు క్షేమంగా యుద్ధరంగం నందు విజయం సాధించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ తరపున దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించడం జరిగింది.

దేశం విజయం పై ప్రత్యేక పూజలు .

దేశం విజయం పై ప్రత్యేక పూజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత త్రివిధ దళాల సైనికుల యోగక్షేమాల కోసం వేలాలలోని మల్లన్న శైవ క్షేత్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణలో పాల్గొన్న సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేయడం పై హర్షం వ్యక్తం చేశారు.అమాయకులైన భారత పర్యాటకులను చంపినందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత్ మరింత దీటైన జవాబు ఇవ్వాలని సంఘీభావం తెలిపారు.దేశ భద్రత,రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్దంగా ఉండాలని దేశ ప్రజలను కోరారు.దేశమంతా ఒకే గళంతో మన సైన్యానికి స్పూర్తిని ఇవ్వాలని పేర్కొన్నారు.

భారత సైన్యానికి మద్దతుగా ప్రత్యేక పూజలు.

భారత సైన్యానికి మద్దతుగా ప్రత్యేక పూజలు

రాయికల్  నేటి దాత్రి:

మే 9.ఆపరేషన్ సిందూర్ లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా రాయికల్ పట్టణంలోని నాగారం హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కశ్మీర్ లో పహాల్గామ్ ఘటన తరువాత ప్రతి భారతీయునిలో ఆవేదనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పైన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం అనేది భారత్ శక్తి యుక్తులకు నిదర్శనమ‌న్నారు.
భారత సైనిక దళాలు ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరిట పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేసిన నేపథ్యంలో వారికి భారతీయులు ప్రతి ఒక్కరు మద్దతు తెలుపాలన్నారు.ఇండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి, భారత భూభాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని,ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్,కాంగ్రెస్,బిజెపి,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,కుర్మ మల్లారెడ్డి,ఎలిగేటి అనిల్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్, నాయకులు మచ్చ నారాయణ,గాజెంగి అశోక్, వాసం దిలీప్,చింతకుంట సాయికుమార్,బొమ్మకంటి నవీన్, సుమన్,భరత్,మహేష్,పవన్,అశోక్, రంజిత్ అర్చకులు సంతోష్. వాసం ప్రసాద్. తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్ట్.!

రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్ట్ లకు ప్రత్యేకంగా రుణాలు కేటాయించాలి

తీగల శ్రీనివాస్ రావు
జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్(ఏ డి జె ఎఫ్)

మంచిర్యాల నేతి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఎలాంటి జీత భత్యాలు లేకుండా నిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిస్వార్థంగా సేవ చేస్తున్న జర్నలిస్ట్ లకు ప్రత్యేకంగా రుణాలను కేటాయించాలని అల్ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే గొప్ప ఉద్దేశం తో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ఉన్నత చదువులు చదివి జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్న వారికి ప్రత్యేక అవకాశం కల్పించినట్టైతే వారిని ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహించినట్టు అవుతుందని అన్నారు.ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్ట్ జీవితాలు మారలేదన్నారు. ఈ ప్రజా ప్రభుత్వం లో రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్టుల కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు చింతల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ పూజా కార్యక్రమంలో పట్టణ ఆవోప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు
గోకారం రాజు కటకం శ్రీధర్ చిదేరే వెంకటేష్. నూకల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

ఆరోగ్యం బాగుపడాలని ప్రత్యేక పూజలు.!

మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారి ఆరోగ్యం బాగుపడాలని ప్రత్యేక పూజలు

మందమర్రి నేటి ధాత్రి

 

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ప్రాంతంలో బస్టాండ్ ఏరియా లోని అభయ ఆంజనేయ స్వామి గుడి లో ఎమ్మెల్యే మాజీ విప్ నల్లాల ఓదెలు గారు ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మంగళవారం రోజున స్థానిక అభయాంజనేయ స్వామి మారుతి నగర్ మందమర్రి బస్టాండ్. ఆలయంలో కాంగ్రెస్ నాయకుడు ఏటూరి సత్యనారాయణ గారు మాజీ మా మాజీ విప్ మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారు ఆరోగ్యంగా మహామృత్యుంజయడు గా తిరిగి రావాలని. అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకం, ప్రత్యేక అర్చనలు చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.భక్తులకు ఓదన్న గారి అభిమానులు తీర్థప్రసాదాలను స్వీకరించి మాజీ ఎమ్మెల్యే కోలుకోవాలని వేడుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొద్దిరోజుల నుంచి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఉన్నాడు. అరోగ్యం తొందరగా బాగా పాడాలని అభిమానులు కార్యకర్తలు భగవంతుని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరి సత్యనారాయణ తో పాటు ఓదన్న గారి అభిమానులు. ఆ ఏరియా ప్రజలు పెద్దలు అందరూ పాల్గొన్నారు

