అలియాబాద్ గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం
పరకాల,నేటిధాత్రి
మండలంలోని అలియాబాద్ గ్రామంలో విద్యశాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు.విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్ తో పాటు గ్రామ వీధుల్లో పర్యటిస్తూ విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సనత్ కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ విద్యుత్ వినియోగంపై బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. విద్యుత్‌ను సక్రమంగా వినియోగిస్తూ బిల్లులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని సూచించారు.అలాగే విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు,సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
