పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా.. పనిచేయాలి.

పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా.. పనిచేయాలి.

బాలానగర్ /నేటి ధాత్రి.

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శనివారం బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలు వైఫల్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై అధికారులను నిలదీస్తూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ప్రజలపై సత్సంబంధాలు మెరుగుపరిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీని పలువురు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలు గెలిపించాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలు గెలిపించాలి.

పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల కేంద్రంలో మండల కార్యవర్గ సమావేశం బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు విచ్చేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారాధ్యంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ దేశం కోసం ధర్మం కోసం దేశ అభివృద్ధి కోసం ఎల్లవేళల శ్రమిస్తూ నరేంద్ర మోడీ ని ఆయన తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధిక స్థానాల్లో గెలుపొందే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ రావుల రాకేష్ బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య మండల ఉపాధ్యక్షులు సుధా గాని శ్రీనివాస్ నల్ల శ్రీనివాస్ రెడ్డి చింతల రాజేందర్ మండల కార్యదర్శి చెన్నవేని సంపత్ బిజెపి సీనియర్ నాయకులు మాచర్ల రఘు, కంచ కుమారస్వామి బూత్ అధ్యక్షులు వల్లల ప్రవీణ్ తీగల వంశీ బుర్రితిరుపతి జైపాల్ చందు వివేక్ తోట్ల మహేష్ గొప్పగాని రాజు మాదారపు రాజు శ్యామల వెంకటేశ్వర్లు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలలో పోటీ చేయుటకు.!

వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలలో పోటీ చేయుటకు రెండు నామినేషన్లు దాఖల్

వనపర్తి నేటిధాత్రి:

వనపర్తి పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోటీ చేయుటకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన బచ్చు రామ్ గోనూరు వెంకటయ్య ఎన్నికల నిర్వాహకులకు నామినేషన్ పత్రాలు దాఖల్ చేశారు . ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నేతలు ఇటుకూరి వీరయ్య గుప్తా పెబ్బేరు బుచ్చయ్య శెట్టి మారం బాలీశ్వరయ్య కట్టసుబ్బయ్య బాదం వెంకటేష్ బుస్స రమేష్ సంబు వెంకటేశ్వర్లు లలిశెట్టి సాయి ప్రసాద్ లగిశెట్టి అశోక్ ఆకుతోట దేవరాజ్ న్యాయవాదులు భాస్కర్ దార వెంకటేష్ కోట్ర రామకృష్ణ చవ్వ పండరయ్య లారీవేణుగోపాల్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

నేటిధాత్రి భూపాలపల్లి:

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, ప్రజల్లో మంచితనం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని, 30 వార్డుల్లో కాంగ్రెస్ నేతలు గెలుపొందించాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన పట్టణంలోని మొత్తం 30 వార్డుల ముఖ్య నేతలతో ఎన్నికల నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు మాసంపెల్లి లింగాజి తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయి నుండి పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ అన్నారని గుర్తుచేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ ప్రక్షాళనలో పీసీసీ పరిశీలకుల బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.

ఘనంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు
ఈరోజు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు మాసంపెల్లి లింగాజితో కలిసి కేకు కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ. పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారి అభ్యున్నతి కోసం పాటు పడుతున్న గొప్ప నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు సుంకర రామచంద్రయ్య ఇప్పాల రాజేందర్ దాట్ల శ్రీనివాస్ గురుముల శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు

ఎన్నికలప్పుడే రాజకీయాలు రాష్ట్ర సమగ్రాభివృద్ధే.!

ఎన్నికలప్పుడే రాజకీయాలు రాష్ట్ర సమగ్రాభివృద్ధే మా లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఒక్క సారి కాదు 50 సార్లు కలుస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో రూ.494.67 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తాను జడ్పీటీసీ స్థాయి నుంచి వివిధ పదవులు అలంకరించానని, అధికారంలో లేకపోయినా నిత్యం జనంలో ఉండి పనిచేశానని, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మాత్రం అధికారంలో పోగానే ఫాంహౌజ్ కే పరిమితం అయ్యారని విమర్శించారు. తాను రాజకీయ విమర్శలు చేయదలచుకోలేదని, కేసీఆర్ తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అసెంబ్లీకి వచ్చి తమ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమించిన 1200 మంది అమరులయ్యారని, 10 ఏండ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, లక్ష వరకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవే కాకుండా 3 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులతో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నామని, పరిశ్రమల రాకతో ప్రత్యేక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. నిమ్ లో హుండాయ్ సంస్థకు 450 ఎకరాలు కేటాయించామని, త్వరలోనే సంస్థ కార్ల ఉత్పత్తిని ప్రారంభించనున్నదాని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీగా జహీరాబాద్ మారనున్నదన్నారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తున్నామని, గతంలో కేసీఆర్ లాగా కేంద్రంతో సఖ్యత プ ఉండేవారు కాదని, చెరువు మీద కడుక్కోకపోతే…మనకే వాసన వస్తుందని విమర్శించారు.

నిమ్స్ భూ నిర్వాసితుకుల పరిహారం పెంచాం.

