వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు నీరు పారుతున్న రహదారులపై ప్రయాణాలు చేయకుండా పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం మహా ముత్తారం మండలంలోని ముత్తారం – యామనపల్లి కేశవాపూర్ – పెగడపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న పెద్దవాగు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పొంగుతున్న వాగులపై ప్రజలు ప్రయాణాలు చేయకుండా ట్రాక్టర్లు తో భారీ కేండింగ్ ఏర్పాటుతో పాటు రెవెన్యూ, పోలీస్, పంచాయతి శాఖల అధికారులు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాగుల్లో చేపలు పెట్టేందుకు ప్రజలు వెళ్ళొద్దని సూచించారు. రహదారిపై నీళ్లు పారుతున్నందున ప్రజల రావాణా ఏ విధముగా చేస్తున్నారని పంచాయతి రాజ్, ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అజాం నగర్ మీదుగా వెళ్తున్నారని ప్రయాణం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ ఎం శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈ ఈ రమేష్, పీఆర్ డిఈ రవీందర్, ఎంఈఓ రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏ ఓ అనూష తదితరులు పాల్గొన్నారు.
గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగుల వద్ద పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిజాంపేట – చల్మెడ గ్రామాల మధ్య వాగు నిన్న రాత్రి కురిసిన వర్షానికి పొంగిపోర్లడం తో స్థానిక ఎస్ఐ. రాజేష్, ఎంపీడీఓ రాజీరెడ్డీ రోడ్డుకు ఇరువైపులా గేట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో లో ప్రజలు అప్రమత్తం గా ఉండాలన్నారు. చెరువులు కుంటలు నిండుకుండాల మారడం తో ప్రజలు చెరువుల వద్దకు వెళ్ళవద్దన్నారు. అత్యవసర సమయంలో 100 కు డయాల్ చేయాలన్నారు.
ఎత్తిపోతల వద్దకు వెళ్లొద్దు: ప్రజలకు పోలీసుల హెచ్చరిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సజ్జారావు పేట తండా శివారులో గల ఎత్తిపోతల పరిసరాలకు ప్రజలు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ఎత్తిపోతల వద్దకు ఎవరూ వెళ్లవద్దని భారీ వర్షాల కారణంగా, ఎత్తిపోతల జలపాతాలలో నీటి మట్టం పరిమితిని దాటింది. ఈ పరిస్థితిలో, మునిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని మరియు మానవ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పోలీసులు తెలిపారు.ఈ కారణంగా, ఎవరూ నీటి దగ్గరకు వెళ్లకుండా ప్రజలను చీకటిలో ఉంచారు మరియు పోలీసులను పూర్తిగా అగౌరవంగా చూడాలి. జహీరాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు,
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఝరాసంగం మండలం జీర్ణపల్లి చెరువు అలుగు పారింది. ఈసారి వర్షాలు అధికంగా కురవడం వల్ల చెరువు నిండుగా ఉప్పొంగుతోందని స్థానికులు తెలిపారు. చెరువులో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అటువైపు ఎవరూ వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది.రాత్రి ఏకధాటిగా వర్షం పడటంతో పలు గ్రామాల్లో పురాతన ఇండ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవగా.. జీర్లపల్లి చెరువు అలుగు పారుతోంది. చెరువును చూసేందుకు పర్యావరణ తరలి వస్తున్నారు. స్థానిక తహసీల్దార్ తిరుమల రావు, ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ డిప్యూటీ ఎంఆర్ఓ కరుణాకర్ రావు, ఆర్ఐ రామారావు చెరువును సందర్శించారు. చెరువు అలుగు పారుతుండటం వల్ల వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని తహసీల్దార్ సూచించారు
చింగేపల్లి పెద్దవాగు ఉప్పొంగుతోంది: రైతులు అప్రమత్తం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, న్యాలకల్ మండలం, చింగేపల్లి గ్రామంలోని పెద్దవాగులో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు చేరింది. ఆనకట్ట పైనుండి పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో, ఆనకట్ట క్రింద ఉన్న పంట పొలాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వరద పరిస్థితిపై రైతులు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి సోమవారం మధ్యాహ్నం స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా మినుము, పెసర, సోయా పంటలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. వర్షం నీరు పంట పొలాల్లో నిల్వ ఉండకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరి కొన్ని రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు లోతట్టు ప్రాంత నివాసితులు జాగ్రత్తలు తీసుకోవాలి-గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసర సమయంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మెట్పల్లి ఆగస్టు 18 నేటి ధాత్రి
జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీలు లేకుండా అవసరమైన సహాయక చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరారు. మరి కొన్ని రోజులపాటు భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం పార్టీ కార్యాలయంలో పత్రిక ప్రకటనను విడుదల చేశారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూసుకోవాలని కోరారు. ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని తెలిపారు. గ్రామాల్లో ఉదృతంగా ప్రవహించే వాగులు, నీటి వనరుల సమాచారం తెలుసుకొని, వాటికి సమీపంలో ఉన్న రోడ్లు వంతెనలపై రాకపోకలను నిలిపివేయాలని, దీని కోసం స్థానిక అన్ని శాఖల అధికారుల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు వైద్యులు సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని కోరారు. భారీ వరదల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు వచ్చిన తర్వాత పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. కాగా రెవెన్యూ, పోలీస్ శాఖ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఒకవేళ ఒకేసారి కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ వరద రానున్న నేపథ్యంలో అలాంటి ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని సూచించారు. అంతే కాకుండా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్పితే బయటకు వెళ్ళకూడదని కోరారు. వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి ప్రజలు దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, శివారు ప్రాంతాల్లో చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దని సూచించారు. రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు ఉంటాయని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులు సిద్ధంగా ఉన్నారని, కానీ అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే స్థానిక అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు పొందాలని కోరారు. అదే విధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటి కారణంగా ప్రాజెక్టు నిండి వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి వదిలి పెట్టారని జిల్లాలో గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.
చింగేపల్లి-ఇబ్రహీంపుర్ రోడ్డులో వరద బీభత్సం: రాకపోకలకు అంతరాయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలం చింగేపల్లి నుండి ఇబ్రహీంపుర్ వెళ్ళే రోడ్డు మార్గంలో భారీ వర్షాల కారణంగా వరద నీరు బ్రిడ్జి పైనుండి ప్రవహించడంతో రోడ్డు పక్కన మట్టి కొట్టుకుపోయింది. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలు తీవ్రంగా అంతరాయానికి గురయ్యాయి.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో అత్యధికంగా 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 17 సెంటీమీటర్లు, కల్హేర్ 11.9, కడ్పాల్ 10.6, అన్నసాగర్ 10.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
ఇక నిన్న సిద్దిపేట జిల్లాలోని గౌరారం అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసి రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్‌లోనూ రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం కురిసి పలు ప్రాంతాలు నీటమునిగాయి. హైదర్‌నగర్ 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కాప్రా, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్ వంటి ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
చిట్యాల మండలం ముచినిపర్తి గ్రామానికి చెందిన మూల లక్ష్మి అనే మహిళ రైతు మూడెకరాల్లో పత్తి చేను వేయగా గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి చేన్లోకి నీరు రావడంతో మూడు ఎకరాల పంట పూర్తిగా నీట మునిగింది ప్రైవేట్ బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చి పంట పెట్టుబడి పెడితే ప్రకృతి వైపరీత్యానికి రైతు పలవుతున్నాడని మహిళా రైతు ఆవేద వ్యక్తం చేసింది దీనికి తోడు చేను పక్కన ఉన్న మరో రైతు కట్టలాగా మట్టితో నింపడంతో చేనులో ఉన్న నీరు బయటకు పోకుండా అందులోనే నిలిచి పంట పూర్తిగా మాడిపోయింది ప్రకృతి చేసిన వైపరీత్యానికి రైతుకు ఆత్మహత్య శరణ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు ముందు వరుసలో ప్రాధాన్యమిస్తున్న వ్యవసాయ రంగంలో నష్టపోతున్న మహిళా రైతుకు సాయం అందించి ఆదుకోవాలని పలువురు వేడుతున్నారు.
