అక్రమ మజీద్ కమిటీ పై కలెక్టర్ కు పిర్యాదు
తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి
తొర్రూరులో ఇటీవల ఎన్నుకున్న జామా మజీద్ కమిటీపై సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ముస్లిం నాయకులు తెలిపారు. పట్టణ కేంద్రంలో వారు మాట్లాడుతూ
గత 40 ఏళ్లుగా ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయని,ఆ ప్రకారం 2020లో ఎన్నికలు జరిగి ముహమ్మద్ అబ్దుల్ అలీమ్ అధ్యక్షునిగా ఎన్నికై కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీ కాలపరిమితి 2022లో ముగిసిందని. సాంప్రదాయ ప్రకారం 2022లోనే కొత్త ఎన్నికలు జరిగేదని, అధ్యక్షుడు ఎన్నికలు వాయిదా వేస్తూ గత 3 సంవత్సరాలుగా పదవిలో కొనసాగుతున్నారని అన్నారు. ఎన్నికలు జరపమని ప్రశ్నించగా జిల్లా వక్ఫ్ బోర్డు అధికారి ద్వారా నోటీసులు పంపించి బెదిరింపులకు గురిచేస్తున్నారని, దీంతో ఎన్నో శారీరక మానసిక ఇబ్బందులు పడ్డామన్నారు.ఈనెల 11న మాజీ అధ్యక్షుడు అబ్దుల్ అలీమ్ స్థానిక ముస్లింలకు తెలియకుండా, ముగ్గురు వ్యక్తుల సమక్షంలో ఏకగ్రీవ ఎన్నికల పేరుతో కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించుకున్నారని అన్నారు. ఈ విషయాన్ని శుక్రవారం మసీదులో ప్రశ్నించగా దిక్కున చోట చెప్పుకోమని భయబ్రాంతులకు గురిచేశారని వాపోయారు.మాకు నోటీసుల ద్వారా, మస్జిద్ లో గొడవలు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని
దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో సానుకూలంగా స్పందించి వచ్చే శుక్రవారం మస్జిద్ కి అధికారులను పంపించి ముస్లింల అభిప్రాయం మేరకు ఎన్నికల నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ అంజూమ్, అబ్దుల్ రెహమాన్, ముహమ్మద్ సాబేర్, యాకుబ్ పాషా, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.