12500 ఎకరాల్లో ఏర్పాటైన నిమ్ లో చాలా మంది భూములు కోల్పోయారని వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తరువాత నిమ్డ్ అభివృద్ధి కుంటుపడిందని స్థానిక నాయకులు తనవద్దకు వచ్చి చెబుతే భూ సేకరణలో వేగం పెంచామని చెప్పారు. గత ప్రభుత్వం భూములు కోల్పోయిన ఎస్సీలకు రూ.2.50 లక్షలు, ఇతరుల సీలింగ్ భూమికి రూ.5 లక్షలు మాత్రం చెల్లించిందని తాను అధికారులను పిలిచి పేదలకు న్యాయం చేయాలని ఆదేశించిన సందర్భాన్ని సీఎం గుర్తు చేశారు. అంతే కాకుండా నిన్జ్ లో మొత్తం 5612 కుటుంబాలు భూములు కోల్పోయాయని, ఆ కుటుంబాలకు వారు కోరుకున్న చోట ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ మొత్తం కుటుంబాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించి అందరికీ ఇండ్ల పట్టాలు అందించే బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. అందుకోసం తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఇతర అధికారులను ఆదేశించారు.

Politics

చరిత్ర మెదక్ ను మరచిపోదు…

మెదక్ నుంచే ఎంపీగా స్వర్గీయ ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించి దేశ ప్రధానిగా సేవలు అందించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడే 1984 లో ఆమె ఆకరి రక్తం బొట్టు భూమిలో వదిలి పెట్టారన్నారు. మెదక్ ప్రజలు నాటి ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కు అండగా నిలబడుతూ వస్తున్నారన్నారు. ఇందిరమ్మ హయాంలోనే మెదక్ కు ఇక్రిశాట్, ఓడీఎప్, బీడీల్, బీహెచ్ఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయన్నారు. ఇందిరాగాంధీ తో పాటు బాగారెడ్డి, ఈశ్వరీబాయి, గీతారెడ్డి ఇలా ఎందరో మెదక్ గుర్తుండిపోయే నాయకులున్నారన్నారు. నిన్జ్ ను జహీరాబాద్ కు గీతారెడ్డి తీసుకువచ్చారని, ఈ ప్రాంతం అభివృద్ధిలో వారి పాత్ర గొప్పదని సీఎం గుర్తు చేశారు.

బసవేశ్వరుడు బాటలో కాంగ్రెస్ పాలన.

విశ్వగురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ, ఆయన చూపిన బాటలో తెలంగాణ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ యాత్రలో భాగంగా బసవేశ్వరుడి సూచనల మేరకే కాంగ్రెస్ జనగణనతో కులగణన చేయాలని రాహుల్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సామాజిక వర్గాలకు భాగస్వామ్యం కల్పించమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ కులగణన చేపట్టిందన్నారు. బసవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచిక భావిస్తున్నామన్నారు. వారి సందేశాన్ని తీసుకుని సామాజిక న్యాయం అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి అన్నారు.

అన్నదాతకు అండగా ప్రభుత్వం.

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉన్నదని సీఎం చెప్పారు. రూ.26 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, ఎకరాకు రూ.5 వేలుగా ఉన్న రైతు భరోసాను రూ.6వేలకు పెంచామని, భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే రూ.12 వేలు అందిస్తున్నాం, వరి వేస్తే ఉరే అని గత ప్రభుత్వ పెద్దలు చెబితే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లు పండిస్తున్న రైతులకు రూ.500 బోసన్ ఇస్తుందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఆడబిడ్డల కోసం గత 18 నెలల కాలంలో ఉచిత బస్సు ప్రయాణానికి రూ.5500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గత ఏడాదిలో స్వయం సహాయక సంఘాలకు రూ.20వేల కోట్ల బ్యాంకు లింకేజీలు ఉంటే ఈ ఏడాది రూ.21 వేల కోట్ల లింకేజికి పెంచామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రానున్న నాలుగేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆర్టీసీ బస్సులను, పెట్రోల్ బంకులను అమ్మా ఆదర్శ పాఠశాలల నిర్వహణ, నిత్యావసరాల సరుకుల పంపిణీ వంటి వాటిలో మహిళల బాధ్యతలు పెంచి వారిచే నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.

Politics

నిండుమనుసుతో దీవించండి…

రాష్ట్ర ప్రభుత్వ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడానికి కృషి చేస్తున్నదని, ఈ ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. యువత, నిరుద్యోగులకు సర్కార్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, ఎప్పుడూ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎవరు ఏమనుకున్నా సోనియాగాంధీ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో వార్డు మెంబర్ మొదలుకుని ఇతర స్థానాలను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలు తీసుకువచ్చి, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామని, వన్ ట్రిలియన్ ఎకనామీ రాష్ట్రంగా, తెలంగాణ ను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. టోక్యో, న్యూయార్క్ సిటీలకు సరసనా భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ కానున్నదని అంతవరకు నిద్రపోనున్నారు. ఇదెలా ఉండగా జహీరాబాద్ చెక్కల పరిశ్రమ ఏర్పాటు కోసం నిఱ్ఱ లో 100 ఎకరాల కేటాయిస్తామని, నిధులు కూడా అందిస్తామని, సింగూరు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సంజీవరెడ్డి, నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలి.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఇండియన్ రెడ్ క్రాస్ సేవలు, ఎన్నికలు, సభ్యత్వాల నమోదు తదితర అంశాలపై సమీక్ష