ప్రభుత్వాలు మారినా మా దుర్భరమైన పరిస్థితి మారలేదు.
మాకు రోడ్డు రాలేదని బాధని వ్యక్తం చేసిన బస్తివాసులు.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి లో గల అంబేద్కర్ నగర్ వార్డ్ నెంబర్ 3,17 లో సీసీ రోడ్ లేక ఇబ్బంది పడుతున్న బస్తీ వాసులు ఎవరైనా మా బస్తీలోకి రావాలంటేనే ఎక్కడ గుంత ఉంటుందో అర్థం కాక భయపడుతున్నారు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద
పెద్ద గుంతలు పడి మరి అధ్వానంగా మారిన రోడ్డు ఇకనైనా ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు బెల్లంపల్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి మా యొక్క బస్తీలోని బురద నుండి మాకు విముక్తి కల్పించండి అని ప్రజలు వారి బాధను వ్యక్తం చేశారు.
అధికారులతో కలిసి వాగులు,లో లెవల్ కాజ్ వేలు,వరద ఉధృతిని పరిశీలన
భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట,నేటిధాత్రి:
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు,వరదల దృష్యా నర్సంపేట డివిజన్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పర్యటించారు. వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత శాఖల అధికారులతో కలసి నర్సంపేట డివిజన్లోని ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ పాకాల చెరువు నుండి వచ్చే వరద నీటిలో లెవల్ కాజ్ వే ను,నల్లబెల్లి మండలంలోని లేంకాలపెల్లి నందిగామ గ్రామాల మధ్య కాజ్ వే,నర్సంపేట నుండి చెన్నారావుపేట వెళ్లే రహాదారిలో ముగ్దుంపుర వద్ద, నర్సంపేటలోని మాదన్నపేట వద్ద కాజ్ వేలను పరిశీలించారు. కాజ్ వే ల వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను పరిశీలించి సమర్ధ నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి రెడ్ అలర్ట్ గా మారే సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెరువులలో నీటిమట్టం ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.గ్రామాల్లో భారీ వర్షాలపై టామ్ టామ్ చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులలో,లో లెవెల్ కాజ్ వేలపై వరదనీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు వెళ్లడానికి అనుమతించవద్దని పేర్కొన్నారు. చెరువులలో ప్రజలను చేపలు పట్టే వారిని రైతులను పశు కాపరులను సందర్శకులను అనుమతించవద్దని అన్నారు.ఇప్పటికే అన్ని శాఖల అధికారులు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉన్నారని,విపత్కర పరిస్థితి ఎదురైతే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు జిల్లాల సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు కాలువల్ని దాటే ప్రయత్నం చేయకుండా ప్రజలకు సూచనలు చేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ పర్యటనలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి,ఆర్డిఓ ఉమారాణి డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు , జిల్లా పంచాయతీ అధికారి కల్పన, తాహసిల్దారులు రవిచంద్రారెడ్డి, ఎంపీడీవోలు,పోలీసు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పరవళ్ళు తొక్కుతున్న పాకాల సరస్సు,మాదన్నపేట చెరువు మత్తడి నీరు..
అశోక్ నగర్ వద్ద ఉగ్రరూపం దాల్చిన పాకాల వరదనీరు..
వట్టేవాగు వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మాదన్నపేట చెరువు అలుగు వరద*
కాకతీయ నగర్ కాలనీ వాసుల్లో మొదలైన ఆందోళన.
