వన మహోత్సవాన్ని బాధ్యతగా స్వీకరించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామం లో సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో వన మహోత్సవం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కలెక్టర్ తో పాటు మిగతా అధికారులంతా మొక్కలు నాటారు.కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలందరూ వనమహోత్సవ కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించాలని,ప్రతి ఇంటి పరిసరాలలో మొక్కలు నాటి స్వచ్ఛమైన ప్రకృతిని,పచ్చని వాతావరణాన్ని పెంపొందించుకోవాలని,ఆరోగ్యమైన జీవితాన్ని పొందాలని తెలియజేశారు.ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయాలని గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ కుమార్ తో పాటు డిఆర్ డిఓ కిషన్,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, తహసిల్దార్ వనజా రెడ్డి,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,ఏపీవో బాలయ్య,ఈసీ,టిఏ,పంచాయితీ కార్యదర్శి,ఈజీఎస్ సిబ్బంది,ఐకెపి సభ్యులు,గ్రామపంచాయతీ సిబ్బంది,స్థానిక కాంగ్రెస్ నాయకులు,గ్రామప్రజలు పాల్గొన్నారు.