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలని జిల్లా రెడ్ క్రాస్ కమిటీ చైర్మన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐ.ఆర్.సీ.ఎస్) సేవలు, ఎన్నికల నిర్వహణ ,సభ్యత్వాల నమోదు తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అందించిన సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఇతర అంశాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ సేవలు అందింస్తున్న సొసైటీ సభ్యులను అభినందించారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ గడువు తేదీ 8.5.2025 నాటికి ముగిసిన నేపథ్యంలో నూతన కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. వేములవాడ లోని ఏరియా హాస్పిటల్ ఆవరణలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం స్థలం కేటాయించామని తెలిపారు. భవన నిర్మాణానికి నిధులు దాతల నుంచి సేకరించాలని, ఐఆర్సీఎస్ రాష్ట్ర చైర్మన్ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అలాగే నూతన సభ్యత్వాలు చేయించాలని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు, ఉపాధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రాయకరరావు వేణు కుమార్.
ప్రధాన కార్యదర్శి తాటిపాముల శివప్రసాద్. కోశాధికారి బుడిమె శివప్రసాద్. కమిటీ సభ్యులు సంగీతం శ్రీనివాస్. యెల్ల లక్ష్మీనారాయణ. దేవులపల్లి రాజమల్లు. చిదుర నాగ శంకర్. కమటాల రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

గణపురం లో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల.!

గణపురం లో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల నిర్మాణ సన్నాహక సమావేశం

సంస్థాగత నిర్మాణం వైపు కాంగ్రెస్ అడుగులు
భూపాలపల్లి నియోజక వర్గం

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లో ప్రతిపాదనల స్వీకరణ
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంస్థాగత నిర్మాణంలో భాగంగా, భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలోని ప్రొ బెల్ స్కూల్ లో మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్థాగత నిర్మాణం సమావేశానికి ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా పరిశీలకులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి , మాసంపెల్లి లింగాజి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశంలో వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈరోజు గణపురం మండల కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, మండల స్థాయి నుంచి పీసీసీ దాకా కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు మండల కమిటీ అధ్యక్షుడు కి గ్రామ కమిటీ అధ్యక్షుడుకి ప్రతిపాదనలు పంపేందుకు, ఆసక్తి ఉన్న ముఖ్యనాయకులు, కార్యకర్తలు అందరూ సకాలంలో తమరి బయోడేటా, పాస్ ఫోటోతో ప్రతిపాదన సమర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ, అనుబంద సంస్థల, బ్లాక్ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల.!

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా రఘునాథ్ రెడ్డి..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా క్యాతనపల్లి మునిసిపాలిటీకి చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ లు కరీంనగర్ జిల్లా పరిశీలకులుగా తనను నియమించినట్లు రఘునాథ్ రెడ్డి తెలిపారు.రానున్న రోజుల్లో తెలంగాణలో సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామం, మండలం, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసే తీరును పరిశీలించేందుకు పరిశీలించేందుకు జిల్లా పరిశీలకునిగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.

వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ.!

వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులదే గెలుపు-బీజేపీ నాయకులు. 

కరీంనగర్, నేటిధాత్రి:

 

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వారోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో క్రియశిలా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి నరేంద్రమోది నిధులతోనే జరుగుతుందని, రేషన్ బియ్యం పంపిణీ కేంద్రమే ఇస్తుందని వారన్నారు. ఈజిఎస్ నిధుల ద్వారా గ్రామాలలో సిసి రోడ్లు కేంద్ర ప్రభుత్వం మే ఇస్తుందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని వారు తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయానికి నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని వారు దిశానిర్దేశం చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, జిల్లా కోశాధికారి వైద రామానుజం, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సెంటి జితేందర్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్, కాడే నర్సింగం, కారుపాకల అంజిబాబు, మండల కార్యదర్శి కడారి స్వామి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, మునిగంటి శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన.!

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను అమలు చేయాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

 

ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు నెలలు గడిచినా ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి,ఏనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ గుండాల మండల అధ్యక్షులు డిమాండ్ చేస్తూ, గుండాల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, పార్టీ సీనియర్ నాయకులు గోగ్గెలా లక్ష్మీనారాయణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల కోసం ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష.

మందమర్రి మున్సిపల్ ఎన్నికల కోసం ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష

 

మందమర్రి నేటి ధాత్రి

 

మందమర్రి మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ ఆధ్వర్యంలో,మందమర్రి మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించలని.

Elections

మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలోని మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది.

