నకిలీ విత్తనాల రవాణా,ఉత్పత్తి విక్రయాలపై ప్రత్యేక నిఘా.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పి.ఎస్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా,రవాణా, ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం అందింతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు,రైతులకు జిల్లా ఎస్పీ సూచించారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో వుంచుకోని రైతన్న నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు చర్యలకై జిల్లా పోలీసులు సిద్ధంగా ఉందని నకిలీ విత్తనాల సరఫరా,ఉత్పత్తి,అమ్మకాలు అరికట్టడానికి వ్యవసాయ శాఖ,జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో తరచు తనిఖీలు చెప్పట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలను అడ్డుకోవడానికి పోలీస్,వ్యవసాయ అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారియెక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుందన్నారు.నకిలీ విత్తనాలు కలిగి ఉన్నా, అమ్మిన,రవాణా చేసే వ్యక్తుల పై క్రిమినల్ కేసులు,పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు.జిల్లాలో ఒక్క రైతుకు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూసే బాధ్యత వ్యవసాయ, పోలీసు అధికారులు పై ఉంటుందని,
జిల్లా పరిధిలో ఉన్న ఫర్టిలైజర్ షాప్, సీడ్స్ షాప్స్ లపై నిఘా ఉంచి ఆకస్మిక తనికిలు చేస్తూ నకిలీ విత్తనాల విక్రయాలను,రవాణాను అడ్డుకట్ట వేయడం జరుగుతుందని,రైతులు సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు.జిల్లా ప్రజలకు, రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు,నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.