నర్సంపేట నుండి మాదన్నపేట,,నర్సంపేట నుండి పాకాల కొత్తగూడ రాకపోకలు బంద్.
ప్రమాదాలు జరుగకుండా పోలీస్ శాఖ అధికారులు బందోబస్తు..రెవెన్యూ మున్సిపల్ ,పంచాయితీ రాజ్ అధికారుల చర్యలు.
వరి పంటను దెబ్బతీస్తున్న భారీ వర్షాలు..
17,18 తేదీల్లో కురిసే భారీ వర్షాలతో రైతుల్లో అలజడి.
నర్సంపేట,నేటిధాత్రి:
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నర్సంపేట డివిజన్ పరిధిలోని సరస్సు,చెరువులు,కుంటులు మత్తల్లు పోస్తున్నాయి.ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు పాకాల గత రెండు రోజులుగా అలుగుపోస్తున్న ది.సరస్సులో 31 ఫీట్ల పైబడి వరదనీరు చేరడంతో ఓక ఫీట్ ఎత్తుగా మత్తడి పరవళ్ళు తొక్కుతున్నది.నర్సంపేట మాదన్నపేట చెరువు గత ఐదు రోజులుగా మత్తడి పోస్తూ నేడు వరద ఉదృతం పెరుగుతున్నది.శుక్రవారం అర్థరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి డివిజన్ పరిధిలోని చెరువులు,కుంటలు,వాగులు,వంకలు వరద నీటితో పారుతున్నాయి.నర్సంపేట నుండి పాకాల మీదుగా కొత్తగూడ వెళ్లే ప్రధాన రహదారిపై అశోక్ నగర్ వద్ద ఉన్న పాకాల నీటి ప్రవాహం తీవ్రస్థాయిలో పరవళ్ళు తొక్కుతుంది.
అటువైపు రాకపోకలు పూర్తిస్థాయిలో బంద్ అయ్యాయి.వాగువద్ద ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా ఖానాపూర్ పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.మాదన్నపేట రోడ్డు వాగు వద్ద వరద నీటి ప్రవాహం ఉదృతం కావడంతో మున్సిపల్,పోలీస్ ,రెవెన్యూ శాఖల అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టారు.మాదన్నపేట చెరువు ఉగ్రరూపం దాల్చి మత్తడి పడితే చాలు..నర్సంపేట పట్టణంలో ఎన్టీఆర్ నగర్ కాలని వాసుల్లో గుబులు పుట్టిస్తోంది.నర్సంపేట నుండి నేక్కొండ వైపు ముగ్దుంపురం కాజ్ వే వద్ద వరద భీభత్సం పెరుగడంతో అటువైపు వెళ్లే వాహనాలను చెన్నారావుపేట పోలీసులు,అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.నల్లబెల్లి మండలం నుండి నందిగామ వైపు వెళ్లే ప్రధాన రహదారి లెంకాలపల్లి నందిగామ గ్రామాల మధ్య ఉన్న లో లెవర్ కాజ్ వే పై వరద నీటితో భయంకరంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ప్రమాదాలు జరుగకుండా నల్లబెల్లి ఎస్సై,రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టారు.దుగ్గొండి,నల్లబెల్లి,నర్సంపేట,ఖానాపూర్,చెన్నారావుపేట, నెక్కొండ మండలాల పరిధిలోని చెరువులు,కుంటలు నిండి మత్తళ్ళు పోస్తున్నాయి.దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.కొన్ని చోట్ల వాగుల వద్ద చేపలవేట చేస్తున్నారు.అనుకోకుండా ప్రమాదాలు జరగవచ్చని అధికారులు హెచ్చరించినప్పటికి అవేవీ పట్టించుకోవడం లేదు.
Ashok Nagar
17,18 తేదీల్లో కురిసే భారీ వర్షాలతో రైతుల్లో అలజడి.