Elections

అలాగే మందమర్రి లో పాలకవర్గం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, అలాగే పాలకవర్గం లేక ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుందని జేఏసీ నాయకులు తెలియ చేయడం జరిగింది, మున్సిపల్ ఎన్నికలు జరిగేంత వరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్ ఎన్నికలు సాధన కమిటీ సభ్యులు ఒక్క రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

మున్సిఫ్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికలు.

చేర్యాల లో మున్సిఫ్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికలు

అధ్యక్షుడిగా ఆరెల్లి వీర మల్లయ్య ఎన్నిక

చేర్యాల నేటిదాత్రి

 

చేర్యాల మున్సప్ కోర్ట్ పరిధిలో జరిగిన ఎన్నికలలో ఎన్నికల అధికారిగా భూమిగారి మనోహర్ వ్యవహరించారు చేర్యాల మున్సఫ్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఆరెల్లి వీర మల్లయ్య ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా తాటికొండ ప్రణీత్ ఎన్నుకోబడ్డారు.

Tatikonda Praneeth

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల మున్సఫ్ కోర్టులో రెగ్యులర్ జడ్జి నియమాకానికి కృషి చేస్తానని మరియు పూర్తిస్థాయి కోర్టు సిబ్బంది నియమకానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పొన్నం సురేష్ కృష్ణ గుస్కా వెంకటేష్ పి యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెపుతారు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెపుతారు

రాష్ట్ర బడ్జెట్ పై యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఫైర్.

హైదారాబాద్,వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్బాటంగా శాసనసభలో ఆర్బాటంగా మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరువై ఐదు కోట్ల రూపాయల తో బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు, వివిధ వర్గాలకు కెటాయించిన నిదులు మాటలు బారెడు – చేతలు చారెడుగా ఉన్నాయని ఈ బడ్జెట్ గత బిఆర్ఎస్ అంకెల గారడీ బడ్జెట్ గా, పాత సీసాలో కొత్త సారాయి లాగా ఉందని రాష్ట్ర బడ్జెట్ పై యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఫైరయ్యారు.దీంతో రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు పాలక కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారని అందుకు తగిన మూల్యం చెల్లించటానికి కాంగ్రెస్ పాలకులు సిద్దంగా ఉండాలని రవి హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉదాహరణకు జనాభా లో 50 శాతం ఉన్న మహిళా, శిశు సంక్షేమానికి కేవలం రూపాయలు 2,862 కోట్లు, ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన జనకుల గణనలో నూటికి 56 శాతం ఉన్న బిసిల అభివృద్ధి సంక్షేమానికి రూ. 11.405 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 42 శాతం బిసి రిజర్వేషన్ కు ఈ నిదులు ఎలా సరిపోతాయని అన్నారు.షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్ తెగలకు కలిపి చూస్తే రూపాయలు 57,401 కోట్లు కెటాయించి వాటిని ఎలా ఖర్చు పెడుతారో చెప్పలేదని కాగితాల మీద కెటాయింపు తప్ప మరేమీ కాదన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో యువజన రంగానికి నిదులు కెటాయింపులేదని అందులో పారిశ్రామిక రంగానికి రూపాయలు 3, 527 కోట్లు ఇచ్చారని వీటితో పరిశ్రమలు స్థాపన,ఉద్యోగం కల్పన ఎలా సాధ్యమని అలాగే
క్రీడారంగానికి కేవలం రూ.465 కోట్లతో ఎలా నైపుణ్యం పెరుగుతుందని, ప్రోత్సాహం ఎలా సాధ్యమని అడిగారు.ఆరోగ్య శ్రీ బకాయిపకు కెటాయించిన బడ్జెట్ రూ.12,393 కోట్లు అయితే మరి రానున్న సంవత్సరం వైద్య రంగం ఎలా ముందుకు పోతుందని దీంతో
ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారుతొందని అన్నారు.విద్యా రంగానికి బడ్జెట్ లో 20 శాతం నిదులు కెటాయించకుండా కేవలం రూ.23,108 కోట్లు కెటాయించటం వలన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి లు, మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధికి ఈ బడ్జెట్ ఏ మాత్రం సరిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.మొత్తంగా విద్య, వైద్య కార్పోరేట్ శక్తులకు ఉపయోగ పడుతుందని అన్నారు.
రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీల అమలుకు ఈ బడ్జెట్ కెటాయింపులో పైస కెటాయింపు లేకపోవడం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను తుంగలో తొక్కి కప్పదాటు చర్యలకు దిగుతున్న తీరు ప్రజలు సహించరని యంసిపిఐ(యు) హెచ్చరిస్తుందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బిసి లకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు, విద్య, వైద్య, ఆరు గ్యారంటీల అమలు కు బడ్జెట్ ను సవరించాలని హైదరాబాద్ బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశ నుండి యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
డిమాండ్ చేశారు.

స్థానిక ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పని చేయాలి.

స్థానిక ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పని చేయాలి.

#బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వనికి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనికి పడుతుంది.

#బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి.

 

Activists should work with the aim of winning local elections.