ఎస్సి, ఎస్టీ ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు.

ఎస్సి, ఎస్టీ ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

*సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి)

 

 

 

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడానికి వీలు లేదని,ఎట్టి పరిస్థితుల్లో నిధులు పక్క దారి పట్ట వద్దని , ఎక్కడైనా నిధులు దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ , సభ్యులు మేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు రాగా కలెక్టర్ సాదరంగా స్వాగతించారు. పోలీసు వారి చే గౌరవ వందనం స్వీకరించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి.గితే, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కుశ్రము నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్ లతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగారాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో 4 వేల 313 ఎకరాలకు సంబంధించి 6029 మంది రైతులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా 1614 మంది రైతులకు 2860 ఎకరాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పెండింగ్ ఆర్.ఓ.ఎఫ్.ఆర్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఎస్టీ రైతులందరికీ పట్టాలు అందాలని 10 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామనిఅన్నారు.సబ్సిడీ కింద ప్రభుత్వం మంజూరు చేసే మొత్తం సద్వినియోగం జరిగి యూనిట్లకు గ్రౌండ్ అయ్యే విధంగా ప్రత్యేక చోరువ చూపాలని అన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ లలో సోలార్ ప్యానల్ ఫెన్సింగ్ ఏర్పాటు ప్రతిపాదనలు 7 రోజుల్లో సిద్ధం చేయాలని, అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి విడుదల అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. జిల్లాలో పెండింగ్ ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని,బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనిఅన్నారు. పోలీస్ కేసులకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు కొరకు తహసిల్దార్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద ఎస్సీ ఎస్టీలకు 100% పని దినాలు కల్పించాలని, వేసవి దృష్ట్యా పని ప్రదేశాలలో చల్లని త్రాగునీరు, నీడ, ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.సంక్షేమ హాస్టల్స్ లలో ప్రభుత్వం రూపొందించిన డైట్ మెన్యూ ను తూచ తప్పకుండా పాటించాలనిఅన్నారు. స్వయం ఉపాధి కల్పన పథకం కింద రాజీవ్ వికాసం ద్వారా ఎస్సీ ఎస్టీ యువతకు అర్హత మేరకు రుణాలు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ శాఖలలో ఎస్సీ,ఎస్టీ అధికారులకు రోస్టర్ పాయింట్ ప్రకారం పదోన్నతులు సజావుగా పారదర్శకంగా వచ్చేలా వ్యవహరించాలని,ప్రభుత్వ కార్యాలయాల్లో నియామకాలలో సైతం 15% ఎస్సీలకు రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల సూచనలు, ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. సభ్యులు వివిధ అంశాల పై కోరిన సమాచారాన్ని, ప్రతిపాదనలను నిర్దిష్ట సమయంలో అందించాలని అన్నారు.
ఎస్సీ,స్టడీ సర్కిల్ కోసం భూమి కేటాయింపు చేయడం జరిగిందని, అక్కడ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అన్నారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ , సభ్యులను జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏ.ఎస్పీ. శేషాద్రిని రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారీ రాధా భాయి, డిఎస్పీ. చంద్ర శేఖర్ రెడ్డి,జిల్లా అధికారులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు,వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఈద్గ ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర.