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు డివిజన్ వ్యాప్తంగా చెరువులు,కుంటలు నిండు కుంటల్లా మారి శుక్రవారం అర్థరాత్రి కురిసిన భారీ వానకు అతలాకుతలం అయ్యింది.17,18 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఇప్పటికే చెరువులు,కుంటలు వాగులు నిండి భారీ ఎత్తున వరద భీభత్సం సృష్టించింది.ఐతే 17,18 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిస్తే పంటల పరిస్థితి ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరి పంటను దెబ్బతీస్తున్న భారీ వర్షాలు..
*ఋతుపవనాలు ముందుగానే వచ్చినట్లు వచ్చి వెనక్కివెళ్లడంతో సుమారు 20 నుండి నెల రోజుల ఆలస్యంగా రైతులు వరినాట్లు సాగుచేసుకున్నారు.వరినాట్లు జోరందుకుంటున్న నేపథ్యంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు,కుంటలు నిండడం వరదలకు వరినాట్లు నీట మునుగడం,కొట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి.మరిన్ని రోజులు వర్షాలు కురిస్తే పంటలకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నాయని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటి ప్రవాహం వద్ద పోలీస్ అధికారుల సేవలు భేష్..
*నర్సంపేట డివిజన్ పరిధిలోని కురుస్తున్న భారీ వర్షాలకు ప్రవహిస్తున్న వరద నీటి వద్ద ప్రమాదాలు జరుగకుండా రేయింబవళ్లు పహారా కాస్తున్న పోలీస్ అధికారుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈలాంటి సేవలు అందించడంలో నర్సంపేట డివిజన్ పోలీసులు ముందుంటారని ప్రజలు పేర్కొన్నారు.
మొరంచపల్లి వాగు ఉదృతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం మొరంచపల్లి వాగు ఉదృతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగు ఉదృతి దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. ఎగువ భాగం నుండి ఎంత వరద వచ్చే అవకాశం ఉందన్న వివరాలు ఈ ఈ ప్రసాదు ను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని వరద పరిస్థితిని ముందుగా అంచనా వేసి ప్రజలను ముందస్తు అప్రమత్తం చేయాలని సూచించారు. వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాకు ఆదివారం వరకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి రక్షణ చర్యలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు దృష్ట్యా ప్రజల, పశువుల ప్రాణరక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. 90306 32608 ద్వారా వచ్చిన ఫిర్యాదులకు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశువులను మేతకు బయటికి పంపకుండా ఇంటి పట్టునే ఎత్తైన ప్రదేశంలో ఉంచాలని తెలిపారు. రహదారులపై నీళ్లు చేరిన ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణాలు చేయకుండా పటిష్ట నియంత్రణ చేయాలని తెలిపారు. కొంతమంది. అత్యుత్సాహంతో ఎవరైనా దాటే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నందున రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్ సిబ్బంది పటిష్ట పర్యవేక్షణలో బారికేడ్లు ఏర్పాటు చేసి రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ ప్రసాద్, డిఈ వరుణ్, ఏఈ షర్ఫ్ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి టిపిసిసి డెలిగేడ్ కల్వకుంట్ల సుజిత్ రావు
మెట్ పల్లి ఆగస్టు 16 నేటి ధాత్రి ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని ప్రమాదాలకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావు కోరారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. 2రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారని, అందువల్ల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని,పట్టణంతో పాటు పలు మండలాలు, గ్రామాల ప్రజలు వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండవద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, శివారు ప్రాంతాల్లో చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దని సూచించారు. అదే విధంగా రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు గతంలో చూశామని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులు సిద్ధంగా ఉన్నారని, కానీ అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే స్థానిక అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు పొందాలని కోరారు ప్రభుత్వం సంబంధిత కార్యాలయాలలో అధికారులను అప్రమత్తం చేసిందని ఏదైనా అత్యవసరం అయితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
భారీవర్షాల వల్ల ఆస్తి,ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలి
భారీ వర్షాల పట్ల జాగ్రత్త చర్యలు చేపట్టాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.
అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:
ఈనెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా శిథిలావస్థలో ఉన్న గృహాలు, పాఠశాలలను గుర్తించి అందులో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.రాబోయే రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు.జిల్లా సంబంధిత వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పలు పథకాల క్రింద చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు లేనప్పటికిని , వాగులు, వంకలు ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా రోడ్డు మార్గాలను డైవర్ట్ చేయాలన్నారు.ఇందుకు గాను పోలీసు, గ్రామ కార్యదర్శుల సహకారం తీసుకోవాలని సూచించారు.తీవ్ర వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి.లోతట్టు బ్ప్రాంతాల్లో జలమయం కు ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలి. డ్రైనేజీ వ్యవస్థ మరమ్మత్తులు, వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని అధికారులను ఆదేశించారు.ప్రత్యేకంగా డ్యామ్‌లు, చెరువుల స్థితిగతులు నిరంతరం పరిశీలించాలని,ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
“Precautions for Heavy Rains in Warangal”
కొన్ని ప్రాంతాలలో వర్షాల వల్ల తెగిపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు.ఈనెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, మండల స్థాయి టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధికారులు సెలవులో వెళ్లకుండా హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటూ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.వర్షాల వల్ల నీరు కలుషితమై దోమలు ప్రబలి సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి,ఇరిగేషన్ శాఖ ఈఈలు శంకర్,సునీత,జిల్లా ఆర్ అండ్ బి అధికారి,జిల్లా పంచాయతీ అధికారి కల్పన,జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,ఆర్డీఓ లు సత్యపాల్ రెడ్డి,ఉమారరాణి,తహసీల్దార్లు వివిధ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి వరంగల్ ప్రాంతీయ కేంద్ర పరిశోధన శాస్త్రవేత్తలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలు సాగు చేస్తున్న రైతులు పంట చేలలో వర్షపు నీటి నిలువలు లేకుండా జాగ్రత్త పడాలని వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ వీరన్న డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రమ్య, మొగుళ్లపల్లి మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డిలు సూచించారు. మొగుళ్ళపల్లి మండలంలో ఇటీవల ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం స్థానిక మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ వీరన్న, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రమ్యతో కలిసి మొగుళ్ళపల్లి మండలంలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మండలంలో సాగు చేస్తున్న పత్తి ,వరి, మొక్కజొన్న పంటల వద్ద ఉన్న రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో కురుస్తున్న అతి భారీ వర్షాలకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పలు సూచనలు అందించారు. పత్తి పంటలో ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీటిని చేనులో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు బయటకు తీసివేయాలని, పత్తి పంట అధిక వర్షాలకు గురైనప్పుడు ప్రతి మొక్క పెరుగుదలకై 19:19:19 పాలిఫీడ్ లేదా 13:0:45 మల్టీకే పోషకాలను లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలని, వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియాతో పాటు 20 కిలోల మెరువట పోటాష్ ఎరువులను భూమిలో మొక్కకి 4 అంగుళాల దూరంలో మొదల దగ్గర వేసుకోవాలని, అలాగే పత్తి చేనులో గుంపులు గుంపులుగా మొక్కలు ఎండిపోవడం లేదా వాలిపోవడం గమనించినట్లయితే వేరు కుళ్ళు లేదా భావించి మొక్కలు మొదల చుట్టూ వేరు బాగా తడిచేటట్లు లీటర్ నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును పోసుకోవాలని, పత్తి చేనులో అధికత్తమ ఉన్నప్పుడు ఎకరాకు 10 కిలోల ఏరియాతో పాటుగా 400 నుండి 5 గ్రాముల కార్బన్దజిం + మాన్కోజేబ్ కలుపుకొని మొక్క మొదల దగ్గర వేసుకుంటే పార విల్ట్ ను తగ్గించుకోవచ్చునని శాస్త్రవేత్తలు అన్నారు. ప్రస్తుతం