నల్లబెల్లి , నేటి ధాత్రి: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.బుధవారం మండలంలోని ముచింపుల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 66 మోసాలతో మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాలం వెళ్ళాదిస్తూన్నా ప్రభుత్వనికి గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.గత 2 నెలల క్రితం అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభ ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి నేడు మండలానికి ఒక గ్రామ పంచాయతీలో మాత్రమే ఇండ్ల కోసం ముగ్గులు పోసి ప్రజలను మోసం చేస్తున్నా ప్రభుత్వనికి రాబోయే స్థానిక ఎన్నికల్లో బుద్ది చెప్పి బీజేపీ పార్టీకి పట్టం కట్టడానికి ప్రతి కార్యకర్త సైనికుడు వలె పోరాటానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.పార్టీలో చేరిన వారు దొమ్మటి శ్రీను గౌడ్, బచ్చాలు, బత్తినీ మల్లికార్జున గౌడ్, కుమారస్వామి గౌడ్ , కక్కెర్ల సమ్మయ్య గౌడ్ , ఈరగోని లింగయ్య చేరారు కార్యక్రమంలో గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుడు ఊటుకూరి చిరంజీవి,బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి , నాయకులు వల్లే పార్వతలు , పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ (కోటి ) ,ధర్మారం క్రాంతికుమార్ ,బోట్ల ప్రతాప్ ,పులి రజినీకాంత్ , తదితరులు పాల్గొన్నారు.

సజావుగా సాగిన గ్రాడ్యుయేట్,ఎమ్మెల్సీ ఎన్నికలు.!

సజావుగా సాగిన గ్రాడ్యుయేట్,ఎమ్మెల్సీ ఎన్నికలు

ఓటు హక్కు వినియోగించుకున్న తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల్ జిల్లాలో ఒకటి టీచర్స్,రెండు గ్రాడ్యుయేట్ స్థానాలనికి పోలింగ్ కేంద్రాలలో సంబంధిత ఎన్నికల అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను చేపట్టారు.జైపూర్ మండల కేంద్రం మండల పరిషత్ సెకండరీ పాఠశాలలోని మూడు పోలింగ్ భూతులలో గురువారం 8 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.పరిమిత సంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా స్థానిక తాసిల్దార్ వనజ రెడ్డి పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు హక్కు వినియోగించుకుని మాట్లాడారు.పోలింగ్ ఏర్పట్లను బ్రహ్మాండంగా చేశామన్నారు.దీనితో ఎన్నికల విధానం సక్రమంగా కొనసాగిందన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: సిఐ..

ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: సిఐ

మందమర్రి నేటి ధాత్రి:

election

 

మందమర్రి లోని సింగరేణి హైస్కూల్ లొ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు:ఏర్పాటు చేసిన మంచిర్యాల్ జిల్లా
మందమర్రి సర్కిల్ పరది లోని పోలీస్ ఆధ్వర్యంలో రామగుండం కమిషనరెట్ ఆదేశాలు తో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో మందమర్రిలొసింగరేణి హైస్కూల్ ఎన్నికల సెంటర్ లో పట్టభద్రుల,4182 టీచర్స్216 ఓటర్లు కొరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మందమర్రి సిఐ శశిదర్ రెడ్డి తెలిపారు. రెండు జిల్లాల్లో 108 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగేలా అందరూ సహకరించాలని మందమర్రి సిఐ శశిదర్ రెడ్డి కోరారు.

election

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాచలం నేటి ధాత్రి;
జిల్లాలోని 23 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకొనున్న 2022 మంది టీచర్లు*

టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఈ రోజు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పరిశీలించారు.సింగరేణి కాలరీస్ బాలికల ఉన్నత పాఠశాల మరియు పాల్వంచ బొల్లోరుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ విధులలో ఉన్న అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేయడం జరిగింది.జిల్లా వ్యాప్తంగా ఉన్న 23 పోలింగ్ కేంద్రాలలో 2022 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

ఎమ్మెల్సీ ఎన్నికలు,మహాశివరాత్రి జాతర నిర్వహణ

పటిష్టమైన ప్రణాళికతో, ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు,మహాశివరాత్రి జాతర నిర్వహణ.

ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు,సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

వేములవాడ నేటిధాత్రి

ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ,25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఈరోజు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఎస్పి లు, సి.ఐ,ఆర్.ఐ,ఎస్.ఐలతో భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ….ఈ నెల 27 తేదీన జరుగు ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు,ఎలక్షన్ రోజు,ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని,పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండలని,ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని,పోలింగ్‌ ప్రక్రియ సజావుగా,నిష్పక్షపాతంగా సాగేందుకు వారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదికారులను ఎస్పి గారు ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ,పట్టభద్రుల పోలింగ్ కి సంబందించి 41 పోలింగ్ కేంద్రలో 23,347 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి పూర్తి అయేంత వరకు పోలీస్ అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను పటిష్టమైన ఎస్కార్ట్ తో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించవలసి ఉంటుందన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మహాశివరాత్రి జాతర సందర్భంగా పటిష్ట భద్రత..

