మా గోడు పట్టించుకోండి
3,17 వార్డులో రోడ్డు లేక ఇబ్బంది.
ప్రభుత్వాలు మారినా మా దుర్భరమైన పరిస్థితి మారలేదు.
మాకు రోడ్డు రాలేదని బాధని వ్యక్తం చేసిన బస్తివాసులు.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి నియోజకవర్గం
బెల్లంపల్లి లో గల అంబేద్కర్ నగర్ వార్డ్ నెంబర్ 3,17 లో సీసీ రోడ్ లేక ఇబ్బంది పడుతున్న బస్తీ వాసులు ఎవరైనా మా బస్తీలోకి రావాలంటేనే ఎక్కడ గుంత ఉంటుందో అర్థం కాక భయపడుతున్నారు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద
పెద్ద గుంతలు పడి మరి అధ్వానంగా మారిన రోడ్డు ఇకనైనా ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు బెల్లంపల్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి మా యొక్క బస్తీలోని బురద నుండి మాకు విముక్తి కల్పించండి అని ప్రజలు వారి బాధను వ్యక్తం చేశారు.