వాతావరణంలో గాలి అధిక తేమతో ఉన్నందున పత్తిలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ, అసికోకైట బ్లైట్ వచ్చే అవకాశం ఉంది, కావున మల్టీకే లాంటి పోషకాలతో పాటుగా క్యాప్తన్+ హెక్సకోనజోల్ 1.5 గ్రాములు లేదా ప్రోపీకొనుజోల్ 1 మిల్లీలీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే నివారించవచ్చునని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. అలాగే వరి పంటలో ఒకవేళ వరి నారు ముదిరినట్లయితే రైతు సోదరులు తప్పకుండా కొనలు తుంచి నాటు వేసుకోవాలి. దీని ద్వారా కాండం తొలచు పురుగు గుడ్లను నిర్మూలించుకోవచ్చన్నారు. నాటు వేసిన 20-25 రోజుల తర్వాత ఎకరానికి 8 నుండి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు తప్పకుండా వేసుకోవాలి తద్వారా కాండం తొలుచు పురుగును నిర్మూలించవచ్చన్నారు. కావున రైతు సోదరులు పైన సూచించిన సూచనలు పాటించి అధిక దిగుబడులు పొందాలని శాస్త్రవేత్తలు పలు గ్రామాల రైతులకు సూచించారు. అలాగే పత్తి పంటలో నీరు నిలబడి మొక్కలు వదలిపోయిన చోట కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు, మరియు ప్లాంటమైసిన్ ఒక గ్రామ్, 10 లీటర్ల నీటితో కలిపి మొక్కల మొదలు దగ్గర పోయాలని, అదేవిధంగా రసం పీల్చే పురుగు ఉధృతి ఉన్నచోట ఇమిడాక్లోఫ్రైడ్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలని, గులాబీ రంగు పురుగు ఉధృతి గమనించడం కోసం లింగాకర్షక బట్టలు పెట్టుకోవాలని, అదేవిధంగా మొక్కజొన్నలో మువ్వు పురుగు ఉన్నచోట ఇమమెక్టిన్ బెంజోట్ నాలుగు మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలన్నారు. పెసర పంటలో క్లోరాంత్రిని రోల్ 60 గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేయాలని, వరి పంటలో నీరు తీసివేసి 35 కిలోల యూరియా, 15 కిలోల పోటాష్ వారం రోజుల్లో రెండు దాఫాలుగా వేసుకోవాలని, అదేవిధంగా వరిలో తుంగ నివారణ కోసం florpyrauxifen benzyle+సైహలొఫోప్ butyl, 500 మిల్లీలీటర్ ఒక ఎకరానికి స్ప్రే చేయాలని రైతులకు తెలపడం జరిగిందన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
24/7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు
వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు
కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495
కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో లో లెవెల్ కాజ్ వే ల వద్ద అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, హెల్త్, పి.ఆర్, మిషన్ భగీరథ ఇతర శాఖల అధికారులు కంట్రోల్ రూంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ నెల 13 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు అధికారులు అందుబాటులో ఉండి, వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన సమాచారం అందిస్తారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేసేలా సేవలు అందిస్తారు. 24 గంటలు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 లను వర్షం, వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజలకు సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు తమ, తమ కార్యాలయాల్లో, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రా వద్దని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
సంగారెడ్డి: న్యాల్కల్ మండల ప్రజలు రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సుజిత్ కుమార్ సూచించారు.
అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగే అవకాశం ఉందని, ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను సూచించారు.
నిండు కుండల మారిన నారింజ ప్రాజెక్టు ను పర్శిలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కారణంగా నిండు కుండల మారిన నారింజ ప్రాజెక్టు ను పర్శిలించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు సందర్శించి ,నీటి ప్రవాహాన్ని , కెపాసిటీ నీటి విడుదల & ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకుంటన చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ,అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఎమ్మెల్యే గారితో పాటు గా మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యువ నాయకులు ముర్తుజా,దీపక్ తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.