ఈ నెల 25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతర సందర్భంగా పోలీస్ శాఖ తరుపున సుమారు 1500 పోలీస్ అధికారులు, సిబ్బంది తో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వివిధ ప్రాంతాల్లో బందోబస్తు లో ఉంటే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వివిధ శాఖల సమన్వయంతో సుదూర ప్రాంతాల నుండి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో రాజన్న దర్శన అయ్యేలా చూడాలన్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద,పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉండే అధికారులు ,సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు, ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

అన్న బెదిరింపులు..తమ్ముడి అర్థింపులు!!

`రెండు సంవత్సరాల క్రితమే విఆర్‌ఎస్‌ తీసుకున్న మహేందర్‌ రెడ్డి

`రాజీనామా చేసినా ఉద్యోగ సంఘంలో నాయకుడు చెలామణి

Vanga mahender reddy

`అటు రియలెస్టేట్‌ వ్యాపారం.. ఇటు రాజకీయం

`సులువుగా ఎమ్మెల్సీ కావాలనే దొడ్డి దారి రాజకీయం

`మొత్తానికి టిచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ గెలవాలన్న తాపత్రయం

`అడ్డదారిలో ఆధిపత్య కుటిల ప్రయత్నం

`పిఆర్‌టియు అభ్యర్థి వంగా మహేందర్‌ రెడ్డి అసత్యాలు ప్రచారం

`అన్నను అడ్డం పెట్టుకొని గెలిచేందుకు పన్నాగం

`అబద్దాలు ప్రచారం చేస్తూ గెలిచేందుకు విచిత్ర విన్యాసం

`పిఆర్‌టియు యూనియన్‌ విస్తుపోతున్న సందర్భం

`అన్న సహకారంతో జరుగుతున్న మంత్రాంగం

`డిఈఓలు, ఎంఈఓలతో ఒత్తిడి రాజకీయాలు

`ఎలాగైనా మహేందర్‌ రెడ్డి గెలవాలని డిఈఓలు, ఎంఈవోలు ఆర్డర్లు

`సైలెంట్‌గా సాగుతున్న మహేందర్‌ రెడ్డి ప్రచారం

`చాపకింద నీరులా సాగిస్తున్న రాజకీయం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ రాజకీయాలను మించిపోయాయి. ఉద్యోగ సంఘాలు కూడా టిక్కెట్లు అమ్ముకునే స్ధాయికి ఎదిగిపోయాయి. ఇది ఎవరో కాదు సాక్ష్యాత్తు ఓ టీచర్‌ ఎమ్మెల్సీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒక సామాన్యమైన ఉపాద్యాయుడు కోట్లు పెట్టి టిచర్‌ ఎమ్మెల్సీ టికెట్‌ కొనుక్కునే పరిస్దితి వుంటుందా? అప్పులు చేసినా సాధ్యమౌతుందా? కాని టిక్కెట్ల పంపిణీలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా స్వయంగా ఆ టీచర్‌ ఎమ్మెల్సీ మీడియా ముఖంగా చెబుతున్నాడంటే రాజకీయాలు ఎంత ఖరైదైపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఒక సగటు ఉపాధ్యాయుడు కరీంనగర్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ టికెట్‌ కోట్లు పెట్టి ఎలా కొనుగోలు చేశాడు. దాని వెనుకు వున్న నిగూఢమైన రహస్యమేటి? రోజూ స్కూలుకు వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు కోట్ల రూపాయలు సంపాదించడం సాద్యమా? అంటే కొన్ని సార్లు సాధ్యమే..కాని అసలైన ఉపాధ్యాయుడు కాదు…ఉపాధ్యాయ కొలువును అడ్డం పెట్టుకొని రియల్‌ వ్యాపారాలు సాగించి, ఫైనాన్స్‌ వ్యవహారాలు నిర్వహించే వారికి మాత్రమే సాధ్యం. అలా కరీంనగర్‌ ఉపాద్యాయ ఎమ్మెల్సీని పేరు పొందిన ఉపాద్యాయ సంఘం నుంచి వంగ మహేందర్‌ రెడ్డి ఎలా కొనుగోలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధి స్వయాన అన్న వంగ రవీందర్‌ రెడ్డి. ఆయన తెలంగాణ రెవిన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర అద్యక్షుడు. ఈ వ్యవహారమంతా ఆయనే దగ్గరుండి నడిపిస్తున్నాడని అంటున్నారు. అందులో భాగంగా రవీందర్‌ రెడ్డి నాలుగు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, మెదక్‌, నిజాబామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన డిఈవోలు, ఏంఈవోలపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. తన తమ్ముడు వంగ మహేందర్‌ రెడ్డి గెలుపుకోసం అందరూ సహకరించాలని ఆయన ఆర్డర్లు వేస్తున్నట్లు చెబుతున్నారు. డీఈవోలు, ఎంఈవోలపై ఒత్తిడి తెచ్చి, ఉపాద్యాయులకు వారితో ఫోన్లు చేయిస్తున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై భారతీయ జనతాపార్టీ ఏకంగా ఎన్నికల కమీషన్‌కు ఉత్తరంకూడ రాశారు. వంగా రవీందర్‌ రెడ్డి తన తమ్ముడు వంగా మహేందర్‌ రెడ్డి గెలుపుకోసం ఉపాద్యాయులు మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు ఎన్నికల కమీషన్‌కు వివరించారు. ఇక అసలు విషయానికి వస్తే వంగా మహేందర్‌రెడ్డి ఉపాద్యాయ కొలువులో చేరినప్పటినుంచి పిఆర్‌టీయూ యూనియన్‌లో క్రియాశీలకంగా పనిచేయడం మొదలు పెట్టారు. అప్పటికే తన అన్న రవీందర్‌రెడ్డి కూడా ఆయన కొలువు చేస్తున్న శాఖలో నాయకత్వం ఎలా చేస్తున్నాడో చూసిన మహేందర్‌ రెడ్డి కొలువులో చేరిన కొద్ది రోజులకే నాయకుడయ్యారు. చదవు చెప్పడం గాలికి వదిలేశాడు. రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సిన మహేందర్‌ రెడ్డి యూనియన్‌ రాజకీయాలు మొదలు పెట్టారు. చదువు చెప్పాల్సిన అవసరం లేకుండా చేసుకున్నాడు.

