ప్రజలకు ఝరాసంగం ఎస్సై కీలక సూచనలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-13T115407.332.wav?_=1

ప్రజలకు ఝరాసంగం ఎస్సై కీలక సూచనలు.

◆:- రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ సూచించారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నందున, ప్రజలు గ్రామాల్లోనే ఉండి, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆయన తెలిపారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని, విద్యుత్ షాక్ ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలని, పశువులను కూడా వాటికి దూరంగా ఉంచాలని ఆయన సూచించారు. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫారం వద్దా పశువులను ఉండొద్దని కూడా ఆయన పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ ప్లాన్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T141549.362.wav?_=2


ఎమర్జెన్సీ ప్లాన్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు

ఆపత్కాలంలో బల్దియా టోల్ ఫ్రీ నెంబర్ నెంబర్కు సమాచారం ఇవ్వాలన్న మున్సిపల్ కమిషనర్.

బల్దియా కమిషనర్తో కలిసి వరంగల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన వరంగల్ కలెక్టర్.

వరంగల్, నేటిధాత్రి

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు జలమయమైన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి సమర్థవంతంగా చర్యలు చేపట్టుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధి లోని నాలుగు మండలాలలైనా వరంగల్, సంగెం, ఖిలా వరంగల్, వర్ధన్నపేటలలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం జరిగిందని అత్యధికంగా సంగెం మండలంలో 24 సెంటీమీటర్ల వర్షపాతం,

ఖిలా వరంగల్ మండలం లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని, జలమయమైన లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ, గాంధీ నగర్, డి కే నగర్, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, గిరి ప్రసాద్ కాలనీ, పద్మ నగర్, శాకారాశికుంట తదితర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సందర్శించడం జరిగిందని, వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రాం వాటర్ డ్రైన్ లు ఇరుకుగా ఉండడం వల్ల నీటి ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఖిలావరంగల్ నుండి వరంగల్ వరకు జీడబ్ల్యూఎంసి తరపున అట్టి నాలాను విస్తరించడానికి పనులు కొనసాగుతున్నాయని, లోతట్టు ప్రాంతాలలో ఎమర్జెన్సీ ప్లాన్ కింద చర్యలు చేపట్టడం జరుగుతుందని మంగళవారం రాత్రి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని, లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజల కోసం ఆహారంతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మందులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో పిల్లలను పాఠశాలకు పంపించవద్దని, ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే క్రమంలో ప్రాణహాని ఉంటుందని, కావున పిల్లలను చెరువుల్లో చేపల వేటకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియంత్రించాలని, విద్యుత్ సంబంధ వస్తువులను తాకకుండా ఉండాలని, వర్షాలు కురిసే క్రమంలో ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంటుందని, భారీగా నీరు నిలిచి ఉండే లోతట్టు ప్రాంతాలకు విద్యుత్తు నిలిపివేయడం జరిగిందని, ఒకరోజు పునరవస కేంద్రాలలో ఆవాసం పొందడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వారు అందజేసిన సాటిలైట్ ఇమేజ్ లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని సమాచారం అందిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు.

బల్దియా కమిషనర్ మాట్లాడుతూ….

జీడబ్ల్యూఎంసి తరపున డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని ప్రతి వార్డులో జవాన్తో పాటు ప్రత్యేక మాన్ సూన్ బృందాలు అందుబాటులో ఉన్నాయని అంతే కాకుండా ఇంజనీరింగ్ బృందాలు కూడా క్షేత్ర స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారని వర్షపు నీటిని వేగవంతంగా బయటకు పంపించడానికి కచ్చా కాలువల ద్వారా పంపించడం జరుగుతుందని, శాశ్వత పరిష్కారం కోసం నాలాను

విస్తరించడంతో పాటు డ్రైన్ ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సమీప ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని ప్రస్తుతం 6 పునరావాస కేంద్రాలు ఎస్ ఆర్ నగర్ లో శుభం గార్డెన్, గాంధీ నగర్, మైసయ్యనగర్ కమ్యూనిటీ హాల్లో, డి కే నగర్లో బీరన్నకుంట హై స్కూల్ , గిరి ప్రసాద్ నగర్లోని కమ్యూనిటీ హాల్, ఏం ఎన్ నగర్ లోని మార్వాడీ హాల్లలోను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆయా కేంద్రాలలో ప్రజలు ఆవాసం పొందుతున్నారని ఉదయం సుమారు 1300 మందికి అల్పాహారం అందజేయడం జరిగిందని లంచ్ తో పాటు డిన్నర్ కూడా అందజేస్తామని ప్రజల అవసరాల కోసం వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ లతో పాటు బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ : 18004251980, మొబైల్ నంబర్:

9701999676 అందుబాటు లోకి తెచ్చామని, ప్రజలు ఈ నంబర్లలో సంప్రదించాలని జీడబ్ల్యుఎంసి తరఫున 2 డిఆర్ఎఫ్ బృందాలు 24×7 మూడు షిఫ్టులలో పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఏంహెచ్ఓ సాంబశివరావు ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి, సిఏంహెచ్ఓ డా.రాజారెడ్డి, డి ఎఫ్ ఓ శ్రీధర్ రెడ్డి, ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఇంచార్జి ఈ ఈ సంతోష్ బాబు, వరంగల్, ఖిలా వరంగల్ తహసీల్దార్ లు మహమ్మద్ ఇక్బాల్, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సిఐ నరేష్ కుమార్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సిఐ నరేష్ కుమార్
https://youtu.be/XsqTcVL4mKo
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణం  పరిసర మండల ప్రాంతాలలో గత రెండు  రోజులుగా అధిక వర్షపాతం నమోదవుతున్నది. ఈ కారణంగా పిడుగులు పడే అవకాశం  రహదారులపై వరద నీటి ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నందున, ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత దృష్ట్యా ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని భూపాలపల్లి పట్టణ సిఐ నరేష్ కుమార్ప్రజలకు సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
చెట్ల కింద, ఎలక్ట్రిక్ పోల్స్ లేదా విద్యుత్ తీగల సమీపంలో నిలబడవద్దు.2. అత్యవసర పనులు తప్ప రోడ్లపైకి రావద్దు.3. వరద నీరు ప్రవహిస్తున్న ప్రదేశాలలో ప్రయాణించవద్దు, ప్రత్యేకించి లోతైన కాలువలు, వంతెనలు, బండ్లు వద్ద జాగ్రత్తగా ఉండాలి.4. వాహనదారులు రహదారులు జారుడు మయం కావచ్చునని గుర్తుంచుకుని మితమైన వేగంతో ప్రయాణించాలి.5. ఏవైనా ప్రమాద సూచనలు గమనించిన వెంటనే పోలీసు స్టేషన్ 8712658142, 8712658110, 8712658120, 8712658121 నంబర్‌లకు సమాచారం అందించాలి
ప్రజల భద్రత మా ప్రాధాన్యం. సహకరించి, భద్రంగా ఉండండి అని భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ సూచించారు

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ

వర్దన్నపేట (నేటిధాత్రి ):

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు వర్ధన్నపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.చిన్న పిల్లలను బయటకు వెళ్లకుండా చూడాలి. రైతులు వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. లోతట్టు ప్రాంతాలు, శిథిలావస్థ ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకుగానీ, పునరా వాస కేంద్రాలకుగానీ అధికారులు తరలించి వారికి భోజన సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ళ నుండి బయటకు రావొద్దు. సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ఎద్దు సత్యనారాయణ వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

భారీ వర్షాలు.. 18 మంది మృతి

భారీ వర్షాలు.. 18 మంది మృతి

 

 

 

shine junior college

 

మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది.

 

ముంబై, జూన్ 17: మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా 18 మంది మృ‌తి చెందారు. 65 మంది గాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాలు, రోడ్డు ప్రమాదాలు, పిడుగుపాటు, నీట మనిగి పోవడం కారణాల వల్ల ఈ మృతులు సంభవించాయని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. ఈ నేపథ్యంలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పింది.

 

రాజధాని ముంబై మహానగరంతోపాటు ముంబై శివారు ప్రాంతం, రత్నగిరి, సిందుదుర్గ్, రాయ్‌గఢ్ తదితర జిల్లాల్లో భారీగా వర్షం కురిసిందని తెలిపింది. మరోవైపు పశ్చిమ మహారాష్ట్రలోని అరంజ్ అలర్ట్‌ జారీ చేసినట్లు పేర్కొంది. అలాగే పుణె, కోల్హపూర్, సతారాతోపాటు రాయ్‌గఢ్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. జూన్ 15 నుంచి 18వ తేదీ వరకు మహారాష్ట్రకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో.. నీట ముంపునకు గురైన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇంకోవైపు భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరంలో రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

 

ఇక నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో 24 గంటల్లో గుజరాత్, విదర్భా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో విస్తరించనున్నాయని తెలిపింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మరో మూడు రోజుల్లో ఇవి విస్తరిస్తాయని పేర్కొంది. అయితే ఈ మరణాలు జూన్ 1వ తేదీ నుంచి నేటి వరకు చోటు చేసుకున్నవని వివరించింది.

 

కేరళలో..

అదీకాక.. కేరళలో జూన్ 18 వరకు విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

 

న్యూఢిల్లీలో..

ఇక ఈ రోజు సాయంత్రం లేదా రాత్రికి దేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం సాధారణ వర్షాలు లేకుంటే.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వివరించింది.

 

కర్ణాటకలో..

అలాగే కర్ణాటకలో సైతం భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది ఈ జూన్ మాసంలో సగటు కంటే 110 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version