ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?
కార్మిక సంఘాల నాయకులను గనుల పైన నీలదీయండి
కార్మికులకు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం పిలుపు
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
సింగరేణిలో ఎన్నికలు జరిగి 18 నెలలు కాలం గడుస్తున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?అని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు నిలదీశారు. గురువారం నస్పూర్ కాలనీలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం బెల్లంపల్లి రీజినల్ సెక్రెటరీ సమ్ము రాజయ్య ఆధ్వర్యంలో టీఎస్ యుఎస్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ,సింగరేణిలో ఎన్నికలు జరిగి 18 నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఎన్నికలలో గుర్తింపు పొందిన ఏఐటీయూసీ,ప్రాతినిత్య ఐఎన్టియుసి కార్మిక సంఘాలు ఎన్నికలలో పెద్ద పెద్ద మేనిఫెస్టోలలో కార్మిక సమస్య చేర్చి మా సంఘానికి ఓట్లు వేసి గెలిపించండి మీకు ఇస్తున్న హామీలు తూచ తప్పకుండా కంపెనీతో కొట్లాడి పోరాడి సమస్యలు పరిష్కరిస్తామని కార్మికుల ఓట్లు దండుకొని గెలుపొందిన ఏఐటీయూసీ,ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘాల నాయకులు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని, కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పరిష్కరింపబడలేదని గుర్తింపు ప్రాదీనీత్య సంఘాలు కార్మిక హక్కులు సాధించడంలో విఫలం చెందాయని,కేవలం ఈ రెండు సంఘాలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. కార్మికుల హక్కుల కోసం కాదని కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీల అమలకై కంపెనీతో గుర్తింపు ప్రాతీనిద్య సంఘాలు పోరాడాలని గత ఏడు సంవత్సరాల కాలం నుండి సింగరేణిలో మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని,కార్మికులకు 300 గజాల ఇంటి స్థలం పట్టణ ప్రాంతాలలో కేటాయించాలని,శరీరక శ్రమ మీద ఆధార పడి పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని అన్నారు.బొగ్గు గనుల ప్రాంతంలో బొగ్గు ఆదరిత పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సింగరేణిలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. డిపెండెంట్ ఉద్యోగాల ఇన్వల్యూషన్ విషయంలో కొనసాగుతున్న కుంభకోణంపై ధర్యాప్తి జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుల వారసునికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.బొగ్గు తట్ట పనిని కూడా సింగరేణి సంస్థ నిర్వహించాలి.ఎట్టి పరిస్థితులలో ప్రవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించరాదని డిమాండ్ చేశారు.సింగరేణిలో అక్రమంగా తొలగించిన డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గనులను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను ఆపాలి.సింగరేణి పబ్లిక్ రంగ సంస్థల కొనసాగించాలి. కేంద్రం బొగ్గు గనులను బహిరంగంగా వేలం వేసే పద్ధతిని ఆపి తెలంగాణకే సింగరేణి సంస్థలను అప్పజెప్పాలి. 2024-2025 కంపెనీకి వచ్చిన లాభాల నుండి 40 శాతం లాభాలను కార్మికులకు పంచాలి.సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కుల కోసం ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ నీరేటి రాజన్న,గోదావరిఖని రీజినల్ కార్యదర్శి ఎం ఎఫ్ బేగు, పి.చంద్రశేఖర్,గుంపుల సారయ్య తదితరులు పాల్గొన్నారు.