తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP)
ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణి*
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలోని సర్ధాపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 17వ బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP) ఆధ్వర్యంలో ఉచితంగా విద్యా సామగ్రి, వాటర్ ప్యూరిఫైయర్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం బెట్టాలియన్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్.
ఆధ్వర్యంలో బుధవారం సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగినది. పోలీస్ కానిస్టేబుల్ అయినా ఇటువంటి రామ్- అంజలి దంపతుల కుమార్తె లక్ష్మి వర్ణిక పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణి చేశారు.అనంతరం బేటాలియన్ పోలీసు సిబ్బంది పిల్లలకు నోట్ పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్‌లు, వాటర్ బాటిల్, ఇతర స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు, అదే విధంగా బెట్టాలియన్ పోలీస్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో
వాటర్ ప్యూరిఫైయర్ అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఈ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కూడా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జే. రాందాస్, పాఠశాల ఎం.ఈ.ఓ దూస రఘుపతి,
ఏఏపీసీ చైర్మన్ లక్ష్మి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బి. స్వాతి, పోలీస్ ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 17వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.