అలా అంచెలంచెలుగా యూనియన్‌లో ఎదుగుతూ వచ్చారు. 2004 తర్వాత తెలంగాణలో వచ్చిన రియల్‌ బూమ్‌ను ఆసరా చేసుకున్నాడు. అటు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే రియల్‌ వ్యాపారం మొదలు పెట్టారు. రియల్‌ వ్యాపారాన్ని కూడా టీచర్లతోనే మొదలు పెట్టి, వ్యాపారాన్ని పెంచుకున్నాడు. అలా కొలువును గాలికి వదిలేసి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇక ఇదిలా వుంటే పేద ప్రజలకు చదువు చెప్పాల్సిన కొలువులో వుంటూ, వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత విస్మరించారు. సిద్దిపేటలో కార్పోరేట్‌ స్కూల్‌ ఏర్పాటు చేశాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను కొలువు చేసే చోట విద్యా కుసుమాలను వికసింపచేయాల్సిందిపోయి, తన ప్రైవేటు స్కూల్‌లో చదువు పేరుతో దోపిడీ మొదలు పెట్టాడు. అటు రియల్‌ వ్యాపారం, ఇటు ప్రైవేటు కార్పోరేట్‌స్కూలు, మహేందర్‌రెడ్డికి మరో సోదరుడి పేరు మీద కొన్ని కళాశాలలో పార్టనర్‌ షిప్‌లో పూర్తిగా విద్యా వ్యాపారం మొదలు పెట్టారు. అన్న రెవిన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా వుండడం, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలున్నాయో గుర్తించడం, వాటిని తమకు అనుకూలంగా మల్చుకోవడం, అక్కడ రియల్‌ వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అయితే తమ వ్యాపారాలపై ఎవరి కన్ను పడకుండా ఓ స్వచ్ఛంద సంస్ధను ఏర్పాటు చేశారు. ఈ సంస్ధనిర్వహణకు మరో వైపు పెద్దఎత్తున విరాళాలు సేకరించడం అలవాటు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థ నిర్వహణ కోసం అటు నిధులసేకరణను తోడు చేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం వేసుకున్నాడు. కొన్ని స్కూళ్లలో వాటర్‌ ప్లాంటులుఏర్పాటుచేసి విద్యా వ్యవస్ధకు మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం తన ఉద్యోగానికి వాలెంటరీ రిటైర్‌ మెంటుతీసుకొని ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు మొదలు పెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కూడా వంగ మహేందర్‌ రెడ్డి ఎలా ఉపాద్యాయ సంఘం నాయకుడుగా వుంటారు. ఎలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అర్హుడౌతాడు. కేవలం ఎన్నికల కోసం కొద్ది రోజుల ముందు రాజీనామా చేశారంటే అదీ కాదు. రెండు సంవత్సరాల క్రితమే రాజీనామా చేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ కొలువును అలాగా వదిలేస్తారా? అంటే అదీ వుండదు. అదృష్టం వుండి గెలిస్తే ఎమ్మెల్సీ అవుతారు. లేకుంటే ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని మళ్లీ ఉపాద్యాయ కొలువులో చేరుతారు. ఇలాంటి జిత్తుల మారి రాజకీయాలు చాలా మంది చేస్తున్నారు. అందులో వంగా మహేందర్‌ రెడ్డి ఒకరు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో ఎమ్మెల్సీ కావాలనుకునే కొంత మంది ఈ దారిని ఎంచుకున్నారు. అటు అన్న రెవిన్యూ అసోసియేషన్‌ ద్వారా తన పలుకుబడిని ఉయోగిస్తున్నాడు. రవీందర్‌ రెడ్డిపై కూడా పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు సంపాదించారనే అపవాదు వుండనేవుంది. సంపాదించిన ఆస్ధులను కాపాడుకోవాంటే తన తమ్ముడు ప్రజా ప్రతినిధి కావడం ఒక్కటే మార్గం అనుకున్నారు. ఇలా సులువైన మార్గంలో ఎమ్మెల్సీ కావడం రవీందర్‌రెడ్డికి దారి లేదు. తిమ్మిని బమ్మిని చేసి రికార్డులు మార్చి, ఆక్రమణదారులకు సహకరించి, సంపాదించిన సొమ్ముతో తమ్ముడితో రియల్‌ వ్యాపారం రవీందర్‌ రెడ్డి సంపాదించారు. అలా అన్నదమ్ములంతారూ అక్రమంగా సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలంటే టీచర్స్‌ ఎమ్మెల్సీ ఒక్కటే మార్గమని ఎంచుకున్నారు. ఇది టీచర్స్‌ యూనియన్‌లోని సభ్యులే చెబుతున్నమాట.

