వన మహోత్సవంలో మొక్కలు నాటి సంరక్షించాలి.

వన మహోత్సవంలో మొక్కలు నాటి సంరక్షించాలి.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరు కృషి చేయాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. వన మహోత్సవంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ లోని శిల్పా గార్డెన్స్ లోశేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమీషనర్ ప్రశాంతి తో, చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ శషిరేఖ తో, యూబీడి అధికారులతో, స్థానిక అసోసియేషన్ సభ్యులతో కలిసి కార్పొరేటర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి శిల్పా గార్డెన్స్ లోని గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచేలా ప్రోత్సహిస్తూ ఈ వనమహోత్సవాన్ని చేపడుతున్నామని అన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బయో డైవరసిటీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ అమృత, మేనేజర్ యూసుఫ్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, యూబీడి సూపెర్వైసోర్ గోపాల్, శిల్పా గార్డెన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరి కుమార్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గోపాల్, ట్రెజరర్ గణేష్, జాయింట్ సెక్రటరీ సురేంద్ర, మెంబర్స్ రామ్ కిషోర్, సురేష్, యూ.ర్ రావు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

వన మహోత్సవాన్ని బాధ్యతగా స్వీకరించాలి

వన మహోత్సవాన్ని బాధ్యతగా స్వీకరించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామం లో సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో వన మహోత్సవం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కలెక్టర్ తో పాటు మిగతా అధికారులంతా మొక్కలు నాటారు.కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలందరూ వనమహోత్సవ కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించాలని,ప్రతి ఇంటి పరిసరాలలో మొక్కలు నాటి స్వచ్ఛమైన ప్రకృతిని,పచ్చని వాతావరణాన్ని పెంపొందించుకోవాలని,ఆరోగ్యమైన జీవితాన్ని పొందాలని తెలియజేశారు.ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయాలని గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ కుమార్ తో పాటు డిఆర్ డిఓ కిషన్,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, తహసిల్దార్ వనజా రెడ్డి,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,ఏపీవో బాలయ్య,ఈసీ,టిఏ,పంచాయితీ కార్యదర్శి,ఈజీఎస్ సిబ్బంది,ఐకెపి సభ్యులు,గ్రామపంచాయతీ సిబ్బంది,స్థానిక కాంగ్రెస్ నాయకులు,గ్రామప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version