ఈద్గ ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

ముస్లిం సోదరులకు,వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
ముస్లింల పవిత్రదినం రంజాన్ పండుగ సందర్బంగా భూపాలపల్లి బాంబులగడ్డలోని ఈద్గలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొన్ని ముస్లిం సోదరీ సోదరులకు వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి,మీ కష్ట నష్టాలల్లో, ముస్లిం మైనారిటీ ప్రజల అభ్యున్నతిలో బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు

మసీదుల్లో ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

రంజాన్‌.. మసీదుల్లో ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్‌ పర్వదినాన్ని జహీరాబాద్ ఝరాసంగం మొగుడంపల్లి న్యాల్కల్ కోహిర్ మండలంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ శుభాకాంక్షలు జరుపుకున్నారు ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్‌ను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆయా గ్రామాలలో ఆవరణలో ఉన్న మసీదులో ఈద్గా లో ఉన్న ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.రంజాన్‌ పురస్కరించుకుని గ్రామాలలోని మసీదులు కొత్త కలను సంతరించుకున్నాయి. కాగా, రంజాన్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.

Ramadan

మహ్మద్‌ ప్రవక్త ద్వారా అల్లాహ్‌ తరపున ఖురాన్‌ గ్రంథం లిఖించినందుకు కృతజ్ఞతగా ముస్లింలు నెల రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తూ. జీవన గ్రంథమైన ఖురాన్‌కు అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు దేవుడు నెల రోజులపాటు ఉపవాసాలు నిర్ణయించాన్నది ముస్లింల నమ్మకం. కోపం, మదం, మోహం, అవినీతి, అహంకారం, దౌర్జన్యం లాంటి దుర్గుణాలను త్యజించాలని బోధించేదే రంజాన్‌ మాసం.అల్లా దీవెనలతో మన భారతదేశ ప్రజలందరూ జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.

శనీశ్వర ఆలయంలో మంత్రి దామోదర్ ప్రత్యేక పూజలు.

శనీశ్వర ఆలయంలో మంత్రి దామోదర్ ప్రత్యేక పూజలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

శని అమావాస్య సందర్భంగా ఝరాసంగం మండలం బర్దిపూర్ లోని శనీశ్వర ఆలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనీశ్వర విగ్రహానికి తైలాభిషేకాలను చేశారు. అనంతరం ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామని 1008 అవధూత గిరి మహారాజ్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

రాచన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

రాచన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ ర్ మండలం బడంపేటరాచన్న స్వామి ఆలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈకార్యక్రమంలోభక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు జగదీశ్వర్ స్వామి, బుచ్చయ్య స్వామి, చిన్న వీరయ్య స్వామి, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్.

సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కాలేజీని మంగళవారం రోజున మండల స్పెషల్ ఆఫీసర్ డిసిఒ పరిశీలించారు, అనంతరం పాఠశాల కళాశాలలోని రికార్డులను వంట గదిని డైనింగ్ హాలును స్టోర్ రూమ్ను ప్లేగ్రౌండ్ పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అభినందించారు అలాగే విద్యార్థుల యొక్క విద్య నైపుణ్యాలను పరిశీలించి వారితో మాట్లాడడం జరిగింది మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయ శ్రీ ,పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలతో అగ్ని గుండం సిద్దం చేసిన పూజారులు.

ప్రత్యేక పూజలతో అగ్ని గుండం సిద్దం చేసిన పూజారులు

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహిరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేటరాచన్న స్వామి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున ఆలయం ఆవరణలో ఇఓ శివరుద్రప్ప నేతృత్వంలో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిప్పు అంటించి అగ్ని గుండం సిద్ధం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, ఆలయసిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో.!

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు.

శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన జహిరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ సాయి చరణ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహిరాబాద్ పట్టణం: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జహిరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ సాయి చరణ్ గారు పట్టణంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలను అందించి సన్మానించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో , ఉపవాస దీక్షలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయని అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆ మహా శివుని కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కండెం నర్సింహులు, ఎయంసి డైరెక్టర్ శేఖర్, రాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు.

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు శ్రీ కొనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మోగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ మాజి చైర్మన్ నర్సింహ గౌడ్,పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,నాయకులు ప్రభు పటేల్ ,ప్రవీణ్ పాటిల్ ,విజయ్ రాథోడ్ శివశంకర్ ,తదితరులు పాల్గొన్నారు .

ప్రత్యేక పూజలు నిర్వహించిన

మంథని :- నేటి ధాత్రి

మంథని పట్టణం పోచమ్మ వాడ లోని శ్రీ శివనాగేంద్ర దేవాలయ ప్రాంగణంలో ఉత్తర బోయలింగం జీర్ణోధారణ మరియు పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version