పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు
*ఆర్టిసి టూర్ ప్యాకేజీలను వినియోగించుకోవాలి *
నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి
నర్సంపేట,నేటిధాత్రి:
పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను ప్రజలు వినియోగించుకోవాలని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట నుండి
1)భద్రాచలం-పర్ణశాల-కిన్నెరసాని-మల్లూరు-బొగత జలపాతం.
2)కొమురవెల్లి-వేములవాడ-కొండగట్టు-ధర్మపురి-గూడెంగుట్ట.
3)నాగార్జునసాగర్-స్వర్ణగిరి-యాదగిరిగుట్ట.
4)పంచారామాలు:అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, మరియు విజయవాడ.
5)విజయవాడ, ద్వారాకాతిరుమల, భద్రాచలంకు మరియు 40మంది ప్రయాణకులు ఉంటే మీరు కోరుకున్న ప్రదేశాలకు బస్సులను నడుపబడునని తెలియజేసారు. వివరాలకు 9959226052,9866373825, 9989038476 నంబర్లను సంప్రదించగలరని డిపో మేనేజర్ కోరారు.