ఓ ఎమ్మెల్సీ మీడియా సమావేశంలో పూసగుచ్చినట్టు చెప్పిన ముచ్చట. ఒక నిబద్దత గలిగిన గురువు విద్యార్టులకు విద్యతోపాటు విద్యా వ్యవస్ధలో రావాల్సిన నూతన ఆవిష్కరణల గురించి మాట్లాడతారు. ప్రభుత్వ విద్యా వ్యవస్ధ మేలు కోసం పనిచేస్తాడు. అలాంటి ఉపాధ్యాయులను ఎమ్మెల్సీలు చేయడానికి సంఘాలకు కూడా చేతులు రావడం లేదు. టిక్కెట్లు అమ్ముకునే యూనియన్లు వుంటే మహేందర్‌ రెడ్డి లాంటి టీచర్లే ఎమ్మెల్సీ కావాలని కలలు గంటారు. ముఖ్యంగా ఈ దారి ఎంతో సులువైంది. తాను ఉపాద్యాయుడై రేపటి తరానికి దారి చూపుతాననుకునే ఏ ఉపాద్యాయుడు తన వృత్తికి ద్రోహం చేయడు. కాని ఉపాద్యాయ కొలువు పొంది, రాజకీయాలను లక్ష్యంగా చేసుకునే కొంతమంది ఇలా ప్రభుత్వాలను మోసం చేస్తుంటారు. పదవులు అడ్డం పెట్టుకొని కొలువులు చేయకుండా రాజకీయాలు చేస్తుంటారు. లేనిపోని హమీలు ఎంతో చైతన్యవంతులైన ఉపాద్యాయులకే చెబుతుంటారు. సాటి ఉపాద్యాయులను కూడా మోసం చేస్తుంటారు. పాత పెన్షన్‌ విధానం తీసుకురావడం అసలు సాధ్యమా? ప్రభుత్వాలతోనే సాధ్యం కాని ఆ విదానం టీచర్‌ ఎమ్మెల్సీలతో సాధ్యమౌతుందా? దేశ వ్యాప్తంగా అమలౌతున్న కొత్త విధానంలో మార్పు చేయడానికి కేంద్ర ఒప్పుకుంటుందా? అది అమలు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యపడుతుందా? కేంద్రం అంగీకరించకుండా జరుగుతుందా? విద్య అనేది రాష్ట్ర స్ధాయిలో వుండే అంశం కాదు. ఉమ్మడి అంశం. కేంద్రం జోక్యం లేకుండా ఎలాంటి నిర్ణయాల అమలు సాధ్యంకాదు. కాని తమ రాజకీయ భవిష్యత్తు కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడై వుండి, యూనియన్‌ సభ్యులను మోసం చేసేవారిని ఎలా ఎన్నుకుంటారో కూడా టీచర్లే ఆలోచించుకోవాలి.

డిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం

డిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల మెట్టుపల్లి పట్టణంలో సంబరాలు…

మెట్ పల్లి ఫిబ్రవరి 8 నేటి ధాత్రి

డిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల సంబరాలు మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బోడ్ల రమేష్ ఆధ్వర్యంలో టాపసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పాల్గొని వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో డిల్లీలో ఘనవిజయం సాధించిందని అత్యధిక మెజార్టీతో బిజెపి అభ్యర్థులను గెలిపించినoదుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను కోరుకున్నారు అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దని నిశ్చయించుకున్నారని అని అన్నారు మన ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గంలో 14 వేల పై చిలుకు ఓట్లు సాధించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరుగుతుంది ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ గుంటుక సదాశివ్ వడ్డపెల్లి శ్రీనివాస్ దొనికెళ్ళ నవీన్ బాయ్ లింగారెడ్డి సుంకేటి విజయ్ తోకల సత్యనారాయణ మధ్యల లావణ్య సునీత కోయల్కా లింగేశ్వర్ కొల్లేపు శ్రీనివాస్ బోడ్ల నరేష్ కుడుకల రఘు లోలపు అనిల్ శ్రీరామ్ శివ కలిగుట శ్రీకాంత్ నరసింహారెడ్డి బిమనతి విజయ్ జెట్టి రూపేష్ జలంధర్ భోగ దత్తు హనుమాన్లు అంబాల జగన్ నరేష్ రణధీర్ నరసయ్య నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version